Sept 12, 2019 Dallas
సాంబశివ రావు గారు పేరులోనే కాదు, తన తీరు లోను, బ్రతుకు తెరువు లోను తనదంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో నిరంతరం సాంబశివ ధ్యానం, నామం జపించి ధన్యులైనారు.
లక్షెట్టిపేట గ్రామంలో అందరి చేత మంచి పేరు తెచ్చుకున్న ఉదార స్వభావి, కష్ట జీవి, నిత్య సంతోషి !
వీరు మహా సాహసి! ధైర్యం, గుండె నిబ్బరం, ఆత్మ విశ్వాసం మెండుగా గల వ్యక్తీ!.
నిండు గంగను ఒంటరిగా, అడ్డంగా ఈదుకుంటూ వెళ్ళిన మొండి ఘటం!
తన గ్రామం కొత్తూరు లో జరుగుతున్న ఒక హత్య ను ఒంటరిగా ఆపడానికి యత్నించిన పరోపకారి.
బావిలో పడిన ఎద్దును ఒంటరిగా తానె లాగడానికి ప్రయత్నించిన భూత దయాళువు!
భక్తి అతని సొమ్ము. అనుకరణ చేత గాని, అభ్యాసం చేత గాని అలవడని భక్తీ తత్వం, ఆ సాంబశివుని అనుగ్రహం వల్ల అలవోకగా ఈ సాంబశివున్ని వరించి అలరించింది.
శిథిలావస్తలో ఉన్న శివాలయాన్ని, తానే అనునిత్యం గంగ నీటితో శుద్ది చేస్తూ, శుభ్రంగా ఉంచి, జీర్ణోద్ధారణ గావించి, ఇదేండ్లు శ్రమించి పునః ప్రతిష్ట చేసి, అందరిని కూడా గట్టుకుని ఆలయ ధ్వజారోహణం గావించి, అంకిత భావం, అకుంటత దీక్షతో జీర్ణాలయాన్ని బాగు చేసి ఉద్ధరించిన మహోన్నత వ్యక్తీ ప్రయత్న ఫలితమే ఈనాడు ప్రజాదరణ పొంది వెలుగొందుచున్న సాంబశివ ఆలయం!
తన సరస సంభాషణలతో, చమత్కారాలతో, తోటి వారందరినీ, పిల్లలను, పెద్దలను నవ్వుతు, నవ్వింప జేస్తూ తన జీవితంలో మోదమే కాని, ఖేదానికి తావివ్వకుండా గడిపిన నిత్య సంతోషి.
గీతా విద్యాలయంలో అంత వృద్ధాప్యంలో కుడా పిల్లలకు పాఠాలు చెప్పడంలో మనసా, వాచా,కర్మణా సఫలీకృతుడైన అలుపెరుగని ఉత్తమ ఉపాధ్యాయుడు.
మారుమూల కుగ్రామంలో గ్రామాధికారిగా పనిచేసి దేవాలయం వెళ్లి, శుభ్రం చేసి, భజనలు చేసి, ఒక గదిలో వండుకుని, ఆ గ్రామస్తుల సమస్యలు తీర్చి, మన్ననలు పొందిన కృషీవలుడు.
చెక్కు చెదరని, మొక్కవోని మనస్తత్వంతో, నిశ్చల చిత్తంతో,రెండు పూటలా సంద్యావందన గాయత్రీ జపం తో,మడీ,ఆచారంతో,అనుష్టానము, ఆధ్యాత్మిక చింతనతో పురాణ గ్రంధ పటనంతో, అత్యంత నియమ నిష్టలతో,శ్రద్ధా భక్తులతో,ఈశ్వరుణ్ణి ధ్యానించి, పూజించి,సేవించి,తరించి అతనిలో ఐక్యమైన వందనీయుడు, పుణ్య జీవి,పరమ భక్తుడు.
తన తల్లి, సోదరి వలే సదాచారత, భజనలు, హరి నామ సంకీర్తనం, శ్రీ మద్భాగవత పద్యాలు,గజేంద్ర మోక్షం, రుక్మిణి కల్యాణం,అంబ రీశో పాఖ్యానం ఈశ్వర అష్టకాలు ఆధ్యాయాలు అనునిత్యం ఎవరు విన్నా, వినకున్నా, దైవ ప్రార్థనలో లీనమై పాడుకుని చదువుకుని తన జన్మ నిరంతర దైవధ్యానంతో , భక్తీ తత్పరతతో ధన్యం చేసుకున్న ధన్య జీవి.
నోటివెంట దుర్భాషలు లేకుండా ఇతరులను నిందించడం ఎప్పుడూ తెలియని ముక్కుసూటిగా, నిర్మొహమాటంగా మాట్లాడే నిష్కపటి.
ప్రతి సోమ వారం రోజున ఉపవాసం, గంగా స్నానం, సాలగ్రామ పూజ, నమక చమకాలతో ఆభిషేకం, నివేదన, భజన, దేవాలయ సందర్శనం,రాత్రి గుడిలో కెళ్ళి తాళాలతో, తబలాతో, నలుగురిని కూడ గట్టుకుని గొంతెత్తి పంచమ స్వరంలో పద్యాలు, భజన పాటలు, చదవడం, వినిపించడం జీవిత కాల దినచర్య కలిగిన క్రమశిక్షణ కలిగిన ఈశ్వర భక్తుడు.
