Dallas, Sept 29 2019
అమెరికా లొ Texas రాష్ట్రం, లో డల్లాస్ నగరంలో Frisco ప్రాంతంలో బతుకమ్మ అట, నేడు ఘనంగా జరిగింది. ఆరు బయట,,!! దాదాపు స్త్రీలు 1500 మంది పై గానే వచ్చారు, ఒక్క ఈ ప్రాంతం లోనే ఇంతమంది మనవాళ్ళు ఉండటం అందరూ, ఇలా ఏకత్వం ప్రకటించడం చాలా హర్ష దాయకం!
. నిర్వహణ కమిటీ వారు, తెలంగాణ గ్రామీణ పదాలతో మాట్లాడుతూ, పాటలతో, మాటలతో "తెలంగాణ దుమ్ము" డల్లాస్ లో రేపారు,. ! ఉత్సాహంగా స్త్రీలు , , యువతులు, పిల్లలు కొత్త చీరల్లో, మహాలక్ష్మి ప్రతి రూపంలో అలంకరించుకొని , చక్కగా అందంగా ముస్తాబై , తాము తెచ్చిన రంగు "రంగుల బతుకమ్మ" లని మద్యలో ఉంచుకొని ,రెండు గంటలు ఎంతోసంతోషం తో సామూహికంగా బతుకమ్మ ఆట అడారు
, పిదప,.5 బహుమతులు కూడా చక్కని బతుకమ్మ లను సెలెక్ట్ చేయబడి బహుమతులు కూడా అందుకున్నారు ,
, మన తెలంగాణా సంస్కృతి నీ చాటే దప్పులతో, ఊరేగింపు చేస్తూ బతుకమ్మ లను ఒక పెద్ద తొట్టిలో నిమజ్జనం చేయడం, దుర్గా మాత విగ్రహాన్ని డాన్స్ లతో సందడి చేస్తూ ఉత్సాహం పెంచడం చేశారు,!! ఆటా పాటా అయ్యాక,
వనితలు అందరూ చేరి,, పరస్పరం ,పసుపు కుంకుమ ,గంధం ఇస్తూ, తెచ్చిన ప్రసాదాలు ఒకరికొకరు అందరికీ అందజేశారు,.
DATA, Dallas area Telangana assosiation, కమిటీ వారు Frisco official అమెరికన్ ల తో మాట్లాడి స్తు, అందరికీ శుభాకాంక్షలు అందజేశారు.
పిదప , కళా వేదికపై ,భరత నాట్యం శైలి లో అష్టలక్ష్మీ వైభవం లాంటి పలు నృత్య ప్రదర్శనలు జరిగాయి,
,,మొత్తానికి తెలంగాణా వేదిక ఐకమత్యాన్ని సూచిస్తున్నట్లు గా ఈ "బ్రతుకమ్మ పండుగ"" నిర్వహణ ఘనంగా జరిగింది!,
,, "అధర్మం పై ధర్మం"చెడుపై మంచి, దానవత్వం పై మానవత్వం""! సాధించిన ఘన విజయానికి. సూచనగా , తెలంగాణా రాష్ట్ర ఆడపడుచుల వైభవ చిహ్నంగా ,వెలిగే
బతుకమ్మ తల్లి కి మంగళ హారతి తో ధూప దీప నైవేద్యాలతో మంత్ర యుక్తంగా , పూజిస్తూ నీరాజనాలు సమర్పించారు,
,నిజానికి ఈ బతుకమ్మ పండుగ గొప్పదనం,ఆడపడుచులకు తమ కున్న గౌరవ మర్యాదలను, సంఘం లో గల ఔన్నత్యాన్ని గుర్తింపును, సూచిస్తూ ఉంది,
,,అంతేకాదు,, మన తెలంగాణా రాష్ట్ర ,సనాతన సంస్కృతి సంప్రదాయాలను ,, బయట ప్రపంచానికి బాహాటంగా సగర్వంగా ప్రకటిస్తూ ఉంది. అదికూడా,సామూహికంగా,, , కుల ప్రాంత బేధాలు లేకుండా,, అందరూ అంతటా ఒక్కటై, ఒకే వేదిక పై, పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ ఎలుగెత్తి చాటి చెప్పే తమఆనందమయ జీవన విధానం , ఈ బతుకమ్మ పండుగ !! మహత్వా న్నీ తెలియజేస్తూ ఉంది..
స్త్రీలకు ఇంత గొప్ప గుర్తింపు ను , గౌరవ మర్యాదలను ఇచ్చిన మన తెలంగాణ సభ్య సమాజం, తెలంగాణ జానపద సంస్కృతి కి గర్వకారణంగా ,తల మానికంగా ఈ తొమ్మిది రోజు లూ జరుపుకునే బతుకమ్మ పండుగ ను అనుకోవచ్చును,,,!!
" అందం "అంటే పుష్పాలు,! "అందము "అంటే స్త్రీలు! అలాంటి అందమైన, పుష్పాలు ధరించి , ఆనందంగా పుష్పాల తో పుష్ప దేవత గా భాసిల్లే బతుకమ్మ ను పూజించే స్త్రీలు నిజంగా దేవతా స్త్రీ స్వరూపాలే కదా!
సృష్టిలో నీ సమస్త వస్తువుల కంటే , ఈ పుష్పాలు పవిత్రత కు, పరిమళానికి, అందానికి, ఆనందానికి, దైవత్వానికి చిహ్నాలు, !!
,,అందుకే ఏ దేవతా పూజకైనా ,పుష్పాలు లేనిదే పూజ అనిపించు కో దు కదా !!
,, మన హృదయాన్ని సుకుమారం అయిన పుష్పాలతో పోలుస్తూ, ఆ హృదయ కమలాన్ని జగదంబ చరణ కమలాల ముందు సమర్పిస్తూ అనుదినం తమ భక్తి శ్రద్దలను చూపుతూ ఉండడం మన ఇంటిలో ఒక దినచర్య గా చూస్తున్నాం,,
,, "బతుకమ్మ "అంటే ఎల్లప్పుడూ ఆనందంగా ఉండే ఒక దేవతాస్త్రీ.వైభవం,!! అందుకే మన సంస్కృతి లో మొదటి పీట స్త్రీ కి వేస్తాం !; "మాతృదేవోభవ అంటూ మొదటి నమస్కారం తల్లికే సమర్పిస్తూ ఉంటాం !!
ఏ ఇంటిలో స్త్రీలు, అలా నవ్వుల పువ్వుల సౌరభాలు విరజిమ్ముతూ సంతోషంగా ఉంటారో, ఆ ఇల్లు స్వర్గధామం లా శోభిస్తూ, పిల్లా పాపలతో, భార్యా భర్తల అనురాగం తో కళకళ లాడుతు రోజూ ఒక బతుకమ్మ పండుగలా, గృహిణి చల్లగా కాపాడే దేవతలా, గృహం స్వర్గ సీమ ను తలపిస్తూ నిత్యం ఆనందంగా ఉంటుంది., ఈ
పుష్పాల సొగసు, సౌకుమార్యం, పరిమళం, వైభవం, పవిత్రత ఇవన్నీ,, దైవ పూజకు యోగ్యత ను సూచించే పరమ పావన పూజా ద్రవ్యాలు!, అందుకే పుష్పాలు దేవతా స్వరూపాలు ,!!,
, పుష్పాలను అవమానించి అసహ్యించు కొనే వారు రాక్షస ప్రవృత్తి కలిగి ఉంటారు,,
,, పూవులు తమ జడలో దాల్చుకొని,సర్వాలంకార శోభితులై సాక్షాత్తూ మహాలక్ష్మి రూపంలో ఉన్న స్త్రీ లు సాక్షాత్తూ దుర్గామాత శక్తి స్వరూపాన్ని ఆవిష్కరిస్తూ శోభాయమానంగా ఉంటా రు !
,, ఇలా వనితలంత కలిసి ఈ బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులు , ఒకే చోట చేరి, తమ భక్తి శ్రద్ధలతో అ సంతోషంగా మాత వైభవాన్ని కీర్తిస్తూ చేసే ఈ ఉత్సవం , ఆనంద మంతా ఒకే చోట కుప్పలు పోసినట్టుగా పరమేశ్వరి సన్నిధానంగ , త్రిపురసుందరి మణిద్వీపం లా వెలుగుతూ ఉంటుంది., దుర్గామాత నవరాత్రుల ఉత్సవం కూడా ఈ బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల తో జరుపుకుంటూ ఉండటం అత్యంత ఆనంద కరం,! సకల పాప హరణం! భుక్తి, ముక్తి ప్రదాయకం కూడా !
"పండుగ అంటే అందం అనందం! ఇవి రెండూ కలిసి బతుకమ్మ పండుగ అవుతోంది !!
అదికూడా అందరూ కలిసి ఆ ఆనందాన్ని ఒకే చోట చేరి పంచుకొంటూ ,పెంచుకోడం అపురూపం అద్భుతం!!
,,,,ఈవిధంగా ,ఆడవారు,తమ అటా పాటా ద్వారా బతుకమ్మ అనబడే దేవతను ఆనందింప జేస్తూ అర్చించే ఈ విధానం, వారికి తప్పకుండా దైవానుగ్రహం ప్రాప్తింప జేస్తుంది , కోరిన కోరికలు తీరుస్తూ ఉంటుంది అని అనుకోడం లో ఎలాంటి సందేహం లేదు, కదా!!,,,
,,,తమ స్వంత ఇండ్ల కు మాత్రమే ఈ పండుగను పరిమితం చేయకుండా,, ""సకల జనావళి శ్రేయస్సు"" ను అభిలషిస్తు సాగే ఈ "ప్రశాంత ఆనందమయ వాతావరణ ఉద్యమం "సర్వ జన సమ్మతం!, బహుళ జన ఆదరణ సమ్మిళితం కూడా,!!
,బతుకమ్మ పూలనిమజ్జనం తో జలదేవత ను కూడా సంతృప్తి పరుస్తూ, పూజించే అద్భుత ఆచార సంప్రదాయం, అటు కాలుష్య నివారణ కు ,, ఇటు ప్రకృతి దేవతా ఆరాధనా భావన పెంచుకోడానికి కూడా తోడ్పడుతుంది కదా!!
" ఈ విధంగా ,,అందరికీ ఒక్కడే దేవుడు" అనబడే సూక్తి తో,, మన హైందవ ధర్మం లో దేవతలు దేవుళ్ళు ఎంతమంది కొలవబడుతు ఉన్నా, ఈ బతుకమ్మ పండుగ ద్వారా "అందరికీ దైవం" ఒకరే అని" భిన్నత్వంలో ఏకత్వాన్ని "సూచిస్తూ ఉండడం, చక్కని మన భారతీయ సనాతన సాంప్రదాయాన్ని తెలియజేస్తూ ఉంది,,!
,,,,ప్రపంచంలో నే అత్యంత శక్తివంతమైన మహిళా శక్తి కి దర్పణం లా ప్రతిబింబిస్తూ ఉంది ఈ పండుగ !!,
, అన్నీ దేశాల, అన్నీ మతాల, భాషల ప్రాంతాల మెప్పు ను కూడా పొందుతూ ఉంది మన ఈ బతుకమ్మ పండుగ!
,, అంతే కాకుండా, అద్భుతంగా, అంగరంగ వైభవంగా, వాడవాడలా, ఊరూరా, నగరం ,రాష్ట్రం, దేశం, మాత్రమే ఎల్లలు కాకుండా పరిమితి ,పరిది లేకుండా ప్రపంచం లో నలు మూలల విస్తరింప బడిన తెలంగాణా సంస్కృతి నీ ,, కనుల పండుగ గా రమణీయంగా , కమనీయంగా,,రంగు రంగుల పుష్పాల సౌరభం వలె విరాజిల్లుతూ విస్తరిస్తూ ప్రకృతి శోభతో పులకింపజేస్తునే ఉంది ,!!,,
,, బ్రతినన్నాల్లు ఆనందంగా అందమైన పుష్పాల వలె, బ్రతకాలి!,,
, బతుకమ్మను ఇలా కొలుస్తూ ,"చల్లగా బతుకుదాం !""" అనే ఈ అమూల్యమైన సందేశం ,, మన తెలంగాణా చరితకు, సమాజానికి , శాశ్వత కీర్తిని ప్రతిష్టను, ప్రపంచం లోనే ఉత్కృష్టమైన సమున్నత స్థానాన్ని , సమున్నత వైభవాన్ని, అందరికీ తెలియజేస్తూ ఉంది ,!! "బతుకమ్మ" అనే పదం లోనే మన తెలంగాణా జానపద సాహిత్య సౌరభం "ప్రత్యేకత " నిండి ఉంది,,
బతుకమ్మ పాటలు, అందులో సాహిత్యం, అద్భుతం! తెలంగాణ గ్రామీణ సంస్కృతిని, జీవన విధానాన్ని, ప్రతిబింబిస్తూ , పాడే వారిలో నూతనఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని కలగజేస్తు ఉంటాయి,
, బతుకమ్మ ఒక్కొక్క పాట నిజంగా అమూల్యమైన ఒక్కొక్క ఆణిముత్యం,! అలాంటి భావ సంపద తో, మహదానందాన్ని అనుభవిస్తూ బతుకమ్మ ఆట ఆడే మహిళా శిరోమణులు నిజంగా అదృష్ట వంతులు!, మహా భాగ్య వంతులు కూడా!!
, ""చిత్తూ చిత్తుల బొమ్మ, శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన !"
,,"అంటూ హుషారుగా సంబరంతో సాగే ఈ పాట సకల దేవతల ను ఆహ్వానం పలుకుతూ ఉంటుంది.. ! అలా సంతోషం తో అందరితో కలిసి తాళ యుక్తంగా భావ ప్రకటన చేస్తూ, బతుకమ్మ పాట పాడుతూ చప్పట్లు చరుస్తూ, కోలాటం వేస్తూ, వంగుతూ లేస్తూ చేసే స్త్రీల పద విన్యాసం, బతుకమ్మ ముందు సమర్పించే గొప్ప "నాట్య ప్రదర్శన" లా తోస్తూ ఉంటుంది.
,, నవవిధ భక్తులలో, నాట్యం గొప్పది,! అంటారు ఎందుకంటే, ఇందులో హావభావాలు ,, తనువూ మనసూ, అత్మ సమర్పణ భావంతో ముడిపడి ఉంటాయి,,!
,,,, అందుకే,
"""ఏ దేశమేగినా ఎందు కాలిడినా తలపరా నీ తెలంగాణ ( జాతి )నిండు గౌరవము!"", అనబడే విధంగా మన సంస్కృతిని ప్రతిబింబించే బ్రతుకమ్మ పండుగను తొమ్మిది రోజులు బ్రహ్మాండంగా, బ్రహ్మానందం గా, బంగారంగా జరుపుకుందాము !!
,,,, మన సంప్రదాయాలను, దైవ భక్తి, దైవారాధన పట్ల విశ్వా సాలను , ఈ విధంగా పెంచుకుందాం!!
,, మన తెలంగాణా పట్ల మనకున్న అత్మ గౌరవాన్ని పెంచుకుంటూ, మన జాతి వైభవాన్ని రక్షించు కుందాము,!
జై తెలంగాణా,!!
భారత్ మాతా కీ జై!!
వందే మాతరం! ,,
దుర్గామాత కి జై !!!"
Saturday, October 5, 2019
బతుకమ్మ
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment