Tuesday, May 19, 2020

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జయంతి 2020

May 6, 2020
వైశాఖ శుద్ధ చతుర్దశి ! స్వామీ !లక్ష్మీ నరసింహా ,!
నమో నమః !"
____&&&&&&&___
"నా ప్రణామాలు స్వీకరించు స్వామీ, !""
ఎంత శ్రమ పడ్డావు  తండ్రీ,!
,,,నా కోసం ,నేను  పలికిన మాటను నిజం చేసుందుకు !
భక్తుల శ్రేయస్సు  పట్ల నీకు  కారుణ్యం ఎంత గొప్పగా  ఉంటుంది,అనేది నన్ను అనుక్షణం కంటికి రెప్ప వలె చూస్తూ ,నన్ను అపదల నుండి సదా రక్షిస్తూ ఉన్నావు !
నిన్ను భక్తితో  ఆశ్రయించిన వారికి చేటు లేదు ,కదా !
*""ఎందెందు వెదకి చూసిన,అందందే గలడు, ఆ పరాంధాముడు!"" అంటూ  నేను మా  తండ్రి గారికి విన్నవించిన ,నా ప్రార్థన  మేరకు , ఆహా,, శ్రీహరీ!! ,,నీవు జగమంతా నిండి యుండి ",సర్వాంతర్యామి ""నని నిరూపించుకున్నా వు!
జడపదార్థం అయిన  స్తంభం లో కూడా ఉంటానని   ప్రత్యక్షంగా చూపా వు కదా !
"" హే లక్ష్మీ వల్లభ!" నారసింహ! ,,ప్రహ్లాద వరదా ,!!
భవ భయ హరణా !""
""నా తండ్రి  నీగురించి పలికిన  దుర్భాషలు మన్నించి ,అతడికి ముక్తిని ప్రసాదించమని  నీ పాదాలు శరణు కోరుతూ
వేడుకుంటున్నాను , !
"" హే భక్ట జన పరిపాలా !!
, , నీ చేతుల్లో నా తండ్రి  హతమవడం  అంటే ,అతడు నీలో నే ""ఐక్యం ""కావడం,, ఉత్తమగతులు పొందడం "" అని నాకు  తెలుసు ,!!
ప్రభూ !!
నీ తొడలపై పడుకున్న  నా తండ్రిగారు ,,ఎంత పుణ్యం చేసుకున్నారో  కదా!!""
నీ చేతి గోళ్ళు తాకిన ఆయన శరీరం ,,,ఎంత పునీతం అయ్యిం దొ కదా !""
ఆహా !
లక్ష్మీమనోహర,నారాయణ!
""అద్యంత రహితా !!
పరమాత్మా !నీవు దయతో నన్ను నీ తొడపై కూర్చోబెట్టి ,నన్ను నీ వాడిగా చేసుకున్నావు !
నాకు  భగవంతుని పుత్ర వాత్సల్యాన్ని చూపించావు !,
నా చరిత ,భవిత ,జన్మ ధన్యం అయ్యింది ! శ్రీహరీ !!
!ఇటు
పది తరాలు ,అటు పది తరాలు  మా వంశాలు , తరించెలా అనుగ్రహించా వు ,,!;
ఇంతకన్నా ఈ నీ భక్తునికి కావలసింది మరేముంటుంది ,??""
""నారసింహ స్వామీ,!!
నీ సాక్షాత్కారము సకల పాప హరణం !
నీ దర్శనం ,భవరోగ నివారణం !""
నీ స్మరణం పూజనం ,సేవనం , జన్మ జన్మల పుణ్యఫలం!!"
శ్రీమన్నారాయణ , స్వామీ ,!
,నీ భయంకర మహోగ్ర లక్ష్మీ నరసింహ రూపం చూసి  నేను భయ పడ టంలేదు !!""
ఎందుకంటే ,ఇంతకన్నా భయంకర స్వరూపం ,, ఈ జగతిలో  మరొకటి ఉంది !
అదే ఈ సంసార సాగర మీద డం ,!
హే కరుణా సిం దొ ,!"!భక్తజన బందో ,!!"
"కరుణించి ,ఈ సంసార సాగర ము దాటించే తరుణోపాయం మాకు  అనుగ్రహించు !""
నీ పై  చెదరని భక్తిని, నిశ్చల బుద్దిని , స్థిరమైన చిత్తమును ,   అవ్యాజమైన అనురక్తి యును , ఆపేక్ష ను , నిరంతరం  కలిగించి ,,మా కు జీవన్ముక్తి ని అనుగ్రహించు !
ఇదే నా రెండవ కోరిక !""
""నిన్ను దర్శించాలి ""అన్న ఒకే ఒక  కోరిక తప్ప మరి ఏ ఇతర
కోరికలు నా మనస్సులో  కలుగకుండా  ఉండే వరాన్ని ప్రసాదించు ;
!చాలు !
శ్లోకం !"
*""సంసార సాగర నిమజ్జన ముహ్యమానం !___
దీనం విలోక య విభో! కరుణా నిధే! మామ్,___
ప్రహ్లాద ఖేద పరిహార !పరావతార !!___
లక్ష్మీ నృసింహ ; మమ దేహి  కరావలంబం !!!""
___&&&&&
హే పరందామా! ,హే   అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక ,! శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ !!
శరణు శరణు శరణు!
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !""

No comments:

A Drama that became Real!

The Turning Point Forty years ago, while teaching at Ragampet village high school, I experienced a moment that changed a student’s life fore...