Tuesday, May 26, 2020

రాధే రాధే రాధే!_1

May 25, 2020
మానవ జన్మ, ఉత్తమమైనది ఉత్కృష్టమైనది , ఎందుకంటే, అతడి శరీరం  అనుభూతులకు ఆలవాలం ,ఆనందాలకు నిలయం ,
మరే ప్రాణికి లభ్యం కాని కేవలం మానవ జాతికే  అనుగ్రహించం  బడిన అందమైన  అపురూపమైన  అద్భుతమైన  అద్వితీయమైన భగవంతుని అనుగ్రహం!
అనుభూతి అంటే  స్పందించడం
దేహంలో ఉన్న కోటాను కోట్ల నాడులు ఒకేసారిగ ,పరిసరాల ప్రభావానికి  ఉవ్వెత్తున   ప్రతిస్పందించే దివ్యమైన సౌకర్యము ,అతడికి మధురాతి మధురం  ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి
ఈ అద్భుతం ఏ ఇతర దేవలోకంలో లేదు
కేవలం ఈ పరమ పావన మైన ఈ ధరణీ పై మనిషిగా  జన్మించిన వారికే ఉంది
అందుకే మానవజన్మ అతి దుర్లభం
చేయి జారితే మరల దొరకదు అంటూ శృత్తి స్మృతి పురాణాలు వక్కానిస్తు ఉన్నాయి
అందుకే ,నేను రాధా దేవిగా. యమునా తీరంలో బర్సానా గ్రామంలో వృషభానుని కుమార్తె రాధాదేవి పేరుతో , జన్మించాను
తదుపరి రేపల్లెలో కృష్ణుడు అవతరించాడు
గొలోకంలో నిరంతరం శ్రికృష్ణాసన్నిధానం లో పొందిన ఆనందానికి మించిన పరమానందం ఈ భూలోకంలో అనుభవించాను
ఎందుకంటే మానవ శరీరంలో  ఎన్నో అద్భుతాలు జరుగుతాయి,
పరమాత్ముని అంశాలతో ప్రభావం చూపుతున్న ఈ పంచభూతా ల ప్రమేయంతో తో ఈ దేహం ఏర్పడింది  ,
ఇక ఆ పంచ భూతాలు ఈ  అందమైన ప్రకృతి సంపదల  రూపంలో ,శ్రీకృష్ణ పరంధాము ని సచ్చిదానంద స్వరూప  దరహాస వైభవ లావన్యాలను  తమలో ప్రకాశింప జేస్తూ ,స్వామి సౌందర్యాన్ని ప్రతిఫలింప జేస్తూ. ఈ మానవునికి బ్రహ్మానందం అనుభూతి నీ నిరంతరం ప్రసాదిస్తూ నే ఉన్నాయి
నాకు శ్రీకృష్ణుని సాన్నిధ్యంలో లభించిన  అనందం , అతడి పరోక్షంలో ,కూడా లభిస్తూ వచ్చింది
పుష్పాలతో లతలు ,ఆకులు ,తీగలు వనాలు చెట్లు పుట్టలు కొండలు లోయలు పచ్చికబయళ్ళు జలపాతాలు , సూర్యాస్తమయ,సూర్యోదయ సమయంలో మనసును  రంజింప జేసే ఆకాశం లోని వర్ణ చిత్ర పటాల సోయగాలు ,వర్షధారలతో ఈ శరీరం   తడుస్తుంటే  , ఆహా,ఏమానందం ఏమా దివ్యానుభూతీ ,!
చూడాలి అన్న తపన ,ఆర్తి ,ఆర్ద్రత ఎదలో ఉండాలి గానీ , ఎక్కడ లేడు ఆ జగన్మోహనుడు ?!
కృష్ణా నుగ్రహం ఉంటే తప్ప , ఆ అనుభూతిని కరునించమని కృష్ణయ్యను కోరుకుంటే తప్ప ,, ఆ తరుణం అందేవరకు ఈ రధామనోహరుని  విడవకుండా పట్టుకుంటే తప్ప ,  యశోదా కిషోరుని దివ్య దర్శనం అంత సులభంగా సాధ్యం కాదుకదా !! 
ఇలా ఎక్కడ చూసినా , అలా చూడబడిన. ప్రతీ వస్తువు  శ్రీకృష్ణ సౌందర్య ప్రకాశ     సాధనా నిలయమై అలరారుతూ , నంద నందనుని ఆరాధనా భావం మదిలో , కలుగ జెస్తూ ఉంటుంది కదా !
నాకు  నీలమేఘ శ్యాముని దయ,మూడు  విధాలుగా అనుగ్రహించ బడింది
1_   పరమశివ భక్తుడు ,మహా ముని శ్రేష్ఠుడు గర్గాచార్యుని  ఆశీస్సుల తో   నాకు శ్రీకృష్ణుని తో  పెండ్లి జరిగింది
ఇది అత్యంత గోప్యంగా ఉంచబడిన గొప్ప  దేవ రహస్యం
ఈ శుభఘడియల కోసమే నేను ,భూమిపైకి వచ్చింది !
2_ ,శ్రీకృష్ణుని అందమైన బాల్య లీలలు ప్రత్యక్షంగా చూడాలని అనుకున్న నా కోరికను , దేవకీ నందనుడు మన్నించాడు ,
ఆహా !
ఎన్ని సార్లు చూసినా,స్మరించిన ,తనివితీరదు కదా ,చిన్ని కృష్ణుని అపురూప సౌందర్య రూప లావణ్య వైభవాలు
దేహ ధ్యాస ఉండదు ,
మనస్సు కృష్ణా దివ్య శరీర సౌందర్య పిపాస తో మత్తెక్కి పోతుంటుంది
దివి నుండి దేవతలు అదృశ్య రూపంలో దర్శిస్తూ పరమానందం భరితులై వెళ్తూ ఉంటారు ,
నాకు ఉన్నది మానవ శరీరం అయినా నాలో పరదేవతా స్మృతులు ఉన్నాయి
కానీ , ఎక్కడా వాటి ప్రదర్శన చేయలేదు ,
ఒక్క  మహా రాసలీల  కేళీ మహోత్సవ సమయం లో తప్ప !
3_  శ్రీకృష్ణ  భక్తి యొక్క  నిజమైన స్వరూపాన్ని ,రేపల్లె గోపస్త్రీల ఆర్తి లో  దర్శించ గలిగాను
,భక్తి యొక్క శక్తి ఎంత గొప్పదో ,స్వయంగా అనుభవిస్తూ తెలుసుకో న గలిగాను
(ఇంకా ఉంది )
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...