Austin, Oct 10, 2019
ప్రతీ మనిషిలో" భగవద్ తత్వం "నిబిడి ఉంటుంది, కదా! కానీ అది బయట పడాలంటే, అక్కడ పరమాత్మ స్వరూప దర్శనం కావాలి.! దేవాలయం లో దైవభక్తి ప్రదర్శింప బడటానికి కారణం, అక్కడి మంత్ర పూరిత విగ్రహం నుండి వెలువడే ధనాత్మక ప్రకంపన ల ప్రతి రూపంగా నెలకొన్న దేవతా స్వరూపం!,,,
, ఆలయం లోనే కాదు, ఎక్కడ సత్సంగం జరిగినా, దైవానికి ఆరాధనలు, జరుగుతున్న మనలోని భక్తి జాగృతం అవుతుంది,!
, అమెరికా లోని ,ఆస్టిన్ నగరం ,బాలాజీ దేవాలయం లో వేంకటేశ్వర స్వామీ విగ్రహం చాలా బావుంది , దాదాపు 10 ఫీట్లు ఎత్తై నా ఉంటుంది,,! అందంగా అద్భుతమైన అభరణాలు ,,పూవులు, అలంకారాలతో ఎంతో ఆకర్షణీయంగా ఉంది,!!,,,,,,,,
గత వారం వేణువు తో కీర్తన వినిపించాను, అక్కడ!! ఇప్పుడు అన్నమయ్య సంకీర్తనలు , స్వామి కళ్యాణ సమయంలో పాడాను,!,,,,,,,
అందరూ విని సంతోషిస్తూ, చాలామంది దగ్గరకు వచ్చి, "మాకు ఎంతో ఆనందం అనిపించింది, మీ రు భక్తితో ఆలాపించిన పాటలు !!,చాలా చక్కగా పాడారు, ,కంఠం బావుంది,! అంటూ మెచ్చుకున్నారు ! ముఖ్యంగా వృద్ద దంపతులు ఇద్దరూ, కారు వరకు వచ్చి, తాము ఎంతో సంతోషాన్ని పొందాం!" మీకు ధన్యవాదాలు !!"" అన్నారు..
, నాకూ అనందం అనిపించింది, స్వామి కృపా భాగ్యంగా, పాటల రూపంలో ,స్వామి ముందు సమర్పించే నా ఆర్తి, అనందం,, ఇలా కొంత మందికి అనందాన్ని కలిగించింది కదా,!"" అన్న సంతృప్తి కలిగింది !! , అంతమందిలో ఈ రకమైన ఒక గుర్తింపు ,,నాకు మరిచిపోలేని మధురానుభూతి గా మిగిలి పోయింది,!!
,, అందరికీ ఏదో ఒక రకమైన ప్రతిభ, ఈ రకంగా అంతర్లీనంగా ఉండి, ప్రకటింప బడే అనుకూల పరిస్తితి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది,!!
ఇది బయట పడి, తనలోని విశిష్టత ఇతరులకు తెలియాలంటే, దైవానుగ్రహం ఉండ క తప్పదు!
, అది రాజకీయం కావచ్చు, విద్యా వైద్య రంగం లాంటివి ఏదైనా కావచ్చు,! ఆ రంగ ప్రవేశం చేయాలన్న,, అందులో రాణించాలని అన్నా, దైవబలం అనుకూలించాలి,!!
వెయ్యి మందిలో ఒకరు మాత్రమే ప్రముఖ కంపెనీలో ఉద్యోగానికి సెలెక్ట్ అవుతారు,! అంత మాత్రాన, మిగతా వారు అనర్హులని కాదు, కదా!! ఎంత ప్రావీణ్యత ఉన్నా, సమయానికి జవాబు తట్టాలంటే, ఆ తెలివి ప్రదర్శింప బడాలంటే, దైవం తోడ్పడాలి.! అదృష్టం బావుం డి, ఎవరికీ కలిసి వస్తుందో, ఆ విషయం, సెలెక్ట్ అయిన విజేతకు కూడా, ముందుగా తెలియదు కదా !!
, ఇక్కడే ఉంది గమ్మత్తు,! ఎందుకు ఇలా కొంతమందికి అన్యాయం, మరికొంత మందికి న్యాయం జరుగుతూ ఉంది !!
,, ఇలాంటి విచిత్రాలు, ఎన్నో జరుగుతూ ఉండడం , మనం రోజూ గమనిస్తూ ఉన్నా అది మనకు అర్థం కాని రహస్యం,, గా మిగిలి పోతూ ఉంటుంది ,,!!
అందరూ మనుషులే, !అవే వసతులు,! అవే పరిస్థితులు,! అవే సమస్యలు, !! ఒకే వేదిక !!కానీ ఆలోచన విధానం మాత్రం వేరు,!!, ఫలితం కూడా వేరే,,!!
, ఈ విధంగా ఎందరు వ్యక్తులు ఉన్నా,, వారు చేసే పనుల్లో , ఆకారాల్లో, ప్రవర్తనా సరళి లో, పొందే అనుభవాలతో , అన్ని రకాల వ్యత్యాసాలు ఉంటున్నాయి,,,!!
