Saturday, October 12, 2019

భజన

Austin, Oct 8, 2019
"భజన "అంటే భగవంతుని వద్దకు భక్తులను చేర్చే మాధ్యమం,!, "భక్తి "అంటే మనసును అనగా అంతరాత్మ ను పరమాత్మ తో అనుసంధానం చేయడమే,! ఈ కలియుగం లో భజన కు మించిన భక్తి యోగం, మంత్రము, తంత్రము, యోగము, ధ్యానము, జపము, తపము, హోమము, యజ్ఞ యాగాది క్రతువులు, అర్చనలు అభిషేకాలు వంటి పూజా విధానా లు గానీ, ఇవేమీ ,భజనకు సాటి రావు,! అది ఒక దివ్యమైన లోకం,! అందులో శ్రీకృష్ణ భగవానుని అలౌకిక అగణిత అపురూప సౌందర్య మధురా నుభుతి లో చేసే నాదం తో భక్త మీరాబాయి లా, అత్మ సమర్పణ భావంతో ,తనువూ మనసు పరవశిస్తూ ఉండే అద్భుత ఆనందమయ మైన విశ్వసనీయ మైన భక్తికి,భజన ఒక పరాకాష్ట , !
,,పోతే అంతటి మనో స్థితికి, భక్తి శ్రద్ధలు అవసరం,,100% పరిపూర్ణ నమ్మకం అవసరం.,
దేవుడు ఎవరైనా, ఏ రూపంలో భావిస్తూ ఉన్నా, స్థలం ఏదైనా, పరిస్థితులు ఎటువంటి వయిన,, ఆలయం అయినా, ఏకాంతం అయినా, భజనలో లీనమైతే,, నీకు బాహ్యప్రపంచం తో సంబంధం లేకుండా పోతుంది.!! నేను అనే అస్తిత్వం దైవం లో విలీన మౌతుంది.
, భగవంతుడు అంటే అనందం,, ! ప్రశాంతత ! భజన ద్వారా ఇవి రెండూ సాధించవచ్చును,,
"అనందో బ్రహ్మ !""అంటోంది వేదం,! "దైవారాధన !లాంటి భజన లో పొందే అనందం ,, మిగతా ఏ విషయాల్లోనూ, ఇంత సులభంగా  పొందలేము, , దొరికినట్టు అనిపించినా అవి తాత్కాలికం,!, అంటే క్షణ క్షణానికి మారేటివి అని అర్థం,,!
ఈ రోజున భార్యకు భర్త పై, లేదా భర్తకు భార్య పై ఉండే ప్రేమ లేదా అనుభవించే "అనందం " రోజూ ఒకేలా ఉండవు, కదా !
,,అలాగే జీవితంలో తారసపడే అనుబంధాలు కేవలం క్షణికాలు,! అత్మ బందువు అంటే కేవలం ఆ పరమేశ్వరుడు ఒకడే,,
,,, ఇంకా చెప్పాలంటే, ఈ సంసార బంధాలు, గతజన్మ ఋణానుబంధాలు,, మాత్రమే! నీ ప్రాప్తం కొద్దీ, ఇపుడు చూస్తున్న వన్ని నీకు ఇవ్వబడ్డాయి,, ఉదాహరణకు
ఎన్నడూ పరిచయం లేని, రక్తసంబంధం కాని వ్యక్తి తో అత్యంత సన్నిహితంగా ఉంటాము,!
,, అంటే ఏ పూర్వ జన్మ సంబంధం వల్లనో, కదా, ఆ స్నేహం!
అలాంటి తెంచుకొలేని బంధాల నుండి విముక్తి కోసమే ఈ భజన అనే ఆయుధాన్ని ధరించాలి, అది వాటిని నామరూపాలు లేకుండా తెగకోసి నీకు పరమపద సాక్షాత్కార భక్తి సామ్రాజ్య వైభవాన్ని అందిస్తుంది,!
,,  దైవభజన చేస్తుంటే మనసుకు శాంతి, శరీరానికి విశ్రాంతి కలుగుతాయి!,,
తనువూ, మనసూ కలిసే యోగస్తితి నే భజన అంటాము,,
మా అమ్మ ఉదయం 4 గంటలకు లేస్తూనే రామునికి, కృష్ణునికి, జగదంబ కు మేలుకొలుపు లు పాడుతూ ఉండేది,80 ఏళ్ల వయసులో అలా తెళ్ళార్లు, ప్రతిరోజూ ఆయాస ప్రయాసలు లేకుండా కళ్ళు మూసుకొని తనకొచ్చిన భాగవతపద్యాలు, పాటలు పాడుతూ లేనమయ్యేది,
అమ్మా నీకు నోరు నొవ్వ దా ఇలా 3,4 గంటలు ఆగకుండా పాడుతుంటే,? అన్నాను
, అతడు ఇచ్చిన నోరు, అతడి కోసం చేసే భజన లో ఉపయోగించ డం లో అనందం ఉంటోంది రా!
