Tuesday, May 19, 2020

కృష్ణా !,కనరావా ?1

May 7, 2020
"కృష్ణా !
నీవు ఎక్కడ  ఉంటావో ,ఎలా ,ఎప్పుడు  ఉంటావో.కూడా  నాకు తెలీదు ,!
కానీ  నీవు ,ఉన్నావన్న నిజం  మాత్రం తెలుసు !""
""రేపల్లెలో యశోదా మాత ఇంటి  ముంగిట్లో ,,ఆమె నీకు తన చేతితో ,నీకు గోరు ముద్దలు  వెన్న ,తినిపిస్తూ ఉంటే ,నీవు తింటూ బాలుని వలెనే తిరిగే పద్మనాభుని వలె ,ఆ   నంద భవనంలో ,, భువన మోహనం గా కదలాడుతూ ,  తల్లి యశోద కు దొరక్కుండా మూల మూలలా దాగుతు, నీ చిన్ని పాదాలతో    ఆడుతూ  ,,పారాడుతూ లీలా వినోదాన్ని కొనసాగిస్తూ ఉంటావు రేపల్లెలో ,,,!"
అందమైన  ఆ యమునా తీరంలో రాధా సమేతంగా విహా రం లో ,దివ్యంగా మోహన, మురళీగానం చేస్తూ ,ప్రకృతిని పులకింపజేస్తూ , నీ అపురూప సౌందర్య లావణ్య స్వరూప దర్శనం తో  వ్రజస్త్రీలను అలరిస్తూ,,వారిని  ఆనందింప జేస్తూ ఉంటావు  ఉంటావు  , కదూ !!""
  పుట్టుకతో అంధుడు, నీ భక్తు డు అయిన వృద్దుడు ఆ  సూరదాసు కు ,ఇష్టమైన బాల కృష్ణుని రూపంలో వచ్చి ,అతని ఎదురుగా కూర్చుని ,ఆతడు పాడుతున్న భక్తి గీతాలను వింటూ పరవశిస్తూ ఉంటావు  కదూ !!""
కృష్ణా!
""నిత్యం   ,,పొన్నలు పొగడలు ,విరబూసే ఆ మధుర బృందావనం కుంజ నికుంజము లో ,,సు నీవు ఆలపిస్తున్న  వేణు గాన సుధామృత రస తరంగిణి లో  ,సకల జగతిని ఆనందింప  చేస్తూ,, నీ ఆరాధ్య దేవత , ప్రేమ రసైక స్వరూపిణి ,నీ హృదయ అంతరంగిని  ,,ఆ రాధాదేవి తో కలిసి ""మహారాస  క్రీడా విలాస కేళి లో""" వారితో పరమానందం గా  తన్మయత్వంతో  నృత్యం చేస్తూ ఉంటావు  కదూ !!
___""నిన్ను మాత్రమే తన జీవిత పరమావధి గా ,తన  భర్తగా ,ఇష్టదైవంగా భావించి , ,,నీకోసమే సమస్త రాజ భోగాలను త్యజించి ,నీవే సర్వస్వం అంటూ ,, నీ పై  మధురమైన   కీర్తనల ను పాడుకుంటూ ,, అమితమైన కృష్ణా నురాగానందం లో తేలియాడుతూ ఉంటున్న ,, ఆ  నీ భక్తురాలు మీరాబాయి  హృదయంలో కొలువై  హాయిగా సేద దేరుతూ ఉంటావు  కాబోలు , కదూ కృష్ణా !!
,  అంతేనా !"
మరొక దాసుడు కూడా ,నీకై పడిగాపులు పడుతూ ,ఉండటం నీవు చూస్తూ ఉన్నావు కూడా !!,
ఏమీ అదృష్టం తనదిక్,, సురలకు దుర్లభమైన రాసక్రీడ వైభవాన్ని ప్రత్యక్షంగా  చూడటమే కాకుండా  అందులో పాల్గొనే మహాభాగ్యం దొరకడం ఎంత భాగ్యం !!
ఆహా !!
