Sept 12, 2019 Dallas
ప్రతీమనిషీ, సహజంగా పరమాత్ముని అంశగా జన్మిస్తాడు, శాంతం, అనందం, నిర్మలత్వం లాంటి అమృత తత్వం తో బాల్య దశలో ఆనందంగా ప్రశాంతంగా ఉంటాడు, కానీ పెరిగే కొద్దీ పరిసరాల ప్రభావం, సంఘం, పెంపకం , తో దైవిక శక్తులు హరిస్తాయి, వాటి స్థానంలో కోపం, అహం, తన పర భావాలు మొలకెత్తి , సంఘం శరణం గచ్చామి అంటాడు,,,,
అయినా కూడా, ఎవ్వరూ పూర్తిగా మంచి లేదా చెడ్డ వాడు కాడు, సందర్భాన్ని బట్టి స్వభావం, గుణాలు ప్రకోపిస్తు ఉంటాయి..
ప్రకృతి అందాలు చూస్తూ పులకించి పోయె ప్రతీ మనిషీ హృదయము నుండి, మధుర భావాలు,, పుట్టలో నుండి వెలువడే చీమల దండులా వెల్లి విరుస్తాయి, ,
మామిడి , జామ, సీతాఫలం, అరటి, ఆపిల్, నారింజ లాంటి మధుర ఫలాల తీయదనం, ఆస్వా దించి అనందం తో ""ఆహా ! భగవంతుడు ఎంత కృపాలువు,? ఇంత చిన్న పండులో, ఎంత గొప్పగా,మధుర రసాన్ని నింపాడు !!,,ఇలా ప్రతీ పండులో తేనె లో తీయదనాన్ని దయతో అందిస్తూ ఉంటున్న ఆ పరమాత్మ హృదయం,, ఇంకా ఎంత గొప్ప అమృత తత్వ భరిత మై ఉంటుందో కదా ??, పరమేశ్వరా ! నీవు ఉన్నావ ని ,, మాకు నీ గురించిన ఈ మధురానుభూతి వల్ల అర్థమవుతోంది ,!! తల్లి వలె ప్రేమపూర్వకంగా పండ్లు కాయలు , ఆహారం అందిస్తూ తినిపిస్తూ శక్తినీ ఇస్తూ ఉన్నావు ,! తండ్రి వలె చెట్లు పంటలు , నదులు, అందిస్తూ రక్షణగా నిలిచి పోషిస్తూ చైతన్యాన్ని కలగజేస్తు ఉన్నావు , కదా!! నీకు మా శతకోటి నమస్కారములు , నారాయణా !!" అంటూ పాల పొంగు వలె,మనిషి అంతరాళం నుండి , కళ్ళ ద్వారా బయటకు ఉబికి వచ్చే ఆనంద భాష్పాలు,, ఆ శ్రీకృష్ణపరాందాముని అనంత ప్రేమను, అపారకరుణ ను ప్రకటిస్తూ ఉంటాయి,!!,
,, కేవలం పండ్ల మాధుర్యం లో మాత్రమే కాదు,, పరమాత్ముని ఉనికిని ,రంగు రంగుల పుష్పాల సొగసు, లలో, మకరంద సువాసన లో, దాగి ఉన్న ఆ దేవాడిదేవుని అందాలు, లావణ్య వైభవాలను విధాత కైనా వర్ణింప తరమా,,??
సృష్టిలో అతి పవిత్రంగా,స్వచ్చంగా, పరిమళ భరితంగా , పరిగణింప బడుతూ, తన అందాలతో, తుమ్మెద లాంటి రస హృద యాలను మత్తెక్కించే అపురూప పుష్ప దృశ్యం పరమాత్ముని గురించిన కమనీయ రమణీయ సౌందర్య కావ్యం అవుతుంది కదా ,!!,,,,
అందుకే ఆరాధించే హృదయం ఉండాలి కానీ, భగవంతుని సర్వ వ్యాప కత్వం లో , ఎందెందు వెదకి చూసినా , అందందే గోచరిస్తు ఉంటాడు విశ్వాత్మ.!!. మనం చూసే చూపుల్లో ఉంటుంది దైవభావన , దైవారాధన!, భగవద్ ప్ర సాదితమైన అందాల ప్రకృతి లోని సౌందర్యాన్ని ఆస్వాదించ లేని మనిషికి , ఎన్ని కథలు, పురాణాలు విన్నా, గ్రంథాలు చదివినా, సత్సంగం చేసినా , పరమాత్మ తత్త్వం అర్థం కాదు, కదా!,
,,, భగవద్గీత లో శ్రీకృష్ణ భగవానుడు , తన విశ్వరూపం ప్రదర్శన ద్వారా, అర్జునుడికి చెప్పింది ఈ విశ్వాత్మ భావనయే !! తాను జగత్తు అంతటా నిండి ఉన్నానని, తన కనుసన్నల్లో సర్వ జగత్తు తేజోవంతం అవుతోందని,,, చెప్పాడు, !!
,,అంతేకాదు,, సర్వ ప్రాణులలో అంతర్యామిగా ఉంటున్న నన్ను నీ హృదయం లో, భావించి , చూడు!! అలా చేయడం వలన,నీకు కలిగే, ఆత్మానందం, పరమానంద అనుభూతిని, నేనే !!! నన్నే ధ్యేయంగా , జీవించు! చాలు ,!! నేనే నీకు రక్షకుడు గా ఉంటూ సరియైన మార్గంలో నిన్ను నడిపిస్తూ ఉంటాను !""అంటాడు,
,,,,
గీతాచార్యుడు బోధించిన ఈ జ్ఞానము తో, గీతా శ్లోకాల పఠనం తో, పరమాత్మ అపార కరుణా కటాక్ష వీక్షణా ల ప్రసార కాంతుల లో బుద్దిని మనసును , శ్రీకృష్ణ భగవానుని పాద పద్మాల చెంతకు మరల్చి, మానవజన్మ లో జీవన మాధుర్యాన్ని పండించు కుందాము,!!, హృదయంలో శ్రీకృష్ణ సుందర రూపాన్ని నిక్షిప్తం చేస్తూ , కలిగే భావ తరంగాలను, స్పందనలను శ్రీకృష్ణ శక్తి చైతన్య ము గా భావిస్తూ మన చుట్టూ , మనలో గోవిందుని తోడుగా చేసుకుంటూ ఉన్నామనే సంతృప్తి తో, ఆనందంగా ఉందాము,
No comments:
Post a Comment