May 22, 2020
వద్దురా కన్నయ్యా !
ఈ పొద్దు ఇలు వదలి పోవద్దు రా!
అయ్యా!
పశువు లింటికి చేర ,, పరుగు లెత్తె వేళ,!
పసి పాపల ను బూచి ,
పట్టు కెళ్ళే వేళా,!
వద్దురా,, కన్నయ్యా !"
పట్టు పీతాంబర ము
మట్టి పడి మాసేను !
పాలు గారే మోము,
గాలికే వాడేను ,,!
వద్దురా కృష్ణయ్యా !
__
నిను విడచి నేను ఒక
క్షణమైనా ఉండలేను ,
నా ఆశ యూ నీవే, నా శ్వాస లో నీవే
నా ప్రాణమూ.__ జీవ
-నాధారమూ నీవే !!
వద్దురా కృష్ణయ్యా !
__నను విడిచి పోకుండ
నిను ఆపలేనయ్యా ,
నీ వెంట నే పరుగు,
నే పెట్ట లేనయ్య !
కృప జేసీ నా మొర
విని బ్రోవ రావయ్యా!!"
బ్రోవ రా కృష్ణయ్యా!
నను కావరా కన్నయ్యా !
నన్నేల రా , నల్లనయ్యా !!""
No comments:
Post a Comment