Saturday, April 18, 2020

""మానవ బాంబు "" ఈ కరోనా !

Mar 30, 2020
   ఇన్నాళ్లూ మన దేశం  ఆత్మాహుతి దళాల దాడులు. , చేసిన మారణ కాండ విన్నాం ,!
రాజీవ్ గాంధీ నీ  ఇలానే చంపేశారు ,!
దుండగులు ఎవరికీ దొరక్కుండా  నక్కి నక్కి వచ్చి  ఎక్కడా జనాలు గుమిగూడి ఉంటే అక్కడికి వచ్చి తన నడుం చుట్టూ బిగించి  ఉన్న బాంబు లను పేల్చి ,తాను చస్తూ  , ఆ ప్రేలుడు దెబ్బకు ఎంతో మందిని చంపుతూ  వచ్చారు !
ఇది శత్రు దేశం అయినా పాక్ ప్రయోగించిన  జిహాదీ అల్లర్లు  , తీవ్రవాద సంస్థలు !
అయితే అది ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం !
,అక్కడ భద్రత చర్యలు కట్టుదిట్టం చేస్తే సరిపోయేది!!
కానీ నేటి కరోనా వ్యాధి  అంతకంటే వేల రెట్లు ప్రమాదకరం అవుతోంది ,,ఇప్పుడు !!
ఒక్కొక్క కరోనా పేషంట్ ,, మానవ బాంబు గా మారి , వేల మందిని బలి తీసుకుంటూ ఉన్నాడు ,
ఇది రాష్ట్రాలు ,,దేశాలు దాటి ,,ప్రపంచం లోని అన్ని దేశాల్లో వేల సంఖ్యలో చంపుతూ  పోతూ ఉంది !!
ఇలాంటి ఘోర విపత్తు ఏ దేశ  చరిత్ర లో కూడా ,,, ఎన్నడూ కనీ వినీ ఎరుగని మృత్యు ఘంటికల ఘోష !!
""నభూతో న భవిష్యత్ "" అంటే,, ఇదేనేమో !!
అయితే ఇది,, నాగరికులు అనబడే ,ఈ చదువు కున్న వాళ్ళు,, బుద్ది జ్ఞానం ఉంటున్న వాళ్ళు ,,, పశువుల వలె గడ్డి కాకుండా అన్నం తింటు ,,పశువు ల కన్నా హీనంగా తిరుగుతూ ఉన్న వాళ్ళు , దేశంలో ఎం జరుగుతుంది తెలిసిన ,పట్టించుకోకుండా మెదిలే  వాళ్ళు ,యువకులు  ,,పెద్ద వాళ్ళు ,  వ్యాది వ్యాప్తి కాకుండా ఉండే జాగ్రత్త చర్యలు  తెలిసిన వాళ్ళు , 
కేవలం నిర్లక్ష్యం తో , సోమరితనం తో , తెలిసి అపరాధ చేస్తుంటే వీరిని  మనుషులు అందామా ,?"
అనలేం !"
పశువులు అందామా ?,"
అనలేం !"
ఎందుకంటే పశువులు చెప్పినట్టు వుంటాయి !!
హద్దుల్లో ఉంటాయి  !!
తమ ప్రాణం ఇస్తాయి ,తప్ప  ఇతరుల ప్రాణం తీయవు  కదా !!
అవి ,తాము  బ్రతికి ఉన్నప్పుడు ,లేనప్పుడు  మనిషికి ఉపయోగ పడుతాయి  !!
అందుచేత వాటితో పోలిస్తే పశువులు బాధ పడుతాయి !!
""అలాంటి నీచులను మాతో జమ కడుతూ మా జాతిని అవమాని స్తావా!"" అని. దీనంగా చూస్తాయి !!
అలాంటి నికృష్టులను , సాటి మనిషిగా , ఒక పౌరునిగా  కాకుండా ,,బాధ్యతా రహితంగా ప్రవర్తించే వారిని క్షమించ వద్దు!!
తాము చస్తూ ఇతరులను చంపుతూ ఉండే  ధోరణి ఉన్న కరోనా రోగులలో అందరం కనిపెట్టాలి !!
అలాంటి లక్షణాలు ఉన్నవారిని ప్రభుత్వ అధికారులకు  ఫోన్ చేసి 
అప్పగించాలి !!
అత్యవసర పరిస్థితి అంటే ఇదే ,,మరి !!""
మనకు మనమే విధించుకున్న  శిక్ష ఇది !"
ఎవరో చేసిన,, చేస్తున్న,, చేయబోతున్న తప్పులకు  దేశం,ప్రపంచం  తీవ్ర వేదన అనుభవిస్తూ ఉంది
మరచిపోకుండా
పరిశుభ్రత ,,పరస్పరం తాకకుండా ఉందాం
బజారు నుండి వచ్చే మనిషిని శుభ్రంగా స్నానం ,చేయించండి
వారి బట్టలు ఉతకాలి ,
వాళ్ళు తెచ్చిన వస్తువులు కడగడం మరవకండి
ఫ్రిడ్జ్ నీళ్ళు చల్లటి నీరు త్రాగ కండి
వేడిగా  ఉన్న భోజనం మాత్రమే తినాలి
గోరువెచ్చని నీరు మాత్రమే త్రాగాలి
If you are out ,,
You are out !!
ఏసీ లు తగ్గించండి
పొరపాటున ఆ కరోనా లక్షణాలు  దగ్గడం తుమ్మడం జ్వరం రావడం ,,నీరస పడటం లాంటివి మన ఇంట్లో ఎవరికైనా వస్తె  జాగ్రత్త !
ఇద్దరూ కలిసి ఒకే మంచం పై పడుకోవడం  కూడా  వద్దు !!
బయటనే కాదు
ఇంట్లో కూడా అదే దూరాన్ని పాటించడం  ఉత్తమం !;
""మనల్ని ప్రక్కవారు గమనిస్తూ ఉన్నారు""
అని మరవ వద్దు!!
అందుచేత మన ఇంటినుం డే ,,మన తోనే ,మనమే  ,,ఈ  కరోనా నివారణ జాగ్రత్త చర్యలు 
ప్రారంభిస్తు  ,,,సమాజ దృక్పథం  ప్రతిబింబించే మానవత్వ విలువలు  మనలో ఉన్నాయని నిరూపించు కుందా ము!!
  నిష్ట తో ,కష్ట పడుట మన వంతు !
కాపాడుట  ఆ పరమాత్ముని వంతు  !
నిజాయితీ తో ,తనపై విశ్వాసం ఉంచి చేసే మనిషి ప్రయత్నాల కు  ,,, భగవంతు డు  ,తప్పక అనుకూ లిస్తూ ఉంటాడు!
ఎంత విశ్వాసం ఉంటే అంత ఫలితాన్ని అంద జేస్తాడు   స్వామి  !!
మనిషి  ఇపుడు పడుతున్న ఈ నరక యాతన,, అతడికి తెలియంది కాదు !!
ఎప్పు డు , ఎలా దీనికి చరమ గీతం పాడాలో ,,ఆ  సర్వాంతర్యామి ,జగద్రక్షకుడు ,,ఆపద్బాంధవుడు , ఆ పరమేశ్వరునికి  చక్కగా తెలుసు !!
కావాల్సింది  మనం ఆర్తితో,, ఆర్ద్రత తో ప్రభువుకు శరణాగతి చేయడం ఒక్కటే !!""
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...