Saturday, October 12, 2019

మురళి

Sept 21, 2019 Dallas
అందుకే మురళి అంటే నాకు ఇష్టం, రోజూ నాతో ఉంటూ, నన్ను మరవకుండ నాతో బాటు ఉంటూ, మహాత్ముల అనుగ్రహాన్ని అందిస్తూ, తన స్పర్శతో మధుర స్వరాలతో, శ్రీకృష్ణ సందర్శన భాగ్యం తో,, తలపులలో కృష్ణ చైతన్య అనుభూతుల తో జన్మ ను  సార్థకం చేస్తూ , నిత్యం నాతో వేణు గానం చేయిస్తూ, అద్భుతమైన అనందాన్ని అనుభవాన్నినాకు ఇస్తూ, అందరికీ పంచుతూ ఉంటుంది,
ఇంతకన్నా అదృష్టం ఉంటుందా,
కుంటివాడి పై పవిత్ర గంగా జల ధార వర్షించినట్టు,,
గ్రుడ్డివా డు దివ్య నేత్రాల తో కృష్ణ పరమాత్మ ను దర్శించి నట్టు,
చెవిటి వాడికి ఆత్మానందాన్ని కలుగిస్తున్నట్టు
మూర్ఖుని కి జ్ఞానాన్ని ఇచ్చినట్టు,
ఆడబోయిన తీర్థం ఎదురై నట్టు,
వెదక బోయిన తీగ కాలికి తగిలినట్టు,,
ఈ వేణుగాన వినోద ములో నన్ను ఇంతగా పరవశింప జేస్తున్న వంశీ లోలుని అపార కరుణా కటాక్ష వైభవానికి శతకోటి ప్రణామాలు, సహస్ర వందనాలు,
హరే కృష్ణ హరే కృష్ణా

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...