Tuesday, September 3, 2019

అత్మ

Sept 3, 2019 Dallas

", అత్మ "లేని ప్రాణి ఉండదు, కదా! కానీ తన శరీరం లోనే ఉంటూ, తన ఔన్నత్యానికి, జీవిత వికాసానికి ,,దైవానుగ్రహం కొరకై ఉపకరించే ఈ " అత్మ బలాన్ని "గురించి మాత్రం, కోటికి ఒక్కరూ కూడా తెలుసుకునే చిరు ప్రయత్నం చేయడానికి ఎవరూ సాహసించరు ,!, కారణం  వారికి వారి" అత్మ ను గురించిన జ్ఞానం" లేకపోవడమే !!! వాస్తవానికి ఈ" అత్మ స్థైర్యం,"మనిషిని బ్రతికిస్తుంది, !"ఆత్మ గౌరవం "మనిషికి  సమాజం లో గుర్తింపు ఇస్తుంది.. !"అత్మ పరిశీలన"మనిషిని , మనసున్న  మనిషి గా తయారు చేస్తుంది,! "ఆత్మానందం "మనిషిని దైవానికి దగ్గర చేస్తుంది, సకల ప్రాణి కోటిని ఒక్కటిగా చేస్తుంది  ! "అత్మ సాక్షి " అనేది ,మనిషి కి మానవత్వపు విలువలు సూచిస్తోంది,!" అత్మ బుద్ది" అనేది, తరగని సుఖాన్ని ఇస్తుంది, అంటారు,! ఇంతకూ "అత్మ "అంటే ఏమిటి,? అది  మనలో ఎక్కడ ఉంటుంది, ? ఎవరైనా ఆత్మను చూడగల రా? , అత్మ స్వభావం ఏమిటి,? " అన్న పరి ప్రశ్నలకు   ఖచ్చితంగా  "లేదు, !"అని చెప్ప వలసి వుంటుంది, భగవద్గీత లో శ్రీకృష్ణ భగవానుడు చెబితేనే అత్మ యొక్క విలువ జ్ఞానం , శక్తి ప్రభావము, సర్వ వ్యాపకత్వము , అఖందము అపురూపం , అమోఘం  అని తెలుస్తూ ఉంది ! నిజానికి అత్మ అనబడే ఒక అత్యంత శక్తివంతమైన తేజస్సు తో ప్రకాశిస్తూ, జీవుడు తన మనుగడ సాగిస్తూ ఉన్నాడు, !అత్మ నశిం చదు!, చూడబడదు ! చంపబడదు!, పుట్టింప బడదు, !గాలి ,అగ్ని, జలం చేత బాదింప బడదు.! ఇలాంటి ఎన్నో విశేషణాలు గలిగిన అత్మ,. జీవి మనుగడకు ఆధారం గా ఉంటూ, సాక్షిగా అతడి జీవనచర్యలను గమనిస్తూ, ఉంటుంది.. మంచి చెడు లను గుర్తించే, వివేకాన్ని ఇస్తూ, మనిషిని దైవం గా నిరంతరం తీర్చి దిద్దే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటుంది .! జీవుడు పొందే సుఖ సుఖాలకు , గతజన్మ కర్మలు కారణం అయితే, వాటిని జీవి అనుభవించేందుకు వీలుగా ఆత్మానుభవం తోడ్పడుతుంది,!,, అత్మ అనేది  ఒక ""చల్లని చెట్టు నీడ" అనుకుంటే, జీవి మండుటెండలో తిరిగి తిరిగీ సంపాదించిన దానితో, ఈ చెట్టు నీడ క్రిందకు చేరి ఆస్వాదించే ఆనందము అయినా, పరితాప మైనా పొందడానికి ఉపకరణం అవుతోంది ఈ ఆత్మ,!!, జీవి పొందే ఏ సుఖ దుఖ అనుభవం తో ప్రమేయం లేకుండా ఉంటూ, జీవి చేయాల్సిన కర్మలను నిర్వహిస్తూ ఉంటుంది, అందలి జీవాత్మ !! అత్మ ఒక దైవాంశ,! ప్రాణ రూపంలో ఉంటూ జీవిని అనందం, ఉత్సాహం, ఆశా పథం లో జననం నుండి మరణం వరకూ , ఆగకుండా నిరంతరం నడిపిస్తు ఉంటుంది,! "ఆత్మహత్య ""మహా పాపం అంటారు.!