Friday, December 13, 2019

భగవద్గీత కర్మయోగం భాగము. 2

Dec 10, 2019 Karimnagar
శ్రీ కృష్ణ పర బ్రహ్మనే నమః
__________________
భగవద్గీత  కర్మయోగం
భాగము. 2
_'_______________
ఆశించింది లభిస్తే ఇక ఏ మనిషికీ,, దుఖం ఉండనే ఉండదు, కదా , !కానీ అలా జరగదు ,!!
ఇక్కడే బాధలు మనిషిలో పుడుతూ ఉంటాయి !!
""శ్లో""!!""కర్మణ్యే వాధికారస్తే, , మా ఫలేశు కదాచన ,,!,,,"శ్లోకం లో, అర్థం ఏమిటంటే,,
ఏ కర్మ నీకు ఇష్టమైతే,, ఆ కర్మను నీవు నిరభ్యంతరంగా చేయవచ్చు,!!, కానీ నీ ఇష్టం ప్రకారం , దాని ఫలితం పొందే అవకాశం మాత్రం నీకు లేదు!!"
,,,కాబట్టి కర్మ కు తగిన ఫలితం పొందవచ్చు, పొందక పోనూ వచ్చు,!! ఎందుకంటే,, నీ కర్మకు తగిన ఫలితం నీవు తీసుకోలే వు,, ! అది ఎవరో నీకు  ఇవ్వాల్సి ఉంటుంది,,!
అయితే ఫలితాలను ఊహించి, కర్మ చేయడం లో తప్పు లేదు,!!
డాక్టర్ రోగం నయం చేయాలని,, విద్యార్థి పరీక్షలో ఉత్తీర్ణు డు కావాలని,, వ్యాపార తానుి చేసే పనుల్లో లాభం రావాలని , ఇలా ఊహిస్థూ పని చేయడం లో ఏ మాత్రం తప్పు లేదు,,!!
శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించింది,,, అతడు జ్ణానం పొంది యుద్దం చేయాలని. ! అనే ఉద్దేశ్యంతో చెప్పాడు .
ఈ విధంగా ఎవరు ఏమి చేసినా కొంత ఫలితాన్ని ఊహించే చేస్తారు!!
కానీ ఆ ఊహించిన ఫలితం రావచ్చు,, రాక పోవచ్చు !! అది వేరే విషయం,,!!
ఈ ఫలితాలు నాలుగు రకాలుగా ఉంటాయి,,
1 అధిక ఫలం
2, అల్ప ఫలం
3 అనుకూల ఫలం
4 వ్యతిరేక ఫలం
ఈ నాల్గింటి లో ఏదైనా రావచ్చు,!! ఏది వచ్చినా నీ మనసు వికలం కాకుండా ఉండాలి,,!! నీ మనసు ప్రశాంతంగా , అశాంతికి లోను కాకుండా ఉండాలి!!
ఇదే కర్మ యోగం ,!
ఈ విధంగా తన చేతిలో లేని ఊహించని ప్రతికూల కర్మ ఫలితాలను జీర్ణించుకోలేక, ప్రతీ మనిషి తాను అనుకున్నట్టు పని కాకపోతే,, ఇలా మూడు రకాలు గా అనుకుంటాడు, విచారంగా,,!
1 ఎందుకు జరిగింది ?
2 నాకే ఎందుకు జరిగింది ?
3 ఇప్పుడే ఎందుకు జరిగింది ??
ఇదే ,,తనకు అనుకూలంగా కర్మ ఫలాలు వస్తె  ,,అదే  ప్రశ్నలను  ఇలా తానే,, మళ్లీ మూడు రకాలుగా మార్చి అనుకుంటాడు,, సంతోషంగా,,!
1 జర గ వలసి వుంది,,కనుక జరిగింది !
2 ఇది నాకే జరగాలి !
3 అవును ఇప్పుడే జరగాలి!!
ప్రశ్నలు అవే,! కానీ సందర్భాలను బట్టి,,  నీవు చెప్పుకునే సమాధానాలు వేరు గా చేశావు,,
అనుకూలం గా కర్మలు ఉంటే ఒక రకంగా, ప్రతికూలం అయితే మరో రకంగా మార్చడానికి,,  ఈ ప్రపంచం నీ చేతుల్లో లేదు!!
ఎంత మేధావి అయినా ఎంత విద్యావంతుడు అయినా  ప్రకృతి నియమాలకు తలవంచాల్సిందే. ,!! కాల చక్రం ప్రవాహం లో , దైవాజ్ఞ ను శిరసా వహిస్తూ , బ్రతకాల్సిందే!! నీ ఖర్మ నీవు అనుభవిస్తూ పోవాల్సిందే!! దైవం చేతిలో బొమ్మలం మనము! అతడు ఆడిస్తున్న ట్టు గా ఆడాల్సిందే! మరో దారి లేదు!
నీవు రాక ముందే, ఈ విశ్వంలో చట్టాలు, ధర్మాలు న్యాయాలు ఉన్నాయి , నీవు వెళ్ళి పోయాక కూడా ఇలానే వుంటాయి ,!
ఇవి భగవంతుడు నిర్ణయించిన విధానాలు, ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా జరగాలో అలా జరిగి తీరుతుంది,!!
భగవంతుడు తానే ఈ బ్రహ్మాండమైన  విశ్వాన్ని తయారు చేశాడు, కాబట్టి దీన్ని గురించిన జ్ఞానం అతడికి సంపూర్ణంగా వుంది  ,, అంటే అతడు సర్వజ్ఞుడు !!, అతడికి తెలుసు  ,,ఎలా నడపాలి ఈ విశ్వాన్ని అని!
దానికి తగిన సత్యం న్యాయం, ధర్మ ము విలువలను అతడు రూపొందించాడు ,
,, వాటికి తల ఒగ,్గి మనం నడచు కోవాల్సిందే !!మన కర్మకు ఎది  తగిన ఫలిత మో ,, అతడు మాత్రమే చూసి ఇవ్వాలి, !! అది మన చేతిలో లేదు ,,!
,,దీనిపై నీకు ఎలాంటి అధికారం లేదు,
కాబట్టీ నీఊహలకు అనుగుణంగా ఫలితాలు రావు,!, ఎందుకు అని ప్రశ్నించడానికి నీవు ఎవరవు ?? అతడి చేతిలో ఒక బొమ్మవు,, ఈ భూమి పైకి నీవు నటించాల్సిన పాత్ర తయారు చేసి, పంపాడు,, నిన్ను తయారు చేసి పంపింది అతడే!! నాటకం లో నీ పాత్ర పోషణ పూర్తి అయ్యాక నిన్ను తానే ఇక్కడినుండి తప్పిస్తాడు కూడా !!
భగవంతుడు విధించిన ఈ అచంచల మైన  విశ్వ ధర్మాలు న్యా యాలూ మార్చే అధికారం ఎవరికీ లేదు!!
ఆ సర్వజ్ఞు నికి , ప్రతీ ప్రాణి యొక్క ఈ జన్మ నే కాకుండా గత జన్మలు కూడా తెలుసు,!! వాటిని కూడా లెక్క గట్టి ఫలితాలను నీకు అందిస్తూ ఉంటాడు ,,!! అందువల్ల,,
ఎవరికీ ఏది  ఎప్పుడు రావాలో అదే వస్తుంది !! యోగ్యత లేకపోతే రాదు !! అంతే!!
శ్రీకృష్ణు డు కర్మ యోగం బోధిస్తూ అంటాడు,,
""కావున  ఓ అర్జునా ! ఇది పరిష్కరించు కు నే సమస్య కాదు, !!అర్థంచేసుకోవాల్సిన సమస్య!""అని,,..
,,,,కర్మఫలితాలు ఆ  భగవంతుని"" అమృత హస్తాల నుండి నాకు  ప్రసాదంగా వస్తూ ఉన్నాయి !!" అనుకోవాలి
ఇలా భావిస్తే , జీవితంలో ఏ సమస్యలు ఉండవు,! బాధలు ,,కష్టాలు , ఉండవు!
పరమేశ్వరుడు ఇదంతా చూస్తూ , చేయిస్తూ ,తగిన ఫలితాలను ప్రసాదంగా మనకు అనుగ్రహిస్తూ వున్నాడు ,,,*"అన్న విషయం అర్థం అయితే ,   ""కర్మ యోగ సిద్దాంతం"" గురించి  మనకు ఒక అవగాహన ""వచ్చినట్టే!!
""సర్వం శ్రీకృష్ణ  పరబ్రహ్మ చరణార విందా ర్పణ మస్తు!!""
స్వస్తి!
హరే కృష్ణ హరే కృష్ణా !!""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...