,,,గతంలో మనం చేసిన కర్మలకు అనుకూలంగా, మన బుద్దిని ప్రచోదింపజేస్తున్న అంతర్యామి అంతరంగాన్ని అంత సులువుగా పసి కట్టలే ము కదా,,! జీవితంలో నిత్యం జరిగే ఇలాంటి సంఘటనలు,
బ్రహ్మోపదే శాన్ని వివరిస్తాయి!!
,, ఎప్పుడు, ఎక్కడ ,ఎవరికీ ఏం జరుగుతుందో, ఎవరికీ తెలియదు!!, మన గురించి మనకే తెలియని విషయాలు మనలోనే ,ఎన్నో ఉంటున్నాయి,!!
, ఒక భక్తుడు అడిగిన ఇదే సందేహానికి, అరుణాచలం లో రమణ మహర్షి ,,ఒకే సమాధానం చెప్పాడు, ""ముందు నీవు నేను ఎవరిని,?! అన్న ప్రశ్న వేసుకొని జవాబు తెలుసుకొని, అప్పుడు నా దగ్గరికి రా! ""అన్నారట,,,
వేదాలు శృతి స్మృతి పురాణాలు , ఇతిహాసాలు,, ఉపనిషత్తులు వివరించేది ఈ"" పరిప్రశ్న ""మర్మం తెలియడాని కే ,,!!
""నేను ఒక జీవుడను,! ఒక మనిషిని,! ఒక స్త్రీ లేదా పురుషుడ ను!, ఒక ప్రాణిని!, తండ్రీ ,,గురువు కొడుకు, తాత, భర్త భార్య, స్నేహితుడు, ఒక బంధువు,! ఒక మానవుడ ను,!! ఒక శరీరాన్ని !! ఒక ఆత్మను !!ఒక గృహస్తు ,,ఉద్యోగి, కార్మికుడు, వ్యవసాయ దారుడు,!!,"" ఇలా ఎన్నో పాత్రల్లో ఆ వేష భాషలతో లతో, ఆ డైలాగు లతో, మిథ్యా ప్రపంచం లో నటిస్తూ, నటింపజేస్తూ ఇదే జీవితం గా బ్రతుకుతూ,, అయోమయం తో ,, సరియైన సమాధానం తెలియక,, "నేను ఇది,! నేను అది !!""అంటూ అనుకుంటూ, ఉన్నాం,!!
నిజానికి ఈ ప్రశ్న, భూమిపై పుట్టిన ప్రతీ ప్రాణి ది,!! అందులో మనిషి కి మాత్రమే ఆలోచించి జవాబు చెప్పే యోగ్యత ఇచ్చాడు ఆ విధాత ! కనుక, బాధ పడటం, బాధ్యత బరువు వహించడం కూడా చేయాల్సి ఉంటుంది మరి !!
కానీ, మనిషికి ఇన్ని ఇచ్చిన దేవుడు, ఈ ప్రశ్న కు జవాబు మాత్రం నిగూఢంగా ఉంచాడు,,,!! ఎందుకంటే ,, మనిషి తనకు తానే స్వయంకృషి తో అత్మ శోధన చేస్తూ, అన్వేషిస్తూ, సాధించి కనుక్కోవాలి,,?!!
అంతేకాదు !!తనను తాను తెలుసుకునే ఈ ప్రయత్నం లో సహకరించ మని దైవాన్ని వేడుకోవాలి కూడా,,!!
ఆ ప్రయత్నం, చిత్తశుద్దితో, స్థిర సంకల్పంతో, దైవం పై పరిపూర్ణ విశ్వాసంతో, ఆత్మ సమర్పణ భావంతో చేస్తూ ఉంటే, గానీ, దైవం దయ చూప లేడు,!!
ఈ తత్వాన్ని అనుసరించి, మన జీవిత ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకుంటూ , ఈర్ష్యా ద్వేషాలు మానుకుంటే, మనలో ఇతరుల పట్ల కలిగే
,, కోప తాపాలు, కష్ట సుఖాలను సమంగా చూస్తూ ఉంటాము !!
""నేను లాభ పడినా ,,నష్ట పడినా, అది ఇతరుల వల్ల కాదు, !లోపం నాలోనే ఉంటూ , నన్ను ఆడిస్తూ ఉంది, !!"" అన్న తృప్తితో సమాధాన పడాలి,,
, ఈ రకమైన అద్భుత ప్రక్రియలో మనకు సహకరించేది భగవద్గీత మాత్రమే,,!
మనకు కలిగే ఏ సందేహానికి అయినా సంతృప్తిని కలిగించే సమాధానం గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు,!
అందుచేత ,శాంతియుత, ఆనందమయ, జ్ఞానమాయ జీవనం కోసం, ""భగవద్గీత ""ను ఆశ్రయిద్దాం, !! ఆ రకంగా
మహోన్నత మైన మానవజన్మ ను ధన్యం చేసుకుందాం
, గోపాలకృష్ణ భగవాన్ కీ జై,
హరే కృష్ణ హరే కృష్ణా!!
స్వస్తి !!!""
Saturday, October 12, 2019
భగవద్ తత్వం
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment