Nov 1, 2019 Dallas
"ఆరాధన "అనేది అద్భుతమైన అందమైన మధుర భావం, !అది త్రిగుణా తీ తం !! అలౌకిక ఆనంద భరితం!!, అనుభవైక వేద్యం, కూడా!!,
స్త్రీ పురుషుల మధ్య, ప్రకృతి కి ప్రాణులకు మద్య, జీవునికి దేవునికి మధ్య గాఢంగా పెనవేసుకునే మమతానుబంధం, అది!!
ఒక భార్య ,తన భర్తను దైవంగా భావించి ఆరాధిస్తూ ఉంటుంది, తనకంటూ ఒక అస్తిత్వం లేకుండా భర్తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ,,అంకిత భావంతో స్వసుఖాలను అతడికై త్యాగం చేస్తూ,, అతడినే తన దైవం గా భావిస్తూ , అలా జీవిస్తూ ,చివరి శ్వాస వరకూ, అతడి ధ్యాసలో నే ఉంటూ ,క్షణ కాలం కూడా దూరం కాకుండా, మనసా వాచా కర్మణా శుద్ధితో స్మరిస్తూ ఉంటుంది,!
ఆరాధన కు అర్థం స్త్రీ! దైవాన్ని ఎలా ఆరాధించా లో స్త్రీ జీవితాన్ని, భక్తి కోణం తో గమనిస్తే, అవలోకిస్తే తెలుస్తుంది !! అందుకే స్త్రీలు ఆరాధన కు ప్రతిరూపాలు అయ్యారు,! శక్తి స్వరూపిణి గా ,ఆరాధ్య దైవాలు అయ్యారు!
, వేదం అందుకే స్త్రీలను "మాతృదేవోభవ" అంటూ స్తుతిస్తూ, ,,మొదటి దైవంగా పూజిస్తూ ఆమెకు పెద్ద పీట వేసింది,,!
ఈ రకమైన ఆరాధన,, భక్తుడు తన ఇష్ట దైవం పట్ల చూపిస్తూ,అంకితభావంతో భక్తి శ్రద్దలను కనబరుస్తూ , ఉంటే అది కూడా "ఆరాధన"" అవుతుంది,!
అంతేకాదు, దైవం పట్ల మన లో ఉండే గౌరవ ప్రేమాభిమానాలు , అత్యుత్తమ విలువలను ఉత్కృష్ట స్తాయిలో కనబరుస్తూ వుంటుంది, ,!
సర్వ ప్రాణి కోటి తో బాటు మనిషి కూడా ప్రకృతి లో భాగమే, !!
కనుక"" రామాయణం" లో వాల్మీకి మహర్షి, సీతా రాముల వనవాస కాలం లో , వనం లో సంచరించే వారి సంయోగ లో పొందే ఆనందం , వియోగం తో అనుభవించే దుఖం, వివిధ ఋతువుల లో కలిగే ప్రకృతి అందాలను సౌందర్యాల ను కలబోసి వర్ణిస్తూ , మహర్షి ప్రకృతి ఆరాధ కుడయ్యాడు ,,,!! అందులో ఆనందం ఉంది!! పారవశత్వం ఉంది ,! తాదాత్మ్యం కూడా ఉంది ! పరమాత్మానుభవసారం ఉంది,!
,,,,,సంగీతము, సాహిత్యం, చిత్ర ,శిల్ప,, కళలు, ఆటలు,, పాటలు ఇత్యాది పలు రంగాలలో కూడా మనసు పెట్టీ ,,వేరే ధ్యాస లేకుండా అరాదిస్తెనే కానీ, అందులో ప్రావీణ్యత లభించదు, కదా!!
దైవారాధన కూడా అంతే,,! ఎన్ని పూవులు నివేదనలు, అభిషేకాలు , సేవలు చేశామని కాదు,,, మనసు పెట్టీ ,పత్రం, పుష్పం, ఫలం తోయం ఏదైనా భక్తి అనే ఆరాధనా భావం తో సమర్పిస్తేనే ,,ఆ చిత్తశుద్ధి కి ,,ఆ అత్మ సమర్పణ భావానికి , ఆ నిష్కళంక ఆరాధనా భావానికి భగవంతుడు కరిగిపోయి ఆనందం తో భక్తుని కరుణిస్తాడు,!!
త్యాగరాజు ఆరాధన ఉత్సవాల లో , ఆయన తాను రచించి, రాగ తాళ భావ యుక్తంగా గానం చేస్తూ స్వరపరచిన కృతులు ,,ఆయన ఆరాధ్య దైవం అయిన శ్రీరామచంద్రుని పట్ల ప్రకటించే ఆరాధన, అనురాగ అనుబంధాన్ని సూచిస్తు ఉంటుంది.
మహానుభావులు , మహాత్ములు ,మహర్షులు ఇదే ఆరాధన తో తమ దైవాలను ఆరాధించి తరించారు!
"ఆరాధన" అంటే నూటికి నూరుపాళ్లు స్వచ్చమైన "తత్వమసి '"అనే వేద ప్రమాణ వాక్యం,!!,
,,"" నీవే నేను,! నేనే నీవు!, నీకూ నాకూ బేధం లేదు,,! నా యోగక్షేమాలు చూసే బాధ్యత నీదే ,! ఎందుకంటే నాదంటూ నా వద్ద ఏమాత్రం లేకుండా ఊడ్చి వేసి, నీ పాద పద్మాల ముందు సమర్పించు కున్నాను శ్రీకృష్ణా ! పరంధామా ,! పరాత్ప రా ! పరమ పురుషా !! "",,అంటూ అనుకుంటూ ఆత్మలో రమిస్తూ, ఆనందిస్తూ బ్రహ్మానంద స్థితిలో"" రామకృష్ణ పరమహంస"" లా దేహం మీద ధ్యాస లేకుండా, శ్రీకృష్ణ పాద ద్వయ చింతనామృత పాన చిత్త హృదయం తో మత్తుడై , పరమానందం తో శ్రీకృష్ణ భక్తి శక్తి చైతన్యం తో కదిలే భావ తరంగాలను"" ఆరాధన ""అంటారు.
శివలింగం నిజానికి ఒక శిలా స్వరూపం! అలా భావించకుండా భక్తుడు, అందులో తన స్వామిని దర్శిస్తూ,, నేరుగా పరమేశ్వరునికి సమర్పిస్తున్న భావంతో,, ధూప దీప నైవేద్యాలతో బాటు భక్తితో సకల ఉపచారాలు చేస్తాడు .ఇది అత్యున్నత స్థాయి ఆరాధన అవుతోంది !;, ,,,
ప్రకృతి సంపదగా ఉంటున్న
ఆకులు ,పువ్వులు, తేనె స్వచ్చమైన నదీ జలాలు సమర్పిస్తూ ,, శివ పూజ కు వినియోగించే పూజా ద్రవ్యాల లో కూడా పరమాత్మను దర్శిస్తూ ఉంటే ,అది దైవారాధన అవుతోంది,,! బ్రహ్మ పదార్థం కానిదేముంటుంది ?? ద్రవ్యాలలో, భక్తుని భావం లో, దేహం లో, కొలిచే మూర్తి లో దైవాన్ని దర్శించ డమే"" ఆరాధన"" అనబడుతుంది,,!!
తమ పెంపు, ఇంపు సొంపు, లను పోషించే ప్రకృతి మాతను ప్రేమించే ప్రతీ మంచిమనసు , కూడా , దేవతా పూజకు ఉపయోగించే ఒక పవిత్ర పూజా కుసుమమే,!!
అనగా భావం ముఖ్యం,! ఏ దృష్టితో చూస్తున్నాం అనేది , ముఖ్యం !! ఉత్సవ మూర్తిని ,చూస్తూ భావిస్తూ, ఆనందిస్తూ, స్మరిస్తూ, స్మరణ లో రమిస్తూ ,, అందులోనే జీవిస్తూ సేవిస్తూ ఉంటే ""ఆరాధన"" అవుతుంది, !
,అది ఒక దైవీ భావన,!! చెట్టూ గుట్టా, పుట్టా, మనిషి ,మృగము, పూవు తీగ, నదులు, లోయలు, సముద్రాలు , ఇలా సృష్టి సర్వంలో , సర్వాంతర్యామి నీ దర్శిస్తూ ఉంటే చాలు, అది ఆరాధన కు పరాకాష్ట అవుతుంది,!! అలా అభ్యాసం చేస్తూ,
సకల ప్రాణుల ఆదరణ, స్వధర్మ ఆరాధన మన జీవన విధానం చేసుకావాలి,!;
ఆరాధన లో త్యాగం ఉంది,! అంకిత భావం ఉంది,! దానికి విజ్ఞానం,పాండిత్యం, అనుభవం , వయసు, జాతి, కుల మత ప్రసక్తి అవశ్యకత లేదు!
,,.,,భక్త శబరి,, మీరాబాయి, అన్నమయ్య, కబీర్ దాసు, తులసీ దాస్, వంటి ఎందరో భక్తులు తమ ఇలవేల్పు లను ఇష్టంగా , ఆరాధించి సాయుజ్యాన్ని పొందారు,
,,,వనంలో నడిచి వెళ్తున్న రాముణ్ణి చూసి లతలు చెట్లు పూలు, సరోవరాలు, జంతువులు , మునులు ఋషులు తమ దైవంగా భావించి ఆరాధించాయి,, అతడు సంతోషంగా ఉంటె సంతోషంగా , దుఃఖ పడుతూ ఉంటే దుఖంగా స్పందిస్తూ , చేతనా వస్తను అనుభవిస్తూ , తరించాయి,,,
అశోకవనంలో ఒంటరిగా సీతామాత ,పుట్టెడు శోకంలో ఉంటూ కూడా ,,తన ప్రాణం, దైవం అయిన భర్త శ్రీరామచంద్రుని, ఆరాధించడం మానలేదు! కలలో కూడా మరవలేదు,!
అలాగే హనుమ, తన ఆరాధ్య దైవం శ్రీరామునీ నామం ధ్యానం చేస్తూ ఆరాధిస్తూ, ఇప్పటికీ చిరంజీవిగా, అభయ ప్రదాత గా వర్ధిల్లుతు ఉన్నాడు..!
! అలాంటి
కల్తీ లేని తేనె ,పాలు ,నీరు వంటి ప్రేమామృత భరిత హృదయ కుసుమాన్ని పరమాత్ముడు ఆనందంగా గ్రహిస్తాడు,
,,,సృష్టిలోని సకల ప్రాణులలో మానవునికి మాత్రమే సాధ్యం అయ్యే ఈ ఆరాధనా పటిమ, ప్రతిభ, ప్రావీణ్యత, వలన దైవ సాక్షాత్కారం పొందే అవకాశం ప్రతీ ప్రాణికీ ఉంది,,
,, దానికి
కావాల్సింది కేవలం మనో వికాసం, !!
దానితో నిరంతర సాధన, అకుంఠిత దైవ భక్తి,, ఇబ్బందులు అడ్డంకులు ఎన్ని ఎదురైనా నిబ్బరంగా ఎదుర్కొనే అత్మ స్థైర్యం, గుండె నిబ్బరం, పరిపూర్ణ విశ్వాసం ,,
అన్నింటికీ మించి ఇష్టదైవం పై ఎనలేని ప్రేమ,, గురి ఏర్పడతాయి. !!
భక్తుడు ఇష్టమైన దేవతా ఫోటోను లేదా మూర్తిని ఎల్లప్పుడూ దగ్గరే పెట్టుకుంటాడు, ప్రాణం లేని మూర్తి లో ఏం చూసి, క్షణకాలం కూడా విడవకుండా చూస్తూ , తన ప్రాణానికి సమానంగా, భావిస్తూ ఉంటున్నాడు?? ఎందుకంటే అది తన జీవం, ధ్యేయం, గమ్యం,!!, అది తల్లి అయినా, తండ్రీ అయినా ప్రియుడు, ప్రియురాలు, అయినా,స్నేహితుడు అయినా ఆత్మ బంధువు అయినా ఇష్ట దైవం అయినా , విశ్వసిస్తే చాలు, అది ఆరాధన అవుతోంది,!!,,
ఆ ఫోటో చిరిగినా, మలినం అయినా, ఎవరైనా గేలి చేసినా, కానిమాట అన్నా ఊరుకోం!!, మనసు బాధ పడుతుంది,!!
అంటే ఫోటోలో ఉన్న వ్యక్తిని అంతగా ప్రేమిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం అన్నమాట,!!
మనసులో ,మాటలో,, భావం లో,, కష్టసుఖాల్లో అన్ని వేళలా ఎడబాయక , నమ్మిన దైవాన్ని, నిరంతరం అంటిపెట్టుకొని హృదయంలో ప్రతిష్టిం చుకునే పరమ పవిత్ర అనుబంధం ఈ, ఆరాధనా భావం ! అది దివ్యం,! అమరం! అమూల్యం! అపురూపం; అద్వితీయం! , అమోఘం! ఈ ఆరాధనా తత్వం,!!!!!
,,,
తనువూ మనసూ, తలపు వలపు, ధ్యానం యోగం, అనురాగం ,అభిమానం అన్నీ ఏకమై మూర్తీభవించిన ""ప్రేమైక భావన""ను ఆరాధన అంటున్నాం,!!
గోపికలు శ్రీకృష్ణుని ఆ విధంగా తలచారు ,వలిచారు, కొలిచారు తరించారు, !! మధురకు వెళ్ళి పోయినా, రాధ హృదయంలో బందీ శ్రీకృష్ణునికి ,ఆరాధన తో మరింత దగ్గరయింది రాధా దేవి,!! , మరవ లేని, విడవలేని అద్భుత ఆరాధనా సంపత్తిని ఆలవరచుకుని భావం లో,, బాహ్యంలో ""మాధవు డే రాధ, రాధయే మాధవుడు!"" గా ఒకరినొకరు పరస్పరము ఆరాధిం చుకున్నారు,, విడదీయరాని అనురాగ అనుబంధంతో అద్వైత ప్రేమైక జీవులవలె విరాజి ల్లారు,,రాధాకృష్ణులు !!
ఇక భాగవతం లోని రాసలీల ఘట్టం, కృష్ణుని పట్ల, గోపికాస్త్రీల కున్న అద్భుత ఆరాధనా శక్తిని, భక్తిని, ఆత్మార్పణ భావాన్ని సూచిస్తోంది !!
ఇందులో ఒక పరమార్థం మనం గ్రహించవచ్చు!!
శిల్పాన్ని అందంగా, సుందరంగా ,అద్భుతంగా మలచిన శిల్పకారుడు అభినందనీయు డే !! కాదనలేం !! నిజమే,! కానీ, అంతటి ఉన్నత స్థాయి శ్రేణికి ఎదగడానికి , అతడిలో తన పట్ల ప్రేమను రగిలించి, పెంచి, పోషించి , అతడిలో అపురూప శిల్ప కళా అభిరుచిని కల్పించి, బయటకు ప్రదర్శించే అవకాశాన్ని అదృష్టాన్ని, ప్రసాదించి, వెలుగులోకి తెచ్చిన అతడి ఆరాధ్య దైవం యొక్క ప్రభావమే గొప్పది, !!
గొప్పతనం శిల్పాన్ని చెక్కిన శిల్పిది కాదు,! చెక్కబడిన శిల్పాని ది కూడా కాదు,! అంతటి మహోన్నత మైన ఆరాధనా పటిమకు తోడ్పడిన దైవబ లానిదే గొప్ప తనాన్ని గుర్తించాలి,!! అదే నిజమైన, సిసలైన, అసలైన ఆరాధన అవుతుంది కదా!!
భక్తుని ప్రేమ అనే పవిత్ర హృదయ క్షేత్రంలో, కరుణ అనే బీజాన్ని నాటి , ఫల పుష్ప భరిత వృక్షంగా ఎదగడానికి "ఆరాధన "అనే భావాన్ని అవలంబన ను అనుగ్రహించిన పరందాముని అపార కరుణా కటాక్ష వీక్షణాల ప్రభా వాన్ని మనం ఆకాంక్షించాలి,,
ఆ పాత్రత, ఆ యోగ్యత భక్తుడు పొందేది కూడా దైవానుగ్రహం వల్లనే !!
అతడి కరుణ ఉంటే చాలు, గడ్డి పోచ కూడా,దైవారాధన కు యోగ్యతా ద్రవ్యం అవుతుంది,!
అందుకే పరమాత్ముని మనసారా వే డుకుందాం, అతడిని గుర్తించి సేవించే మహద్భాగ్యం ప్రసాదించ మని. ,!, దానికి తగిన ఆరాధనా శక్తిని , అంతః కరణ శుద్ది నీ కూడా కరుణించుమని , ఆర్ద్రత తో ఆర్తితో, కోరుకుందాం!!
స్వస్తి !!
హరే కృష్ణ హరే కృష్ణా !""
No comments:
Post a Comment