ఎందుకంటే,అర్ధాంతరంగా చావడం, అంటే, ఎంతకాలం బ్రతకాలో, అంతకాలము బ్రతక కుండా,  తానే స్వయంగా,  " కర్త "గా మారి, నిర్ణయం తీసుకొని,అంతం చేసుకోవడం, తప్పు,! అంతే కాదు, అది క్షమించరాని గొప్ప నేరం కూడా,!, ఈ జీవితం,మానవజన్మ తాను కోరి తెచ్చుకున్నది కాదు కదా అలా,శాసిం చుకోడానికి,,?? కేవలం శరీరాన్ని పనిముట్టు లా ఉపయోగించాలి !  కానీ అంతం చేసుకునే అధికారం ఏ ప్రాణికీ లేదు !,! నిజానికి అత్మ యొక్క స్థానం పరమాత్ముని సన్నిధానం మాత్రమే !!, అందుకే," ముని జన హృదయ విహారి, ""అంటూ శ్రీకృష్ణ భగవానుని ,సత్పురుషులు , పరమహంస లు  కీర్తిస్తూ, గానం చేస్తూ ఉంటారు.  తమఅత్మ లో, అనగా హృదయ అంతరంగం లో అనవర తం పరమాత్మను దర్శిస్తూ రమిస్తూ బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ తాదాత్మ్యం స్థితిలో ఉంటారు, అలాంటి అపురూప మనో స్థితి, ఆత్మానుభవం,! అది క్రమంగా  అపారమైన దైవభక్తి కి పరాకాష్ట అవుతుంది,,! మానవునికి శ్రవణ, దర్శన, ఘ్రాణ, శబ్ద, స్పర్శ జ్ఞానము లనబడే ఐదు జ్ఞాన శక్తులే కాకుండా, ఆరవ జ్ఞానము, అత్మ జ్ఞానము, ! దీనినే sixth sense ! అంటారు .అందుకే న్యాయస్థానాల లో," అత్మ సాక్షిగా "  అనగా సాక్షిని నీకు తెలిసింది చెప్పమని అంటారు!,, తెలియక మనం చేసిన పొరబాట్లు, లేదా అపరాధ ము లు ఎన్నో ఉంటాయి ,, ఒకసారి వాటిని వివేక జ్ఞానం తో పరిశీలిస్తే, ఆత్మసాక్షిగా అలోచి స్తే, జరిగింది తప్పు అని తెలుస్తుంది, అయ్యో!"అని బాధ పడుతూ, పశ్చాతాపం తో సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాము!,, రామాయణం లో, తాను చేయని తప్పుకు అందరి దృష్టిలో నేరస్తుడు గా చిత్రీకరించ బడిన భరతునీ, ఆత్మ,, ఎవరెన్ని విధాల సము దాయించి నా కానీ  శాంతించ దు, !తండ్రి దశరథుని ఆకస్మిక మరణానికి,, సీతా రామ లక్ష్మణుల వనవాసానికి,అయోద్యానగర వాసుల దుఃఖానికి,, రాజు కాకుండా,,పట్టాభిషేకం లేకుండా, బందుజనుల ఏవగింత కు, ద్వేషానికి కారకుడై, దోషిగా వారి ముందు దోషిగా నిలబడి,14సంవత్సరాలు  పరితపిస్తూ  రామ దర్శనం కోసం నిరీక్షిస్తూ, అత్మ క్షోభను అనుభవిస్తాడు భరతుడు,! ఎవరూ చెప్పాల్సిన అవసరం లేకుండా నే ,తనకు తానే అత్మ సాక్షిగా శిక్ష వేసుకొని,, శ్రీరామ భక్తితో, సాధనా పటిమ తో, అత్మ శాంతిని పొందుతాడు . ఏ మనిషీ అయినా, "ఆత్మ తృప్తి" అయితేనే పరిపూర్ణ మైన అనందాన్ని  పొందుతాడు, ! అంతవరకు అత్మ క్షోభకు గురి అవుతూ ఉంటాడు ! అందుకే, ఈ ఆత్మకు ,శరీరం తో ఎలాంటిసంబంధం ఉండదు,, ఈ విషయం జ్ఞానికే తెలుస్తుంది,, సామాన్యులు శరీరమే సత్యము, నిత్యము, అనుకొంటూ అత్మ జ్ఞానం కరవై, జంతు ధర్మ మార్గంలో జీవనం గడుపుతూ ఉంటారు. కావున, ఇవి రెండూ వేరు అని తెలియు వాడే నిజమైన జ్ఞాని , !అర్జునుడు భారత యుద్ధంలో , అటు గురుజన బంధువుల ను చంపలేక ,, క్షత్రియ ధర్మం విడవకుండా  ఉండలేక , శ్రీకృష్ణ పరమాత్మ ను తరుణోపాయం కోసం విధిలేక ఆశ్రయిస్తాడు, , అంతవరకు ఘోరమైన అత్మక్షోభను అనుభవిస్తాడు ,! అతడికి  గీతాచార్యుడు బోధించిన జీవన రహస్యం ఇదే,, అత్మ జ్ఞానం గురించి నది. !! పుట్టిన వాడు చావక మానడు!, చచ్చిన వాడు పుట్టక మానడు!. పోయేది శరీరమే, కానీ  ఆత్మ మాత్రం కాదు,! అది శాశ్వతం!, సచ్చిదానంద స్వరూపం!, స్పటికంలా భాసించి ప్రకాశించే బ్రహ్మ పదార్థం,!"" అంటూ అత్మ ను గురించిన జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు పరమాత్ముడు !, ప్రతీ మనిషీ కూడా, అర్జునుని వలే, తన జీవితం అనబడే  భారత యుద్ధంలో వలె, నిరంతరం ఘర్షణ పడుతూ, ఆత్మలో కృంగి పోతూ, ఈ పని చేయాలా,? వద్దా, ?అని అత్మ క్షోభకు గురి అవుతూ అయోమయం గా  ఉండడం అందరికీ అవగత మే కదా,! అందుకే, ఈర్ష్యా ద్వేషాల తో ఆత్మను క్షోభ పెట్టకుండా, ఇతరుల ఆత్మలను బాధ పెట్టకుండా ,, అందరికీ ఆత్మానందాన్ని  పంచుతూ, ఆత్మీయులు గా, అత్మ బందువులు గా భావిస్తూ, తాను సంతోషంగా  బ్రతుకుతూ , ఇతరులను అదే సంతోషం తో బ్రతికించాలని అంటారు విజ్ఞులు.!". ఆత్మానుభవం" అనేది మనిషికి దేవుడు ప్రసాదించిన ఒక గొప్ప వరం,! ఇది,, ఎవరికివారే, తమ, అతి  నిరంతర ప్రయత్నం తో ,ప్రజ్ఞ తో , దైవానుగ్ర హం తో, స్థిత ప్రజ్ఞత తో, బుద్ది కుశలత, మనో నిగ్రహం తో, ఆర్తితో, ఆర్ద్రత తో ఆరాధ న తో దైవకాంక్ష తో, ఆత్మ సమర్పణ భావంతో, చేయాల్సిన  గొప్ప జ్ఞాన యజ్ఞం ! ఎందుకంటే, ప్రతివాడు కోరుకునే నిజమైన అనందం యొక్క స్వరూపమే, ఈ  "ఆత్మానందం,!"అనుకోకుండా తనకు అస్తి కలిసి వస్తె, డబ్బు కోట్లలో సంపాదిస్తే, సంతానం కలిగితే,, పెండ్లి అయితే, ఇల్లు కడితే, పార్టీలకు, పండగలకు వెళితే సంతోషంగా అనిపిస్తుంది , కానీ ఆ సంతోషం శాశ్వతం కాదు!, ఆ అనుభూతి, కొద్దిసేపు మాత్రమే నిన్ను అంటుకొని ఉంటుంది,! అలా భౌతిక ప్రపంచం లో పొందే క్షణికమైన  ఆనందాలు శాశ్వతం కాదు,! కాలానుగుణంగా అవి.  మారుతూ ఉంటాయి,! మారనిది, కాలాతీ త మైన ది భగవంతుని పై గల  ప్రేమ ఒక్కటే!!,, ఆ ప్రేమను మన హృదయాకాశం లో అనగా అత్మలో నిక్షిప్తం చేసుకొన గలిగితే అప్పుడు అది బ్రహ్మానందం అవుతూ మనకు,పరమానందం ఇస్తుంది కదా!",, అత్మ ప్రబోధం" అనేది అద్భుతమైన జీవిత అనుభవం,! మనసు పెట్టి చూస్తే, ధ్యానిస్తే ,భావిస్తే నే గానీ, అది అవగతం కాదు!, యోగము అంటే ఆత్మను పరమాత్మ తో అనుసంధానం చేయడం, అనుకుంటే, ఆ సాధనా ప్రక్రియను ధ్యానము అంటున్నాము,, కదా, !!! మన 5 పంచేంద్రియాలు,. 5. కర్మేంద్రియాలు 1 మనస్సు,, ఈ 11 శక్తులను ధ్యానం అనే యోగం తో నియంత్రిస్తూ, శరీరాన్ని ఒక పనిముట్టు గా మార్చి, అందులో నిక్షేపంగా ఉన్న ఆత్మను మేల్కొలిపి, అందులో నిద్రాణంగా ఉంటున్న కుండలిన చైతన్యీ శక్తిని, మూలాధార చక్రము నుండి, శిరస్సు పై భాగంలో గల సహస్రార చక్రం వైపుకు కదిలించే సాధనా పరమైన యోగజ్ఞానాన్ని అందించేది కేవలం ఆత్మజ్ఞానము మాత్రమే!!"",, నేనెవరు,??" అన్న పరి ప్రశ్నకు జవాబు ఆత్మ పరిశీలన, అత్మ పరిశోధన, వలననే సమాధానం  చెప్పవచ్చును!, "ఆత్మానంద ము" అనే మధురానుభూతిని పొందాలంటే, ధ్యాన యోగమే శరణ్యం,! ఏకాంతం లో, నిశ్చ ల సమాధి స్థితిలో, ప్రశాంత వాతావరణం లో, అత్మ లో శ్రీకృష్ణుని దివ్యసురుచిర సుందర లావణ్య వైభవ అపురూప రూప చిద్విలా సాన్ని , తన అంతఃకరణంలో భావిస్తూ, అత్మ లో దేవదేవుని దర్శిస్తూ చేసే తపము, జపము, అర్చన, పూజా విధానాలు భక్తిశ్రద్ధల కు పరాకాష్టగా చెబుతారు!.. కానీ ఎంతమందికి తీరిక, ఓపిక ఆత్మజ్ఞానం ఉంటుంది, చెప్పండి ??ఈ ధ్యానం చేస్తూ, తమను తాము తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండడానికి,!? అది, ఆధ్యాత్మిక జ్ఞానం తో ఆత్మసాక్షిగా నిరంతరం సాధన సాగిస్తే నే తప్ప,, అన్యులకు అంత సులభంగా  సాధ్యం అయ్యే సాధారణ విషయం కాదు!,,, ఋషులు మునులు, భక్తులు, మహాత్ములు తమ జీవితకాలాన్ని పూర్తిగా వెచ్చించి, తమ "ఆత్మానుభవం "తో భగవద్ సాక్షాత్కారాన్ని పొందారు. అందుకే ,బ్రతికి ఉండగానే ఎవరి  ఆత్మను, అంటే జీవితాన్ని వారే ఉద్దరించుకోవాలి, !అంటే భక్తి భావనతో భగవంతుని చేరాలి.! విలువైన మానవ జీవితంలో ఒక్క క్షణమైనా వృథా చేయకుండా పరందాముని సాన్నిధ్యాన్ని అభిలషిస్తూ బ్రతుకును  కొనసాగించాలి , చచ్చాక సాధించేది ఏమీ ఉండదు, కదా! దీపం ఉన్నప్పుడే అంటే ఆత్మ జ్యోతి వెలుగుతున్న ప్పుడే శరీరం అనబడే ఇల్లును, చక్కదిద్ది జీవిని ముక్తి మార్గంలో పయనింప జేయాలి..!, అర్ధాంతరంగా అసంతృప్తితో, మరణించే వారి ఆత్మల కు ముక్తి ఉండదు అంటారు,! అంటే, తెగని కోరికలతో, జీవితం పై, బంధువుల పై వ్యామోహం తో, అస్తి పై దురాశతో చనిపోయే వారి ఆత్మలు అటు మరో జన్మకు నోచుకోకుండా ఇటు, ఉన్న ఉపాధి లో ఉండే వీలు లేకుండా,మద్యంతరంగా ప్రేతాత్మ లై మిథ్యా ప్రపంచం లో , బాధ పడుతూ, ఇతరులను బాధ పెడుతూ , దిక్కు లేకుండా తిరుగుతూ ఉంటాయని శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి,!, అందుకే అత్మ చెప్పినట్టుగా, అత్మ ప్రబోధం వినేందుకు తీరిక, ఓపిక చేసుకుందాం,! భగవద్ గీత గ్రంధాన్ని కూలంకషంగా చదువుతూ , అర్జునుని అత్మ ఉద్దరణకై శ్రీకృష్ణుడు ప్రబోధించిన అత్మ జ్ఞానం ఉద్ధరణ కై మనం చేయాల్సిన, అవలంబించ వలసిన పద్దతులను, ప్రణాళికలను తెలుసుకొంటూ, క్రమంగా జీవితంలో అన్వయిస్తూ, ఆచరించే ప్రయత్నం చేద్దాం ,!" మనసే మనిషికి శత్రువు, మరియు మిత్రువు  కూడా !""అన్న నగ్నసత్యం తో ప్రారంభిస్తూ, మనసును నిగ్రహించ క పోతే అధోగతి ప్రాప్తి !అనే  అత్మ పరిశీలన చేస్తూ, అంతః కరణ శుద్ది భావంతో ,ఆత్మానుభవం తో, ఆత్మానందం పొందుదాం , !  "భగవద్ సాక్షాత్కారము !"అనే జీవన మధురానుభవాన్ని,, ఆత్మానుభూతి నీ , నిర్గుణ నిరాకార సచ్చిదానంద బ్రహ్మ ఘన స్వరూపాన్ని ఆత్మలో దర్శించుకుని, దైవ ప్రసాదిితం మరియు, పరమేశ్వరానుగ్ర హము అయిన,, ఈ మానవజన్మ ను , అచంచలమైన భక్తి శ్రద్ధలతో, అకుంఠిత దీక్షతో,, సత్సంగముతో, సాధన చేస్తూ, సార్థకం చేసుకునే ప్రయత్నం చేద్దాం, !ఇందుకు తగిన స్ఫూర్తిని, శక్తి సామర్థ్యాన్ని, చిత్తశుద్ది నీ అనుగ్రహించమని గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుని చరణ కమలాలను తాకి ప్రార్ధిస్తూ, స్వామికి, సాష్టాంగ ప్రణామము లు సమర్పిస్తూ కోరుకుందాం ! హరే కృష్ణ హరే కృష్ణా !! స్వస్తి !!

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...