మధ్యాహ్న భోజన సమయంలో పీఠ మీద కూర్చునే ముందు, వడి వడి గా వెళ్ళి, సుదీర్ఘ దైవ పూజ తర్వాత పూజగది నుండి వచ్చి పెట్టే తులసీ దళ సహిత సాలగ్రామ తీర్థం తీసుకున్న అనుభూతి ఎప్పటికీ సజీవం. 🙏
కష్టమైనా సుఖమైనా, లాభమైనా , నష్టమైనా, దగ్గరి వారు కానీ, ఇతరులు కానీ, ఎవరైనా బాధపెట్టే మాట అనినా,, కూడా, ఏదీ మనసులో ఏ మాత్రం,అత్మక్షోభ లాంటిది పెట్టుకోకుండా జీవించడం ఆయనకే చెల్లింది, పగ కోపం ద్వేషం, అసూయ,, డంబం, అహం, దురాశ, లోభత్వం తో డబ్బు దాస్తు ఉండడం, అనే దుర్గుణాలు లేశం కూడా దగ్గరకు రానీయకుండా కేవలం భక్తి మార్గంలో జీవనం సాగించ డం, సాంబశివ రావు గారి భోళా శంకర తత్వాన్ని తెలియజేస్తూ ఉంటుంది,!,
శాలిగ్రామ పూజ, ఎంత నిష్టగా,,ప్రేమగా,శ్రద్ధతో చేసేవా డో,, అక్షరాలా,అదే విధంగా తల్లిని గౌరవించాడు, మనసా వాచా కర్మణా తల్లిని , దైవంగా భావించి సేవించాడు.. ఉపవాసం రోజున తల్లి సూర్యా బాయికి అరటిపండ్లు, కానీ, చాయ్ కానీ, ఆమె తినగలిగింది ఏదైనా బజారు కు ప్రత్యేకంగా వెళ్లి తెచ్చి ఇవ్వడం, ఇంకా నాకు గుర్తు,, పండుగరోజు లలో ఆమెకు రామాయణ, భాగవత గ్రంధాలు చదివి వినిపించడం గుర్తు..,,!
కోపంతో ఎవరు ఎన్ని మాటలు అనినా, మనసులో పెట్టుకొన కుండా,, సోదర భావంతో,ప్రేమతో, మరునాడు తానే వెళ్ళిఇంటి కి వెళ్లి, కనబడి వచ్చేయడం కూడా నాకు గుర్తు.
చేతి రాత అయోమయంగా కనిపించినా, చేతల్లో మాత్రం, తోచిన ఉపకార మే తప్ప,, అపకారం ఎరుగని దయార్ద్ర హృదయుడు,,!
. బలహీనత లు లేని మనిషి ఉండడు, కదా,,! దేవుడంటే పిచ్చి ప్రేమ, !!ఆ ప్రేమకోసం, ఎంత కష్టమైనా ఇష్టంగా పడ్డాడు,,! అందులో ఒకటి కటిక ఉపవాస దీక్ష ,,!, అది తాను నమ్మిన సిద్ధాంతం ,! సోమవారం ప్రదోషం , లాంటి ది.. !!అలా తల్లితో బాటు వరుసగా ఉపవాసాలు చేస్తూ ఉండడం,,.!!. ఆ నమ్మకమే తన ఆరోగ్యం దెబ్బ తీసింది,! భక్తి జ్ఞాన వైరాగ్యా లలో తల్లికి తగిన కొడుకు అనిపించు కొన్నాడు... ఆయన!
అయినా , అది కూడా ఒకందుకు మంచిదే అయ్యింది,,! ఎందుకంటే
1.తన ప్రారబ్ద కర్మను, తనతో మోసుకు పోకుండా, కర్మ శేషం లేకుండా, ఇక్కడే అనుభవించడం
2.అనారోగ్యం తో ఉన్న 5 ఏళ్లూ కూడా ,కొడుకులు కోడళ్ళు భార్యా, అందరూ ప్రేమతో సేవి స్తూ, ఇతరులకు స్ఫూర్తి దాయకంగా ఉంటూ,, కొడుకులంటే ఇలా ఉండాలి అని గుర్తింపు రావడం
3,, పరమ భాగవతు డు, ఉత్తముడు అయిన తండ్రి కి , కష్టాలలో,ఏ మాత్రం బాధ కలుగకుండా సేవించుకున్న పుణ్యం, ఆయన కొడుకుల కుటుంబాలకు శ్రీరామరక్ష లా , సాంబశివ నిలయం లాంటి ధర్మ కవచం, సదా, కాపాడుతూ ఉండడం!
ఇవి అందరికీ తెలిసిన నిజాలు.! అవి, ""ధర్మో రక్షతి రక్షితః !""అన్న వేద వాక్యాన్ని రుజువు చేస్తున్నాయి,,!! ,
వారి జీవనవిధానం నుండి నేర్చుకొని ఆచరింప దగినవి, అందరిపై ప్రేమ,,అచంచ లమైన. దైవభక్తి, నిరాడంబర జీవనం, , కపటం లేని నవ్వు,, ఆనందంగా, ప్రశాంతంగా , అందరితో మంచిగా తృప్తిగా భక్తితో గడిపిన జీవితం, అందరికీ స్ఫూర్తి దాయకం.
అతడు,దేవుడు చేసిన ఒక బొమ్మ అయినా, తనను పుట్టించిన దేవుడి నీ, మరవకుండ,, విడవకుండా కొలుస్తూ, బ్రతిినన్నాళ్ళు దేవుడికి దగ్గరగా ఉండి, , స్మరిస్తూ జపిస్తూ చివరకు , అదే దేవుడికి ఎంతో దగ్గర గా అవుతూ ఆయన పరమ ధామం చేరుకోవడం, ఆయన లాంటి పుణ్యాత్ముల మహా భాగ్యం,!! ఆ కోవలో కొనసాగే వారి బ్రతుకు పుణ్యప్రదం,! జన్మ సార్థకం అవుతుంది కూడా,,!!
హరే కృష్ణ హరే కృష్ణా!!
No comments:
Post a Comment