నోరు నొవ్వంగ హరి కీర్తి నుడువడేని, దయయు సత్యం బు లోనుగా దలపడేని ,, కలుగనేటికి  తల్లుల కడుపు చేటు,, అంటూ భాగవత పద్యం శ్రావ్యంగా వినిపించేది,,, నిరంతరం హరి స్మరణ చేసే ఏ ప్రక్రియ అయినా భజనే కదా!!,
,, త్యాగరాజు కృతులు  భజనకు ఉత్కృష్టమైన స్థాయి నీ కలుగజేస్తు ఉంటాయి,,
నవవిధ భక్తి లో, శరణాగత భావం మహోన్నత మైనదీ,, అలాంటి అంకిత భావంతో చేసే కృతులు, కీర్తనలు,  ఆరాధన లు అన్నీ భజన కు ప్రతి రూపాలే,!!
, భజన ఒక్కరూ చేయవచ్చు, ఇద్దరితో ముగ్గురితో, సామూహికంగా చేయవచ్చు!!
ఇలా పదిమందితో చేసే భజన మహాత్మ్యం అద్భుతం, ! అది అనుభవైక వెద్యం,,!
,, ఇక్కడ అమెరికా లో ఆస్టిన్ రాష్ట్రంలో, బాబా ధ్యాన మందిరం లో నిన్న టి రోజున,, ఒక అమెరికన్ స్త్రీ గిటార్ వాయిస్తూ, సాయిబాబా గురించిన భజన గీతాలు రమ్యంగా, పరవశిస్తూ పాడుతూ ఉండటం చూశాను,!! ఆమెను
పరిచయం చేసుకొని , గిటార్ ఎలా నేర్చుకున్నావు అంటే,
బాబా కృప వల్ల అంది, బాబాను చూశావా అంటే,
గిటార్ వాయిస్తూ భజన గీతం పాడుతూ ఉంటే, బాబా చేతి స్పర్శ తన భుజాన్ని తాకుతూ,, ముఖం పై వెలుగులు పడుతూ, తనకు లోన దివ్యాను భూతి కలుగుతూ ఉంటుందట,! తనకి గిటార్ వాయించడం రాదనీ, బాబా కలలో కనిపించి గిటార్ తో తన భజన చేస్తూ ఉండమని,, చెప్పాడట.
అలా ఆరుసార్లు చెప్పడం తో, గిటార్ పై గురి, ఆసక్తి, కుదిరి, క్రమంగా బాబా భక్తురాలు అయ్యింది,
అరగంట సేపు విన్నాను, ఆమె గొంతు, గిటార్ నాదం, భజన గీతాలతో, శ్రావ్యంగా భక్తి భావంతో, తాదాత్మ్యం పొందుతూ , భజన అంటే ఇది అనిపించింది,!
ఇలా చెబుతుంటే ఆమె కళ్ళలో అనందాష్రువులు పొంగడం గమనించాను,
ఇదీ భజనలో ఉండే మేజిక్,"ఇలా ఎన్నో వింత విషయాలు అందరం చూస్తూ ఉంటాం
ముఖ్యంగా, వీణ, గిటార్, సితార్, వాయెలిన్, వేణువు, తబలా, హార్మోనియం, లాంటి వాయిద్యాల సమ్మేళనం తో చేసే భజన, ఆహా! నిజంగా ,అది అద్వైత ఆనంద నిలయం అవుతుంది!!
,, పాటలు, గీతాలు, భజనలు అన్నీ చక్కని, భావంతో, అందమైనసాహిత్యం తో ముడివడి ఉంటాయి.
,, కానీ, "తాదాత్మ్యం "అన్నది ముఖ్యం,! అది ఎవరికి వారే" స్వయంకృషి,"తో నిరంతర సాధన తో, అంకితభావంతో చేస్తూ సాధించాల్సిం దే!! భజనలు ఎన్నో రకాలు,!
""శ్రీరామ్ జయరామ్ జయ జయ రామ్,!,, హరే కృష్ణ హరే కృష్ణా!,, గోవిందా హరి గోవిందా,,!, విఠల విఠల పాండురంగ!,,, హరహర శంకర జయ జయ శంకర,,!"",, లాంటి భజనలు రెండు చరణాలు చాలు, భక్తి రస అమృతాన్ని పంచడానికి,!
,, భజన ఒక అనుభూతి! అద్భుతం, అమూల్యం, అపురూపం,! అద్వితీయమైన, బ్రహ్మానంద భరితమైన పరమానంద మైన మధురానుభూతి! దానిని మాటల్లో చెప్పలేం,,! కవితల్లో వర్ణించలేం,! కేవలం"" స్వానుభవం"" తోనే అవగతం అవుతుంది,,
,, కోతి లాంటి చంచల స్వభావం కలిగిన ఈ మనసును ,,శ్రీహరి నామ గాన మాధుర్యం తో అనుసంధానం చేస్తూ, ఈ శరీరాన్ని పనిముట్టు వలె, హార్మోనియం గిటార్, తాళాలు లాంటి ఏదైనా ఒక వాయిద్యం తో సహకరిస్తూ, , లేదా చప్పట్లు చరుస్తూ, సమయం తెలియకుండా,, అలసట లేకుండా, పరిసరాలు మరిచి,, అంతరంగం లో,, పరమాత్మను నిలుపుకుని, లోనా, బయటా,, ఎదురుగా ఉన్న చెట్టు పూవులు, కృష్ణ శిలా విగ్రహం, నీలాకాశం, నింగీ నేలా, ఆకూ, తీగా ఇలా అన్నింటిలోనూ దాగి ఉంటూ ప్రకాశిస్తున్న పరందా ముని దివ్య రూప వైభవ లావణ్య లీలలను , తాను గానం చేస్తూ వాటిని తాను భజిస్తున్న దైవంగా భావించే , భావసం పద ప్రాప్తించడం,సామాన్యమైన విషయం కాదు,!,
"భజన "అంటే ఏదో, ఒక పండుగ, ఒక పర్వదినం, శ్రీరామ నవమి, శివరాత్రి,కృష్ణాష్టమి లాంటి వేడుకల్లో కొన్ని గంటల పాటు సాగే సంగీత కచేరీ కాదు,,!
భజన అంటే జీవితం!, అదే ధ్యాస,! అదే శ్వాస,! అదే యాస!,, అదే ఘోష, తో బ్రతుకు పంట పండాలి,,! హృదయం లో అనందం నిండాలి!
,, దీనికి సమయం లేదు! సందర్భం లేదు, !సహచర్యం తో  పని లేదు,!
దేశం, కాలం, పరిస్తితి తో సంబంధం లేదు,,! కేవలం చిత్తశుద్ది ఉంటే చాలు! మనసు ను , భజన చేసే చరణాలను, ఆ శ్రీకృష్ణ పరందాముని చరణ కమలాల తో జోడిస్తే  చాలు!! జీవితం ధన్యం అయినట్టే! అదే నిజమైన భజన అవుతోంది!!,,,,
అలా నిరంతరం అనునిత్యం, అనుక్షణం, అనుదినం, పరమ పావన పవిత్ర గంగా, కృష్ణా, గోదావరీ యమునా, లాంటి పుణ్య నదీ జలాల ప్రవాహం వలె అనవరతం, అవిచ్ఛిన్నంగా సాగుతూ ఉంటుంది, ఈ భజన అనబడే అనందా మృత భక్తి తరంగాల స్రవంతి!!
,,, అన్నమయ్య కీర్తనలు, రామదాసు, మీరాబాయి భజనలు మనల్ని భక్తి రసామృత ప్రవాహం లో ఒలలాడిస్తు ఉంటాయి, అలా భజిస్తూ వారు తరించారు,
అదే ,భజనలు మనమూ చేస్తుంటాము, కానీ అందులో జీవం పండదు! ప్రాణం ఉండదు,! భావ సంపద కనిపించదు,! భజిస్టూ ఉన్న సమయంలో, పరమార్థం కంటే ప్రాపంచిక విషయాల మీద నే దృష్టి ఉంటుంది!!
, అంటే సంకల్ప శుద్ది ఉండటం లేదు!, చేసే భజనకు , గడిపే జీవితానికి లింకు ఏర్పాటు చేసుకోవడం లేదు.!
, అది కేవలం ఒక "టైమ్ పాస్, లేదా ఎంజాయ్ చేయడం!", అంటే వినోదం గా భావిస్తూ ఉండడం!!,
"భజన" అంటే మనం అనుకుని చేసే ఒక పని కాదు,! అది నిస్వార్థ భావంతో స్వచ్ఛందంగా దైవానికి సమర్పించే త్యాగ భావం!
