Sunday, September 1, 2019

జో అచ్యుతానంద

Aug 19, 2019 Dallas
""ఎంత చక్కని భావన,,! జగాలను ఊపే సాక్షాత్తూ మహావిష్ణు స్వరూపం అయిన చిన్ని కృష్ణుని , ఇలా,ఉయ్యాలలో పడుకోబెట్టి ఊపడం అనేది.!"సామాన్య విషయమా, మానవులకు? సాధ్యమయ్యే పనేనా అది ??". జో అచ్యుతానంద ,,జో ,జో ముకుందా, !,, రావె పరమానంద,, రామ, గోవిందా ,,!",, జో,! జో,,!!అంటూ తల్లులు అందరూ, తమ కన్నబిడ్డ లను లాలిస్తూ ప్రేమతో పాడుతూ ఉంటారు!..తమ ఇంట పెరుగుతున్న వరాల పంట లు వారి సంతానం,.!. తమ పుణ్యాల రాశి గా,, దైవానికి ప్రతి రూపాలుగా ప్రతిఫలిస్తూ ఉంటారు. దైవానుగ్రహం వలన,, తాము , నవ మాసాలు మోసి,కన్న కలల నోముల పంట గా కంటికి వెలుగులా, ఇంటికి దీపం లా వెలుగుతూ ఉంటారు.. వారి బొసినవ్వుల పువ్వుల పరిమళాల మాధుర్యం లో , ఆ ఇల్లు ఆనందమయం గా, తోస్తుంది.. బిడ్డలు కన్నవారి కలల పంట గా,, ఆ ఇల్లు ఒక  స్వర్గ సీమలా, పిల్లల ఆటల పాటల మేళవింపు తో, మాతృత్వ మాధుర్యం తో ఎప్పుడూ, ఆనందంతో కళకళ లాడ తూ  ఉంటుంది,, పరమాద్భుతం , పరమ పావనం, కడు దుర్లభం అయిన తమ మాతృ ప్రేమను పంచడానికి ,,వారు పిల్లలను కూడా ఉయ్యాల లో పడుకోబెట్టి వారిని  శ్రీకృష్ణ స్వరూపాల వలె భావిస్తూ  , బాల కృష్ణుని కి జో కొడుతూ ఉన్నట్టుగా ,లాలిస్తూ, "జో, జో !"",,అంటూ ఇదే జోల పాట పాడుతూ ,ఆనందిస్తూ పిల్లలను నిద్ర పుచ్చుతూ ఉంటారు!, ఉయ్యాల మహత్తు అది ఏమిటో గానీ, తల్లి ఉయ్యాల ఊపుతూ ఉంటే,  చల్లగా మెల్లగా  తగిలే పిల్లగాలు ల లాలన తో, అమ్మ తీయని , అమృతహృదయం నుండి పొంగి పొరలి వస్తున్న సంకీర్తనా చార్యుడు, అన్నమయ్య స్వరం లోంచి జాలువారిన మదుర రస భరిత కీర్తన జో జో పాట, వింటూ చంటి పిల్లలు , ఆదమరచి క్షణ కాలంలోనే ,,చిత్రంగా, అంతవరకు  సాగిస్తున్న ఏడుపు మాని , చిరు నవ్వు నవ్వుతూ ,, క్రమంగా , సుఖంగా, హాయిగా,నిద్ర లోకి జారీపోతూ ఉంటారు.!, పిల్లలు తల్లుల, ముద్దుల వరాల మూట లు,, అయితే, తల్లులు పిల్లలకు  సాక్షాత్తూ ప్రత్యక్ష దైవాలు కదా ! తిరుమలలో అనందనిలయం లో గర్భగుడిలో, శ్రీే వేంకటేశ్వరస్వామివారి పవళింపు సేవలో, అనుదినం స్వామివారి అర్చా మూర్తిని బంగారు ఉయ్యాలలో పడుకోబెట్టి,, ఆరగింపు, శయన హారతిని సమర్పించి ,,మహానుభావుడు తాళ్ళపాక అన్నమయ్య, చిన్ని కృష్ణుని నిద్రపుచ్చి సేదదీర్చుటకు  భక్తి ప్రపత్తులతో రచించి ,, రాగ మాధుర్యం జోడించి , అద్భుతంగా గానం చేసిన దివ్యమైన, అద్భుతమైన సంకీర్తన, ఈ శ్రీకృష్ణుని బాల్యదశ లో కీర్తించిన అందమైన  ఈ దివ్యమైన జోలపాట!,, ఇది వింటూ ఉంటే మనకు తెలియని ఒక పరవశత్వం కలిగి, అనందం తో శరీరం పులకించి పోతూ ఉంటుంది. ! స్వామిని ప్రత్యక్షంగా దర్శించి తరించిన ఆ అన్నమయ్య హృదయం , ఆనందంతో,ఎంత తాదాత్మ్యం చెంది ఉంటుందో, ఆయన సహజ భావ ధారా సాహిత్యం తో,మనకు తెలుస్తోం ది,,!! శ్రీకృష్ణ భక్తి రసామృ త పానము తో మత్తుడైన అపర భక్త శిఖామణి అన్నమయ్య..! అందుకే అంతటి దర్శన మహా భాగ్యాన్ని పొందాడు. ఆయన !  సకల జగము ల నేలే పరమాత్ముడు, జగన్మోహనాకారుడు, ముజ్జగాలను తన కుక్షిలో, నాభి వద్ద దాచుకున్న దేవాది దేవుని, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకునీ,, లీలా నాటక సూత్రధారినీ,, అంతటి వాడిని ,ఇలా ఇప్పుడూ బాలకృష్ణుని రూపంలో చూస్తూ, స్వహస్తాలతో చేతుల్లోకి తీసుకొని , పసిడి ఉయ్యాలలో సుతి మెత్తని పట్టు పరుపు పానుపు పై పరుండవెట్టి, తన గారాల ముద్దుల కొడుకు, నీల మేఘ శ్యామ సుందరుని లాలి పాట , గాన మాధుర్యం తో ,ఆనంద పారవశ్యంలో  మునిగి తేలుతు ,భక్తి సామ్రాజ్యం లో మహదానందం పొందడం , ఆయన భాగ్యం అయితే, ఆ పాటను యధాతధంగా మనకు అందించి, అదే పాటను పాడుకుంటూ,, ఆ పాట మాధుర్యం లో మహదానందం పొందే అవకాశం మనకు లభించడం  మహాభాగ్యం కదా !! "ఆహా !!మనిషి మనసులోని. భావం లో ఇంత మధురత,ఇంత గొప్ప జ్ఞానం, జన్మ సాఫల్యత నింపిన   శ్రీకృష్ణ భగవానుడు. ఎంత దయామయుడు ,.!!? అతడి కృపకు నోచుకున్న పరమ వైష్ణవ భక్తులు ఎంత పుణ్యాత్ము లో కదా !! నిజంగా మానవుడు ఎంత అదృష్టవంతుడు ? అందాలకు, ఆనందాలకు సున్నితంగా ప్రతిస్పందించే దివ్యమైన మానవశరీర, సంపద,, అద్భుతమైన మేథా సంపత్తి తో బాటు, వినియోగించు కు నే  జ్ఞానాన్ని, భావోద్వేగాన్ని, అందుకోవడం మనం కావాలనుకుంటే లభించాయా ??, కేవలం దైవం ,మనిషికి అనుగ్రహించిన వర ప్రసాదం కాకపోతే  !!"అలా భావించి, పరమానందం పోందే హృదయాన్ని, అదే పనిగా  తలుచుకునే,, అపురూపం అయిన క్రిష్ణ రూపం చూస్తేనే కరిగిపోయే వెన్నలాంటి  మనసుని కూడా శ్రీకృష్ణ పరందాముడు దయతో మనకు అనుగ్రహించాడు , కదా ! కాస్తా శ్రద్ధతో ఊహిస్తే చాలు, !స్మరిస్తే చాలు,! విశ్వమంతా నిండి ఉన్న గోవిందుడు, ఇలా నీ ఇంటి లో  ఇలా నీ చంక యందు ముద్దులొలికే , బోసినవ్వుల ,చంటి పాపయై  ఒదిగి పోతూ ఉంటాడు! వాస్తవానికి,. ఈ "కృష్ణ ప్రేమ "లో ఏదో తెలియని అలౌకిక అద్భుత అద్వితీయమైన బలమైన సమ్మోహనకర మైన  ఆకర్షణ శక్తి దాగి ఉంది, కోటానుకోట్ల భక్తజనం మోహింపబడే సౌందర్యం కృష్ణయ్య ది,, ఒక్కసారి శ్రీకృష్ణ సుందర విగ్రహాన్ని చూస్తూ ఉంటే చాలు,,!