Sunday, March 29, 2020

మన కర్తవ్యం !

Mar 28, 2020
"తీరని ఆపద ,ఘోర విపత్తు ""కరోనా వ్యాధి రూపంలో ప్రపంచం అంతటా ఒకేసారి వచ్చి పడింది!
ఒకరికి మరొకరు సహాయం చేసుకునే పరిస్తితి కూడా లేదు
మన మధ్య ఉన్న బేధాలు అన్నీ మరచి ,,
అందరం ఒక్కటీ కావాలి !!
మీరు బయటికి వస్తె  ,కరోనా  దయ్యం ,భూతం లా మీ ఇంటికి ఏదో రూపంలో ప్రవేశిస్తుంది !
మానవజాతిని పీల్చి పిప్పి చేస్తూ ఉంది !!
అందుకు మనం ,
మనలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి !
సంత్రా ,బత్తాయి ,water million ,nimma   ఇలాంటి విటమిన్ సి ఉన్న పండ్లను  ,,కోడి గుడ్లను , కూరగాయలతో బాటు తింటూ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి !
కరోనా వ్యాధిని వ్యాప్తి కాకుండా చేయడమే  మన వద్ద ఉన్న ,,ఒకే ఒక  ""మందు "!!
విదేశాల నుండి ఈ వ్యాది ,మన దేశానికి ,మన నగరానికి  వచ్చింది
వారు  ,కరోనా లక్షణాలు ఉన్న వారు ,,ఇక్కడే ,,మన మధ్యనే ఉంటున్నారు !!
రోజూ మనం వాడే నిత్యావసర వస్తువులను ,,వారు ముడుతూనే  ఉన్నారు !!
పాపం ,ఆ ప్రమాదం తమ ఇంట్లో జరుగుతున్న  విషయం ,, వారికి తెలియకుండానే  జరుగుతు ఉంది !!
ప్రభుత్వం ,,పౌరులు బజారులో కి రాకుండా  ,వారి ఇండ్ల కే కావాల్సిన పదార్ధాలు అందజేస్తే ,,, మరింత తొందరగా  ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా కట్టడి చేసుకున్న వారం అవుతాం !!
అందుకే ,,ప్రతీ వ్యక్తి వ్యక్తిగతంగా  బాధ్యత తీసుకుంటూ ,తాను ఒక్కడే కాకుండా  ,,,తన  ఇంటి చుట్టూ రా ఉన్నవారికీ దూరంగా ఉంటూ,,,  వారు కూడా ,దూరంగా  ఉండాలని గుర్తు చేస్తూ, ఉండాలి !!
కంటికి కనబడకుండా ,
ఏ మందు కూ లొంగకుండా
రోజూ రోజుకు తన వ్యాధి గ్రస్తుల సంఖ్యను పెంచుకుంటూ ఉన్న ఈ మహమ్మారి   ప్రభావం మనలోనే మన ఇంటిలోనే  మన వారి లోనే  ఉంది అన్న భావనతో   ప్రతీ ఒక్కరూ,, అప్రమత్తత తో ఉండాలి !!
ఇంత ఘోరం తమ చుట్టూ చూస్తూ కూడా
  ప్రజలు బజార్ లలో ఇంకా తిరుగుతూనే  ఉన్నారు
అంటే  సిగ్గు పడాలి  
వారు  ,అలా ,మన దేశాన్ని తల దించుకునే లా  ఏది పట్టనట్టుగా , బాధ్యతా రహితంగా , విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే బాధగా ఉంటోంది !!"
వారు ఆరోగ్యంగానే ఉండవచ్చు ,!!
ఊరూ,నగరం రాష్ట్రం దేశం ,ప్రపంచం మొత్తం కర్ఫ్యూ విధించారు అంటే  పరిస్తితి  ఎంత దారుణంగా ఉందో   వారు ,,కాస్త అర్థం చేసుకోవాలి
మాకేమైత ది ?? అనే పిచ్చి ఆలోచన   రానీయకుండా 
మన వంతు కర్తవ్యం గా
Physical  distancing కేవలం బయట నే కాదు ,
,అదే
Physical distance  ఇంటిలో కూడా పాటించు దాము ,!!
బయట గుంపులు గుంపులుగా వెళ్ళవద్దు !!
బయటకు వెళ్లిన  వ్యక్తి తనకు  తెలియకుండానే కరోనా వైరస్ ను మోసుకొస్తూ ఒక రోజులో   వందల వేల రోగుల సంఖ్యను పెంచేస్తాడు !
ఆ దెబ్బకు ,,పెద్ద పెద్ద దేశాలే గడ గడ వణకిపోతున్నాయి !
ఇక మనమెంత ?
అధిక జనాభా ఉన్న మన దేశంలో   మనం అజాగ్రత్తగా ఉంటే
,నిర్లక్ష్యం చేస్తే ,ఘోరంగా ప్రాణ నష్టం ,,కష్టం , చేచేతులారా  తెచ్చుకున్న వాళ్ళం అవుతాం !
ఇంతకంటే మూర్ఖత్వం ఉండదు  కదా !
జ్ఞానం ,వివేకం ఉన్న మనిషిలో,,
ఇలాంటి అజ్ఞానం ,అహంకారం  దేవుడు కూడా క్షమించ డు !!
అందుకే ,
దయచేసి  ఎవరూ ,అనవసరంగా బయట తిరగకుండా ,ఈ మూడు  వారాలు  ,,ఎవరి ఇంట్లో వాళ్ళే  గడుపుదామని  మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను  !
మానసికంగా ,శారీరకంగా దృఢంగా ఉండాలి !
పిల్లలను అలా ఉంచాలి కూడా !!
దొరికిన ఈ విరామం లో
1_వ్యాయామము  online చూస్తూ చేయాలి !
2_ఆటా, పాటా,సంగీతం , క్విజ్ ,లాంటివి నేర్చుకోవాలి
3_యోగా ,మెడిటేషన్ ,లాంటివి సాధన చేస్తూ ఉండాలి
4_ డబ్బు ఉంటే  బజారులో ఉండే పేదలు , కార్యకర్తల కు ,సంస్థలకు  ఉదారంగా విరాళాలు అందజేయాలి
5_తక్కువ తినాలి  ఎక్కువగా రసాలు నీరు త్రాగుతూ వుండాలి
ఏ విధమైన అనారోగ్యం రాకుండా  జాగ్రత్తగా ఉండాలి
ఎందుకంటే బయట ఉన్న  ప్రతి  హాస్పిటల్ ,కరోనా పేషంట్ల తో నిండి పోయింది
అందుకే ఎవరికి భారం కాకుండా ఉండాలి
ఎవరిని ఇబ్బంది పెట్టవద్దు !
6_, కరోనా ను నివారించే నిరోధించే సలహాలు ,సూచనలు ,కవిత ,జాగ్రత్తలు ,పష్టలువ్,పద్యాలు ,,నాటకాలు , పుష్టి కోసం శక్తి కోసం  ,తినాల్సిన ఆహార  పదార్థాలు  , భగవద్గీత శ్లోకాలు  online భజన ,,భక్తి గీతాలు గానం చేయడం ,,కథలు చెప్పడం ,
YouTube తో చక్కని సంగీతం ,drawing , painting ,,skipping ,chess , లాంటి వి  indoor games ,, తో, ఈ సెలవుల్లో , తమ పిల్లలలో
""క్రియేటివిటీ""   వారిలో ఉన్న ప్రతిభను , కళలను , పెంచే ప్రయత్నం తలిదండ్రులు చేస్తూ ఉండాలి
  ఇతరుల కు  కూడా వాటిని wattsup మాధ్యమం  ద్వారా తెలియ జేయాలి  !!
ఇంట్లో పిల్లల కోసం వాటిని ఉపయోగిస్తూ , సమయాన్ని సద్వినియోగం చేస్తూ ఉండాలి !!
ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం లా భావించాలి !!
1__మనకు మనమే స్వీయ నిర్భంధం చేసుకోవడం ,
2__సామాజిక దూరం పాటించడం
ఇవి రెండు మనస్ఫూర్తిగా చేస్తూ ఉంటే ,
కరోనా నిర్మూలన అవుతుంది !! 
ఇదే మానవసేవ !
ఇదే దేశసేవ !
ఇదే మాధవసేవ !
ఇదే మానవత్వం !
ఇదే మనిషికి ఉండాల్సిన
ఇంగిత జ్ఞానం !
ఇదే మన  జీవిత లక్ష్యం !
ఇదే ఆదర్శం !
ఇదే దైవత్వం !
నాది  ,మీది  మన అందరిదీ ,,ఒకటే కోరిక !
మనం ఇంట్లో నే ఉండాలి !!
గడప తలుపు పెట్టీ ఉండాలి ,!
ఆ కరోనా బయట ఎండల్లో  మాడి చావాలి !!
మనల్ని చంపడానికి వస్తున్న ఆ శత్రువు పట్ల అప్రమత్తంగా ఉండాలి !
అది ఇంటి దొంగగా. మారింది!!
అది బయటనే చావాలి !
చిత్తశుద్దితో   అనునిత్యం ,,అనుదినం ,,అనుక్షణం ,, జాగ్రత్తగా ఉందాం !!
గరళాన్ని మింగి, లోకాలను రక్షించిన ఆ పరమేశ్వరుడు ఈ కరోనా వ్యాధి బారి నుండి  ప్రపంచాన్ని  రక్షించమని
అందరం భగవంతుని కోరుకుందాం  !!
""హే భగవాన్ !,
మమ్మల్ని  ఈ విపత్తు నుండి  గట్టెక్కిం చే మార్గాన్ని అనుగ్రహించు,,,తండ్రీ !!
నీవు తప్ప మాకు వేరే దిక్కు లేదు !
ప్రభూ!, దీనంగా విలపిస్తూ నీ కరుణ కోసం,,కన్నులు కాయలు కాసే లా , ఎదురుచూస్తూ ఉన్న  మా మొర ఆలించు !
ఎన్నడూ , కనీ వినీ ఎరుగని ఈ దుష్ట రాక్షసి "కరోనా "ను తు ద ముట్టించు !!
నారాయణా ! మాకు నీవే గతి !
కృప ఉంచి సత్వరంగా మాకు ఈ విపత్తు నుండి విముక్తిని ప్రసాదించు !
స్వామీ!శరణు !
గోవిందా !శరణు !
ఈశ్వరా !శరణు !;
అంటూ శరణాగతి భావంతో ప్రార్థించుదాం !""
స్వస్తి !""
హరే కృష్ణ హరే కృష్ణా !!

శార్వరి నీవెవరు ?

Mar 27, 2020
శార్వరి ,,,! అంటే  జ్ఞాన దేవత ! సరస్వతీ మాత!"
""నీవెవరు ?
ఎక్కడి నుండి వచ్చావు  ఈ భూమి పైకి ?"
ఏం ఉద్దేశ్యం తో  వచ్చావు ? ,"
ఎక్కడికి వెళ్తున్నా వు ,?"  తిరిగి ఎప్పుడు వెళ్తావు ??"
నిన్ను ఎవరు ఇక్కడికి  పంపించారు ? "
నీవే అనుకోని వచ్చావా ? "
తిరిగి ఎవరి వద్దకు వెళ్తావు ??
ఈ ఆకారం ,,ఎత్తూ,రంగు , ఈ స్వభావం , ఈ తలిదండ్రులు ,స్నేహితులు , ఇవన్నీ నీకు ఎవరు ,,ఎలా, ఎందుకు. ఎప్పుడు  ఇచ్చారు ? ""
నీకంటే పెద్దవారు , నీ కంటే చిన్నవారు కూడా,నిన్ను విడిచి శాశ్వతంగా  పోతున్నారు కదా ,,!
మరి నీవు ఎందుకు పోవడం లేదు ??
ఈ బందువులు అనబడే వాళ్ళను , నీ చుట్టూ తిరిగే  ఇంతమందిని ,,నీవు ముందే చూసి తీసుకొని వచ్చావా ,,నీతో ??""
ఈ ఊళ్ళోనే , ఈ జిల్లా,, ఈ దేశంలో నే ,ఎందుకు పుట్టావు ?""
అమెరికా  లాంటి ఇతర దేశాల్లో ఎందుకు పుట్టలేదు !?
అంటె. ముందే అనుకోని వచ్చావా ???
గత జన్మ లో ఎవరు నీవు ?""
వచ్చే జన్మ లో  ఏమౌతావు ?""
అసలు  ఈ చావడం అనేది ఎందుకు ?
ఈ ముసలి తనం ఎందుకు ?
ఇలాగే యువకుడిగా  ఎప్పుడూ ఉండవచ్చు కదా !!""
నీకు భార్య గా  ,లేదా భర్తగా లేదా కొడుకు కూతురు ,,, ఎప్పుడు  ఎవరు వస్తారో నీకు ముందే  తెలుసా  ?""
వందల వేల గ్రహాలను,ఒకదానికొకటి తాకకుండా  విశ్వంలో   ఎవరు తింపుతున్నారు ??
ఎందుకు ? ఎలా?
ఎప్పటినుండి ?? 
ఇలా ఎంతకాలం ?!
,,,,???  భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంటే దానిపై గల సముద్ర ,నదీ జలాలు  ఎందుకు పడి పోవడం లేదు ??
భూమికి సూర్యుడికి మద్య  యుగ యుగాల నుండి ఒకే దూరం ,ఒకే వేగంతో , ఒకే వలయం లో ఏ శక్తి తింపుతు ఉంది ?
నేను పడుకున్నా తెలివితో ఉన్నా ,నా శరీరంలో ఉన్న ఊపిరి తిత్తులు ,గుండె ,మెదడు ,రక్తప్రసరణ ,కాలేయము ,మూత్రపిండాలు , ఇలా అనేక అవయవాల ను  ఆగకుండా ,, నా ప్రమేయం లేకుండా నడిపిస్తున్నది ఎవరు?!
నన్ను జీవింపచేస్తు ,నాతో పనులు చేయించే a అద్భుత దైవిక శక్తి ఎక్కడ ఉంటుంది ??
అసలు నేను ఎవరు ??
నా అసలు స్వరూపం ఏమిటీ ??
ఎన్నాళ్ళు ఈ ప్రయాణం , దేని కోసం , ఈ తాపత్రయం ??
ఇలాంటి అనేక వందల వేల కోట్ల ప్రశ్నలకి మనం   జవాబు తెలుసుకోలేము !
అఙ్ఞానులం మనం !
సర్వజ్ఞుడు ,, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు !
మనకు""అంతా తెలుస్తోంది!"" అన్న  "భ్రాంతి ""లో ఉన్నాం !
కానీ మనిషికి ఇంతవరకూ  తెలిసింది ,సముద్ర తీరాల్లో ఉండే ఇసుకలో ఒక చిన్న రేణువు కూడా కాదు !
ఇవన్నీ పగలు  వెలుతురు లో మన కళ్ళకు కనపడుతున్న వే !!
కానీ మనకు ఒక్క ముక్కా ,అర్థం కాదు !  సృష్టిలో
ఏ ఒక్క దాని గురించికూడా  పూర్తి జ్ఞానం లేదు మనకు !!
అందుకే ,,ఇలాంటి పరి ప్రశ్నలు మనకోసం అర్జునుడు అడిగాడు భగవద్గీత లో !
""మహాత్మా ! పరమ పురుష!  శ్రీకృష్ణా!!
ఈ ,యుగాలు ,తరాలు జన్మలు ,,ఎన్ని మారినా ,మనం  ఎప్పుడూ కలిసి  ఉన్నవారలమే  !"" అని నీవు  అంటున్నావు
,,కానీ
నీ గతం గురించి నీకు తెలియదు !
కానీ ,నాకు తెలుసు ! అని కూడా చెప్పావు !
పరంధా మా !, పరాత్ప రా !!
ఎప్పటినుండి ఈ జీవుడు,, ఆ దేవుడు కలిసి ఉంటూ ఉన్నారు?
అని అర్జునుడు అడిగిన
ఈ ప్రశ్నకు భగవానుడు ,!
భగవద్గీత , 4అధ్యాయం జ్ఞాన యోగం లో  5వ  శ్లోకం !!  లో samshaya నివృత్తి చేశాడు
"బహూ ని మే వ్యతీతా ని. జన్మాని తవ చార్జున ,!
తాన్యహం వేద శార్వాణి  , న త్వం వేత్త పరంతప !!""
ఓ అర్జునా,!నీవును నేనును పెక్కు జన్మము  లు ఎత్తి నాము !!
అవి అన్ని నాకు జ్ఞప్తి యందున్నవి !!
నీకు మాత్రం  జ్ఞప్తి యందు లేవు !"""
ఈ పరంపర
అనాది నుండి   వస్తూ ఉంది ! అంటూ క్లుప్తంగా ముగిస్తాడు . శ్రీకృష్ణపరమాత్మ !!
అంటే ,ఇన్ని కోట్ల జన్మల నుండి అని  ఖచ్చితంగా సంఖ్యల్లో చెప్పాలి కదా !
శ్రీకృష్ణుడు చెప్పినా కూడా ,, ఆ స్థాయి లో ,
అర్థం  చేసుకునే పరిజ్ఞానం , అర్జునుడికి లేదు !
అలాగే మనకు  కూడా ,విజ్ఞులను  ప్రశ్న అడగటం తెలియదు ,!!తెలిసిన దాన్ని అవగాహన చేసుకునే పరిజ్ఞానం  కూడా లేదు  !!
ఇప్పుడు  మానవ జీవితంలో ఉన్న  ఈ స్వర్ణ  అవకాశం ""జ్ఞానం ""అనే దీపాన్ని వెలిగించుకోవడం !!
,దాని సహాయంతో , ఇహము పరము,
తనవా రు,పరాయి వారు, ఏం తెచ్చాం , ఏం తీసుకుని పోతాం 
,గురించిన పరి ప్రశ్నలకు జవాబులు వెతుక్కోవ డం!!
అది నిరంతర సాధన తోనే సాధ్యం !!
మనలో ఉన్న జ్ఞానం అనే దీపాన్ని వెలిగించే  జగద్గురువు ,, దైవం ఆ శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా తన వాక్కు ల ద్వారా . మనకు అనుగ్రహించిన  ""భగవద్గీత ""అనే సద్గ్రందం మాత్రమే , సకల మానవాళికి  శరణ్యం !
మరి వేరే దారి లేదు !
""శార్వరి "" ఆ విధంగా జ్ఞానజ్యోతిని  అనుగ్రహిస్తూ ఇప్పుడు  ,వచ్చిన  మన తెలుగు సంవత్సరం ,!!
మన ఋషులు ,,మన బాగు కోసం ముందు చూపుతో ,చక్కగా ఏర్పాటు చేసిన 60సంవత్సరాల లో,, 34  వది !"ఈ శార్వరి!
  శార్వరి అన్న నామం , దాని వెనక ఉన్న పరమార్థం  , పరిజ్ఞానాన్ని  తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి !!
సృష్టి లోని సకల జంతువులలో  మనిషి  శ్రేష్ఠుడు గా పిలవబడ టానికి కారణం అతడికి ఉన్న ""జ్ఞానమే ""కదా !;
ఆ జ్ఞానాన్ని ,మనకున్న  ""అజ్ఞానం అవిద్య ,అహంకారం "అనే చీకట్లను తొలగించడానికి వినియోగించు కోవాలి !
ఈ ""శార్వరి  "" కొత్త సంవత్సరములో  రెండు  జీవిత  లక్ష్యాలు  పెట్టుకుందాం !!
ఒకటి ,___
""జ్ఞానం"" అనే జ్యోతినీ  వెలిగించి , ఆ వెలుతురు సహాయం తో  జీవన మార్గాన్ని సుగమం చేసుకోవాలి !!
అంతే కాదు!!
ఆ వెలుతురు ఇతరులకు  కూడా  మార్గదర్శనం చేసేలా,, దీపాన్ని పెద్దగా చేసి వెలిగించే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగాలి !
అంటే జ్ఞానాన్ని అభివృద్ది చేసుకోవాలి !!
ఈ జ్ఞానజ్యోతిని ,,మన ప్రాణ సమానంగా చూస్తూ , జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లకు , ఇబ్బందులు అనబడే తీవ్రమైన గాలుల తాకిడికి ,, అది ఆరిపోకుండా అప్రమత్తత తో ఉండాలి !!
రెండు !!'"
ఈ ""జ్ఞాన జ్యోతి" వెలుతురులో ,, ప్రాపంచిక దృక్పథం తో నే కాకుండా ,ఆధ్యాత్మిక చింతన చేస్తూ ఉండాలి !
రవి కాంచని చోటును కవి గాంచును
అన్నట్టుగా
జ్ఞానం ఉపయోగించు కోనివా డు మనిషి అనిపించు కోడు కదా!
భగవంతుని తో నేరుగా ఒక సంబంధం పెట్టుకుంటే ,  అతడి అనుగ్రహం మనపై. ,,""శ్రీరామరక్ష ""వలె  పరిపూర్ణంగా ఉంటుంది !!
జ్ఞానం అనేది  మన హృదయం లో ఉన్న  పరమాత్మ గురించిన ""భావ సంపద ""!;
చిత్తశుద్ది ,ఆత్మవిచారం ఉంటేనే  ఈ "జ్ఞాన పుష్పం"" వికసించి ,అందలి పరిమళభరితమైన సువాసనలు అనబడే " సంస్కారాలు ,,""భక్తి శ్రద్ధలు ,""  వెలువడి, మన జీవాత్మ ను పరమాత్మ వైపు  నడిపిస్తాయి !!
   శ్రీకృష్ణుని కరుణతో , భగవద్గీత ,పఠనం తో ,పదార్థం లో వున్న యదార్థ జ్ఞానం తెలుసుకుంటూ , పరమాత్ముని అనుగ్రహానికి పాత్రులం కావాలి !""
సర్వే జనాః స్సుఖీనో భవంతు !!""
స్వస్తి !""
హరే కృష్ణ హరే కృష్ణా !"

Thursday, March 26, 2020

శార్వరి! అంటే ఏమిటీ అర్థం ?

Mar 26, 2020
మన తెలుగు వారికి  నిన్న టి రోజునుండి  , ఉగాది పండగ వెలుగులను  ,ఆనందాన్ని తెస్తూ అందంగా  వచ్చింది మన శార్వరి  నామ తెలుగు సంవత్సరం  !!" ,
  అయితే కరోనా కష్టాలతో  తో ప్రారంభం అయిన ఈ శార్వరి , ఆ విపత్తు నుండి కాపాడటానికి వచ్చిందని తెలియక  కొందరు తెలుగువారు అపార్థం చేసుకుంటూ ఉన్నారు
ఎన్నో అర్థాలు ఉన్న శార్వ రి అనే పదానికి " చీకటి" అని కూడా ఒక అర్థం !
దీనితో   తెలిసి ప్రజలు బెంబేలెత్తి  ,ఇంకా  భయపడుతున్నారు
,,ఎవరైనా "చీకటి "అంటే భయపడటం సహజమే !
చీకటిలో  కనిపించని  వస్తువులు వెలుతురు లో కనబడతాయి !!
వస్తువులలో ,ప్రదేశం లో మార్పు లేదు ,
కేవలం మన భావం లోనే  తేడా కనిపిస్తుంది ;!
అనాది కాలం నుండి ,చీకటిలో ఉన్న వస్తువులను చూడటానికి,,ఒక ," దీపం" ను తయారు చేసి దాని వెలుతురు లో వస్తువులను చూస్తూ వస్తున్నారు !!
,,, ఇక్కడ సమస్య చీకటి గురించి కాదు !
దానిని మించిన. మనిషి అజ్ఞానం గురించి !!
  పగలు చూసే వస్తువుల గురించిన  సంపూర్ణ జ్ఞానం,, ,నిజంగా మనకు తెలుస్తోం దా ??""
అన్నది ప్రశ్న !
ఎదురుగా ప్రవహించే నదీ జలాల ప్రవాహం రోజంతా ఈ కళ్ళతో చూస్తాం !
రాత్రి చూడలేం !
నిజమే !
అంత మాత్రాన నదీ జలాల గురించిన జ్ఞానం  మనకు తెలిసి పోయిందని అనుకుంటే అది  మన పొరబాటే అవుతుంది కదా !
వెలుతురు  లో వస్తువు రంగు ,ఆకారం మాత్రమే తెలుస్తాయి అంతే!
నీటి స్వభావం ,ప్రభావం ,శక్తి చైతన్యాన్ని  తెలియడం అంత సులభమా ?! గుణం ,అనుభవం ,  చింతన చేయడం ద్వారా కొంత  తెలియ వచ్చు!!
ఉదాహరణ కు ,,
ఒక ఏనుగు వద్ద నలుగురు గుడ్డి వాళ్ళు ఉన్నారు  ,, ఉండి, ఆ
ఏనుగు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని  ప్రయత్నం చేస్తున్నారు అనుకుందాం !;
వారిలో  ఒకరు  ఏనుగు తొండం ,,మరొకరు కాళ్ళు ,ఇంకొకరు తల ,చివరి వాడు ఏనుగు వెనక భాగాన్ని చేతులతో  తడివి చూసి ,ఏనుగు ఆకారం  గురించి  ,,ఆ నలుగురు నాలుగు రకాలుగా  భిన్నంగా ఊహి స్తారు !
అదే విధంగా ,  కూడా  ప్రపంచం లోని వివిధ వస్తువుల గురించిన అవగాహన లేకుండా  ఒక్కక్కరు ఒక్కొక్క రకంగా భావిస్తూ ఉంటారు ,
పదార్థ జ్ఞానమే , గానీ యదార్థ జ్ఞానం తెలుసుకోవాలనే   ,ప్రయాస పడరు!!
ప్రయత్నించ రు కూడా !; ,
ఒకే సినిమాను వంద మంది , చూస్తూ వంద రకాలుగా అనుకుంటారు !,,
ఎందుకు ?
అందరూ మనుషులే !!
కానీ ,,వారికున్న జ్ఞానం లో తేడా ఉంది !!
నాకు తెలిసింది అనుకోవడమే కానీ. , నిజంగా  ఏం తెలిసిందో , ఎవరూ చెప్పలేరు !
ఈ విశ్వంలో ఎన్నో అనంతమైన సృష్టి రహస్యాలు ఉన్నాయి ;,
వేల కోట్ల వయసు ఇచ్చినా ,,అందులో అవగింజ వంతైనా తెలియడం సాధ్యం కాదు !!
,,,రాత్రి పగలు వస్తున్నాయి ,పోతున్నాయి
ఋతువులు ,
సంవత్సరాలు ,యుగాలు  మారుతూ ఉన్నాయి
నవగ్రహాలు భూమి చుట్టూ ,, భ్రమిస్తూ ఉన్నాయి
సమస్త  సృష్టి చలిస్తూ వుంది ,
అండ పిండ బ్రహ్మాండాలు  నడిపించే నాథుడు ఎవరో తెలియదు ,
కనీసం ఊహకు కూడా అంద డు!!
తెల్లారేసరికి కొత్తగా పూవులు ,లేత చివురు టాకులు,పండ్లు  , రంగు రంగుల్లో శ్యామసుందరుని తలపించే నీలి మేఘాలు ,సూర్య చంద్రుల సాక్షాత్కారం వైభవం ,
ఆహా!ఏమీ ఆ పరమేశ్వరుని సృష్టి రచనా విన్యాసం ?!
రోజూ ఇన్ని వింతలు  చుట్టూ చూస్తున్న మనిషి ప్రవర్తన లో  మాత్రం ,
పెద్ద తేడా కనపడ దు!
తినడం ,పనులు చేయడం , పడుకో వడం !
అంటే ,, మానవ జీవనం కాకుండా  జంతు ధర్మాన్ని  అవలంబిస్తూ ,బావిలో కప్పల వలె,బ్రతకడం !
అంతా యాంత్రికంగా!  శక్తి ఉన్నా ,చైతన్యం  లేని రోబో ల వలె ,తనకు తోచింది నిజమనే భ్రమలో  బ్రతకడం మామూలు అయిపోయింది !!
నిజానికి మనం  రోజూ ,,చూస్తున్న ప్రకృతిలో కనపడేది వేరు ,! దాని
లోపల జరుగుతున్నది వేరు ,!!
పిల్లలు అనుకుంటారు   తమ వయసు పెరుగుతూ ఉందని !
పెద్దవారు అనుకుంటారు ,,తమ
వయసు తరుగుతూ ఉందనీ,
రెండూ నిజమే !
అంటే క్షణ క్షణం,, శరీరంలో ,ప్రదేశంలో, ప్రకృతిలో మార్పు వస్తోంది !
ఈ మార్పు ను కళ్ళతో చూడలేం ! ఉన్న జ్ఞానం తో
అంత పరిజ్ఞానం పెంచుకోవడం లేదు మనం !
సాధన లో  లోపం !!
*"జగతి ""అంటేనే ,
పుట్టడం ,గతించడం జరిగే ప్రదేశం  !అంటే మార్పు కు  గురి అయ్యేది !!
భూమి ,,గ్రహాలు ,నవగ్రహాలు ,, ఉపగ్రహాలు ,నక్షత్రాలు ,పంచభూతాలు అన్నీ సక్రమంగా భ్రమిస్తున్నాయి!
మనకున్న జ్ఞానం అది గమనించడానికి సరి పోదు!!
అలా కదిలే   ప్రతీ వస్తువు ,,తన  ,,శక్తిలో రూపంలో ,స్వభావం లో క్షణ క్షణం మారుతూనే  ఉంటుంది ;
ఏడాది ,రెండేళ్లు మూడేళ్లు నాలుగు ,ఐదు ,ఇలా కాల ధర్మం తో బాటు పిల్లలు పెరుగుతూ  ,,తమ స్వభావం ఆకారం ,గుణం అలవాట్లు ,పరిజ్ఞానం  ,,ఇలా కాలానికి అనుగుణంగా  అన్నీ మారుతూనే ఉంటాయి !;
స్వస్తి!
హరే కృష్ణ హరే కృష్ణా !""

Wednesday, March 25, 2020

కరోనా వీరులు

Mar 24, 2020
వైద్యు లారా. నమస్తే,!
పోలీస్ శాఖ ఉద్యోగులారా ,
నమస్తే !
మీడియా మిత్రులారా ,,
నమస్తే !!
ఏమిచ్చి మీ రుణం తీర్చుకొనే ది ,
సోదరులారా !""
దేశ సరిహద్దుల్లో ఉంటూ  ఎముకలు కోరికే మంచు కొండల్లో  యాతన పడుతూ ,, ,నక్కల్లా పొంచి ఉన్న  ఆ పాక్ శత్రువుల బారి నుండి కాపాడుతూ,, తమ ప్రాణాలను ఫణంగా పెడుతూ ,, రాత్రీ పగలూ అనకుండా ,పోరాడుతూ ఉంటున్న  ,,మన వీర జవానుల వలె  ,,
మీరు కూడా మీ ప్రాణాలను లెక్కజేయకుండ  సాటి వారి ప్రాణాలను కాపాడడం కోసం  అహర్నిశలు కృషి చేస్తున్నారు !!
Hats off to your dedication and commitment !""
మీ సేవా తత్పరత కు చేతులు జోడించి మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం !;
మీ సంకల్ప బలానికి ,చిత్త శుద్ది కి జోహార్లు అర్పిస్తూ ఉన్నాం !!"
జై జవాన్ !
జై కిసాన్! ""
నినాదాలతో
బాటు ఇపుడు
జై డాక్టర్స్ !
జై పోలీస్ శాఖ!
జై మీడియా ,!"'
అంటూ మిమ్మల్ని మనసారా అభి నందిస్తూ ఉన్నాం !
ప్రస్తుతం మన దేశ భద్రత  అత్యంత ప్రమాద స్థితిలో ఉంది  ,!
ఈ దిక్కుమాలిన కరోనా మహమ్మారి రోజూ రోజుకు ప్రపంచం అంతటా  మహా వేగంగా  రెచ్చి పోతూ ,,దేశ ప్రగతిని అయోమయం లో పడేస్తోంది !!""
,గంట గంటకు ,ఇంటింటికీ నిరంతర పర్యవేక్షణ చేస్తూ ఉండడం తప్ప ,
ఏ మందూ మాకు లేకుండా
కరోనా ను నిరోధించడం
ఎంతో కష్టం  అని అందరు చెబుతున్నారు !
అయినా అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ
లక్ష్య సాధన కోసం శ్రమిస్తున్న  రక్షణ  శాఖ ,,వైద్య ,,మీడియా విభాగం  మిత్రులకు మనసా శిరసా వచసా అభినందనలు అందజేస్తూ ఉన్నాం !!
""మరవము మీ సేవా తత్పరత!!""
మరవ దు ఈ దేశం మీ వృత్తి ధర్మాన్ని ,!;
కర్తవ్య నిర్వహణ దీక్షా దక్షత బలాన్ని !""
ప్రాణం కంటే విలువైంది  ఈ లోకంలో మరేదీ ఉండదు !;"
ప్రాణ దానానికి మించిన దానం కూడా ఉండదు!!
ఆ  ప్రాణానికి మీ  ప్రాణం అడ్డుగా వేసి ,మన దేశ గౌరవాన్ని
పరువూ ప్రతిష్టలను 
సంరక్షిస్తూ ఉన్న ఓ  యోధుల్లారా
మీకు సాదర ప్రణామాలు !!
భగవంతుడు మీకు ఇచ్చిన శక్తి సామర్థ్యాల ను ఉపయోగిస్తూ
దైవాన్ని నమ్ముతూ  ,,కొనసాగిస్తూ ఉన్న  ఈ పోరాటం లో
ఆధర్మానికి  ప్రతీకగా ఉన్న ఆ  దుష్ట శక్తి కరోనా పై ,
మీరు చేస్తున్న ధర్మ పోరా టం లో , మీకు విజయాన్ని కలిగించాలని ఆ జగదంబ విశ్వపాలిని మాతను  ప్రార్ధిస్తూ ఉన్నాం !!
ధర్మం జయించాలి !
దుష్ట శక్తి ఈ కరోనా  నశించాలి !!
భారత్ మాతా కీ జై !
ఐకమత్యం వర్ధిల్లాలి !సంఘటన్ మే  శక్తి హై !!
జై తెలంగాణా !"

కరోనా కష్టాలు !

Mar 23, 2020
మనిషి కి ఉన్న  అనేక దుర్గుణాలలో  పేర్కొన దగినవి , ముఖ్యంగా  రెండు !!
మొదటిది ,,
""తాను అన్నిటికీ అతీతు డను,అనుకోడం ,! అంటే,ఎవరో ఎవరో చస్తారు ,,కానీ ,నేను మాత్రం ఇక్కడే ఉంటాను అన్న మూర్ఖం  అజ్ఞానం !
మృత్యుభయం,, పాప భీతి,, ఉంటే , ఏ మనిషి కూడా ఒక్క తప్పు చేయడు కదా !
ఇక రెండవది ,!
ఎన్నడూ ఒక్క తప్పు లేదా పాపం  కూడా చేయలేదని  అనుకోడం !!,
అందర్నీ వేలెత్తి చూపిస్తాడు ఏ తప్పు ఎవరెవరు చేశారో చెబుతాడు !
కానీ తన తప్పులు చెప్పడు ,
తెలిసినా కూడా ఒప్పుకో డు!!
భగవంతుడు మనిషికి దేహంతో బాటు ,ఎటువంటి రోగాలనైన తట్టుకునే రోగ నిరోధక శక్తిని ,, ఆంటీ బాడీస్ నీ ఇచ్చాడు
కానీ చిన్న రోగానికి కూడా  తట్టుకోలేక తొందరగా తగ్గాలని  ఆంటీ బయోటిక్స్ నీ విరివిగా వాడుతూ ,తనలో సహజంగా ఉంటున్న ఆంటీ బాడీస్ , తెల్ల రక్త కణాల సంఖ్యను శక్తిని తగ్గించు కుంటు ,ఉన్నాడు
ఫలితంగా , ఈ కరోనా వంటి విష రోగాల వ్యాప్తి నీ అడ్డుకునే శక్తి సామర్థ్యం కోల్పోయి , మరణా న్నీ కోరి తెచ్చుకుంటున్నారు
గ్రహ బలం తప్పి పోవడం అంటే ఇదే ,కదా !!
సూర్య చంద్రు ల సంచారం మనం గుర్తిస్తూ ఉన్నాం ,!
సూర్య  చంద్ర కాంతి ప్రభావం సమస్త జీవకోటి మనుగడకు ఆధారం గా కూడా గమనిస్తున్నాం !!
అలాగే మిగతా ఏడు గ్రహాల ప్రభావం భూమిపై గల మనపై  ఉంటుంది కూడా ,!!
గ్రహ సంచారం లో ఉండే అవకతవకలు మానవ జీవనం పై ,సమస్త ప్రాణికోటి పై ఉండి తీరుతుంది!
ఇప్పుడు ఉన్న ""కరోనా వైరస్ ""దుష్ట శక్తి ప్రభావం ఈ, గ్రహ సంచార దోషమే !!
ప్రస్తుతం రాహు గ్రహం ,,ఆరుద్ర నక్షత్రం తో కలిసి సంచరిస్తూ నీచ స్థానం లో  ఉన్నాడు !
ఆరుద్ర  నక్షత్రం నీలకంఠు ని కంఠ స్థానం!!
,,అది విష తుల్యము,!
ఈ రాహు గ్రహం,, ఆ ఆరుద్ర నక్షత్రాన్ని విడిచి ,దీని తర్వాత  మృగశిర  అనబడే అమృత తుల్యమైన నక్షత్రం స్థానానికి కదిలి వెళ్లేవ రకు  మనం ఓపిక పట్టాల్సిందే ,! ఏప్రిల్ నెల ఆఖరు వారం లో ఈ దుష్ట పీడ తగ్గుతుంది ,!
!అంతవరకు ఈ బాధలు తప్పవు !!
దైవారాధన వల్ల తొలగని బాధలు ఉండవు !!
అయితే ఈ కరోనా వైరస్ బారి నుండి కొంత ఉపశమనం పొందాలి అంటే  ,,పరిశుభ్రత ,పర్యావరణ కాలుష్య నివారణ,,స్వీయ గృహ నిర్భంధం  , వ్యక్తులకు వస్తువులకు దూరం ఉండడం , లాంటిచర్యలతో బాటు ,సత్వర పరిష్కార మార్గం కేవలం  ""దైవారాధన ""ఒక్కటే ,, తప్ప మరో మార్గం  కానరావడం లేదు  కదా!!
ఈ గ్రహచార సంచార బలం  అనుకూలంగా లేకపోతే ఎంతటి వారైన విధి ముందు తల వంచాల్సిందే కదా !!
ఒకసారి పరమశివుడు  అనుకోకుండా శని దేవుని చూడటం జరిగిందట !
""ప్రభూ !!""ప్రణామాలు !మీరు
నన్ను క్షమించాలి!! ఈశ్వరా !,
కొన్ని ఘడియలు నా దృష్టి మీ పై ఉండబోతోంది!""
మీరు జగత్ పాలకులు !కనుక మీకు ముందే తెలుపడం ఈ దాసుని ధర్మం !!""
అని వెళ్ళిపోయాడు శని !!!
భోళాశంకరుడు అయోమయం లో పడి , తనపై ,ఆ శని ప్రభావం పడకుండా ఉండేందుకు ,అడవిలో ఒక పెద్ద రావి చెట్టు తొర్రలో ప్రవేశించి ,,గాలి వెలుతురు చొరలేని చీకటి లో దాక్కున్నాడు !
తర్వాత బయటకు వచ్చి ,తన వెండి కొండపై గౌరీ దేవి తో బాటు సమస్తపరివారం తో  కైలాసం లో కొలువు దీరా డు శివయ్య !!
అప్పుడు శని దేవుడు వచ్చి ""మహాదేవా ,!నేను మిమ్మల్ని అవహించి, బాధపెట్టినందుకు మీరు  నన్ను క్షమించాలి !!""అంటూ సాగిలపడి ప్రణామాలు చేశాడు
శివుడు మందహాసం చేస్తూ
""నేను నీకు  కనబడకుండా ,, నీకు దొరక్కుండా దాక్కున్నాను కదా,!!
మరి ,, నీ ప్రభావం నా మీద ఎలా పడినట్టు ?"
చెప్పు ,!!అన్నాడు సాంబశివుడు!
""మహాదేవా ,!, దేవాది దేవా  !!
హే సదాశివ !  ,,నేను మీకు చెప్పగలిగే జ్ఞాని ని కాను! కానీ,
ఎంతటివారైనా గ్రహచారం అనుకూలించక పోతే , శని దేవుడు అంటే నా చూపు పడింది అంటే ,,,కష్టాలు పడక తప్పదు  !!
, ఆ సమయంలో నా ప్రభావం వల్ల ,,వారి కున్న వివేకము, జ్ఞానము అన్నీ శూన్యం అవుతాయి , శంకరా ;భక్త వశంకరా !!
అందువల్ల వెండి కొండ పై గౌరీ దేవి సహితంగా ,ప్రమథ గణాలతో ఆనందంగా కైలాసగిరి పై  ఉండాల్సిన మీరు ,ఎక్కడో కీకారణ్యంలో అడవిలో ,చెట్టు తొర్రలో , చీకటిలో , నా భయం ఆందోళన లతో  గడిపిన ఆ కొన్ని ఘడియలు , మీ కింకరుడ ను అయిన ఈ శనైశ్చరు ని నీడ సోకడం వల్లనే ప్రభూ !"
అని నమస్కరిస్తూ ఉన్న శనిదేవు ని చూసి,
నిజమే !, నీ ప్రభావం నా పైననే ఇంతగా చూపితే ఇక సామాన్యుల గతి ఏం కాను ?!"
ఔరా !ఎంత ఆశ్చర్యం !
గ్రహాల సంచార ప్రభావం ఇంత ఘోరంగా ఉంటుందా !""
అనుకుంటూ శని దేవుడిని ఇక ముందు శనై శ్చరుడు అంటే శని కూడా మహేశ్వరుని  అంశగా గుర్తించేలా  అనుగ్రహించాడు
,,ఇప్పుడు కూడా , ఆ శనిదేవుడు  ఈ కరోనా మహమ్మారి   రూపంలో  వచ్చి ,ఈ మానవాళి ని పట్టి ,,పీల్చి  పిండి చేస్తూ ఉన్నాడా ,!?
అనిపిస్తూ ఉంది! మనకు,,!
గ్రహచారం తప్పిన అంతటి మహావీరులు పంచ పాండవులు కూడా , విధికి తల వంచి ,,,అడవుల్లో పన్నెండు ఏళ్లు, ఆకులూ అలములు తింటూ అరణ్యవాసం చేయాల్సి వచ్చింది !!
సీతా దేవి , లంక లో రావణుడి నిర్బంధంలో  సంవత్సరం దీనంగా దుఖిస్తు గడపాల్సి వచ్చింది
""అకటా !గ్రహచారం తప్పి వచ్చి నన్ !!""
అనుకుంటూ ,నూరుగురు కొడుకులు ఉన్న దృతరాష్ట్రుని కి  ఇంత పిండం  కూడా పెట్టడానికి ఒక్క కొడుకు కూడా జీవించి లేడాయే కదా !; దిక్కు లేని గ్రుడ్డి బ్రతుకు ఆయే గదా !!
అంటూ వాపోయాడు గ్రుడ్డి రాజు !!
అప్పటి సంఘటన లు దాకా  ఎందుకు ?
కష్టాలు పడని వారెవరు ??
విధిని తిట్టని వారెవరు ?  ఇప్పుడు ఈ  కరోనా కష్టాలు కూడా  అంతే గా !!
ఏదైనా అన్ని  రోజులు  ఉండవుగా ,,,!!,
అందుచేత హరినామ భజన చేద్దాం !
భగవద్గీత శ్లోకాలు చదువు కుందా ము !
, విష్ణు సహస్ర , లలితా  సహస్ర నామ పారాయణ చేద్దాం !
లేదా
ఓమ్ నమో భగవతే వాసుదేవాయ,,,!లేదా ,ఓమ్ నమో నారాయణాయ!! ,ఓమ్ నమః శివాయ , అంటూ 108సార్లు అందాం !!
సత్ సంకల్పంతో ,సద్ భావనతో ,జీవిస్తూ సద్గతి ని పొందే ప్రయత్నం చేద్దాం ,!
ఒక్కొక్కరూ విడిగా చేసే ప్రార్థన కన్నా ,సామూహికంగా  అందరూ  కలిసి చేసే  ప్రార్థన కొంచెం అయినా మిన్న యే కదా !
ఈ రోజున కొట్టే చప్పట్లు కూడా దుష్ట శక్తులను తరిమువేసే శక్తిని ప్రకంపనాలు కలిగిస్తాయి !!
అందుచేత కరోనా నునిగ్రహించే శక్తి యుక్తులను అనుగ్రహించమని జగదంబ విశ్వపా లిని మాత ను ప్రార్టించుకుందాం!!
స్వస్తి/
హరే కృష్ణ హరే కృష్ణా!!""

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...