June 27, 2020
"ఆనందమే కృష్ణుడు"_!
భువి లోన _
అందమంటే కృష్ణుడు _!"
______&&&&_____
ఆనంద మానందము_
పరమానంద మానందమూ_!
కాళీయమర్దనము చేయూ,
కృష్ణ _,
నీ తాండవమే ఆనందము _!"
!! ఆనంద!!
""బ్రహ్మాండము లు కదలగా _ మో దమున ,
వర యమునయే పొంగగా_
నర్తించు_ గోవింద గోపాలుడే_
, డెందమున _ కానంద మానందము _!!
!!ఆనంద!!
కాళీయఫణి మంటపముపై___
భాసించు కృష్ణు డే ఆనందము _!
శ్యామ సుందరుని చూచే _కన్నులదే ఆనంద మానందము __!!
!!ఆనంద !!
_,
కృష్ణ , వేణునాద శ్రవణము
వీనులకు _,
అనంద మానంద ము _!
చిన్ని కృష్ణుని
అందెల రవళి యే_
హృదయమున ఆనందము _ ఆనందము _!!
!! ఆనంద !!
నలినలోచను నాట్యము_
మనసునకు _ఆనంద మానందము _!
తాళ యుక్తము గ చేయు _
కృష్ణ పద ఘట్టనము లానంద మూ_!
"!!ఆనంద !!
భువనాలు ఆడించునే _ ఆటగా_!
తానే ఆడుచు పొందునే_
ఆనందము _!
దుష్ట శిక్షణ వ్రతము గా_
పాలించు శిష్ట రక్షణ దీక్షయే_
భక్తులకు మానంద
మానందము!
"!!ఆనంద !!
బృందావన సీమలో , _ దివ్యమౌ _యమునా నదీ జలములో _
కృష్ణ తాండవ నృత్యమే _
తలచిన ప్రతి ఆత్మ ఆనందము _!
!!!ఆనంద !!
గోప గోపీ జన ము లో_
కనిపించు_ ప్రేమయే
ఆనందము _!
కృష్ణ భరత నాట్యమే _
జగతి కి _
ఆనందమా నందము_!
!!ఆనంద!!
పులకించు
ప్రకృతిమాత దే _ఆనందము_!
నందా యశోద జంట దే ఆనందము _!
నంద వ్రజ స్త్రీల దే, ఆనం దము_!
మునిజన డెందము న_ కానందము _!
నాట్య మానం దము_! _పరమాత్మ
లీలలానందము_!
అందాల కృష్ణుని ,_ అనురాగ మూర్తిని _
ఎంత స్మరియించిన అంత ఆనందము_!
అందించు కృష్ణయ్య అలరించవయ్యా_!
నీ ఆనంద లహరి లో
తేలించవయ్యా__!""
No comments:
Post a Comment