Tuesday, May 19, 2020

కృష్ణా , రావేలా,

May 9, 2020

పల్లవి
______
చరణం _1
,""కృష్ణా , రావేలా, 
నను దయ గనవే లా !
కరుణ జూపి నీ దాసుని గావ వేలా !""
     !! కృష్ణా !!
చరణం _1
""నిన్ను తలచ మది ఎంతో ,_
పులకరిం చు గా !
నిన్ను కొలువ జన్మ మింక
ధన్య మౌనుగా ,!
కన్నయ, నీవే రా,
మా ఇల వేల్పు వురా ,!!
కనికరించి కృప , జూడ జాగేల రా !!
   !కృష్ణా!!
చరణం _2
గోవిందా , అంటేనే  గో  వర్ధన  గిరి నేత్తే వూ,,!
గోపాలా అంటే ,గోకుల ముద్దరించి  చూపేవు !!
గోలోక పర దేవత
, ఆ రాధ నెంతో వలచేవు  !!
గొప్పగ నిను భావించే ఈ
దీ నునేమో మరచేవు !
   "!కృష్ణా !!
చరణం _2
""కృష్ణా"" అని అంటే చాలు,,
,కన్నుల భాష్పాలు రాలు !
"కృష్ణా "నీ భావన  బోలు,
   జగతిలో ఏ రూపు లేదు !        
__"కృష్ణ కృష్ణ కృష్ణ
హరే కృష్ణా  !" అనీ వినిన  చాలు !
  ఆ కృష్ణ  పరందాముని   చరణాల ముందు ఎద వాలు !
   !! కృష్ణా !!

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...