Dec 6, 2019 Karimnagar
"పరమాత్మా,! పరందామా,!, పరాత్పరా,! పరమ పురుషా !ప్రభో ,! నీవు సర్వాంతర్యామి వి ,! సర్వ ప్రాణులలో ఉంటున్నట్లే , నా లో కూడా నీవు అంతర్యామిగా ఉంటూ నన్ను జీవింప జేస్తూ నా మనుగడకు , కారణ భూతుడౌతూ ,, నా గత జన్మ లకు అనుగుణంగా నాతో కర్మలు చేయిస్తూ ఆ కర్మ ఫలితాన్ని కూడా నాతో అనుభవింప జేస్తు న్నావని కూడా నాకు తెలుసు,,!"
నారాయణా!!"ఓ, జగన్నాటక సూత్రధారి,!
నీవెంత ""దయా సాగరుడి వో, ఎంత భక్త జన వత్సలుడ వో,, ఆపద్బాంధవుడ వో,"" అన్న విషయం ఇప్పుడిప్పుడే నాకు అవగతమవుతోంది దీన జన శరణ్య ! "
ఓ దేవాదిదేవా !", నేను భూమిపై కి రిక్త హస్తాలతో వచ్చాను,! వెళ్ళేటపుడు కూడా ఖాళీ గా నే పోతాను,! అప్పుడు ఈ దేహం కూడా ఉండదు,! ఈ లోకంలో కి నీవు పంపే సమయం లో అన్నీ ఇస్తూ పంపిస్తూ ఉంటావు ప్రతీ ప్రాణికీ !!
ఇక వచ్చిన పని అయ్యాక ఇచ్చినవన్ని లాగేసుకొంటు, ""నాది" అనేది ఏది మిగలకుండా చేస్తావు! ఏమిటో నీ ఈ లీల ! నాటకం లోని "పాత్ర "ల వలె, ఎప్పుడు, ఏ వేషధారి గా ఏ దేశంలో, ఏ ప్రాంతంలో, కి ఏ విధంగా పంపిస్తా వో, నీఇష్టం ! తీసుకుని పోవడం కూడా నీ ఇష్టమే ! అంతా నీ ఇష్ట ప్రకారం గా నీవు ఆడించే ఈ విచిత్రమైన
నాటకం లాంటి జీవన రంగం లో ,,ఎలా నటిస్తూ ఉన్నామో కూడా, బాగా గమనిస్తూ, వాటి లెక్కలు వేస్తూ, ఆ ఫలితాలను మా అకౌంట్ లలో వేస్తూ, నాటకాన్ని చక్కగా రక్తి కట్టిస్తు ఉంటావు ,గదా గోపీ లోలా ,!
ఇక నేను
పుట్టకముందే , నేను కోరకుండానే , భూమి పైకి వచ్చాక నాకు ఏవి అవసరమో అవన్నీ నాకోసం సిద్దం చేసి పెట్టావు గదా, , స్వామీ'!"ఏమీ దయ నీది !!"
ఈ గాలీ నీరు భూమీ నేలా అగ్ని ,,అన్నీ నీవై ఉంటూ కూడా, అవన్నీ మా జీవన వినియోగం కోసం ప్రసాదంగా ఇస్తున్నావు!!"
, జగత్తు లో కనిపించే వస్తు రూపాల్లో ఉన్న "రూపం" నీవే కదూ,,అనం తా!!"
ఊగే చెట్లను హాయిగా ఊపుతూ, ఎవరికీ కనిపించకుండా ఉంటున్న ఆ వీచే గాలులు కూడా నీవే కదా కేశవా!""
,నిర్గుణ నిరాకార సత్ చిట్ స్వరూపదారివి నీ వే కదా జగన్నాథ !""
నీవు ఉన్నావని, నీవే జగతికి ఆధారభూతుడ వని , నీవు లేకుండా తాను ఉండలేనని విశ్వసించిన వాడే నిజమై న ""భక్తుడు*" అవుతున్నాడు కదా,,!
తండ్రీ!" ,
బ్రహ్మాండం అంతటా నిండి ఉన్న నిన్ను "భక్తితో" ఏకాగ్రత చిత్తం తో కొలవాలంటే నా ఈ గృహము వీలు కావడం లేదు ముకుందా !""
గృహం లో ఎన్నో పనులు ,! అన్నీ పనుల్లో నిన్ను పూజించడం ఒక పని , గా ఊహించలే క పోతున్నా ను శ్రీనివాసా !""
ఏకాగ్ర చిత్తం తో నిన్ను అర్చన చేయలేక పోతున్నాను!"
గోపాలా !ఈశ్వరా !, అందుకే ప్రతి రోజూ క్రమం తప్పకుండా నీ ఆలయానికి వస్తున్నాను, నీ దృష్టి లో పడాలని!
,, ఇక్కడికి భక్తులు ఎంతో మంది వస్తారు,!, ఆ సత్సంగం తో నీపై ఉన్న భక్తి ప్రేమ అనురక్తి లను ఇంకా cపెంచుకునే సౌలభ్యం నీ ఆలయ ప్రాంగణం లో లభిస్తూ ఉంటుంది కదా దామోదర!!
,,,ఎందరు న్నా అందరిలో ఉండేది భక్తి భావన ఒక్కటే ,!! అంతే కాదు,,ఈశ్వరా! మా అంతరంగం లో నీ గురించి మెదిలే అందమైన మధుర భావాల్ని మీకు విన్నవిం చుకో వచ్చును కూడా !," ""రాధా వల్లభ !,నేను నీతో,, నీవు నాతో కూడా మాట్లాడు తూ ఉండవచ్చు కదా!"
అని నేను మనసులో అనుకున్న విషయం దేవదేవుని కి ఎలా తెలిసిందో గానీ, వెంటనే ఆలయం లోని విగ్రహం దేదీప్య మానంగా వెలిగి పోతూ ,,అందులో మందహాస వదనం తో గోచరిస్తు ఉన్నాడు అందాల గోప బాలుడు, ముగ్ద మనోహర శ్యామ సుందరుడు..
""ఆహా ! నాది ఎంత భాగ్యము ,! ఈ రోజు ఎంత సుదినం !!, హే మాధవా! మధుసూదనా! కేశవా! అచ్యుత !అనంత !గోవిందా ,,!నమో నమః! అంటూ స్వామి కి సాష్టాంగ ప్రణామాలు సమర్పించు కొన్నాను,
గోపాల కృష్ణుడు నగుమోము తో , అరుణ కిరణ కాంతులీనే,ఎర్రని లేత కమలాల వంటి పెదవులు కదిలిస్తూ అన్నాడు
"నాయనా ! నీ భక్తి శ్రద్ధలు నన్ను ముగ్దున్ని చేశాయి! అందరిలో అన్నింటిలో దైవాన్ని దర్శించే తత్వం నీవు అలవరచుకోవ డం నాకు సంతోషాన్ని కలిగిస్తూ ఉంది !""అని నంద నందనుడు నా వేపు చూస్తూ అంటూ ఉంటే,,
నేను అనందం తో ఉబ్బి తబ్బిబ్బు అవుతూ, కళ్ళ ఎదుట సాక్షాత్తూ పరమాత్ముని, పరిపూర్ణ అవతార మూర్తిని, చూసిన ,పరమానందం తో తన్మయత్వం లో ఉంటే, నా మాటలు తడబడుతూ ఉన్నాయి
""ధన్యున్ని స్వామీ ,,,! మహా తపసంపన్నులకు లభ్యం కానీ సురుచిర సుందర దివ్య దర్శనం ఈ అల్పునికి, అఙ్ఞానికి ,,అతి సామాన్యునికి లభించడం నా పూర్వజన్మ పుణ్యం!!
కానీ , ప్రభో,!నేను నీకు సమర్పించేందుకు ఏ కానుక నూ తే లేదు,, పురుషోత్తమా !"అంటూ చేతులు జోడించా ను అపరాధి లా. ,
""తేవడం మరిచావా నాయనా ? ""మృదువుగా కృష్ణయ్య పలకరింపు !
నాకు ; ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియలేదు ,,!
*""లేదు ప్రభూ, ఏమీ తేవాలో తోచలేదు,! ఏది చూసినా అందులో ,,""నీ వే కనబడుతూ ఉన్నావు,,!; అంటే అది" నీదై "ఉంది!, ఇక నీది కానిది ఏముంటుంది నా వద్ద నీకు కానుక గా ఇవ్వడానికి "??
స్వామీ ! యశోదా నందనా ,,!,నీది నీకే ఇవ్వడం లో అర్థం లేదు కదా! ""అనగానే,
గోపాలుడు కోటి చంద్ర కాంతుల తలపించే తెల్లని దంత పంక్తి కనబడుతూ ఉండగా, చిరు నవ్వు నవ్వాడు ,
""నీ దగ్గర లేనిది ,అంటే నేను నీకు నేనే కొత్తగా, ఒకటి ఇవ్వాలని నీ అభిప్రాయం,! అవునా ,,?ఇవ్వ మంటావా ,??"
"వద్దు ,ప్రభూ! వద్దు! వద్దు!వద్దు ! నీవు ఇంత వరకూ నాకు ఇచ్చింది చాలు! జగదీశ్వర,,! గోవిందా,! లోకం లో ఎంత మంది కుంటి వాళ్ళు లేరు, కానీ నాకు కాళ్ళు ఇచ్చావు,! ఎందరో గ్రుడ్డి వాళ్ళున్నారు కానీ నాకు చక్కని నేత్ర దృష్టి నీ ఇచ్చావు, ఈ కళ్ళతో నీ అద్భుత మైన అపురూపమైన బ్రహ్మానంద కరమైన, సకల పాప హరణం, మోక్ష దాయకం, బ్రహ్మాది దేవతలు నుతించిన మోహన రూపాన్ని, నారదాది ముని శ్రేశ్టులచే కీర్టింపబడిన కోటి సూర్య ప్రభలతో విరాజిల్లే నీ సౌందర్య స్వరూపాన్ని ,, నీచే సృజింపబడ్డిన ఈ రమణీయమైన అందాల ప్రకృతిని ఆనందంగా చూస్తున్నాను,!
చెవిటి వాళ్ళు ఉన్నారు ఎందరో,!, కానీ, స్వామి !!నీగుణ గణాలు వింటూ ఆనందించే విధంగా శ్రవణశక్తిని ,అనుగ్రహించాడు కదా కరుణాంత రంగా! శ్రీ రంగా!
ఇంత బలగాన్ని ,బంధు మిత్రులను, కుటుంబాన్ని కోరకుండానే ఇచ్చావు,! తరగని ప్రకృతి సంపదలు అడగకుండానే ఇచ్చావు,! అనుభవిస్తూ ఆనందించ డానికి మానవజన్మ ను కరునించావు!"
తృప్తిగా జీవించడానికి
దేనికీ కొరత లేకుండా , చేసి, తిరిగి ,ఏది అడిగే అవసరం అవకాశం కలగనీకుండ అన్నీ ప్రసాదించా వు కదా ,, గోవిందా !!
""ఇంకా, ఏమైనా కావాలా?? అంటూ ప్రేమతో ఆదరిస్తూ ,అనుగ్రహిస్తూ ఉంటున్న నీ అపార కరుణా కటాక్షాల కు ఎన్ని జన్మ లేత్తి నా ,,ఎన్ని ప్రణామాలు చేసినా ,,శ్రీకృష్ణా! నీ కృపకు సరి తూగేనా ప్రభూ??"
చాలు ! మహాప్రభో! చాలు ! ఈ నీ దయఒక్కటి చాలు! శ్రీధర!, నీ దర్శనం చాలు! ఈ భాగ్యం చాలు,!"చాలు!అంటుర్
చేతులు జోడించి కళ్ళ ముందు ఆనందభాష్పాలు వెల్లువలై ఏరులా పారుతూ ఉండగా, స్వామి కి నా మనసు లోని మాట విన్నవించా ను
శ్రీకృష్ణుని మందహాస వదనం తో అంటున్నాడు,,
""నీవు నాకు ఇవ్వవు !నేను నీకు ఇస్తే తీసుకోవు ! ఎలా, నాయనా,! ?మరి, ఇంతకూ ఆలయానికి ఎందుకు వచ్చి నట్టు!!!?? కేవలం నన్ను చూడటాని కేనా ??""
కృష్ణయ్య మధుర మైన పలుకులు వేయి వీణలు ఒక్కసారిగా మృోగుతూ సప్త రాగాలను ధ్వనిస్తు ఉన్నట్టు అనిపించింది
"కాదు ,నందనం దనా,! నిన్ను చూడటానికే అయితే నీ ఆలయానికి ప్రత్యేకంగా రావాల్సిన అవసరం లేదు కదా!""
"అంటే,! వివరించి చెప్పు?"నాయనా ?!
స్వామిని కన్నులు ఆర్పకుండా అతడి సౌందర్యాన్ని కళ్ళతో త్రాగుతూ చెప్పాను , అనం దాతి శయం పెల్లుబికి రాగా
""మాధవా, !ఇంట్లో ఉండి కూడా , నేను,నిన్ను దర్శించు కోవచ్చు ను మనసు ద్వారా !, ఎవరిని తలచుకుంటే వారి స్వరూ పాన్నీ వారి ఆత్మలో దర్శించుకునే జ్ఞాన సంపద ను నీవు మా మానవ జాతికి నీవు అనుగ్రహించా వు కదా ముకుందా!!"
""మరి ఎందుకు వచ్చావు నాయనా ??
వేణు నాదం, లా వాసుదేవుని స్వరం విని పించింది..నాకు ,,
""హే, దయ మయా!" , నేను నీ ఆలయానికి వచ్చింది ,నేను నిన్ను చూడాలని కాదు !, నీవు నన్ను చూడాలని, !!.
నీ కరుణా కృపా కటాక్షా వీక్షణాలు ఈ దీను ని పై వర్షించాల న్న అభిలాషతో ఆర్తి తో నిన్ను ఆశ్రయిస్తూ, ఆరాధిస్తూ తపిస్తూ ఉన్నాను!"
"స్వామీ ,అనుగ్రహించు! , నీ దివ్యమైన ఆశీస్సులు అందించు !"
అనిర్వచనీయ మైన అపురూపమైన, నిర్గుణ నిరాకార సచ్చిదానంద స్వరూప సందర్శనా భాగ్యాన్ని అనునిత్యం అనుక్షణం ఇలా కరుణించు తండ్రి .!
నీ పాదాలు శరణం! నీ తలపే మధురం! నీ స్మరణ యే జీవనం గా బ్రతికే ""భావ సంపద""ను కరుణించు చాలు!
ధన్యోస్మి వేణు గోపాలా!
అంటూ ""హరే కృష్ణ హరే కృష్ణా , కృష్ణ కృష్ణ హరే హరే!! హరే రామ హరే రామ ,,రామ రామ హరే హరే!!""అంటూ అమితానందం తో చప్పట్లు చరుస్తూ ,శ్రీకృష్ణ భగవానుని బిగ్గరగా కీర్తిస్తూ ఉంటే, మెలకువ వచ్చింది
బంగారం లాంటి స్వప్నం కరిగి పోయింది, కానీ, నల్లనయ్య గురించిన మధురానుభూతులు మాత్రం తరగని పెన్నిధి లా మిగిలాయి ,
స్వస్తి!
హరే కృష్ణ హరే కృష్ణా !!
Sunday, December 8, 2019
సూత్రధారి
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment