""నన్ను ఇంత గొప్పగా,
తయారు చేసిన వాడిని,
ఎంతని పొగడ ను ?
ఏమని వర్ణించను ?
అందమైన ఈ శరీరాన్ని,,
లోన అంతకంటే అందమైన మనసుని,
బయట అంతకన్నా అందమైన సృష్టిని,
అణువణువునా పొదగబడిన, జగతి నీ,,
అతడి అద్భుత మైన మహత్వాన్ని,
అది గుర్తించే జ్ఞానాన్ని, పొందగలిగే పరమానందాన్ని ,,
ఎన్నటికీ తరిగిపోని మధురమైన ఆహారాన్ని,
, పుష్కలంగా ప్రకృతి సంపదలను,
ఉచితంగా, ఉదారంగా
, అనుగ్రహించి, అందిస్తు, తనివిదీరా, మనసారా
అనుభవించి, ఆనందించ మని,
మహా ప్రసాదంగా, తన కరుణ గా అందించిన
దైవ కృపను ,
ఏమని పొగడ ను?
ఎంతని వర్ణించను?
సమస్త జీవ రాశుల కన్నా,
ఉన్నతంగా,ఉజ్వలంగా సృష్టించిన మానవాళి నీ,, మాతృ ప్రేమ వాత్సల్యం తో,
అపార కరుణా కటాక్షాలతో కోరకుండానే ఇచ్చిన వరాలతో,
తన అమృతఅనంత దివ్య హస్తాలతో,
పోషిస్తూ, రక్షిస్తూ
అటు సూర్యుడు, ఇటు చంద్రుడు
అటు పంచ భూతాలు, ఇటు పంచ ప్రాణాల లో , నాలో ఉంటూ, నీలో ఉంటూ,
అంతటా ఉంటూ,, అన్నీ తానై ఉంటున్న , ఆ సర్వాంతర్యామి నీ,
ఆ పరాందామునీ ,,
ఆ పరమేశ్వర వైభవాన్ని
ఆ సచ్చిదానంద స్వరూపాన్ని,
ఆ అనంత గుణ గణ సంపన్నుని,,
ఏమని పొగడ ను??
ఎంతని వర్ణించను ,??
నీవు అనంతు డవు,! అఖండ తేజో నిధివి,!
నిన్ను తెలియలే ను,!
నన్ను తెలుసు కొలేను,!
సూత్రధారిగా ఉంటూ, నీవాడించే జగన్నాటకం లో
ఒక పాత్రధారి నీ, మాత్రమే నేను!
వట్టి తోలుబొమ్మ ను, సుమా!!
నీవు లేకుండా నేను లేను,!
నిన్ను స్మరిస్తూ ధ్యానించడం తప్ప,
మరే విధంగా నిను సేవించలేను !!
స్వామీ, శరణు,!
జగన్నాథ శరణు!
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక,, శరణు !!
హరే కృష్ణ హరే కృష్ణా!!
No comments:
Post a Comment