Sunday, December 8, 2019

శక్తి

Dec 7, 2019 Karimnagar
రాయబారం విఫల మయ్యింది , అన్నీ తెలిసి ఉండి కూడా  మూర్ఖుడైన రావణుడు వినలేదు  ! ఇక గత్యంతరం లేక  యుద్దం  ప్రారంభించాడు రాముడు,, శ్రీరాముని అరి వీర పరాక్రమం చూసి, భయపడి,, రావణుడు తనకు కుడి భుజం గా ఉంటున్న కుంభకర్ణుని అతికష్టం తో, బలవంతంగా నిద్ర నుండి లేపాడు  . నిజానికి
అతడు ఆరునెలలు ఖచ్చితంగా పడుకోవాలి,! మద్యలో లేపితే , అరిష్టం! ఇది బ్రహ్మ గారి శాసనం!
అయినా రావణుడు తమ్ముని బల పరాక్రమా ల పై అమిత విశ్వాసం పెట్టుకుని  ధర్మం తెలిసి కూడా మూర్ఖంగా , అహంకారిస్తూ అధర్మ మార్గాన్ని అనుసరిస్తూ వచ్చాడు,,,,,
,,,అన్నట్టుగానే కుంభకర్ణుడు ఘోరంగా విజృం బించి యుద్దం చేయసాగాడు.
వానర సైన్యం చాలామంది హతులవుతున్నా రు, అతడి దెబ్బలకు  తట్టు కోలేక, వానర భల్లూక వీరులు, కాళ్ళు చేతులు విరిగి ,చావు దెబ్బ లు తింటూ , దేహమంతా ,రక్తాలు స్రవిస్తుఉండగా ,, యుద్ద రంగం నుండి పారిపోతూ,, దారిలో హనుమ ను చూసి ఆగి తమ గాయాలు    , చూపుతూ రోదించ సాగారు, !
హనుమ కూడా బాధ పడుతూ""నేను మిమ్మల్ని  ఊరడించడం  తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నా""నని ,
నేను మీకు ఏ సహాయం చేయలే ని  , బలహీను న్ని ,! మీరు నన్ను ఆశ్రయించి  ఏమీ లాభం లేదు,!"" అంటాడు ,
అంటే హనుమ కు బలం లేదనా,, దైర్యం చాలకనా ,!! అలా అన్నాడు.
""అతడు వారితో అబద్దం చెప్పాడా ? "లేదు  !!హనుమ నోట అబద్ధపు మా ట రానే రాదు!!
మరి ఎందుకలా "నేను బలహీనుడ ను !!అన్నాడు , అంటే అతడి బలం అంతా రాముడి అనుగ్రహం వల్ల వచ్చిందే,! పరి పూర్ణంగా ,నూటికి నూరు శాతం దైవాన్ని  నమ్ముకున్న రామ భక్తుడు హనుమ!
సముద్రం దాటడానికి ""నేను,, రాముడు ప్రయోగించిన  రామ బాణం ల అంటే రాముడు మంత్రించి విడిచిన బాణం లా ""వేగంగా దూసుకు పోయాను ,!" అంటాడు
ఎక్కుపెట్ట బడిన బాణం  లక్ష్యం చేరేవరకు మద్యలో ఎక్కడా ఆగ దు  !అదే విధంగా సముద్ర మద్యం లో సింహిక, మైనాకుడు, మేరు పర్వతం లాంటివి అతడి మార్గమధ్యం లో అడ్డు తగిలినా, అతడు వాటిని తాకుతూ ఆగకుండా వెళ్ళాడు! , కానీ ఎక్కడా విశ్ర మించ లేదు హనుమ !!
నిజానికి బాణం లో ఏమీ బలం ఉండదు, !దాన్ని రామ మంత్రం తో అనుసంధానం చేస్తూ సందిస్తే దానికి అద్భుతమైన వేగం బలం ప్రభావం అలవడుతాయి!!
హనుమ బలవంతు డే సహజంగా , కానీ ""ఇది నా బలం కాదు !నా శక్తి కాదు! ఇది రామయ్య ది!"" అనుకుంటాడు ,
తన లో బలం ఉందని తెలుసు,,! కానీ ఆ బలం రాముడి కృప తో వచ్చింది అనీ, తనలో  ఉన్న తన శక్తిని రామ ప్రసా దమని భావిస్తాడు,!!
ఇలా ఆ వానర వీరులు అధైర్యపడుతూ దిగాలు గా ఉంటూ,, , ఏం చెయ్యాలో,, ఎటు పోవాలో ,,ఎవరికీ చెప్పుకోవాలో ,,తెలీని అయోమయ పరిిస్తితి లో ఉంటుంటే , అపుడు గురు స్థానం లో ఉండి దైవాన్ని దర్శించే మార్గాన్ని వారికి  హనుమ సూచిస్తాడు,,,, ""నాయనలారా !మిమ్మల్ని చూస్తే బాధగా ఉం ది !, కానీ నేను మీకు ఏమీ సహాయం చేయలేను !మీకు సహాయం దొరికే దారి చూపిస్తాను, ,అదుగో! చూడండి!! అక్కడ వింటితో బాణాలు సందిస్తు వున్నాడే  కనిపిస్తున్నా డే , అతడి వద్దకు వెళ్ళం డి ,!! అన్నాడు
""అతడు శ్రీరామ చంద్ర ప్రభువు కదా!!"??
అవును  ! అతడే మన రామచంద్రా ప్రభువే! అక్కడికి వెళ్ళండి!!""
""మేము వెళ్ళి, అతడితో ఏమని  చెప్పాలి??"ఓడిపోయి, పారిపోతూ వచ్చామని చెప్పాలా. ??""
""ఏమీ చెప్పకండి,! వెళ్ళి, అతడి ముందు నిలబడండి!! చాలు ! మీరు ఒక్క మాట కూడా  ,అతడితో  చెప్పాల్సిన అవసరం లేదు !!
వెళ్ళండి !నా మాట మీద నమ్మకం ఉంచండి!!""అని పంపాడు..
అలా ఉంటుంది "గురు కృప,!", తనను ఆశ్రయించిన వారికి చక్కని మార్గో పదేశం చేస్తూ వారి బాధను నివారింప జేసే ప్రయత్నం చేస్తాడు సద్గురువు !!
గాయపడిన వానర సైన్యం,భల్లూకాలూ కలిసి, హనుమ చెప్పినట్టుగా నేరుగా వెళ్లి రామయ్య కెదురుగా ,అతడు తమను చూసేలా నిలబడ్డారు!!
చేస్తున్న యుద్దం ఆపి,, రాముడు వీళ్ళ దుస్తితి చూస్తూ ఉంటే అతడి హృదయం ద్రవించింది, బాధతో ,!!
""అయ్యో !వీరంతా తమ తమ కుటుంబాలు విడిచి, నా కోసం ఇంత దూరం వచ్చి పోరాడుతూ , ఇలా గాయ పడుతూ ప్రాణాల మీదకు తెచ్చు కుంటు ఉన్నారు, కదా!""
అనుకుంటూ  పుట్టెడు దుఃఖంతో విపరీతంగా బాధ పడ్డాడు.
ఇదే బాధ ను, రాముడు  తీవ్ర మైన గాయం తో మరణా వస్త లో ఆఖరి శ్వాస తీస్తూ బాధ పడుతూ , తన కోసం ఎదురు చూస్తూ ,కళ్ళల్లో ప్రాణాలు నిలుపు కొన్న జటాయువు ను  చూస్తూ కన్నకొడుకు లా విలపించాడు, పక్షి రాజును తన ఒడిలోకి తీసుకొని , గుండెకు హత్తుకుంటూ,, భోరు మంటూ దుఃఖించాడు రాముడు ,!
రాముడు కరునార్డ్ర హృదయుడు ,! దయా సాగరుడు,,! జటాయువు కోసం, ఒక అత్మ బంధువు కంటే ఎక్కువగా రోదించాడు!
""లక్ష్మణా  ! నా దౌర్భాగ్యం ఎలా ఉందో చూశావా ,,?నా కంటే దురదృష్ట వంతుడు ఈ ప్రపంచం లో లేడు కదా,! తమ్ముడూ !!
ఉన్న ఊరూ కరువైంది! కన్న తండ్రి పోయాడు! ! కన్నవారికి తోబుట్టువుల కు దూరం అయ్యా ను, చివరకు, కట్టుకున్న భార్య సీతమ్మ కూడా కనపడకుండా పోయింది,! ఆత్మీయుడు గా ఉన్న ఈ పక్షిరాజు కూడా , ఇదిగో,ఇలా చివరి నా, చూపుతో నా కోసం, కొస ఊపిరి తీస్తూ,  క్షత గాత్రుడై   ఎలా కొట్టుకుంటూ ఉన్నాడో చూశావా. ? తీవ్రంగా గాయప డి, రక్త స్రావం తో ఎంతగా బాధ అనుభవిస్తూ ఉన్నాడో చూడు లక్ష్మణా ,, నేను ఈ దీన స్థితిని భరించ లేకుండా ఉన్నాను. ?అంటూ జటాయువు ను కౌగలించుకొని , కన్నీరు మున్నీరుగా విలపించాడు రాముడు,!
వనవాసం కష్టం!, భార్యను పోగొట్టుకోవడం  మరీ కష్టం,! అంతకంటే ఎక్కువ కష్టాన్ని  ఈ జటాయువు విషయంలో  అనుభవించాడు శ్రీరాముడు !!
అదే విధంగా ఇప్పుడు తీవ్రంగా గాయపడి రక్తం ఓడుతూ  తన ఎదుట నిలబడి కనిపిస్తున్న  వానర వీరులను  చూస్తూ కూడా,, వా రి కంటే ఎక్కువగా  బాధ పడసాగాడు ,,! అతడిగుండె కరిగి పోయింది,!!, ఈ విధంగా ఏ కోణం లో చూసినా,,
రామాయణం  ఒక ""కరుణా లయం ,!"" కారణం,!! రాముడు కారుణ్య మూర్తి,! పోతపోసిన కారుణ్య విగ్రహం రాముడు,!! అంత విశాలమైన ప్రేమ కలిగిన రామచంద్రమూర్తి స్వరూపం, ఒక్కసారిగా వీళ్ళను చూసేసరికి అతడి కళ్ళ వెంట నీళ్లు  రాసాగాయి !!,
వీళ్లకెందుకు వచ్చింది బాధ,?? ఎందుకు దేహాలు ఇలా నా కోసం శిథిలం చేసుకుంటూ ఉన్నాయి? ఎందుకిలా కష్టపడుతూ ఉన్నాయి? ""అనుకుంటూ వారికోసం  బాధతో కన్నీటి ధారలు రాలుస్తు ఉంటే,,
క్రమంగా వానర భల్లూక సైన్యం లో శక్తి పెరుగుతూ వస్తోంది  !!
,,కొద్దీ సేపటికి , వారంతా వెనక్కు తిరిగి పరుగు పరుగున హనుమ దగ్గరికి వచ్చారు!
చిత్రంగా అందరిలో సంతోషం ఉత్సాహం , ధైర్యం , శక్తి నీ చూస్తున్నాడు హనుమ!
""ఏమైంది వెళ్ళారా?""
""వెళ్ళాం!""
""ఏం చేశారు ??""
""ఏమీ చేయలేదు,! నీవు చెప్పినట్టు గానే, రామునికి కి ఎదురుగా వెళ్లి నిలబడ్డాం,, అందరం,, అంతే!""
""ఏం జరిగింది మరి ??"'
""ఏం జరిగిందో మాకు తెలియదు ,!!, కానీ హనుమా,!, మాలో ఇప్పుడు బాధలు లేవు,! నొప్పులు మాయం అయ్యాయి!, ఇదిగి చూశావా గాయాలు, కూడా లేవు, !, కనీసం నెత్తురు ఛాయలు కూడా లేవు,!! మాకు ఇప్పుడు ఒక్కొక్కరికి వేయి ఏనుగుల బలం వచ్చింది ! ఎంతో సంతోషంగా ఉత్సాహం గా ఉంది ,!! ఇప్పుడు,,, మమ్మల్ని ఏం చేయమంటా వో చెప్పు,?? హనుమా!
ఆ పది తలల వాడి తలలు పచ్చడి చేయమంటావా ,??, కుంభ కర్ణుడి పని పట్ట మంటావా ,?? చెప్పు! హనుమా !
మాకు  కేవలం రామ దర్శనం తో నే,,ఏదో తెలియని అద్భుత శక్తి, వచ్చేసింది సుమా ,!!
ఇప్పుడు తెలిసింది, మాకు,! హనుమా! ""రాముడంటే, రామ నామం అంటే, రామ ప్రభువు దర్శనం"" అంటే నీవు ఎంతగా పరవశిస్తూ, ఆనంద పడుతూ ఉంటావో,,!!"" అంటూ గంతులు వేస్తూ సంతోష పడుతూ ""రామ రామ రామ ""అంటూ భజన చేస్తూ ఉన్నారు!
నిజమే,మరి,,
వారికి ఈ శక్తి ఎలా వచ్చింది,?? అంటే వారు రాముని ముందు వెళ్ళి నిల్చో గానే, వారి పై రాముని చూపు పడింది ,!
అంతే !!వారు  అద్భుత మైన శక్తివంతులయ్యారు!""
రాముని కోసం, తమ భార్యా పిల్లలను విడిచి, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మాయాఘోర రాక్షసుల తో తలపడటానికి సిద్దం అయ్యే ధృఢ సంకల్పం వీరికి ఎలా కలిగింది??, అంటే రాము డి ధర్మం ,నీతి, నిజాయితీ ,, కరుణ ,,పరాక్రమం,, శతృవు నైనా శరణు అంటే చాలు మన్నించే  అపారమైన దయ,,,, క్షమా గుణం ,,అన్నింటికీ మించి ఇతరుల క్షేమం కోసం పాటుపడే ఉదార గుణం ,,, వారు బాధ పడితే తట్టుకోలేని సున్నితమైన హృదయం ,,,, ఇలాంటి అద్భుతమైన , అసాధారణ మైన సుగుణాల ఖని రామయ్య, !! కనుకనే పక్షులు, జంతువులు, మునులు,, రాక్షసులు,, చివరకు ప్రకృతి , పంచభూతా లు క్ కూడా రాముని కై స్పందించారు ,అమితంగా కూడా !!
"జీవుడు దేవుడు కావాలంటే, రాముని వలె ఎదుటివా రీ కష్టాలను, పంచుకో గలగాలి!!"" సుగ్రీవుడు ,జటాయువు, శబరీ, విభీషణుడు, మునుల ను కటాక్షించడం,, ఈ విజ్ఞత తోనే కదా! రాముడు దేవుడయ్యింది ఈ కారుణ్యం తోనే,!
అందుకే, మనిషి ""ఎన్నెండ్లు బ్రతికాడు??"_ అన్నది లెక్క లోకిరా దు,!, ఎంత మందితో ఈ జీవుడు,""మంచి వాడు""గా గుర్తింప బడ్డాడు అన్నది తన లెక్క లోకి తీసుకుంటాడు దేవుడు.!!
అందుకే దేవాలయానికి వెళ్ళాలి !, దైవాన్ని ,,మనం చూడటం కోసం కాదు,! దేవుడు మనల్ని చూడాల న్న ఆర్తితో వెళ్ళాలి, !!ఏ
రాతి విగ్రహం లో నైనా ,నీ ఇష్ట దైవాన్ని దర్శించగలిగితే, అదే దర్శనం ప్రతి ప్రాణి లో రామునిలా చూడగలిగితే , చాలు,!! నిరంతరం ,నీవు పరమాత్ముని సన్నిధిలో కొలువు తీరినట్టే కదా! అందుకే,
నిష్పలా పెక్షతో , నిశ్చల
భక్తితో ఆలయ దర్శనం చేస్తూ ఉండాలి!!
భక్తి సాధనకు దేవాలయ దర్శనం మొదటి మెట్టు గా మనం భావించాలి,!!
తప్పులు చేస్తూ ఉంటాం , నిత్యం అందరం,,,! అది మానవ నైజం,!! కానీ వాటిని ఒప్పుకుంటూ, ""నారాయణా ,,,కరుణించి క్షమించు!"" అని దైవం ముందు నిలబడి మొక్క డం, మానవ త్వం!!
""అలా,,""మానవ సేవయే మాధవ సేవ ""అనే వేద వాక్యాన్ని ఆచరించి చూపించిన దర్మావతారుడు"" శ్రీరామ చంద్ర మూర్తి"""కి శతకోటి ప్రణామాలు సమర్పించు దాం,!
న్యాయాన్ని ధర్మాన్ని సత్యాన్ని, నిష్టతో శ్రీ రాముని లా ఆచరించడం   యజ్ఞం తో సమానం !!" ఈ పవిత్ర యజ్ఞంలో పాల్గొంటూ,రామదర్షణం  చేసే ప్రయత్నం కలిసి  చేద్దాం రండి !!!
జై శ్రీరామ్!!
జై జై శ్రీరామ్ !!
స్వస్తి!
హరే కృష్ణ హరే కృష్ణా!!""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...