Wednesday, June 3, 2020

"ఏమి రూపము నీది !

May 27, 2020
" పల్లవి !

"ఏమి రూపము నీది  !""
,దివ్యము భవ్యము !!
ఎంత చూసిన తనివి__ తీరదు రా   కృష్ణా!""

చరణాలు _1

""నీవెంత చూపినా ,,
, నోటిలో భువనాలు !
నిన్ను పరమాత్ముని గ  భావించగా లేను !"
_నన్ను కన్నయ్య , నా
_చిన్ని కృష్ణయ్య గా
నిను తలచినా చాలు ,!!, నీ తల్లి  మురిసే ను !!

చరణాలు _2

"ఏమి నోములఫలమో!
,చందురుని మరపించు ,
ముగ్ద మనోహర బాల_ కృష్ణునికి చనుబాలు
ఇచ్చు భాగ్యము కలిగే!!
ఏ తల్లి పొందని,
  పుత్ర వాత్సల్యము  !
నా ముంగిటా నడయాడు
కృష్ణా!నీ  వలన  కలిగే !
___________'___"_

((ఆహా ! అమ్మా , నంద రాణీ !
యశోదా మాతా ! యశోదా కృష్ణా,అని ఆ  పరమాత్ముని  నీ బిడ్డగా   కీర్తింపబడు టకు 
ఎంత పుణ్యం చేసుకున్నా వో గదా !
నీ పాదాలకు శతకోటివందనాలు !
అమ్మా !;))
,________&______"
  చరణం 3

"" భాగ్యమంటే ఈ యశో_
దా మాత దే కదా !
  "శ్రీహరి" యే  శిశువుగా ఆమె ఒడిలో మురిసే !
నీ పేరు తలచి తే ప్రతి-
,  మాతృ హృదయ మూ పొంగు !
""జో అచ్యుతానంద !
జోజో ముకుంద!"" అను
నీలాలిపాటను వినే __
  కృష్ణునే తలపించు !!

స్వస్తి!
హరే కృష్ణ హరే కృష్ణా !!"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...