, త్యాగానికి మించిన ధనం లేదు, అది మనిషికి మాత్రమే సాద్యపడే అపురూప సాధనం!!,
భజనలో ఈ త్యాగం, అత్మ సమర్పణ భావం ఉంటాయి,!"" అంతయు నీవే హరి పుండరీకాక్ష!" అంటూ గోచరించే పరమాత్మ స్వరూప దర్శనం, ఈ భజన యొక్క ముఖ్యోద్దేశం, దాని ఆంతర్యం కూడా అదే!!
రోజుకు 24 గంటల్లో , కనీసం ఒక గంట అయినా భగవంతుని కి మనస్ఫూర్తిగా అర్పించ గలిగితే, అప్పుడు నీకు భజన చేసేందుకు నిజమైన యోగ్యత వస్తుంది, ! ఇక ఈ ""గంట సమయం"" నీది కాదు, !ఆ దైవం కు సమర్పించింది,!
రోజూ త్రికరణ శుద్ధితో మనసా, వాచా, కర్మణా శ్రీహరి నామ స్మరణ, జపం భజన చేస్తూ ఉండడమే నీ కర్తవ్యం, గా భావిస్తూ చేయాలి. గంటలు మాత్రమే కాదు రోజులు, ఏళ్లు, చివరకు జీవితాన్ని భగవద్ సానిద్యం లో భజిస్తు తరించేవారు ఎందరో మహానుభావు లను, ఇప్పటి కీ మనం గమనిస్తూ ఉంటాం!
, అతడికి సమర్పించిన ఈ ఒకే గంట లో, నీ ధ్యాస ను ఏ కొంత సేపైనా వేరే ఇతర విషయాల వైపు మరల్చే ప్రయత్నం చేస్తే, కృతఘ్నుడు అవుతావు సుమా!, నీవు స్వామి ద్రోహం చేసిన వాడివి అవుతావు ! ఎలా అంటే,
, ఒక యజమాని వద్ద జీతం తీసుకుంటూ ఆయన చెప్పిన  పనిచేస్తూ , మద్యలో నీ స్వంత పని చేయడం ఎంత క్షమించరాని అపరాధమో, ఇదీ అంతే!
, అందుకే, ఏ ఇతరమైన పని యైన చేయవచ్చేమో కానీ,, భజన విషయంలో మాత్రం దైవానుగ్రహం లేకుండా కొనసాగించ డం అత్యంత కష్టతరమైన విషయం!!
అందుకే భజన ప్రారంభం ముందు విఘ్నేశ్వర ప్రార్థన చేస్తుంటారు,, మనసు కుదురుగా ఉండడానికి పదిమందితో కలిసి భజన చేస్తూ ఉంటారు ! ఇది పది రెట్లు ఫలితాన్ని, పుణ్యాన్ని ఇస్తుంది!!
అందుకే ,, మానవజన్మ ను ధన్యం చేసే అవకాశం ఇవ్వమని ఆ దైవాన్నే ఇలా కోరుకుందాం!!
""ఓ పరమాత్మా! ఓ విధాత! ఓ జగన్నాటక సూత్రధారి ! నీవు విశ్వం అంతటా నిండి అనంత స్వరూపం గా భాసిస్తూ ఉన్నావు, కదా! అలాంటి నిన్ను పట్టుకోవడం మానవ మాత్రులకు అసాధ్యం!, నీ కరుణ, కృప ,దయ లేనిదే నీ గురించిన నామ జపం భజన ఏకాగ్రతతో చేయలే ము తండ్రీ ! మా మనసు ను నీ పై నిలుపలే ను, కూడా,! అందుకే,
స్వామీ,!
నీ నామ రూప గానం చేసేందుకు, కావలసిన ఆర్ద్రత, భావ సంపద, శక్తి సామర్థ్యాలను, సంకల్ప సిద్ధిని నాకు అనుగ్రహించు!!
నారాయణా!!, భక్తవత్సల, దీన శరణ్యా,, భక్తజన బందో!!, నిరంతరం నీ పాద కమలాల పై  నా చిత్తాన్ని నిలి పే,మహాభాగ్యం, నాకు కరుణించు,!
కరుణా సాగరా,! కమల లోచనా,! కమలాలయా !! నీ భజన చేసుకుని తరించే అదృష్టాన్ని కలిగించు  !!  శరణు,! స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా!!,

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...