Dec 9, 2019 Karimnagar
ఓమ్ శ్రీకృష్ణ పరబ్రహ్మ నే నమః!
___________________
భగవద్గీత ,
_____________
కర్మ ఫలం ,, భాగము,1
__________________
మనం జీవితంలో ఉన్న వాటి గురించి కాకుండా, మనకులేని ,వాటి గురిం చే ఎక్కువగా ఆలోచిస్తూ,, ఆరాట పడుతూ వాటిని పొందడం కోసం తరుచుగా బాధపడుతూ ఉంటాం,! అవి పొందడం వలన మనం తృప్తిగా ఉండగలమా,?, ఆ పొందిన వాటిని దూరం చేసుకోకుండా చూడగలమా ,??
ఇది ప్రతీ మనిషికి ఎప్పుడూ ఎదురయ్యే ప్రధానమైన సమస్య!!
అలా ఎంతో ప్రయాసపడి పొందిన వాటితో,మనం నిరంత రం ఆనందంగా ఉండగలమా,!? అన్నది ప్రశ్న !!
,, ధనం ఈ రోజు ఉంది,ఉంటుంది,! అది రేపు పోతుంది!!
ఆరోగ్యం ఉంది , ఇపుడు! అది మారుతూ పోతూ ఉంటుంది!!
స్నేహితులు, ఆత్మీయులు బంధువు లు కూడా దూరం అవుతూ ఉంటారు, ఎవ్వరూ మిగలరు, చివరకు నేను, నాది అనే ది కూడా పోతాయి,
మనం ఆపలేం ఈ మార్పుని,! జగతి అంటేనే అనుక్షణం కాలం తో బాటూ మార్పుకు గురి అయ్యేది,,! అందుచేత ఈ పృత్వి లో ఎది కూడా శాశ్వతం కాదు,,!
ఉన్నవన్నీ పోయేందు కే ఉన్నాయి, !వాటితో సుఖ పడలేం,,!
కొన్నింటిని అంటే,,"పేదరికం" లాంటివి ,దూరం చేసుకుంటే సుఖంగా ఉంటాం అనుకుంటాం,,! కానీ ఎంత ప్రయత్నించినా అవి పోవు,! అలాగే పోయే వాటిని ఆపలేవు,, ఎందుకంటే అవి నీవు కావు కాబట్టి !!
కాబట్టి ఉన్నవి పొయినా,, లేనివి వచ్చి ,, మళ్లీ పోయినా కూడా ,,నీవు ఆనందంగా ఉంటు న్నావా?? అనేది శేషప్రశ్న !
ఉన్నది ఉండినా, ఊడినా ఈ రెండింటి మధ్య నీవు ఆనందంగా ఉండాలనే అవగాహన ""యే ""కర్మయోగం"!
భగవంతుడు అందరికీ మూడు శక్తులు ఇచ్చాడు,
1,జ్ఞాన శక్తి,2, ఇచ్చా శక్తి, 3,,క్రియా శక్తి
జ్ఞానశక్తి కొద్దీ ,గొప్పో తేడాతో అందరికీ, అన్ని ప్రాణులలో కూడా ఉంటుంది, చివరకు దోమ కు కూడా ఉంటుంది, రాయి పై కూర్చున్న మనిషిని కుడుతుం ది కానీ,, రాయిని కుట్ట దు, !అంటే దేనిని కుడితే రక్తం వస్తుందో, దానిని గురించిన జ్ఞానం దానికి ఉంది,!
అలాగే మనిషి దేని కోసం ఆరాటపడ తుంటా డో,, దానిని గురించిన" జ్ఞానం"" అతడికి ఉంది అన్న మాటే కదా ,!
ఈ జ్ఞాన శక్తి ఉండడం వల్లనే ""ఇచ్చా శక్తి""క్రమేణా పెరుగుతూ ఉంటుంది,! డబ్బు ,అస్తి ,కారూ ,బంగళా లు ఇలా మనం కోరుకునే ప్రతీ వస్తువు గురించిన జ్ఞానం మనకు ఉంది,
అందుకే అవి కావాలి అనీ,, కోరుతూ ఉంటాం!