అతని చిద్విలాస దరహాస సుందర రూపాన్ని కాస్సేపు  తిలకిస్తే చాలు !. అతడి వారం అవ డం ఖాయం.. అయినా లోన ఏ మార్పు రాకపోతే,అతడి ఉనికిని , చైతన్యాన్ని, దివ్యత్వాన్ని రంగరించి ఓలలాడించే వేణువు నాదాన్ని వింటే చాలు,," కృష్ణా,, కృష్ణా !"అని భజి స్తే చాలు, లేదా మనసులో కృష్ణ రూపం, ధ్యానం నిలిపితే చాలు, , మన పని అతడే చూసుకుంటాడు . శ్రీకృష్ణ భక్తి తో, , శరణాగతి చేస్తూ ,ఆ శక్తి చైతన్య ఉద్యమం లో అంకితమై, ధన్యులు అవుతున్న లక్షలాది దేశ విదేశ ఇస్కాన్,దేవాలయాలను,, ధోవతి, లాల్చీ, ధరించి, పిలక జుట్టూ, నుదుట తిలక ధారణ, చేతిలో  తులసీ పూసల మాల ను త్రిప్పుతూ హరే కృష్ణా హరే కృష్ణా  అంటూ భక్తి తో నిర్విరామంగా మహామంత్ర జపం  చేస్తున్న కృష్ణ భక్తులను చూస్తే చాలు ,! శ్రీకృష్ణ చైతన్య నిజ సంపద లభిస్తుంది ,, అలాంటి తలపులే , మనిషి బ్రతుకు ను  ధన్యం చేసే నిజమైన భావ సంపద, అవుతాయి.. మిగతావన్నీ , భావ దారిద్ర్య చిహ్నలుగా, మిగిలి, బ్రతుకును నిర్వీర్యం చేస్తాయి. !!!.. చిన్ని కృష్ణుని ప్రతిరూపం వలె, పిల్లలు, మన ఇంటి ముంగిట పారాడుతూ నయన మనోహరంగా, కన్నులకు విందు చేస్తూ, ప్రతి రోజూ ఒక పండగరోజును గుర్తు  చేస్తూ, బ్రతుకును ఆనందమయంగా తీర్చి దిద్దుతూ ఉంటా రు,,,!,, కృష్ణ ప్రేమ ఎంత మహనీయ మైనదో , చూద్దాం !!!",,. "ఆ రోజున రేపల్లె లోని గోపికలతో యశోదమ్మ ఇల్లు కళకళ లాడుతూ సందడి గా  ఉంది, సాయంత్రం,! చీకటి పడిన వేళ, ! దీపాలు  వెలిగించి,అంతా తీరికతో, ఎంతో సంబరం తో,  చిన్ని కృష్ణుని  ,అందమయిన , రంగురంగుల, సువాసనా భరిత మైన పుష్పాలతో,, నవ రత్నాలతో వజ్ర వై డూర్యాలతో , అలంకరించ బడిన ,బంగారు ఉయ్యాలలో పడుకోబె ట్టింది యశోద . ఇరుగూ పొరుగూ ఇండ్లవారిని, తోటివారిని ఆహ్వానించి, వారిని కూడా కృష్ణుని పవళింపు కార్యక్రమం లో చేర్చింది యశోద మాత.,! తన బిడ్డను చూడటానికి సంతోషంతో,ఉత్సాహంగా పరుగులు తీస్తూ వచ్చే వారిని అందరినీ చూస్తుంటే, ఆమెలో" అమ్మ మనసు "ఆనందంతో పొంగి పోతోంది,!"", బిడ్డడు పుట్టగానే "సరిపోదు కదా,! అందరూ ఆ బిడ్డను ఆహా,! ఏమా అందం!, ఎంత బావున్నాడు,, కృష్ణుడు ?? ఇంత చక్కని కొడుకును కన్న ఈ నంద యశోద లుఎంత భాగ్యవంతులో కదా ? అని అంతా అనుకుంటే,, అది ఏ తల్లికైనా గర్వకారణం అవుతుంది  ! మన యశోద మ్మ కూడా అలా ఆ  బ్రహ్మానందం లో మునిగి తేలుతూ ఉంది,, వారికేం తెలుసు, ఆ బాల గోపాలుడు సాక్షాత్తూ వైకుంఠ వాసుడు అయిన శ్రీమన్నారాయణుడు అని !! వారికి చదువూ, పాండిత్యం, లేవు,, దైవాన్ని నమ్ముకుని, రెక్కల కష్టం పై బ్రతుకుతున్న శ్రమ జీవులు, అటువంటి కుగ్రామ వాసులకు తరగని పెన్నిధి వలె కృష్ణ సాన్నిధ్యం ప్రాప్తిం చింది.. అదృష్టం అంటే వారిదే కదా !! ఇప్పుడు అక్కడ చేరిన ఆడువారు అందరూ పోటీలు పడుతూ, కృష్ణుని ఏమారక చూస్తూ, ఉయ్యాల ను నిదానంగా, నింపాదిగా, ఊపుతు ఉన్నారు ,! ఆయనేమో దొంగనిదుర నటిస్తూ ,కళ్ళు మూసుకొని  గమనిస్తూ, వారు తనకోసం ఎంతో ప్రేమగా  పాడుతున్న పాటలను వింటూ,పరమానందం పొందుతూ ఉన్నాడు "" , కృష్ణా లా లీ ! ముద్దుల కృష్ణా లా లీ !,,,""అంటూ ఉయ్యాల చుట్టూ నలువైపులా నిలబడి, కృష్ణ దర్శనం చేస్తూ ఉన్నారు..ఇరువైపుల నుండి  కొందరు వంతుల వారీగా  వస్తూ ,ఊపుతూ , పోతూ  ఉన్నారు.! ఊపుతూ ఉండగా,,. వారిమెడలో వ్రేలాడే హారాలు, ముత్యాల సరాలు , పాపిట బిల్ల లు ,,కూడా వారి తో బాటు అవికూడా ఉాగుతూ ఉన్నాయి .. వారి ముంజేతి కంకణాలు, కాలి గజ్జెలు,, పలు రకాల సంగీత ధ్వనులు చేస్తూ, పాడుతున్న పాటకు అనుగుణంగా తాళం వేస్తూ ఉన్నట్టుగా మోగుతు ఉన్నాయి,!! తెల్లని స్వచ్చమైన మేఘాల వంటి వారి చెంపలపైకి,  పొడవాటి నల్లని జడల కొప్పులు ,కారు మేఘాల వలె ముసురుతు ఉన్నాయి,, !ఉయ్యాల ఊపుతున్న సంతోషంలో సమయమే తెలియని వనితలు, తమ  ఫాల భాగం పై నుండి కారుతున్న చెమట బిందువుల లో తడిచి, నుదుట అతికి పో తున్నే నల్లని వెండ్రుకలను, అవి తమ దృష్టికి అడ్డు వస్తున్న విషయాన్నే మరచి పోయి,, ఆ  గోపాల బాలుని అందాల నగు మోమును తదేకంగా చూసే అమృత ఘడియలని వృథా చేయ కుండా ,తమను తాము మరచి పోతూ, ఉన్నారు ,,!!  ముజ్జగాలను తన  బొజ్జలో దాచుకొని, జగన్నాటక  సూత్రధారి, లీలా మానుష వేషధారి, మురారి,ఇలా చిన్నారి బాలుని రూపంలో ఊగుతున్న ఉయ్యాల ను సుతారంగా, సున్నితంగా, కదిలించడం తన భాగ్యం గా, భావించిన వాయుదేవుడు పొంగిపోతూ, మలయ మారుత గతులలో, ఆనంద మనే మకరందాన్ని వెదజల్లుతూ, అందమైన వాతావరణం కలిగిస్తూ నెమ్మదిగా గాలి వీస్తూ ఉన్నాడు, ఆ చల్లని, ఆహ్లాద భరితమైన గాలులలో,కృష్ణయ్య ఒంటికి అలరిన కస్తూరీ పరిమళాలు , సుగంధ సువాసనలు గుప్పు మంటు  వారి సంతోషాన్ని మరింత  ఇనుమడింప జేస్తూ ఉన్నాయి.! వ్రజవనితలు కన్నయ్య ను చూస్తూ మైమరచి, ఆనందంగా అలాపిస్తూ ఉన్న గాన మాధుర్యం వింటూ ,, చుట్టూ ఉన్న సకల చరాచర జగత్తు తన్మయం పొందుతూ ఉంటే, బలువైన రాళ్ళు కూడా, ఆ గాన లహరి మాధుర్యం లో వెన్న లా కరిగి పోతూ ఉన్నాయి,! రేపల్లెలో ఈ గాన లహరి నీ వింటూ, పరవశిస్తూ ఉన్న రేపల్లె పౌరు లు, గోపాలు రు,మూగజీవాలు, అన్నీ కూడా,  ఆ దినమంతా  పడిన తమ అలసట, శ్రమ, ఆయాసం అన్నీ సునాయాసం గా తొలగిపోతు ఉన్నాయి,! ఆహా! ఎంత రమణీయ సుందర, పరమ పావన దృశ్య కావ్యం, ఈ తలంపు ! లాలి పాట వింటున్న కృష్ణ పరాందాముడు , పాడుతున్న భక్త జనుల హృదయాలలో కృష్ణ ప్రేమ అనే భక్తి నీ, కృష్ణ చైతన్య తరంగాల ప్రచోద న రగిలుస్తు ఉన్నాడు.! ఓ గోవిందా, !యశోదా కి శోరా,! రాధా మనోహ రా,! గోపీ చిత్త మానస చోరా,! బృందావన విహారా!, నంద బాలా !, లలనా జనాల పాలిట నవ మన్మథ చాప బాణం వంటి కృష్ణయ్యా,!, లలిత లావణ్య సుందర సురుచిర స్వరూపా,!, కమలాల వంటి విశాలమైన, చల్లని, చలువ రేకుల వంటి కన్నులు కలవాడా!, పద్మ పత్ర నేత్రా,,! నిర్గుణ నిరాకార సచ్చిదానంద స్వరూపా,!, భక్త జన హృదయ మందారా,,! నవనీత చోరగోవిందా,!, అనంతము, అఖండము, అద్వితీయం, అపురూపం అద్భుతం గా ప్రకాశిస్తూ ఉన్న, కోటి మన్మధ, జగన్మోహనాకారా!, తలచిన కొలదీ, తలపులలో, హృదయ అంతరాళం లో నిరంతరం భాసిస్తు, మదిలో జ్యోతి యై వెలిగే తత్వ జ్ఞాన ప్రకాశ మా,,! శ్రీకృష్ణ భక్తి శక్తి చైతన్య  తరంగమా ! పరమహంస ల పాలిట పరమానందమా,!", అంటూ, రేపల్లె వాసుల పంట గా, నందగో పుని ఇంట, వెలసిన గోవిందుని మనసారా కీర్తించి తరించు దాం  !!నాలుగు వేదాలు నాలుగు త్రాడులుగా మార్చి, సకల భువన,బ్రహ్మాండాన్ని  తొట్టి గా మార్చి,, ఆదిశేషుని నునుపైన దేహాన్ని  తనకు ,తెల్లని చల్లని పానుపుగా అమర్చుకుని,, రేపల్లె చెలుల భాగ్యం గా, పూర్వజన్మ పుణ్యం గా, ఉయ్యాల లూగుతూ , కృష్ణా, అనాడు  నీవు పరవశించావు! కృష్ణ ప్రియులను పరవశింప జేశావు,, ఆ తల్లుల మాతృ వాత్సల్యం చూర గొనడా నికి,, వారి వాత్సల్య ప్రేమానురాగాలు రంగరించి  కలబోసిన కమ్మని అమృత ధారల ను మరపించే చనుబాలు నీవు తనివితీరా  త్రాగడానికి, వారి చేతుల్లో పొత్తిళ్ళలో, కల్లా కపటం ఎరుగని పసివాడు గా ఒదిగి పోతూ, అనాడు, రేపల్లె వనితల ను ధన్యం చేశావు కదా అచ్యు తా ! , అలాంటి మహద్భాగ్యం, భగవద్ ప్రాప్తిని,మహానందాన్ని  పొందడానికి ,నయన మనోహర మైన, అతిరమణీయమైన, కడు కమనీయమైన, ఆ ముగ్ధ మనోహర సుందర దృశ్యం రూపాన్ని , భావిస్తూ,  మురిసిపోతూ, ఆ  తలపుల , వలపుల అమృత ధారల లో, మా మనసులు నిండుగా తడిచి, ముద్దగా మారి, ఆ భావ సంపద తాదాత్మ్యం లో వెన్నలా , అలానే క్రమంగా నీలో నే మమ్మల్ని కరిగి పోనీ, మోహన కృష్ణ !!నవనీత హృదయా,!నవమోహనాంగా,,! నవరస కళా నైపుణ్య చతురా, !శ్రీకృష్ణా,,,! పరమాత్మా, !పరంధామా,! పరాత్పరా,! పరమేశ్వరా,! రుక్మిణీ వల్లభా ! భక్త సులభా ! పాహిమాం, జగత్పితా, !రక్ష మాం దేవకీ సుతా, !శరణు, చిన్ని కృష్ణా, !శరణు, వసుదేవ నందనా, !నంద నందనా శరణు,! స్వస్తి ! హరే క్రిష్ణ హరే కృష్ణా !!""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...