Dallas, Sept 6, 2019
ఎందుకో తెలియదు గానీ, ప్రతి వారికి, గుండెల్లోంచి ,ఆడపిల్ల అంటే అంతులేని గౌరవం, అభిమానం ప్రేమా, జాలి, వాత్సల్యం పొంగి వస్తూ ఉంటాయి, కదా !ఏ అమ్మాయిని చూసినా,50 ఏళ్లు పై బడిన స్త్రీ అయినా,10 ఏళ్ల పాప అయినా, పాతికేళ్ల యువతి అయినా , బీద ధనిక తేడా లేకుండా ప్రతీ రోజూ పరకాయ ప్రవేశం చేస్తూ ఇంటా బయటా ,రక రకాల విభిన్న పాత్రలు ఎప్పటికప్పుడు పోషిస్తూ కుటుంబ సభ్యులను మెప్పించ వలసి వస్తుంది, నేటి ఆధునిక సమాజంలో, ఆడపిల్లలు చాలా ఇబ్బందులను ఎదుర్కొన వలసి వస్తోంది.,అదృష్టవశాత్తు విద్యా బలం తో ప్రగతి పథం లో సాగి పోతున్నారు..!
అయినా అలుపెరుగని బాటసారి, స్త్రీ,!! ముందు చూపే గానీ, ఒకసారి వెనక వైపుకు తిరిగి చూసే విరామం, విశ్రాంతి తీసుకునే సమయం లేని నిరంతర శ్రమైక జీవి.!!, పళ్ళ మధ్య నాలుక వలె, స్వేచ్చా స్వాతంత్ర్యం ఉండి కూడా, పరాధీన వలె, మర మనుషుల మద్య ,ఒక యంత్రం లా , మనసుతో పని లేకుండా తిరుగుతూ ఉండాలి,!! ఆమె ప్రేమను పంచుతుంది,. ప్రేమను అపెక్షిస్తు ఉంటుంది, కూడా !!తన ప్రేమను ఉపెక్షించిన వారిని కూడా దయతో క్షమిస్తుంది,! ప్రేమకు దాసురాలు ఆమె! ప్రేమిస్తే, మహాలక్ష్మి లా రక్షిస్తుంది,! ఆమె సేవను, భావాలను నిర్లక్ష్యం చేస్తే మాత్రం అపర దుర్గా భవాని లా శిక్షిస్తుంది ,!
అందుకే, తల్లి మొదటి గురువు, గా ఉంటుంది!. ఉత్తమ పౌరులను దేశానికి అందించే సామర్థ్యం కేవలం వనితా రత్నాల కే ఉంటుంది! , జాతి ఔన్నత్యాన్ని స్త్రీల సంస్కారం, విద్యా బుద్ధు లు,ఆర్థిక స్వాతంత్య్రం, ఆమె వ్యక్తిత్వ వికాసం పైన మాత్రమే ఆధారపడి వుంటుంది !,,, ప్రతీ వనిత ,దయ ప్రేమ కరుణా , మాతృ వాత్సల్యం గల ,రాశీ భూత మైన దేవతా స్వరూపం!! , కోపం, దుఖం, బాధ లో కూడా ప్రేమానురాగాలు వర్షించే అమృత హృద యిని స్త్రీ మూర్తి,!!
తలిదండ్రుల పెంపకం లో తాను నేర్చిన విద్యా బుద్దులు, సంస్కార సంప్రదాయాలు , జ్ఞానం, వివేకం ,ప్రేమానురాగాలతో , కన్నవారి కి వినియోగించ కుండా, వేరే కుటుంబం లో ఉపయోగించ వలసి రావడం ఆమె సహనానికి ప్రతీక !,, రక్తసంబంధం కాదని, నవ మాసాలు మోసి ,పువ్వుల్లో పెంచిన తల్లీ దండ్రి కి,, బాల్యమంతా ఆత్మీయత అనురాగం తో పెరిగిన తోబుట్టువుల ను వదిలి, ఎక్కడో దూరంగా, నిర్దాక్షిణ్యంగా విసిరి వేయ బడిన విధంగా , తనవారి కి దూరంగా పరాయి స్త్రీ గా బ్రతక డం ఆమె త్యాగానికి పరాకాష్ట ! ఏ అమ్మాయి కైన, ఇంతకంటే బాధాకరం ఉంటుందా,?? ఆరోగ్యంగా, ఏపుగా, పూలు పండ్లు కాసే సమయం లో మొక్కను పెరికివేసి, మరో చోట, పెరడు లో నాటిన విధంగా, బలవంతంగా పుట్టింటికి దూరంగా నెట్టబడుతోంది , స్త్రీ, !!కొత్తవారిని, అపరిచితుల ను , బొత్తిగా తెలియనివా రిని, తన వారని, వారినే ఆత్మీయులు గా, ఆపద్బాంధవు లుగా భావించాలి!, మరో లోకం, మరో ప్రపంచం, మరో జీవితం, వెనక్కి తిరిగి రాని మరో మలుపు,!,
అందుకే ఆమె త్యాగానికి, మారు పేరు,! స్వార్థం ఎరుగని దయామయి,! ఇవ్వడం లోనే తృప్తి నీ అమి తంగా,ఆనందాన్ని పొందే అల్ప సంతోషి,, ! కొత్త సంసారం లో ,అంత భారం, బరువు, బాధ్యత లతో సతమత మౌతూ కూడా, కన్నవారిని కలలో నైనా మరచిపోని కూతురు ను కన్న తలిదండ్రులు ,నిజంగా ధన్యులు, !!