అలా కోరుతూ, వాటిని పొందడానికి చేసే ప్రయత్నమే ""క్రియా శక్తి""!,,,
,,,ఈ విధంగా అందరిలో ఉండే ఈ మూడు శక్తులూ పరిమితంగా ఉంటూన్నాయి,,
ఉదాహరణకు ,,రోడ్డు ప్రమాదం లో ఒక బస్సు కాలవలో బోల్తాపడి కొంత మంది దుర్మరణం పాలయ్యారు అనుకుందాం. !! ఈ విషయం ముందే తెలిస్తే, ఆ బస్సులో ఎక్కేవారా ,, ఆ చనిపోయిన వారు?
అంటే ,, దానిని గురించిన ""జ్ఞాన శక్తి""మనకు "పరిమితం "అని తెలుస్తోంది !!
ఈ కష్టాలన్నీ రావడానికి కారణం, మనకు జ్ఞానశక్తి బలహీనంగా ఉండటమే కదా!!
సముద్ర తీరంలో భయంకరమైన తుఫాన్ వస్తోంది ,,రెండు రోజుల్లో!!"" అని ముందే అక్కడి తీరవాసుల కు ప్రకటన ద్వారా తెలిసినా, వచ్చే తూఫాన్ ను ఎవ్వరూ ఆపలేరు, కదా !! ఆ ప్రాంతాన్ని వారు ఖాళీ చేసి పోవాల్సిందే, !
అంటే ఇక్కడ క్రియా శక్తి బలహీనంగా ఉంది అన్నమాట,!!
,,,ఒక మనిషి డాక్టర్ వద్దకు మామూలు గా వెళ్ళి పరీక్షలు చేయించు కుంటే, పేషంట్ కు "" టెర్మినల్ కాన్సర్ ""ఉందనీ ,,అది నాల్గవ దశలో ఉందనీ తెలిస్తే, ఏమీ చేయలేం ,!! విషయం ముందే తెలిసినా కూడా,ఇక్కడ ""ఇచ్చా శక్తి ""బలహీనం !!
,,,వ్యాపారులు మార్కెట్ లో బాగా డిమాండ్ ఉన్న సరకును భద్రంగా,, గోదాం లో దాచి, ధర బాగా పెరిగాక లాభా నికి అమ్ముకో వచ్చు అనుకుంటాడు !!
కానీ ప్రభుత్వ పాలసీ మారి,, ధరలు తగ్గితే,, భారీ నష్టం వచ్చింది !!
ఈ విషయం ముందే తెలిస్తే,, ఆ వ్యాపారి, అలా సరుకును దాస్తాడా ,?? దాయడు కదా !!
అంటే ఇక్కడ కూడా ""జ్ఞాన శక్తి ""పరిమితం గా ఉంది అన్నమాట!
,, మరొక ఉదాహరణ,,!!ఒకరికి ఐదు లక్షలు అప్పిస్తే,, అది తిరిగి మనం రాబట్టుకొలేక పోతే, అంత డబ్బు అతడికి అప్పుగా ఇస్తామా.?? ఇవ్వం కదా!!
అంటే ఆ జ్ఞానం తక్కువ అని తెలుస్తూ ఉంది !!
ఇలా ఈ మూడు శక్తులూ మనలో ఊహించినంత గా ఉండకుండా, తక్కువ గా ఉండటం వలన ,,ఈ కష్టాలను కోరి తెచ్చు కుంటు ఉన్నాం!!
ఒకటి ఊహిస్తాం,, కానీ,
మరొకటి జరుగుతుంది ,!,
అంటే చేసిన కర్మకు ఊహించిన ఫలితం రాకుండా , ఊహించని రీతిలో లభిస్తూ ఉంటుంది!!
ఇదియే కర్మ ఫలం!!""
స్వస్తి!
హరే కృష్ణ హరే కృష్ణా
Friday, December 13, 2019
భగవద్గీత , కర్మ ఫలం
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment