Wednesday, June 3, 2020

మృత్యు భయం _1

May 28, 2020
________&______
"మృత్యువు అంటే భయం అందరకూ ఉంటుంది ,!"
చావును మించిన భయం లేదు ,!
" గోచీ నీ మించిన దరిద్రం లేదు!" అంటూ ఉంటారు ! కదా,,,,
పరీక్షిత్తు మహారాజుకి  తన చావు ఎప్పుడు  వస్తుందో తెలిసి జాగ్రత్త పడ్డాడు !,
అతడు ఏ మాత్రం మృత్యు భయం లేకుండా వారం రోజులూ మహా భాగవత శ్రవనానందం  తో_ బ్రహ్మానంద భరితుడై , ఏడ వ రోజు గడిచాక , తక్షకుని రాకకు ,అతని కాటుకు ,జీవన్ముక్తి కోసం ఎదురు చూస్తూ  ఉండి పోయాడు ,,,
అలా ఎవరికైనా మృత్యు భయం పోవాలంటే ,భగవద్ ప్రాప్తి సిద్దించాలి ,,మృత్యువు మరో జన్మ కు దారి చూపుతుంది అనుకోవాలి ,
కోరికలు తీరని వాడు , అయ్యో ,ఇంకా చేయాల్సింది ,తినాల్సిందే చాలా ఉండి పోయింది ,,అప్పుడే పోవాలా నేను !""
అనేవారికి తృప్తి ఉండదు,, సరికదా, అలాంటి వారిస్నేహంలో ఉన్నవారికీ కూడా సుఖం ఉండదు !
మృత్యు భయం అలాంటి వారికి ఉంటుంది ,
నాటకంలో పాత్ర అయిపోయింది , అంతే, ఇక దిగి పోవాల్సిందే , కొత్త వారికి ఛాన్స్ ఇవ్వొ ద్దా !"
__"మరణించాక జీవుడు ఏమై పోతాడు ,అన్న జ్ఞానం జీవుడీ  కలగాలి ,!
"ప్రియము ,శ్రేయము "అని రెండు దారులు ఉంటాయి మానవుడికి !
"ప్రియము "అంటే  జీవుడు సుఖపడటానికి ఇష్ట పడే విషయాలు !,, అవే ప్రాపంచిక సుఖాలు , ! ,, ""కంటికి కనపడేవి ,శరీరం తో స్పర్షింపబడేవి !,ఇంద్రియాలతో భోగింపబడేవి ! ఇహలోకంలో ఉండేవి ,,! ఆ భ్రమతో,ఇవే శాశ్వతం అనుకోడం లో  తన ఆనందం , ఉంది  అనుకొంటాడు ,!!!,
"" ఇక రెండవది __"శ్రేయము "అంటే మంచితనము !
జీవుడికి శాశ్వతమైన అనందాన్ని తృప్తిని కలిగించేది ,!!
ఇహాన్ని కాకుండా ,",పరలోకచింతన" యే  పరమానందం గా భావిస్తూ ,ఆధ్యాత్మిక చింతన తో గడపడం ,! శ్రేయ ము ,అనగా జీవుడికి  హితము అవుతుంది !
, రాజుకైన పేద కైనా ,మృత్యువు తప్పదు ,,ఏనాటికైనా ఎప్పుడైనా ఎవరికైనా ,అనే విషయం అందరికీ తెలుసు !!
,కానీ దాని గురించి  శ్రద్ధ చేయడు,,!వినడు! అనడు! ,చింతన చేయడు! అసలు పట్టించు కొడు.!
కారణం భయం !
ఈ జన్మలో డబ్బులు డచుకుంటున్నట్టుగా. , వచ్చే జన్మలో  అక్కరకు వచ్చే మంచితనం అనే పుణ్యాన్ని పోగేసుకుంటు ఉండాలి అన్న జ్ఞానం ఉంటే భయం ఉండదు !
మనసు శరీరం మాత్రమే కాకుండా ఆత్మ అనే అద్భుత దివ్య శక్తి తనలో ఉంటూ ,జీవన చైతన్యానికి కారణం అవుతూ ఉందని తెలిస్తే  మృత్యుభయం ఉండదు 
, ఎన్ని జన్మల కైన తనను  విడవకుండా  వెంట వచ్చేది ఈ ఆత్మ,, అని తెలిస్తే ,, ఆ మాత్రం ఆత్మ జ్ఞానం ఉంటే చావు భయం ఉండదు ,!
ఈ బొమ్మ తనది కాదు ,!ఇది చేసిన వాడు ఆ పైవాడు ,!
దీనిపై సర్వ హక్కులు వాడివే!
వాడు పంపించాడు , భూమిపై కి వచ్చాము ,ఇపుడు తీసుకుని పోతున్నాడు , అంతే వెళ్ళాలి ,ఇది వాడి సొమ్ము !
ఎవరి ఆస్తిని వారు తీసుకుంటే ,, మధ్య నీ గొడవ ఏమిటి ?!
వెదవ గోల !!
,,,""చావును ,చచ్చే వాళ్ళను"" ఎదురుగా చూస్తూ కూడా ,క్షణ కాలం ఆలోచించాడు కదా !
ఏం జరుగుతోంది ఇక్కడ ? ,వచ్చింది ఎవరు ?
పోతోంది ఎక్కడకు ??
,__గమ్మత్తు ఏమంటే,," ఆ చావు ఎవరెవరికి కో వస్తుంది ,,!" తనకు మాత్రం రాదు ! ,తాను మాత్రం దానికి  అతీతుడు!"" అనుకుంటాడు ,!
ఇదే అజ్ఞానం అవిద్య ,అహంకారం ,!
ఇలాంటి వారందరూ హిరణ్య కశిపు లే ,కదా !!""
దేహాభి మానం ,మనిషికి పెద్ద శత్రువు !
ఇది పోతే గానీ, బుద్ది రాదు కదా !!
పైగా చచ్చేది ఎప్పుడో తెలీక పోవడం ,. వాడికి పెద్ద అదృష్టం,వరం  అయిపోయింది !!,,,
ప్రపంచం లో అతి పెద్ద వింత ఏమిటీ అంటే ,మృత్యువు తప్పదు అని తెలిసి కూడా,,అది నెత్తి మీద నే నర్తిస్తూ ఉంటుందని చెప్పినా కూడా,, విస్మరిస్తూ బ్రతకడం  వింత లలో కెల్లా వింతైన విషయం !!""
అప్పటివరకు చూద్దాం లే !!"
అంటూ నిర్లక్ష్య భావంతో జీవితాన్ని తన ఇష్టం వచ్చి్నట్టుగా మలచుకుంటూ, భావిస్తూ జీవిస్తాడు !
ప్రపంచం దుఖ నిలయం, ఎందుకంటే, అన్నీ నాశనం అయ్యేవే , కోరికలు పెంచేవే,,అంతృప్తిని కలిగించేవే,
ఇలాంటి క్షరాలు, అక్షర మైన పరమాత్ముని వెదకడానికి ఉపకరించేనా ??'
విషయాలు వాసనలను పెంచుతాయి,వాసనలు  దుఖాన్ని ,, కలిగిస్తూ అశాంతిని పెంచుతాయి,
జీవుడికి స్వాంతన కలిగేది తల్లి ఒడిలాంటి ఆ పరమాత్మ చింతన లోనే కదా !!""
ఎదురుగా అకస్మాత్తుగా ఒక పులి ,లేదా పాము , లాంటి క్రూర జంతువు ,,మృత్యు దేవత రూపంలో అనుగ్రహిస్తూ  తనను  సమీపిస్తు ఉంటే ఆ ,మనిషి  మనోస్థితి ఎలా ఉంటుందో  అంచనా కూడా చేయలేము కదా ,!!
అనుభవానికి వస్తె తప్ప !
__లోనున్న నవ నాడులూ కృంగి పోతాయి! ,మెదడు మొద్దు బారి పోతుంది !
దెయ్యం పట్టినవాడిలా చేష్టలు దక్కి , బొమ్మలా ,కట్టె చరచు కొని పోతాడు ! ,,నోట మాట పెగలదు ,,!గుండె  ఎడాపెడా కొట్టుకుంటూ ఉంటుంది ,!
కొందరికి పై ప్రాణాలు పైనే పోతూ గుండె కొట్టుకోడం ఆగిపోతుంది ,,!!
___ఇదే మృత్యువు మరో వారం రోజులు అయ్యాక వస్తోంది !""
అని తెలిస్తే మనిషి మానసిక పరిస్తితి ఎంత దారుణంగా ఘోరంగా . మారి పోతుందో ఊహించలేము కదా !
చస్తే ఒకే వేటుకు ప్రాణాలు పోవాలి,, కానీ , పళ్ళు లేని. పులి నమిలినట్టుగా , క్షణ క్షణం భయం భయంగా ,వారం రోజుల పాటు మృత్యు భయంతో ఉండడం ,  అనేది, శత్రువు కైన కూడా అలాంటి దుర్బర మైన పరిస్తితి  రావద్దు సుమా !;
మేక ,కసాయివాడి కట్టి ముందు  నిర్భయంగా తలవంచి నిలుస్తుంది ,! ఎందుకంటే,
చావు  అసలు స్వరూపం  గురిం చి ,,పాపం   దానికి  తెలియదు కదా;,,
ఆ జ్ఞానం దానికి లేదు ,!
అందుకే భయమూ ఉండదు  ,!
ఎదురుగా ఒక కత్తి పట్టుకుని  చంపడానికి  వస్తుంటే , తప్పించుకొని వెళ్లే వీలు కూడా లేకుండా ఉంటే,, ఆ పరిస్తితి ఊహించడానికి కూడా మహ భయానకంగా ఉంటుంది , కదా !
మృత్యు భయం,మించిన భయం ఉండబోదు,,కారణం, ఆవలి తీరం లో ఏముంటుందో ఎవరికి తెలియదు,, ఆ తీరం చేరినవారు  , ఏ విషయమైనా చెప్పేందుకు ఎవరూ వెనక్కి రారు, !రాలేరు! ఎందుకు వాడికీ మనకు ఉన్న బంధుత్వం కట్ చేయబడింది ,!
ఎవరో నీవు! ఎవ్వరి వాడో, అటు వైపు వెళ్లినవాడు !
నాది నాది అన్నది ,ఇపుడు నీది కాకుండా పోయింది రేపు నీ బతుకు,ఎల్లుండి నా బతుకు కూడా అంతే!
బొందితో ఉంటే నీది, నాది, లేకుంటే ఆ పైవాడిది !"
అందరకూ ఒకటే రూలు !!
__ప్రస్తుతం _ఈకరోనా కాటుకు లక్షలాది మంది బలియై పోతున్నారు !, ఇంత పెద్ద ఎత్తున నర మేధం జరుగుతూ   ఉండడం ,అనేది   చాలా ఘోరం !
ఏదైనా తనదాకా వస్తె తెలుస్తూ ఉంటుంది ,!
ఆ కరోనా అనేది ,"ఎవరికో వస్తుంది ,మన కి. మాత్రం   రాదు!; వచ్చినా నేను పోను !"" అంటూ ,మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు , మనిషి !;
ప్రతీ వాడికి , ప్రాణం పై తీపి అలా వుంటుంది. మరి !;
__ చిన్న కథ ని చూద్దాం;! __ఒకాయన భార్యా పిల్లలతో వాగు దాటుతూ ఉన్నాడు ,!
ప్రవాహ వేగం అంతకంతకూ పెరుగుతూ ,వారిని పట్టుకుంటూ  దాటడం అతడికి   కష్టంగా  ఉంది !!
వెంటనే ఇద్దరు పిల్లలను ,, కన్న బిడ్డలని, ఒకరి  తర్వాత మరొకరిని వదిలేశాడు  నీళ్ళలోకి,!
అతడికి పిల్లలంటే ప్రాణం ,!
కానీ తాను బతకాలంటే అలా చేయక తప్పదు !!
మిగిలిన  భార్యతో, అతి కష్టంగా వాగును  దాటుతూ ఉండగా, అకస్మాత్తుగా పెద్ద అల వచ్చింది ;! ప్రాణం మీది తీపి తో,, మృత్యుభయంతో , అలల దెబ్బకు ,భార్య ను కూడా వదిలేశాడు ,!
భార్య అంటే పంచ్
కిందా మీదా పడుతూ ఎలాగో లా,, తన ప్రాణం దక్కించు కు ని ఒడ్డు చేరుకున్నాడు  !
మనిషికి
ప్రాణ భయం అంటే అలా ఉంటుంది ,!
మగాడు  చేసిన ఆ సాహసం స్త్రీ చేయగలదా ?""
అది, అప్పటి
పరిస్థితులు నిర్ణయిస్తాయి!!
__మనిషికి  తన ప్రాణం పై  చాలా  తీపి ఉంటుంది ,! ప్రాణం కంటే ప్రియమైనది  మనిషికి మరొకటి పృత్వి లో ఉండదు కదా  !!
__అందుకే తనకు మాలిన ధర్మం లేదు కదా ,, అంటారు ,విజ్ఞులు. !
__"బ్రతికి ఉంటే బలుసాకు తినవచ్చు ""అంటారు , పెద్దలు ,,!"
  "(ఇంకా ఉంది )"
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...