Tuesday, May 19, 2020

ఇంగిత జ్ఞానం అంటే ?

May 11, 2020
, నిజంగా ఒక మనిషి తృప్తిగా ఆనందంగా ఉండాలి అంటే , అతడిలో ""నిజాయితీ ,మంచితనం"" ఇవి రెండూ ఉండి తీరాలి !!
ఒక  సినిమాలో చూపించినట్టు గా ,ఒకరు ముగ్గురికి చేసే సహాయం , ఆ ముగ్గురూ  ఒక్కొక్కరూ ముగ్గురికి చొప్పున అంటే తొమ్మండుగురు కి సహాయం  చేస్తూ __
ఇలా ఈ గొలుసు ఇంతింతై  అంచెలంచెలుగా  పెరుగుతూ ,,"  ప్రక్కవాడికి సహాయం"" అనే మానవతా విలువ,,
ఒక అద్భుతమైన  జ్యోతి రూపంలో ప్రకాశిస్తూ ,,
మనిషి కి ఉన్న
,"జ్ఞాన ""దీపాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది !!
కానీ ఇది ఊహాగానం చేయడం,,సినిమాల్లో చూడటం  తప్ప వాస్తవం లో  అలా జరగడం లేదు !!
ఎందుకంటే ,  ఎదుటివారి ని  అర్థం చేసుకోడానికి ,ఎదుటపడితే ఒక చిన్న చిరునవ్వుతో పలకరించడానికి,, ఈ మనిషి అనబడే వాడికి ,తన"" అహంకారం  స్వార్థం , మిడి మిడి జ్ఞానం""ఇవన్నీ ,"మనిషి"గా బ్రతకడానికి అడ్డు వస్తూ ఉంటాయి !!
""నాకు అన్నీ తెలుసు !"
""నాకు ఎవ్వరూ ఏమీ చెప్పే అవసరం లేదు !""
""నేను చెప్పిందే రైటు!"
""నేను చెప్పినట్టే  మీరు అందరూ వినాలి !""
""నేనే జ్ఞానిని !"
"నాకు ఎవరూ ఎదురు మాట్లాడ వద్దు !
నాకు కోపం వస్తుంది !
ఆ కోపంతో నేను ఏం చేస్తానో నాకే తెలీదు !
జాగ్రత్త !!"
""చెప్పింది చేయాలి !"
అంతే !"
"మారు మాట్లాడ వద్దు !""
ఇలాంటి" హిట్లర్ "నియంత ధోరణి ఉన్నవాళ్లు ఇంటింటికీ కనబడు తూ ఉంటారు మనకు !;
వారు  ఎప్పుడూ తమ పొరబాట్లు  తెలిసినా మూర్ఖంగా ఒప్పుకోరు!"
అలాంటివారికి  ఎదుటి వారు చేసేవి అన్నీ తప్పులుగా  కనబడుతాయి !
" ఈ "కరోనా పీ డ ,"" పెరగడానికి కారణం ఇలాంటి మనస్తత్వం ఉన్నవారే !!
తమ   half knowledge తో  సమాజం లో  ఈ "కరోనా క్రిమి "" లా తమ  మనసు  పై   తమకే  నియంత్రణ  లేకుండా,, ప్రపంచ శాంతిని   దూరం చేస్తూ ,,లక్ష లాది   అమాయక ప్రజల  మరణానికి,  కారకులు అవుతున్నారు ,;!
అందుకే  నాయనా ,దయచేసి నీవు ఊరక చూస్తూ ఉంటే చాలు!,,
""నీవు ఎవరికి మేలు చేసే అవసరం లేదు ,,!"
""అది ,నీకు చేత కాదు !;""
""నీకు అంత ఓపిక ,తీరికే  లేదు !
అంత గొప్ప  , తెలివీ సీన్ నీకు  లేదు !""
కానీ  సమాజానికి ,కీడు చేయకుండా ఉంటే  చాలు!
"మాకు అదే పదివేలు  !
కాస్తా పరిస్థితిని అర్థం చేసుకో బాబూ 
అంటూ హెచ్చరించక తప్పదు కదా  !
