Wednesday, October 16, 2019

అంతా నీవే, అంతటా నీవే

Oct 13, 2019 Austin
నీటిలోన నీవే, నింగి లోన నీవే,
చెట్టు లోన, పుట్ట లోన,
నాలోన, నీ లోనా,
ఇటు చూసినా, అటు చూసినా,
అంతా నీవే, అంతటా నీవే
కృష్ణా నిన్ను చూసేందుకు,
ఈ కళ్ళు చాలవుగా,
కళ్ళ నిచ్చావు కన్నా, కానీ
నిను మాత్రమే చూడగలిగే,
అంతః చక్షువు లను కూడా
అనుగ్రహించు స్వామీ
ఎందుకు ఈ కనులు
వట్టి మాంసం ముద్దలు
దానంగా ఇచ్చి నందుకు దాసులం కాలేక,,
ప్రపంచాన్ని చూస్తూ
నిరుపయోగం చేస్తున్నాం
, వ్యర్థం మా బ్రతుకు
నిను చూడలేని ఈ కళ్ళు
చెట్టు తొఱ్ఱ లు కావా,
బలి ఇచ్చిన మూడడుగులు,
నిన్ను దాసుని చేశాయి అతడి బంటు వయ్యావు
కానీ నేను మాత్రం
అహానికి బలి అవుతున్నా
కృతజ్ఞత మరుస్తున్న
జ్ఞాన నేత్రం ప్రసాదించి
నిను చూసే మహా భాగ్యాన్ని
నిను తలచి తరించే
నీ పాద కమలాలు కొలిచే
భావ సంపద నివ్వు
నా కళ్ళలో నీవు వెలగాలి
నీ చల్లని చూపు లో
నా బ్రతుకు పండాలి
కృష్ణా అన్న పిలుపు తో
నా కళ్ళు చెమ్మగిల్లా లి
ఒళ్ళు పులకరించాలి
తనువూ మనసూ ఒకటై
నీవు నాలో నిలవాలి
నీవు నేను కావాలి
నేనే నీవు కావాలి
ఇంతకు మించిన సౌఖ్యం
ఉంటుందా ఈ లోకంలో
జన్మ రాహిత్యం చేసే
నీ సుందర రూపాన్ని
దర్శిస్తే చాలు కృష్ణా
నీలమేఘ శ్యామా
సుగుణా భి రామా, రామా
మన్మోహన్, మంద స్మిత
మధుర మధుర నామా
యదు నందనా, కృష్ణా
మధుసూదనా
గోపికా వల్ల భా,
రాధా రమణా
హరే కృష్ణ హరే కృష్ణా
స్వస్తి

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...