,నీ రాసలీల వైభవం ను కనులారా చూస్తూ ,,తానుకూడా ఆ వేలాది గోపికా స్త్రీలలో ఒక గోపికగా మా రి ,, ఒళ్ళు మరచి  నృత్యం  చేస్తూ,, నీ కరుణా పూరిత చూపులతో ,క్రీడ లో పాల్గొనే అద్భుతమైన  అనుగ్రహాన్ని పొందిన ,,,నీ భక్తుడు ""నార్సి మెహతా"" గుజరాత్ ప్రాంతీయుు డు,,శ్రావ్యంగా తాంబురా మీటుతూ నీకు  వినిపించే భక్తి గీతాలు వింటూ ఉన్నావో !  ఏమో ,!ఎవరికి తెలుసు ,, స్వామీ ,?!""
మరాఠీ భక్తురాలు ,పండరి నగరంలో ,,భక్త. నీకు  సమర్పించే సేవలు , నివేదన లు ,,హారతులు  గ్రహిస్తూ ,, మైమరచి పోతూ ఉంటున్నా వో ,, కృష్ణా !
ఎవరికి తెలుసు ??
కృష్ణా అని పిలిస్తే చాలు ,గబుక్కున పరుగెత్తి వెళ్లడమే,నా ??
మేము లేమా , నీ వారము మేము గామా ,చెప్పు ,??"
నీవు లేకుండా , మా గతి ఏం కాను ,చెప్పు ??"'
ఎందుకు నీ ప్రేమ పిచ్చిలో పడవేసి ,మమ్మల్ని నీ వెంట తింపుకుంటు ఉంటావు ??""
ఇదేం ఆటలు స్వామీ ?!
"""హరే కృష్ణ హరే కృష్ణా,,,!"" అంటూ " శ్రీ కృష్ణ చైతన్య "ఉద్యమాన్ని   ప్రారంభించి ,అన్నీ దేశాలలో కృష్ణ భక్తి ని  ప్రేమతో అందించిన ఇస్కాన్ భక్తులను  కూడా  అనుగ్రహిస్తూ  , ఎక్కడ వెదకి నా దొరక్కుండా తప్పించు కుంటున్నావా ,నల్లనయ్య ?
మాకు దొరక్క మమ్మల్ని ఇలా నీకోసం వేదకే లా చేస్తుంటే ,
నిను గన మా తరమా కృష్ణా ??
  నీకోసం ఎక్కడ అని వెదక మంటావు చెప్పు ??
అయినా .  ""నా అజ్ఞానం"" కాకపోతే నాలో నే  పరంజ్యోతి రూపంలో ఉంటూ , ఉన్న నిన్ను ,, ఈ మానవ నేత్రాలతో ఎలా చూడగల ను  చెప్పు ??""
నిన్నునేను  చూడగలనా ??
అల్ప జీవుడనువ్ నేనె క్కడ ,,??
సచ్చిదానంద ఘన విశ్వాధారుడ వై  ,విశ్వ సృష్టి స్థితి లయ శిల్ప  రచనా  చతురత తో ,,జగతిని ప్రకాశింప జేసే   ఘనుడవు నీవెక్కడ ??
నా జీవన జ్యోతి రూపంలో నా బుద్దిని  ప్రచోదనం చేస్తూ , , నా భావ సంపదకు  నా ప్రాణాలు నిలబడటానికి ఆధారమైన  ""ఓ పరమాత్మ ,! ఓ పరం థామా , !!ఓ పరాత్పరా ,!! శ్రీకృష్ణా !
నిన్ను కనలేని , నీ లీలలు తెలుసుకోలేని , నీ వైభవాన్ని గుర్తించలేని ఈ దీనుడు నీ , ఈ అవివేకిని , ఈ మూర్ఖుని  దయతో మన్నించు ,కేశవా !!
గోవిందా ,! జనార్దనా ,,! నా బోటి అల్పబుద్దులకు ,సామాన్యులకు ,పాపాత్ముల కు నిన్ను తెలియ వశమా ?"" ప్రభో,!
అండ పిండ బ్రహ్మాండాలను కుక్షిలో నిడుకొన్న ఓ  సర్వేశ్వరా,!! హే జగదీశ్వర ,!! హే పరమేశ్వర ,!!హే జగన్నాథ !!""
"" పరబ్రహ్మ వని  _నిను తలవని ,  పరంజ్యోతి రూపంలో భాసించే నిను,, సేవించుట తెలియని నా అపరాధాన్ని క్షమించు , స్వామీ !"
  రోజూ దర్శించే ఆ కర్మ సాక్షి ,, సూర్యభగవాను ని  దివ్యమైన కారుణ్యము ,అరుణ కిరణాల ప్రభావం తో ,ధరణి పై గల సమస్త ప్రాణికోటి శక్తిని , చేతనత్వాన్ని  ,పొందుతూ ఉంది !
జగతిని తన కిరణాలతో  సదా  ,సజీవంగా ఉంచుతూ  ,పరమానందాన్ని ప్రసాదిస్తూ  ఉంది ,!""!జీవులు  పొందుతున్న
ఈ మా  ఆనందంతో  ,, ఆ దినకరునికి ఏ ప్రమేయము లేదు ,! ఆయన కేవలం సాక్షి మాత్రమే !;
అదే విధంగా కృష్ణా !!పరమాత్ముని  వైన  నీవు ,,నీ  అనంతమైన   ప్రేమను , కరుణ ను , నీ  బిడ్డల పై సదా వర్షిస్తూ ,,పోషిస్తూ , రక్షిస్తూనే ఉంటావు కదా !!
నీవు ఎడతెగకుండా మాకు  ప్రసాదిస్తూ ఉంటున్న  ఈ ఉత్తేజాన్ని ,జీవనాన్ని,శక్తిని  చైతన్యాన్ని    ,అనుభవిస్తూ ,  ఆనందిస్తూ ,జీవితాన్ని   ఆనందమయం చేసుకుంటూ ,,, ఈ పరమానందానికి మూల కారణమైన   దైవానికి  అనగా నీకు ,నిత్యం  కృతజ్ఞత సూచిస్తూ. మేము  నమస్కారం చేస్తూ ఉండాలి  ,!
మేము నోరు విడచి అడగకున్నా  ,మాకు  అవసరం ఉన్న ప్రతీ వనరులను ,సంపదలను ,భోగభాగ్యాలను బంధువులను , ఉచితంగా ,ఉదారంగా ,ప్రేమతో
ఇస్తూ ఉండడం  , కృష్ణా ! నీ కారుణ్యం , ఎంత గొప్పదో మాటల్లో చెప్పలేం కదా వాసుదేవా   !"""
ఇచ్చిన దానిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియాల్సిన ధర్మం మాది !"""
అలాగే కృష్ణా !
నీ పేరులోనే  ఏమిటో తెలియని  ఎవరికీ అర్థం కాని,,అద్భుతమైన ఆకర్షణ ఏదో నీలో  ఇమిడి ఉంది , సుమా ,!"""
నీ దివ్యమంగళ విగ్రహదర్శనంలో  అమితానందం  నిబిడి ఉంది !
కృష్ణా!
,__"నీవు ఎక్కడ ఉంటావో ,, నీ ఉనికి , పతా, మాకు తెలిసి పోయింది ,!
నిన్ను  ప్రేమతో  గానం చేసే  భక్తుల హృదయాల్లో  వారిని విడవకుండా సదా నీవు కొలువై ఉంటా వు కదా !!"
శ్రుతులు,, స్మృతులు వేదాలు పురాణాలు ,,మాకు  నీ విశ్వరూపాన్ని తెలియజేస్తూ నే ఉన్నాయి !
కృష్ణా!
ఈ శరీరం అనే సంపద నీ ప్రసాద మే!
ఈ  ఉత్కృష్టమైన మానవ జీవనం  నీ  అపార మైన కారుణ్య మే , కదా !!
"""నవనీత చోర  గోవిందా !!,నంద నందనా ,, గోవిందా !!
నా ఈ దేహంలో ని  వేలాది  నాడులు , నీ నామ  రూప దివ్యగానం చేస్తూ ,పాల పొంగులా   పొరలే అనందాన్ని ,,,నా ఎదలో  ఉవ్వెత్తున ఉప్పొంగనీ !"
""కృష్ణా !!
దేవకీ నందన, !గోవిందా, !! ఈ నేత్రాలు నీ అలౌకిక అద్భుత ,కమనీయ రమణీయ ఆనందకరమైన ,మనోహరమైన  విగ్రహ రూపా లావణ్య వైభవాలని  కనులారా  తిలకించ నీ ,!
కేశవా!
నీ దివ్య నామాన్ని నోరారా  స్తుతిస్తూ  ,తన్మయం పొందే పరమ సౌఖ్యాన్ని ఈ నా నాలుక కు  అందించవా,!!"" హే పుండరేక వరదా!హే,,పాండురంగ !,, హే పండరి నాథా,!!   హే పురందర విఠల,!"
