Sunday, September 1, 2019

వేంకటేశ్వర స్వామి

Aug 14, 2019 Austin
తిరుమల క్షేత్రానికి వెళ్ళి వేంకటేశ్వర స్వామి నీ దర్శించి నప్పుడల్లా, నాకు అనిపిస్తూ ఉంటుంది, పాపం ! భక్తజన బాంధవుడు ,, కరుణా లోలుడు, మన ఇంటింటి ఇలవేలుపు, కలియుగ ప్రత్యక్షదైవం , మనకోసం ప్రత్యేకంగా, వైకుంఠ లోకం నుండి భూలోకానికి , దిగివచ్చి,అలా యుగాల తరబడి  నిలబ డు తూ ఉన్న  పరమాత్ముని కి కాళ్ళు నొప్పులు పెట్టవా అని !?" కానీ, వెంటనే  అల్ప బుద్ది కలవాడినీ కదా నేను  ! ఆ పరమాత్మ తత్వాన్ని, అవతార ఉద్దేశ్యాన్ని భావించుట, కనీసం ఊహించుటకు కూడా నేనెంత వాడిని,,? అనుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు ప్రేమాతి శయం తో  పలురకాల తప్పుడు  తలపోత లు చేస్తూ ఉంటాం మనం  కదా! అతడు దేవాది దేవుడు,!దివ్యప్రభావుడు ,! శ్రీ రమణి హృదయంత రంగుడు,! శ్రీ విభుడు !మంగళకర కరుణా అంతరంగుడు ! ఆశ్రిత దీన జనావనరంగుడు,!, అంతటి జగధాధారునికి, మామూలు  జీవుల కు వలె నొప్పులు, బాధలు ఉంటాయా,?  నాకు రెండు కాళ్ళు, రెండు చేతులు, ఒక తల అయితే అతడికి అనంత హస్తాలు, అనంత బాహువులు, అనంత పాదాలు అనంత రూపాలు, అంతా తానై విశ్వమంతా నిండి ఉన్న,  అనంతుడు, అతడు !, అయినా కూడా, నాకు ఆలోచన వస్తూ ఉంటుంది, వేంకట రమణుడి దివ్యమైన , మృదువైన పాదములు పడితే బాగుండును,! అరుణ కమలాల వంటి పాదాలను ముడితే, స్పర్శిస్తే, కనీసం దగ్గరి నుండి దర్శిస్తే బాగుండును అనుకున్నాను!,, అంత భాగ్యమా , ఈ అఙ్ఞానికి,,? అయినా కూడా , ఏదో తెలియని ఉబలాటం,,! ఏడుకొండలరాయడి ముంగిట కనీసం ఒక ఐదు నిముషాలు స్వామిని నఖ శిఖ పర్యంతం చూస్తూ  ఉండాలని, అతడి సుందర వదనార విందా న్ని తనివితీరా ఆస్వాదించాల నీ,, చంద్ర కాంతిని దిక్కరించే స్వామి తెల్లని నునుపైన కపోలాల సోయగాలను తిలకిస్తూ పొద్దు గడపాలని, లక్ష్మీ రమణునీ  పద్మపత్రాల వంటి విశాల నేత్రాలలో వర్షించే ,ప్రశాంతమైన ,చల్లని కరుణా మృతధారలలో తడిచి, మురిసి పోవాలని,,,, అరుణారుణ సూర్యకాంతుల ను తలపించే గోవిందుని లేత పెదవులపై అందంగా, అద్భుతంగా, అపురూపంగా, అమోఘంగా, ఆనందంగా, మెరుస్తున్న చిరు మందహాస విధ్యుల్లతా కాంతుల సోయగాలను కనులారా  కాంచాలనీ , నందనందనునీ  విశాలఫాలభాగంపై ,వినూత్న కాంతులతో విరాజిల్లుతూ ఉన్న ఊర్ధ్వపుండ్రాలు ,కస్తూరీ తిల కాలను నేను కూడా ధరించి స్వామి వలె వెలిగి పోతూ పులకించాలని , బ్రహ్మాండ నాయకుని తలపై శోభిల్లుతున్న మణి మయ స్వర్ణ భూషణ ములు పొదగబడిన వజ్రమకుట కిరీటాన్ని ఆపాద మస్తకము పూలమాలలతో , గజమాల అలంకరణతో శోభిల్లుతున్న శ్రీదేవి భూదేవి సహిత వేంకటేశ్వరుని  వైభవాన్ని అంతరంగంలో ఆవిష్కరిస్తూ నిక్షేపిస్తు ఆనందించాలని ఏదో పిచ్చి కోరిక గా ఉంటుంది ! ఆ గోపీ హృదయ విహారుని, ఆ యశోదా తనయుని నయన మనోహర సౌందర్య రూప, లావణ్య వైభవాన్ని  వర్ణించ వశమా ? , అయినా కూడా అదే పనిగా స్వామిని చూస్తూ, తన్మయం పొందాలని , ఇలా వైకుంఠ రమణుని సాకార రూప సౌందర్య లావణ్యాన్ని గ్రోలుతూ, గోపాలకృష్ణ భగవానుని సన్నిధిలో  జీవితం గడపాలని కోరిక మెండుగా ఉంటోంది. భగవంతుని సాక్షాత్కారం కోసం తపించడం లో తప్పు లేదు కానీ, కోటాను కోట్ల భక్తుల సమూహసందర్శన ములో, నిత్య కళ్యాణం, పచ్చ తోరణం గా , కొరిందే తడవుగా వరాలిచ్చే ఇలవేలుపు గా , ఆపద మొక్కులవాడుగా , అనాధ రక్షకుడిగా, అభయ హస్తం తో, భక్త జనావళికి నూతన తేజాన్ని, సంతోషాన్ని అనుగ్రహిస్తూ , , అర్త జనావళికి అడిగిందే తడవుగా కోరిన కోర్కెలు సఫలం చేస్తూ అనునిత్యం, అనుక్షణం , అనవరతం క్షణం తీరిక లేకుండా, క్షణం కూడా  కూడా విశ్రాంతి తీసుకోకుండా కలియుగ దైవంగా, ఉంటున్న స్వామినీ నాకోసం, ఆపాలని అనుకోడం  స్వార్థం అవుతోంది కదా!! నేను తనని సమీపంగా  దర్శించాలని కోరుకోవడం తప్పు మాత్రమే కాదు, !గొప్ప అపరాధం అవుతోంది, కూడా! దేవదేవుని వలె, ఇతరుల సేవ చేయడం, అందులో పరంధాముడు పొందే అద్భుత ఆనందాన్ని,, సంతృప్తిని పొందడం,, మనం నేర్చుకోవాల్సిన విషయం !!ఈ సేవ స్వామి దర్శనం కంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది కదా అనిపించింది, అంతేకాదు, చూసే చూపుల్లో, భావించే తలపుల్లో దైవం నిలుస్తాడు,! కానీ, కేవలం స్వామి విగ్రహాన్ని చూస్తూ ఉండడం లో అర్థం లేదు కదా,, !దైవాన్ని భజించే పెదవుల కన్నా, ఆర్తులకు చేసే సేవయే మిన్న కదా,!,, అంతగా కుతూహలం, ఆర్తి ఉంటే,దర్శించడానికి ఎన్ని వేంకటేశ్వర స్వామి క్షేత్రాలు లేవు,,? అని తృప్తి పడినా కూడా, ఎన్ని ఉన్నా, ఎంత గొప్పగా ఉన్నా, తిరుమల గిరిపై వెలసిన వెంకన్న స్వామీ దర్శనంలో ఉన్న రుచియే వేరు,! స్వామిని ఎంతో సేపు చూడ వల్సిన అక్కర లేదు,! వైకుంఠ వాసునీ ఆనంద నిలయంలో, ఆ రద్దీ లో ,ఆ క్యూ లోనే, అంత కష్టపడుతూ కూడా , వెనక నుండి భక్త జనం నెట్టుతూ, "గోవిందా "అంటూ ఘోషిస్తు ఉండగా , స్వామి దివ్య మంగళ శాలగ్రామ విగ్రహ సుందర రూపం కళ్ళారా చూడాలి , కానీ, అలా, చూడటానికి దొరికే  ,,ఆ కొన్ని సెకన్ల సమయం లోనే, చక్కగా చూడనీకుండ   ముందు ఎత్తైన భక్తులు, వారి తలపై పిల్లలు, లావుగా ఉన్న భక్తులు, పద పద మంటూ గట్టిగా భుజాలు పట్టి ముందుకు తోసే వాలంటీర్లు, ఎన్నో ఇబ్బందులు ,!!ఇన్నింటి మద్య చిద్విలాసంగా మందహాసం తో , దంత పంక్తి బయటకు కనపడనీకుండ , పెదాలపై విరిసే చిన్న చిరునవ్వు తో, మనల్ని సాదరంగా పరికించే  స్వామి నీ దర్శిస్తే  చాలు అనిపిస్తుంది,,! మనం అచ్యుతుడిని చూడటం కాదు, రుక్మిణీ వల్లభుడు మనల్ని చూడటం కావాలి,! చూస్తాడు, కూడా ! తప్పక చూసి ఉంటాడు, !ఎందుకంటే ప్రత్యేకంగా అతడి నిలయానికి, అతడి సన్నిధికి ,అతడి సమీపానికి, అతడి ముంగిట నిలిచి ,,చేతులెత్తి వినమ్రంగా, భక్తితో, ప్రేమతో, నమస్కారం,  వినతి, చేస్తుంటే, మన హృదయం గ్రహించకుండా ఉంటాడా, జనార్ధనుడు ? సకల భువనాల ను కుక్షిలో నిడుకొన్న సర్వాంతర్యామి కి,, జగాల నేలే ఈశ్వరునికి ,ఇంత చిన్న విషయం తెలియ కుండా పోతుందా,?, అన్న వివేకంతో, ఆలోచించిస్తే  అన్ని భావాలకు కేంద్రం మనస్సు అని తెలుస్తోంది ,! దానిని సక్రమంగా నడిపించేవాడు, మనిషి !, అప్పుడే మన మనసు ఒక పవిత్ర పుణ్య క్షేత్రం అవుతుంది, , అది  ధ్యానానికి, యోగానికి, జ్ఞా నానికి , అత్మ పరిశీలన కు ఉపయోగించే  అద్భుత సాధనం కావాలి. అలాంటి భావ సంపద కలిగేది అక్కడే,,! నల్లన సాలగ్రామ శిలా విగ్రహం లో వేంకట రమణునీ దర్శించేది మన సుతోనే  కదా,, !భగవద్గీత ను బోధించింది ఈ కోతి లాంటి మనసు ను నియంత్రించి, దైవానుగ్రహం పొందేందుకు మాత్రమే,, !సంస్కారం లేకుండా, జ్ఞానం కలుగదు,! జ్ఞానం లేకుండా దైవానికి చేరువ కాలేము,!, అందుకే తలిదండ్రులు తమ పిల్లలకు ఇంట్లో జరిపే పండుగలు,,సంప్రదాయాలు ,, సభ్యత, సంస్కారం నేర్పాలి  ,! పెద్దవారు రోజూ చేసే పూజ వారిలో  ఆ స్ఫూర్తిని కలుగజేస్తుంది, !పది ఏళ్ల వయసు వరకూ బాలల మనసు  అత్యంత శక్తివంతంగా ఉంటుంది, బలమైనఅయస్కాంతం వలె, ఆసక్తితో, పట్టుకుంటారు,! వారికి ధారణ శక్తి ఎక్కువ,! అలాగే గ్రహించే శక్తి కూడా ఎక్కువే , ప్రహ్లాదుడు ,మార్కండేయుడు , ధ్రువుడు, శివాజీ మహారాజు లాంటి వారు పట్టిన పట్టు విడవకుండా, గురువు చెప్పినట్టు గా సాధించి ధన్యులు అయ్యారు, ,! దైవాన్ని నమ్మినవారు ఎన్నడూ చెడి పోరు. ! అందుకే పిల్లలకు చిన్నతనం నుండే దైవభక్తి నీ మనం ఆచరిస్తూ, అలవాటు చేయాలి,!, ఆ భక్తి బీజం పెద్దయ్యాక వృక్షం అవుతుంది ,!అందుకే  ఎవరి మనసు వారికే  ఒక అందాల బృందావనం, !అందులో గోపికలు జీవులు,! సృష్టి పాలకుడు, పరమాత్ముడు ఒక్కడే పురుషోత్తముడు,,! అలాంటి దివ్యమైన , భవ్యమైన భావ సంపద తో , ఆర్ద్రత తో , ఆర్తితో , ఆ పరందాముని ఎలాగైనా చూడాలనే ఆకలి, తపన కూడిన  జీవనం , ఆచరణ తో అలవడాలి,! ప్రతిరోజూ, ఉదయం లేస్తూనే, ""శ్రీ హరీ, శ్రీహరీ "అంటూ, శ్రీపతినీ అరచేతిలో చూస్తూ స్మరించాలి. స్నానం చేస్తున్నప్పుడు, సకల పావన పవిత్ర గంగా, యమునా, సరస్వతీ, మందాకినీ,, స్వామి పుష్కరిణీ, ఆకాశగంగ, పాపవినాశినీ ,కృష్ణా ,త్రివేణి సంగమ పుణ్య నదీ జలాలతో  , మన దేహానికి కాకుండా, స్వామి మంగళ కర వరకు విగ్రహానికి అభిషేకం చేస్తున్నట్టుగా  భావిస్తూ స్నానం ఆచరించాలి,, వంట చేస్తుంటే  ""శ్రీహరి "అంటూ,, భోజనం చేస్తుంటే ""గోవిందా"" అంటూ స్మరిస్తూ తినాలి.. ఉదయం వాకింగ్ చేస్తున్నా, ఏ కొంత విరామం, విశ్రాంతి దొరికినా భగవద్గీత లాంటి సద్గ్రంధ పఠనం చేస్తూ, నిద్రించే సమయలో పరాత్పరుని రూప సౌందర్య లావణ్యాన్ని మదిలో తలుస్తూ ఉండాలి, ఇలా ""దేహమే దేవాలయం,"" చేస్తూ, నిత్యం ఒకటే కోరుకోవాలి,," గోవిందా, గోవిందా ""అంటూ స్మరించే భాగ్యాన్ని ప్రసాదించమని కోరడం ! అలాంటి బ్రతుకే  ధన్యం ! పుణ్యం !, అతడిని గూర్చి ఆడినా, పాడినా,, శ్రీకృష్ణ లీలలు చర్చించినా, చింతించినా, పూజించి, సేవించినా , రాసినా,చదివినా , అర్చనతో  భావించినా చాలు ,! ఈ జన్మకు అదే పదివేలు,! ఆ రోజే, మన జీవితం లో లెక్కించ దగిన  నిజమైన శుభదినం ,!, కానీ పరమాత్మ తో ఏ సంబంధం పెట్టుకోకుండా అనుబంధం పెంచుకో కుండా, అతడిపై చెదరకుండా మనసు నిలవడం కష్టం ,! మనసు నిలవడానికి స్వామి రూపం లాంటి ఆలంబన అవసరం ! అందుకే పామరుడైనా ,పండితుడైనా సాకార రూపంలో , తన కళ్ళముందు నిలిచిన  అద్భుత సౌందర్య శిలావిగ్రహ దర్శనం చేస్తూ దైవారాధన చేయక తప్పదు !! స్వామి సాక్షాత్తూఅది స్వయంభువు, !! శ్రీమహా విష్ణువు , స్వయంగా ,,తనకు తానుగా ఇలపై దిగి, తిరుమల కొండలపై  సాలగ్రామ శిలా రూపంలో వెలసిన వేంకటేశ్వర స్వామీ అవతారం  ఇది! సకల పాప హరణం, మోక్ష దాయకం, పరమానంద కరమైన  స్వామి అపురూప సాక్షాత్కారం   పొందుతూ , అతడి ముందు నిలిచినా ఆ  కొన్ని క్షణాలు చాలు ,, జన్మ ధన్యం !!ఇంతకన్నా సౌఖ్యమైన, బ్రహ్మానంద కరమైన క్షణాలు జీవితంలో ఉండవు!!, అందుకే గోవిందుని చేరాలి,!  మనసారా వేడాలి,!వేంకటేశ్వరుని మంగళ గీతాలు  పాడాలి,!,పునర్దర్షణం కోసం తపిస్తూ కోరాలి,!! అడిగితేనే గానీ, అమ్మ పెట్టక పోవచ్చు గానీ, మన గోవిందుడు మాత్రం అలా కాదు, ఎక్కడ, ఎలాంటి స్థితి లో ఉంటూ మనసులో అనుకున్నా, స్వామి అపార ప్రేమానురాగాల తో కటాక్ష వీక్షణాలతో నిన్ను తనవాడిగా చేసుకుంటాడు !!అది  శ్రీవారి ప్రతిజ్ఞ ,!అఖిలాండకోటి బ్రహ్మాండనాయకా  !!విశ్వ రూపా,,!! నిన్ను కొలిచి పూజించే ,,భజించె, భావించే అంత జ్ఞానం, పాండిత్యం వివేకం, స్థిర చిత్తం,, చిత్తశుద్ది, ఏకాగ్రత, మాకు లేవు నారాయణా,! అది మాకు చేత గాని పని,! ఉద్యోగం, వృత్తి, వ్యాపార, వ్యవహార పనులలో సంసారం అనే సాగరంలో తల మునకలై పోతున్న మాకు , నీవు తప్ప మరే దిక్కు లేదు ,! నిన్ను జ్ఞాపకం చేసే సమయం, ఓపిక, బుద్ది కూడా మేము నొచ్చు కోము ,,"" భగవాన్ !""దయ ఉంచి నీవు, మమ్మల్ని ,నిన్ను తెలుసుకునే దారిలో నడిపించు ,! తల్లివి తండ్రీవి , గురువు దైవానివీ నీవే గోవిందా ! , నీవే గతి, ! నీకే శరణు ,,స్వామీ,! అంటూ, జీవితంలో మనం చేసిన తప్పులు, అపరాదాలు , బలహీనత లు లక్ష్మీపతి ముందు ఒప్పుకుంటూ , క్షమించమనీ  త్రికరణ శుద్ధిగా  వేడుకోవాలి ,! అంతే ,! శరణాగత వత్సలుడు కదా,నందనందనుడు ,!! కరుణిస్తాడు ఆర్తులను, అర్త శరణ్యులను,, పరమ వైష్ణవ భక్తుల ను, !!   ""అచ్యుతా, అనం తా, గోవిందా ,,!""అనే హరి నామ మంత్ర జప దివ్య ఔషధం తో ,,సర్వ రోగ ,తాప, పాప, శాప విమోచనం కలుగుతుంది కదా , !! ఇక  మనకు భయమేల, ?శ్రమ ఏల ,? నిరాశ పొంద నేల?"" పరాత్ప రా,,! పరందామా , పరమేశా ,,,! శరణు,,!""అంటూ వేడుకునే  ఈ  ఆత్మసమర్పణ భావం చాలు ,,స్వామి కృప కలగడానికి, !అంతేకానీ, ఇన్నిసార్లు తిరుమల వెళ్ళి, ఏడుకొండల వాడిని దర్శించు కున్నామని గానీ ,,, స్వామి ముందు ఇంతసేపు నిలబడి చూశామని గానీ, అనుకోవాల్సి న అవసరం లేదు!,, ఒక్కసారి చూసిన స్వామి దివ్య మంగళ రూపాన్ని సదా భావిస్తూ, జీవిస్తే చాలు,,!  పరిశుద్ధమైన మనసుతో, పరమాత్మను అంతరంగంలో  స్మరిస్తే చాలు,,, జీవితం ధన్యం అవుతుంది!,,  _"తత్వమసి "అనే భావం అదే సూచిస్తోంది,"", సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్ముని నిర్గుణ ,నిరాకార ,ఆనంద స్వరూపాన్ని  ఆరాధిస్తూ ఉన్నాను , అనే ఆ శుద్ధ తత్వాన్ని నేను,! ""స్వామీ, వేంకటేశా !, తిరుమల వాసా !, లక్ష్మీ రమణా!, నిరంతరం నిన్ను అలా  భావిస్తూ ,సేవిస్తూ ఉండే భాగ్యాన్ని అనుగ్రహించు,!"" బ్రతినన్నాళ్లు అందరూ నా వారే, చివరి శ్వాస తీసే ఘడియలలో మాత్రం, ఎవరూ నా వారు కాదు, ఒక్క శ్రీహరి తప్ప ! అనే తలంపు తో ఉండే నాకు, నీవు నా మదిలో సదా కొలువై, నా తలపుకు నెలవై, నాకు చేరువై, ఉంటూ, కాపాడు స్వామీ ! నారాయణా,! ఏడుకొండల వాడా, !ఆపద్భాం ధవా,,!అనాధరక్షకా ,! నీ సన్నిధానం లో ఎంత కాలం ఉన్నా, నిన్ను దర్శించే యోగ్యత, అర్హత నాకు లేదు! అంత జ్ఞానం పుణ్యం భక్తి మాకు లేవు స్వామీ !!",ముకుందా !! నీ చేతిలో బొమ్మలం,! నీవు ఎలా ఆడిస్తే అలా ఆడే ఆట తోలు బొమ్మలము  మేము ,,జగదీశ్వర,! మాకున్న ఈ మాంస నేత్రాలతో,, మేము నిన్ను దర్షించామనే అజ్ఞానాన్ని అవివేకాన్ని మన్నించు!, క్షణ కాలం కూడా నీ మూర్తిని మదిలో నిలుపుకోలేనీ. మా అసమర్థత ను క్షమించు,! పరమేశ్వరా !"నేను ఏమిటో?? నీవు ఎవరివో ??  అది తెలుసుకునే పరిజ్ఞానాన్ని అనుగ్రహించు !! కరుణించి కాపాడు,!, స్వామీశరణు! శ్రీనివాసా శరణు! తిరుమల వాసా, శరణు ! శేషాద్రి వాసా , శరణు !! స్వస్తి !""హరే కృష్ణ హరే కృష్ణా !"""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...