లక్షలు, కోట్ల డబ్బు లేకున్నా ఫర్వాలేదు కానీ ,అంతిమ ఘడియల్లో తమ కోసం ఏడుస్తూ ప్రేమతో కన్నీరు కార్చే ఒక్క కూతురు ఉంటే చాలు, ఈ జన్మకు అదే పదివేలు అనిపిస్తూ ఉంటుంది,!!, అబ్బాయిల లో ప్రేమ తక్కువ అని కాదు,, కానీ జీవిత కాలం అంతా, బాల్యం నుండి, బామ్మ అయ్యేవరకు తల్లి కొంగు చాటున దాగే ఆడపిల్ల నిరంతరం తమ ప్రేమమృతాన్ని ,జీవన మాధుర్యాన్ని ,పంచుతూ,అనురాగ బంధాలను పెంచుతూ ఉంటుంది,! అమ్మాయి లేని ఇల్లు, అసలు ఇల్లేనా??, అడ కూతురు లేని బ్రతుకు, ఒక బ్రతుకేనా?? అనిపిస్తు ఉంటుంది ఇవన్నీ చూస్తూ ఉంటే !
జీవితం అంటే కేవలం, డబ్బు సంపద ఉండటం మాత్రమే కాదు కదా !,, కష్ట నష్టాలు సుఖా దుఖాలు , బంధాలు, అనుబంధాలు పంచుకుంటూ ఇవన్నీ ఒకరికొకరు , పరస్పరం ,ఇచ్చి పుచ్చు కుంటేనే బలపడతాయి ,! ఇదే నిజమైన జీవిత విధానం ,, స్వార్థం తో ఎవరికి వారే గిరి గీసుకుని బ్రతుకే వారి బ్రతుకు వ్యర్థం, అనర్త దాయకం కూడా. !
వాస్తవానికి, ఆడపిల్ల మనసు పెట్టి చేసినంత సులభంగా ,, నమ్మకంగా, మగ పిల్లలు చేయలేరు, కదా. ! అందుకే "కంటే అడ కూతురినే కనాలి,"!!""" అనిపిస్తుంది,! పుట్ట బోయే సంతానం, అడపిల్లనా, మగపిల్లడా, అనేది మన చేతిలో లేని విషయం అని,, దైవాధీనం అనీ తెలుసు!, కానీ, ఎన్నటికీ తెగిపోని ప్రేమానురాగ బంధం ఆడపిల్లతోనే ఉంటుంది,! నిజమైన బంగారము, మనం ధరించే నగలు,నాగాభరణాలు , లాంటి బంగారు నగలు కావు, కదా !!
ఇంటింటికీ జ్యోతిని వెలిగించి, అందరి కన్నులలో ఆనంద భావన లనే కాంతులను నింపే అమ్మాయిలే నిజమైన బంగారం,,!!, పండగ, ఉత్సవాలు, సంక్రాంతి దసరా దీపావళి, సంక్రాంతి, వివాహ వేడుకల్లో వెలుగులు విరజిమ్మే తమ చిరు నవ్వుతో , ఆ ఇంటిని స్వర్గధామం లా మార్చే ఆడపిల్లను, తన కు ప్రతిరూపంగా భువి పై అవతరింప జేసిన ఆ పరందాముని అపార కరుణా కటాక్ష వీక్షణాలకు భక్తి పూర్వక ప్రణామాలు సమర్పించ కుండా ఉండలేము కదా !!,
,,,,,,, జనకుని కూతురు జానకి తండ్రి తో అంటుంది ,, ""నాన్నగారూ !, ఇంత ప్రేమగా కూతుళ్లను కని పెంచి పోషించి, "పెళ్లి "అనే తంతు ఆధారంగా , దూరం చేసుకోవడం భావ్యమా,?? కూతురు అత్తవారింటికి వెళ్తుంటే, మీరు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ, విధిలేక, ఆత్మవంచన చేసుకుంటూ , ఉంటే , మేము చూసీ చూడనట్టుగా పేగు తెంచుకుని కన్న వారి ప్రేమను దూరం చేసుకోవడం న్యాయమా?? ఇలా తలిదండ్రుల ను బాధ పెట్టడం మాకు ధర్మమా !? చెప్పండి ??"" అంటూ తండ్రీ కళ్ళల్లో నీరు చూడలేక అడుగుతుంది ,,, తండ్రీ ప్రేమకు తాము దూరం అవుతున్నామన్న బాధ తో,,!!!!
దానికి రాజర్షి, జనక మహారాజు ఈ విధంగా సమాధానం చెబుతాడు,,, ""తల్లీ! నీవు నా కూతురు కావడం, నిజంగా , నా అదృష్టం !! మీరు ,స్త్రీ లు,, సహజంగా త్యాగమూ ర్తులు!! స్త్రీ, పుట్టింటి లో బాల్యం నుండి తాను నేర్చిన సభ్యత ,సంస్కారం, మరియు ప్రేమతో బాటు చక్కని, సంతానాన్ని కూడా భావి తరానికి అందిస్తూ , ఇటు పుట్టింటి వంశ గౌరవాన్ని, సంప్రదాయాన్ని, అటు మెట్టినింటి వంశాభి వృద్ధిని ఒకే చేతి తో, ఏక కాలంలో సాధిస్తు ఉంటుంది ,,!! ఆ విధంగా ఆమె ఆ రెండు వంశాలను,, వారి కుటుంబ సభ్యులను , వారి కీర్తి ప్రతిష్టలను ఉద్దరిస్తుంది స్త్రీ,,,!!
,,, తమ కూతురికి పెళ్లి చేస్తూ, అటు వైపు కుటుంబాల ను కూడా, వారికి, సంతానం, సౌభాగ్యం, సుఖ సంతోషాలతో బాటు శాంతి సౌఖ్యాలను సంతృప్తిని ,,ఆనందాన్ని పొందే భాగ్యాన్ని, కన్యాదానం ద్వారా తలిదం డ్రులు , అందజేస్తూ , ఋణ విముక్తుు లౌతూ, కృతార్తులౌతు ఉన్నారు,!
,, కూతురి వివాహం, కన్నవారి త్యాగ ఫలం,!!, అందుకే కన్యాదానానికి సరి తూగే దానం సృష్టి లో లేదు, !అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు కూడా, సంతృప్తి ,సంతోషం తో సంతసించి, ఉద్దరింప బడే అద్భుతమైన త్యాగదనం, మహా యజ్ఞ ఫలం ,ఈ కన్యాదానం,!!
అలా తమ నిస్వార్థ భావంతో తలిదండ్రులు కూతురి పెళ్లి చేసి అత్తవారింటి కి పంపిస్తే,, అదే నిస్వార్థ భావంతో, ఆ ఆడపిల్ల, తన అత్తవారే తనవారిగా, పతియే దైవంగా , ఆ ఇల్లే తన పాలిట "స్వర్గదామం""తీర్చి దిద్దుతారు , అదే భావనతో శ్రమిస్తూ, చివరి శ్వాస వరకూ ఆ వంశానికే తన బ్రతుకును, శక్తిని, ప్రాణాన్ని ధార వోస్తూ, "వారి అనంద మే తన అనందం"" గా జీవించే ప్రేమైక త్యాగజీవి గా, బ్రతుకు తుంది !!
,, అలా మీకు గల అత్మ గౌరవాన్ని ,హక్కును అధికారాన్ని , బరువు బాధ్యతలను, గౌరవ మర్యాదలను, అత్మబలాన్ని ,మధురానుభూతిని , అవకాశాన్ని మీకు కల్పించడమే మా సంకల్పం,!! అదే మా జీవిత పరమార్థం కూడా!! అంతే కాకుండా, ఈ ఆడపిల్ల వల ననే ,, స్వర్గస్తులైన పితృదేవతల అత్మ, తృప్తి ,,, సద్గతులు కలిగి, వారికి ఉత్తమ లోకాల ప్రాప్తి కోసం , వారి ఆత్మలు ఉద్దరింప బడతాయి,! వారి ఆశీస్సులు వంశాభి వృద్ది నీ కలిగిస్తాయి,
,,,ఈ విధంగా" వివాహం" అనే క్రతువు ,బహుళ ప్రయోజనాలను సంతరించు కొని, జీవితాన్ని ఆనందమయం గా ప్రాప్తింప జేస్తూ ఉంటుంది.! పైగా, ఇది వేద శాస్త్ర ప్రమాణం, కూడా!!"
!లక్ష్మీ నారాయణుల అనురాగం,, ఉమా మహేశ్వర అర్ధ నారీ శ్వర దాంపత్యం,స్ఫూర్తితో, ఆ దేవతా మూర్తుల దీవనా బలం తో, తమ కూతుళ్ళు కూడా అలాగే తమ భర్తలతో అన్యోన్య దాంపత్యం తో ప్రేమానురాగాలు వర్షిస్తు పిల్లా పాపలతో చిరకాలం వర్ధిల్లాలనీ తలిదండ్రులు గా మేము కోరుకుంటాం, తల్లీ ,!!!, ఇక మా కళ్ళల్లో నీరు, మా హృదయం ఆనందంతో, ఉండి పొంగి ప్రవహించే ఆనంద భాష్పాలు, !!!, మీ వివాహం అనేది , మీ ఉజ్వల భవిష్యత్తు గురించి , మా సంతోషాన్ని, సంతృప్తి నీ ప్రకటించే , మాకు జీవన్ముక్తి నీ ప్రసాదించే సద వకాశం,! గొప్ప అదృష్టం,!!,అంటాడు,,
,,,,
ఆ రకంగా , ఏ చరిత్ర చూసినా, ఏ తరం, లో ఏ యుగం లో, ఏ కుటుంబం లో అయినా, ,ఇలను స్వర్గంగా మార్చే ఏకైక ధీశాలి స్త్రీ,,!! అది స్వంత కూతురే కావాల్సిన అవసరం లేదు,! కోడలైనా, చెల్లెలైన, సోదరి అయినా, ప్రతీ ఆడపిల్ల ఒక ఆరాధ్య దేవతా స్వరూపం,!,,,,
,,అందు కే,, అలాంటి అమృత వర్షిణి లాంటి గృహ లక్ష్మిని నిరాదరణ చేస్తూ, బానిస గా చూస్తూ, తన మాటలతో చేతలతో, శాడిస్టు ప్రవర్తన తో, ఆ ఆడపిల్ల ను , కట్టుకున్న ఇల్లాలిని హింసిస్తూ , ఆమెను ఏడ్పించిన వాడు మనిషి కాదు" పశువు" అవుతాడు!,
,,, స్త్రీలను గౌరవించని, ప్రేమించ నీ, అదరించని దౌర్భాగ్య పురు షులు,, భార్యలను ఏడ్పించు కొని తినే భర్తలు గా , ఇంకా మన సమాజంలో ఉండడం మన దురదృష్టం కదా!!
,,,, , ప్రేమను మించిన ధనం, వైభవం, జ్ఞానం, వస్తువు మరొకటి భూమి పై లేదు,! ఆ ప్రేమ కేవలం ఆడపిల్ల సొత్తు ,! ఎంత పంచినా కూడా తరగని పెన్నిధి, స్త్రీ సన్నిధి , లో పొందిన ప్రేమ వాత్సల్యం !! అందుకే అమ్మ ఒడిలో ఉన్న ఆనందాన్ని మించిన ది ఉండదు ఉండబోదు అంటారు పెద్దలు !;, తల్లి వంటి దైవం లేదంటారు విజ్ఞులు ..!; కనుకనే, వేదాలు ప్రథమ స్థానం తల్లి కే అందించాయి,!" మాతృ దేవో భవ!" అంటూ మొదటి నమస్కారం, ప్రత్యక్ష దైవం లా కనిపించే కన్నతల్లికి సమర్పించా యి,, !,,,,
,, అటువంటి మహనీయుల ను, తమ తలిదండ్రుల ను, వారి పెద్ద తనంలో,అదరింపకుండ ,, వారిని వృద్దశ్రమాల పాలు చేయడం మానవతా ధర్మానికి సిగ్గు చేటు !! మాతా !!ఓ తల్లీ !!విశ్వ జననీ !!లోక మాతా ,!! జగదంబ,!, జగదీశ్వ రీ ! సకల సృష్టికి స్థితి లయాలకు కారణం నీవు,! నీవే లేని జగతి ప్రగతి జీవన ప్రయాణం, వ్యర్థం కదా !! ఓ వనితా! నీకు జోహార్లు,! శతకోటి సహస్ర వందనాలు!, అమ్మా !!, ఎన్ని జన్మలెత్తినా తీర్చు కొలేని ది ఈ మాతృ ఋణం,!
,,, , ఈ పురుషాధిక్య ప్రపంచం లో, మగవారిగా మేము, మీపై సాగించే పెత్త నాల వలన మీకు జరుగుతున్న అన్యాయం, బాధలకు హృదయ పూర్వక క్షమాపణ లు మీ స్త్రీ జాతికి సమర్పిస్తూ ఉన్నాము , ! దయతో క్షమించు ! హే మాతా , పాహిమాం ,!! దుర్గా భవాని మాతాజీ జై,! వందే మాతరం!, భారత మాతా కీ జై,!, వాణి గౌరీ లక్ష్మీ మాత లకు జై ,! హరే కృష్ణ హరే కృష్ణా ! , స్వస్తి !!
No comments:
Post a Comment