Saturday, November 2, 2019

అనందం

Oct 30, 2019 Austin
"నిజమైన అనందం "అంటే భవిష్యత్తు తెలియకుండా ఉండడమే,,!పరమానందం అంటే భగవంతుని తెలియడమే !!
జీవితంలో ఎవరికైనా,  తమకు వచ్చే ఆ  కొన్ని రోజులు "సుఖం" అని తెలిస్తే, "అయ్యో  !!" ఆ తర్వాత దుఖమేనా, దేవుడా ! అని ఇప్పుడే ఏడుస్తా ము ...
లేదా ఆ కొన్ని రోజులు  "దుఖం" అంటే, అయ్యో!" ఆన్ని రోజులు దుఖం భరించాలా అని ఇప్పుడే వేదన పడుతాం,,!
ఇది మన మానవ నైజం !!
ఈ రకమైన "మనో దౌర్బల్యం "నకు కారణం,, ఏమిటంటే,, మన చుట్టూ ఉన్న విషయాలకు, వస్తువులకు ,మనుష్యుల పట్ల మన అంటు దల, వ్యామోహం జిగుత్స, లే ముఖ్య కారణం ,,;!
మనం అనుకుంటాం కానీ, ఈ భవ బంధాల నుండి విడిివడటం అంత సామాన్యమైన విషయం కాదు, కదా!!
ఇల్లు,, ఇల్లాలు ,పిల్లలు ఆస్తులు, అంతస్తుల పై మమకారం తొలగించు కోవడం ఎంతటి వారికైనా అసాధ్యం ,!
""ఆశా మోహములు ,,దరి రానీకోయ్, ఆ ఎరుకే నిశ్చలా నంద మోయ్,, బ్రహ్మానంద మోయ్ !"" అన్నట్లుగా
ఆ వాసన తో నే పుట్టాం,! అందులోనే పెరిగాం,! అందుకే చావడం కూడా అదే వాసన తోనే  కదా!!
ఈ దృక్పథాన్ని దైవ చింతన వైపు క్రమంగా  మల్లించ డాని కే, ఇంట్లో పూజలు జపాలు వ్రతాలు చేస్తాం,, ఇక, బయట,,, దేవాలయ దర్శనం, సత్సంగం, సంఘ సేవ,, తీర్థ యాత్రలు , యజ్ఞాలు హోమాలు అయ్యప్ప స్వామి దీక్షల వంటివి  తీసుకోవడం లాంటి సద్గతి దారులను  మనం ఆశ్రయిస్తు ఉంటాం,!!
ప్రతీ రోజూ క్రమం తప్పకుండా మరచిపోకుండా విడవకుండా, విధిగా అలా దైవారాధన, భగవద్గీత లాంటి ఉత్తమ గ్రంధాల అధ్యయనం చేయడం కూడా ఈ బలవత్తరమైన సంసార బంధాల నుండి దృష్టిని భగవద్ ధ్యానం వైపు మళ్లించడానికి మాత్రమే,,!!
శ్రీహరి చింతన అనే పని  స్వచ్చందంగా చేయాల్సిందే,! ఇందులో ఇతరుల ప్రమేయం,, ప్రభావం ఉండదు. !
బలవంతం లేదు. బ్రతిమిలా డటం అసలే ఉండదు!!
, ముఖ్యంగా దైవబలం తోడు కావాలి,! అది లేకపోతే ,,మానవ మాత్రులం మనం ఏమీ చేయలేం!
అందుకు దైవాన్ని దీనంగా వేడుకోవాలి,! అర్ద్రత తో ప్రార్థించాలి. కన్నీళ్లు పెట్టు కోవాలి.,!
మన బంధువు అయితే ఇలా ఉంటాడు, !ఇక్కడికెళ్తే దొరుకుతాడు , !అనుకునే వీలుంది,,
కానీ, స్వభావము, స్వరూపము, సాకారము , ఏ మాత్రం తెలీని దైవాన్ని ఎలా పెట్టుకోవాలి,? అతడిపై  మనసును ఎలా నిలపాలి,? ఏమని ఏ పేరుతో  ప్రార్థించాలి,? ఎలా ఉంటాడని అనుకోవాలి,??
,, ఇవన్నీ నిజంగా భగవంతుని గురించి తెలుసు కొదగిన పరిప్రశ్న లు,, అర్జు నుని ఇలాంటి సందేహాల నివృత్తి కోసమే  శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ఆవిష్కారం, విశ్వరూప సాక్షాత్కారము సందర్శన భాగ్యాన్ని కర్తవ్య నిర్వహణ ను కూడా అనుగ్రహిం చాడు,,!!
శ్రీహరి ఎలా ఉంటాడో,, ఎక్కడ ఉంటాడో, అసలు ఉన్నాడో లేడో, అన్న సందేహం గజరాజు కు కూడా కలిగింది మొదట్లో,,! అప్పుడు రాలేదు శ్రీహరి !!, "ఉన్నాడు,! తన మొర వింటున్నాడు!!, విని వస్తాడు !!""అన్న ధృఢ నిశ్చయంతో నే ""నీవె తప్ప ఇతః పరంబెరుగ మన్నింపన్ దగున్ దీను నిన్, రావే ఈశ్వర కావవే వరద,, సంరక్షిం చు భద్రా త్మకా , అంటూ ఎలుగెత్తి కన్నీరు కారుస్తూ , ముందు కాలు పైకెత్తి, దండం పెడుతూ, తొండం తో దగ్గర ఉన్న తామర పూవును తీసి, శ్రీహరికి సమర్పిస్తూ ఆత్మార్పణ భావంతో శరణాగతి చేయడం, వలన చావునుం డి తప్పించుకొని, పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందడమే కాకుండా అతడికి సద్గతి  ప్రాప్తి కూడా కలిగింది !!మ
, మనమూ గజేంద్రుని వంటి సంక టస్తితి లో ఉన్నవారమే, ! ఆ విషయం మనం గ్రహించడం లేదు ,!
విషయ వాసనలు అనే కొలనులో, కాల సర్పమనే మొసలి కోరల్లో ఉన్నాం,,! అది ఎప్పుడు, ఎక్కడ , ఎవరిని కాటేసేది ఎవరికీ తెలియదు !!
కానీ, ఎవరూ ఆలా ఉన్నా మని ఒప్పుకోరు,! కనీసం అనుకోరు కూడా,!
నిజానికి అందరిదీ అదే దీన పరిస్తితి, !
,భగవద్ ఆరాధన కు నోచుకోని వారంతా అహంకార మమకారాల తో మత్తులై కన్ను మిన్ను కానని అలనాటి  గజేంద్రు లే  అనుకోవాలి.!!
తీర్థ యాత్రలకు వెళ్లే వారు, రానూ పోనూ టికెట్లు తీసుకొని వెళ్తుంటారు,, అంటే ,,దేవుడిపై ధ్యాస కంటే ఇంటి పైనే యావ ఎక్కువ !!
,,ఇన్నేళ్ళు అలవాటైన స్వంత ఇంటి కి వెళ్ళడానికి ఎంతగానో పరి తపిస్తూ ఉంటారు!, తనవారి కి ఫోన్ లు, చేస్తూ అక్కడినుం డే, వ్యవహారాలు  నిర్వహిస్తూ ఉంటారు, !!
,అంటే "శరీరం"" పరమ పవిత్ర క్షేత్రాల్లో,,పరంధాముని దివ్య ధామం లో ఉన్నా కూడా, మనసు మాత్రం, ఒక ""దీపపు పురుగులా "" ఇంటి చుట్టూ వ్యామోహం తో పరిభ్రమిస్తూ ఉంటుంది,! దేవుని కంటే ఎక్కువగా తనవారిని ప్రేమిస్తూ ఉంటున్నారు అని కదా అర్థం !!""
ఇలాగే  అదే వ్యామోహం తో ఆఖరు శ్వాస విడిి స్తే, సద్గతి కి నోచు కోకుం డా,, అతడి ప్రేతాత్మ అదే ఇంటి చుట్టూ తమవారిపై అదే మమత తో అలానే తిరుగుతూ ఉంటుంది !!
,, అందుచేత,,  మనసులో వైరాగ్య భావన  ఉంటే నే తప్ప, చిత్తశుద్ది కలగదు, ఎప్ప టి కైన ఆ యమ ధర్మరాజు కు స్వాగతం పలుక క ఎవరికైనా తప్పదు కదా "!
మృత్యువు అంటే భయపడే వారు, ఈ తాత్కాలిక భోగ భాగ్యాలు అనే పరదా చాటున దాగి , సంతోషంగా ఉంటున్నట్టు గా నటిస్తూ ఉంటారు,!!
ఇటువంటి జటిలమైన సమస్యల పరిష్కారానికై ఉత్త మో త్తమ మార్గం నిరంతర హరినామ చింతన, యే !!
"హరి భజనలో "అంతటి మహత్తు ఉంటుంది,, అది అనుభవిస్తేనే గానీ తెలియదు ,, సాక్షాత్తూ శ్రీహరిని తన వద్దకు రప్పిం చుకొనే అద్భుత శక్తి ఆ స్మరణ ఆ భజన ఆ భావన లో ఉంటుంది,,!!
ఏ మహానుభావులకు , లేదా పూర్వజన్మ పుణ్యాత్ముల కో తప్ప, అనుక్షణం అనుదినం అనుదినం అనవర తం  ఇలా భగవద్ సాన్నిధ్యం లో మైమరచి ఉండి పోవడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు కదా !!!
కీర్తిశేషులు అయిన మన తాత ముత్తాత ల గురించి ఏ కొంచెం భావించినా, తర్పణాలు విడు స్తూ ఉన్నా గానీ  ,, పురాణాలు వినినా గానీ ఆ భక్తి భావన తో  కొంతనైనా ఆ మరణ భయాన్ని తగ్గించు కోవచ్చును , !!
మరణించిన వారు ఎక్కడికి ,, ఎలా వెళ్తున్నారు ,!?, జన్మించే వారు ఎక్కడినుండి ఎలా వస్తూ ఉన్నారు?? , అని విచారి స్తే తప్ప,,
ఈ సృష్టి చిత్ర విచిత్ర పరిమాణ స్వభావాన్ని , పరమాత్మ తత్వ రహస్యాన్ని  తెలుసుకోలేము కదా,!!
""చావంటే వెరవని ప్రాణి జగతి పై ఉండదు,!!, ఆ వెరపు,, ఆ భయం, ఆ పిరికితనం,,, నిరంతర హరినామ సంకీర్తన వలన మాత్రమే తొలగించు కొన వచ్చును, మరి  వేరే ఇతర దారి లేదు, కాక లేదు,,!
అందుకే వృద్దుడవు కాక మునుపే జ్ఞాన వృద్దులం కావాలి,!
మన జీవన శైలి ఇతరులకు మార్గదర్శకం అవ్వాలి,! ప్రతీ ప్రాణి లో దైవాన్ని దర్శించాల నీ దీని భావం !! ఉత్తమ మానవ జీవన మార్గాన్ని బోధిస్తూ , అదే త్రోవలో నడిపించే భగవద్గీత ను క్షుణ్ణంగా చదవాలి!, , గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుని పాద పద్మాలను ఆశ్రయించి గీతా సారాన్ని ఒంట బట్టించుకొంటు,, మనసు కెక్కించు కుంటు, నిజ జీవితంలో ఆచరిస్తూ ,,శ్రీకృష్ణ తత్వాన్ని విచారిస్తూ,, తద్వారా ఉత్కృష్టమైన ఈ మానవజన్మ ను సార్థకం చేసుకుందాం ,
స్వస్తి !!
హరే కృష్ణ హరే కృష్ణా !

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...