నా ఈ చెవులు , " శ్రవనానందకరమైన  , నీ. మధురా మంజుల మోహన గీతా మాధుర్యాన్ని   చేవులార వినే భాగ్యాన్ని కల్పించవా , మాధవా,, కోటి మన్మథ లావణ్య తేజా!పురుషోత్తమా !; ""శ్రీకృష్ణ గోవిందా హరే మురా రే !
హే నాథ ,!నారాయణ,, వాసుదేవా !""
, అంటూ  సుమధురంగా   వినిపించే నీ   , గోవిందనామ సం కీర్తన ను వీనులారా  శ్రవణం చేసే అదృష్టాన్ని మాకు  కల్పించు ! కృష్ణా !
,నా శ్వాసలో  నా ,ధ్యాసలో  నా ,భాషలో , సదా నీవే గోచరిస్తు  వుంటావు  సుమా ,,కృష్ణా ! దేవకీనందనా !!
నీ దర్శన భాగ్యం కోసం మనసు విలవిల లాడుతూ,,నిరంతరం  నీకై  పరితపిస్తూ ఉంటుంది  !!
,మాధవా !,,కేశవా! మధుసూదనా !
,  ఈ సర్వేంద్రియాలు నీ కోసం  ఆర్తితో ఆర్ద్రత తో   స్పందిస్తూ  ఆదుకో మని వేడుకుంటూ ఉన్నాయి ,,!
కృష్ణా!
నా మెడలో దాల్చిన సుగంధ పుష్ప మాల , సుమధుర పరిమళాలు  నీకోసమే సుమా
__ నీవు కనిపిస్తే  !
నీకు ఈ మాల  వేసి ,అందులో నీవు ఎంత అందంగా కనిపిస్తావో ""అన్న ఆరాటంతో  నేను నీ పూలమాల ను  ధరించి  ఉన్నాను !
అంతే కానీ, నా కోసం కాదు !!
నేను. భుజించే ఆహారం ,త్రాగే పానీయాలు ,భావించే కార్యాలు అన్నీ నీకోసం ,అని గ్రహించు సుమా !
నీవు నాలో ,నా చేతికి అందనంత దూరంలో అంటున్నావు ,!
ఏం చేయను నేను ??చెప్పు ??
ఆ సూర్య చంద్రులు,అష్ట దిక్పాలకులు నీ సేవకులు కదా !
నీ  సేవకుల కే  ఇంత గొప్పగా   ప్రజ్ఞ ,ప్రతిభ  పాటవాలు "" ఉంటే  ,, నీ మహత్తు ,,ప్రాభవం ,గురించి  చెప్పతరమా ? కృష్ణా!
,కనీసం ఊహించ వశమా !
కృష్ణా ! రాధికా మానస విహా రా !""
""నీవు ప్రేమావతారుడవు !"
నీ కృప,నిన్ను ఆరాధించే భక్తులపై   ప్రేమామృత ధార లా   పైనుండి వర్శిస్తు నే  ఉంటుంది !
మేము ఈ ధరణీ మాత లాలన లో అమ్మ  ఒడిలో అమాయకంగా ఒదిగి పోతూ , తండ్రి  పాలన కోసం  నింగికెసి ఆశతో  ఎదురుచూస్తూ   ఉంటున్న  , పసిపాపలం మేము !!" దేవాది దేవా,,పరమపురుషా !!
నీ అద్వైతామృత తరంగాల లో ఒలలాడిన  భక్తులు ఎందరో.  ఈ ""కృష్ణ భక్తి సామ్రాజ్యం ""   లో జీవించి ,తరించి , కృష్ణ సాయుజ్యాన్ని  పొంది ,జీవన్ముక్తి నీ సాధించారు కదా !""
""కృష్ణా!! , నీ భక్తి అనే ""అంకురం ""మా ఎద అనబడే సుక్షేత్రం లో మొలవాలి !""
అంటే ,అందుకు నీవు మా   పై  ,,  అనురాగామృతమైన  ప్రేమ అనబడే   నీ చల్లని చూపుల  తొలకరి జల్లులు కురిపించి , ఈ జీవుడి కి, నీ కృప పొందడానికి పాత్రత కల్పించాలి  , హే కృపా సిందో! దీన జన బందో!"
పాహిమాం హే భగవాన్!
రక్షమాం  హే గోపీ మనోహర ,,గోపాలా !
శరణు !
  ( ఇంకా ఉంది )
స్వస్తి!
హరే కృష్ణ హరే కృష్ణా!"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...