టీవీ , పేపర్ , మీడియా ల మాద్యమాల ద్వారా విషమ పరిస్థితిని జ్ఞాపకం చేస్తూ ఉండాలి ,మరి !!""""
చిత్రం ఏమిటంటే,," మంచి" కంటే" చెడు ""తొందరగా వ్యాపిస్తూ పోతూ ఉంటుంది !
ఇప్పుడు మనకు దాపురిం చి న ,  ఈ కరోనా వ్యాధి లాగా !!""
త్రోవలో మట్టి ,మురికి , బురద దుమ్ము  తగిలితే  కడుక్కో వచ్చును! కాలకృత్యాలు  తీర్చుకొనేందుకు. నీళ్లతో సబ్బుతో చేతులూ కాళ్ళు కడుకుంటు రోజూ  శుభ్రంగా ఉంటాం !!
, ఆ మలినం   మన కంటికి కనబడుతూ ఉంటుంది !!
,కొంత  ఆలస్యంగా చేసినా ,,
అంతగా హాని చేయవు !!
కానీ కరోనా క్రిమి అలాకాదు కాదే,,!
దాని చేతికి దొరికితే ,,,అది కాస్తా ఏ కొంచెం
తగిలి నా,మనల్ని   చంపకుండా విడిచి పెట్ట దు కదా !
అది మనల్ని తాకినా ,మనం దాన్ని తాకినా ,ఇంతే సంగతులు !
తెలిసి చేసినా,తెలియక చేసినా , ,చేసిన . ఆ నేరానికి , నేరుగా. దారుణమైన  మరణశిక్ష,, విధించబడుతోంది  మనకు !!
ఒకరి నుండి మరొకరికి సులభంగా  సంక్రమించే  ది ఈ వ్యాధి !!
, , కరోనా. సోకిన  వ్యక్తిని,, అలా ముట్టుకుంటే చాలు ,,,, బ్రహ్మ రాక్షసి లా వెంటబడి తరుముతూ చంపెవరకు విడిచి పెట్టడం లేదు కదా !!
ఎంతమంది అతడిని తాకుతూ ఉంటారో ,,అంత మందిని ,, అంటువ్యాధి వలె, అంటుకుంటూ పోతూనే  ఉంటుంది !!
    ఎక్కడి కక్కడ చావకుండా , ఆ విషక్రిమి అంతటా చిరంజీవి లా కరోనా  వర్దిల్లుతూ ఉంది అంటే ,
__,అలాంటి ""మొండితన"" మే కలిగిన మనుషులు మన ఈ సమాజం లో ఉండటమే ముఖ్య కారణం !!""
""శుభ్రంగా ఉండాలి ,!
ఎవరికీ తగులకుండా  "మడి"కట్టుకున్నట్టు గా ,ప్రక్కన ఉన్న వ్యక్తికి   కాస్తా   ""దూరంగా ""ఉండాలి అనే  కనీస ఇంగితజ్ఞానం   తెలియని వారు ప్రస్తుత సమాజంలో ఎవరూ లేరు ,!!
దీనికి పెద్ద పెద్ద చదువులు నేర్వాల్సిన అవసరం లేదు !"
""మనిషి తలచుకుంటే,,ఈ జగతిలో, సాధించ లేనిది లేదు కదా !!"
వియత్నాం లాంటి దేశంలో ఒక్క కరోనా కేసు లేదు ,,అంటే
వారు తీసుకుంటున్న చక్కని  జాగ్రత్తలే కారణం!!
వాళ్లూ మనలాగే మనుషులు !!
"" రోజువారీ పనుల్లో ,క్రమశిక్షణ  పాటించడం అందరికీ తెలుసు ,!""
___ఇతరుల పట్ల ఆదరణ భావం తో ,, మంచితనం తో ,చేసే పనిలో నిజాయితీ గా ఉండడం లో నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తూ ,
కరోనా కట్టడి చేయలేక పోతున్నాడు  మనిషి !!
అని  ప్రపంచ దుస్తితి ని పరిశీలిస్తూ ఉంటే మనకు తెలిసి పోతోంది !!
  సరియైన పద్దతులతో నియంత్రించే నాథుడు లేకుండా ,ఇంతింతై ,అంచెలంచెల్లో ,,  కరోనా వ్యాధి  రోజురోజుకూ  ప్రభలుతూ వుంది అంటే ,
ఈ మనిషి దుడుకు తనమే , అహంభావ మే ,తలబిరుసు తనమే ,, తొందరపాటు స్వభావమే  కారణం కాదా !!
,,  తన గురించిమాత్రమే ఆలోచిస్తూ ఉండే  స్వార్థ భావమే ముఖ్య కారణం  కాదా !
తన కుటుంబం లోని వారి సంక్షేమ ,యోగక్షేమాలు ఎంత అప్రమత్తత తో చూస్తూ ఉంటున్నాడో , అంతే సోదరభావంతో ఆత్మీయ చింతన తో ,  ఇరుగు పొరుగువా రి పట్ల ఆదరణ  హృదయపూర్వకంగా ప్రదర్శించ గలిగితే. , కరోనా వ్యాధిని అణచి వేయడానికి   "మందు ""  మన వద్ద ఉన్నట్టే అనుకోవాలి ,!!
మనకు ఇప్పుడు కావాల్సింది "",తెలివి జ్ఞానం బలం బలగం డబ్బు పరపతి "" ఇలాంటివి కాదు , కదా!""
""అంతా నా వారే!"" అన్న సౌభ్రాతృ త్వ భావంతో అందరూ ముందుకు రావడం కావాలి !""
దీనినే ""సామాజిక స్పృహ"" అంటాం !""
అలాఎదుటివారిని అర్థం చేసుకుంటూ ,అందరం కలిసికొక్క త్రాటి పై,, సమైక్యంగా కదలాలి ,!
"ఇలాంటి ఘోర విపత్తు లో అందరూ ఒకటి కావాలి ,!""
" ప్రభుత్వమే అన్నీ చేయాలి !""అంటే కుదరదు !
"నీవే ప్రభుత్వం ,!"
నీ నుం డే చురుకైన తెలివైన చర్యలు కదలాలి !!"
""దొంగా ,పోలీస్  ""ఆట ఇక్కడ పనికిరాదు !!
""నన్ను దొరికించుకో ,,నీకు తెలివి ఉంటే ,?""
అనే చీప్ ట్రిక్స్, జోక్స్ ,లతో  ప్రభుత్వాన్ని మోసం చే వద్దు  !  అది ""నీకు నువ్వే మోసం"", దగా"" చేసుకున్నట్టు అవుతుంది !;

ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ గా రోజూ మన కళ్ళ  ఎదుట   చూస్తూ ఉన్నాం !
ఏమీ చెయ్యలేక పోతున్నాం !
రావణాసురుని వంటి
తెలిసిన మూర్ఖులకు  చెప్పడం కష్టం !
_'మార్కెట్ వద్ద ,,మద్యం షాపు ల వద్ద ,కిరాణా దుకాణాల వద్ద , ప్రభుత్వ ఆదేశాలు ఖాతరు చేయకుండా ,ఒకరిమీద ఒకరు పడి తోసుకుంటూ ,రాసుకుంటూ ,తమని ఏ పోలీస్ గమనించడం లేదనీ "",వింత పశువు""ల్లా  కొంతమంది   ప్రవర్తిస్తూ  ఉండడం  మనం రోజూ చూస్తు ఉన్నాం
వీటివల్ల  నే , ఆ కరోనా వ్యాప్తి ఎక్కువ అవుతోంది !!
జనాలు ఎక్కువ పోగు అయితే,
వ్యాధి అన్నీ రెట్లు ఎక్కువ అవుతూ ,దొరికిన వారిని దొరికినట్టు గా కాటు వేస్తూ అంతం చేస్తూ పోతుంది !
ఈ నిజం తెలియని వారు లేరు !
అందరికీ  అన్నీ తెలుసు !!
అయినా  మూర్ఖంగా ""చావుతో చెలగాటం"" ఆడుతున్నారు !!""
వాడు ఒక్కడే కాకుండా ,వాడితో బాటు మరి కొంతమందిని కూడా తీసుకెళ్తూ ,వారిని  చంపెస్తు,తాను  కూడా చస్తూన్నాడు !!
""ఈ జాగ్రత్త లు తమ కోసం కాదు ,!""
"" ఎవరికోసమో"" అన్నట్టు వ్యవహరించే ఈ పెడ సరి ధోరణి తోనే  ఈ కరోనా విస్తరిస్తూ  పోతూ  మనః శాంతి లేకుండా చేస్తూ ఉంది!
""నన్నెవరూ చూడటం లేదు!""
""ఇక నా ఇష్టం  !""అనే దిక్కుమాలిన ఆలోచన తో ,కరోనా వ్యాధిని ,తనకు తెలియకుండానే,, ప్రతీ రోజూ, బలవంతంగా ఎంతోమందికి అంటగడుతూ ఉన్నాడు ,, ఆ వెధవ !!
.నేను అంటాను కదా ,,
""అన్నీ తెలిసిన నీకు ,ఇంత చిన్న విషయం తెలియకుండా ఉంటుందా ?""
నీ మూర్ఖత్వం తో ఎంతమంది అమాయకులు చావుకు నీవు మూల  కారణమై పోతూ ఉన్నావో , తెలుసా ?""
ఒకసారి ఆత్మ విచారణ చేసుకో !""
నీకు జ్ఞానం ఉన్నది అన్న విషయం  నిరూపించు !!,,చాలు !""
,సమాజంలో బుద్దిగా ఉంటూ,
నీకోసం శ్రమిస్తున్న డాక్టర్స్, నర్స్,,పోలీస్,పారిశుధ్య కార్మికులు ,నేతలు ఎందరో నిరంతరం దేశ క్షేమం కోసం  శ్రమిస్తున్నారు !
మ రి. ,, ఇందులో  నీ బాధ్యత ఏమీ లేదా ,??""
నీవు మనిషివి కావా ?""  వారి పట్ల కృతజ్ఞతా భావంతో వారికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ ,వారు చేబట్టిన కరోనా కట్టడి ఉద్యమానికి నీవు  తోడ్పడాలి  కదా!""
ఇదే మాధవ సేవ!
ఇదే దేశ సేవ !
ఇదే మానవ సేవ !""
""జంతువుల్లో కనిపించే ఐకమత్యం "" మనలో కూడా ఉంది అని ఆచరణలో ,ఆలోచనలో చూపాలి  మనం !""
కరోనా ను జయించాలి అంటే అందరూ ఇదే సంకల్పంతో కలిసి కట్టుగా పనిచేయాలి ,!
మంచితనం తో  ఉంటూ ,నిజాయితీ ని పాటిస్తూ,, ,ప్రభుత్వ ఆదేశాలను  నిర్వహిస్తూ , ఈ" కరోనా వ్యాధి""ని అరికడదాం !
""నేను ఒక్కడిని  చేయక పోతే ఏమైంది ,?
వారందరూ లేరా ?""
అని తప్పించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం ,
అదే ,నిజమైన దేశద్రోహం , అవుతుంది !"
,కరోనా మహమ్మారి కంటే ఘోర రాక్షసుడి వి ,,నీవు  అవుతావు !!
ఏ దేవుడూ కూడా క్షమించ లేని నికృష్ట జీవి వలె ,,ఉత్తమమైన నీ మానవ జీవితం ,వ్యర్తంగా ,  భ్రష్టు పట్టి పోతుంది !!
కాబట్టి
ఇంట్లో ఉందాం !
భద్రంగా ఉందాం !
ఇంటా బయటా
మానవత్వం ఉన్న మనిషి వలె మెద లుతూ సమాజానికి సేవ చేసే దృక్పథం తో ,,""అందరికోసం  మనమందరం"" అన్న నినాదం తో ముందుకు కదలు దాం !!
వందే మాతరం !"
భారత్ మాతా కీ జై !"
జై తెలంగాణా!""
స్వస్తి !"
హరే కృష్ణ హరే కృష్ణా !!"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...