June 26, 2020
నర మాంసం తిన మరిగిన పులి , ఆ వాసన తో అడవంతా మనిషి కోసం గాలిస్తు ఉంటుంది
పిల్లి ఎలుక మాంసం రుచి తెలుసు కనక ఆ ఎలుక వాసన పసిగడుత్ మెల్లిగా దాన్ని పట్టేస్తుంది
అలాగే ఈ మనిషి అనే జంతువుకు కూడా వాసన ఉంటుంది
, వాసన అంటే బలమైన కోరిక, ఎలాగైనా కోరింది పొందాలి
రావణుడు చేసింది అదే పని
దుర్యోధను ని రాజ్య కాంక్ష కూడా అతడి వాసనా తీవ్రత యే,
మధిర మగువ జూదం మాంసం , మత్తు పానీయాలు వీటికి దాసుడు కావడం అంటే అతడిలో వాసన సూక్ష్మ స్థూల కారణ శరీరాల్లో నిండి పోవడమే
, వాసన లు మూడు రకాలుగా వర్గీకరించవచ్చు
ఒకటి దేహ భావన ,
ఇది అందరికీ తెలిసిందే
అయినా
దీన్ని అర్థం చక్కగా చేసుకోవడానికి చిన్న ఉదాహరణ చూద్దాం
ఒక రాజుగారి మహల్లో మహారాణి కొలువులో ఒక ముసలి దాసి ఏళ్ల నుండి ఆమెను సేవిస్తూ ఉంది,
ఆమెకు ఒక కొడుకు ,యువకుడు ఉన్నాడు
ఒకరోజు ఆ యువకుడు రాణి గారి అంతః పురం లోకి తల్లి కోసం వచ్చి,అక్కడే ఉన్న రాజకుమారి నీ చూసి ఆమె అందానికి , మోహితుడై పోయాడు
ఇంటికి వచ్చాక తల్లీ కి తెలిసింది
ఇది కుదరని పని అని ఎంత చెప్పినా కూడా అతడు వినకుండా ,అన్నం నీళ్ళు మానేసి , పిచ్చి వాడి లా తిరుగుతూ ఉన్నాడు
తల్లి విచారంగా కనిపిస్తూ ఉంటే ఒకరోజున మహారాణి అడిగింది ,కారణం ఏమిటి అని !
దాసి ఆమె వద్ద దాచకుండా విషయం చెప్పింది
ఆమె నవ్వుతూ
ఓస్ ఇంతేనా ! రేపు ఉదయం నీ కొడుకు ను నా వద్దకు తీసుకు రా !_
అంది
మరునాడు రాణీ తన ముందు బుద్దిగా కూర్చున్న యువకుడి ని పరిశీలనగా చూస్తు అడిగింది
చెప్పు నీ సమస్య ?
రాకుమారిని ప్రేమించాను !
ఆమెలో ఏం చూసి ప్రేమించా వు ?
అందం -_!మరచిపోలేని కళ్ళు. ఆధారాలు. ,వదనం ,అవయవ సౌందర్యం , మరవలేక పోతున్నాను
ఒక్కసారి చూస్తేనే ఇంత ప్రేమ కలిగిందా ?
అవును ,ఆమెను తప్ప ఇంకెవరి నీ పెళ్లి చేసుకోను ,
సరే ,ఒక రాకుమారిని చేసుకోవాలంటే ,నీవు ఆ స్థాయి కి ఎదగాలి కదా ,
నాకు ఆ హోదా స్థాయి కోరిక లేదు
ఈ కోరిక తీరాలంటే నీవు ఇదే రాణీ వాసం లో ఒక గదిలో ఒక సంవత్సరం పాటు ఉండాలి ,
బయటకు రావడం , కుదరదు
నీకు ఆహారం వసతి ఏర్పాటు చేస్తాను ,నేను చెప్పినట్టుగా నీవు ఏ ది చేయమంటే అది చేయాలి ,
నేను పంపించిన వ్యక్తుల తోనే నీవు మాట్లాడాలి , నీవు ఈ నియమాలు పాటిస్తే , సంవత్సరం గడిచాక నేను నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను ,
సరేనా నీకు
ఆమెను పెళ్లి చేసుకోడం కోసం నేను ఏమైనా చేస్తాను __!
అలాగే ఉన్నాడు , విన్నాడు ,
సంవత్సరం గడిచింది
రాణీ గారు అతన్ని పిలిచి
రాకుమారిని పెళ్లి చేసుకుంటా వా అంది
, ఎవరు ఆమె ,నాకు ఎవరూ తెలియదే
అన్నాడు
అయితే ఆమెను మరచి పోయావు ,సరే ఇన్ని రోజులు గదిలో ఉండి ఏం నేర్చుకున్నావు
గీతా సారం బోధ పడింది , మీరు పంపించిన ఆచార్యులు రోజూ నాకు , భగవద్గీత ను చక్కగా బోధించారు
దాని వల్ల నాకు దేహ భ్రాంతి ,దేహ వాసన తొలగి పోయింది ,
బాహ్యంలో ఇంద్రియాల ప్రలోభ వలన కంటికి అగుపించే ఈ భౌతిక శరీరంలో అందాలు సత్యం కాదు నిత్యం ,శాశ్వతం కాదు ,
అందం ఆనందం అంతా ఆత్మా నందం లో అంతరంగం లో కలిగే అనుభవం లో ఉందని అర్థం అయ్యింది
నాకు జ్ఞానభిక్ష పె ట్టి, అజ్ఞానం లో కొట్టుకు పోతున్న నా ,కళ్ళు తెరిపించినందుకు మీకు కృతజ్ఞుడిని
అమ్మా మీకు ప్రణామాలు
అంటూ ఆ యువకుడు తన ఇంటికి తిరిగి వెళ్ళాడు ,
అతడికి ,తన ఆత్మ విచారం తో ,,దేహ వాసన తొలగి పోయింది
అతడిలో కలిగిన మార్పుకు తల్లీ , రాణీ సంతసించారు
ఈ శరీరం అందం ,అనందం ఆరోగ్యం ,సుఖ భోగాల వాసనలు పూర్తి చేయడం కోసం జననం నుండి మరణం వరకూ దేహం పై మమకారం తో జీవుడు పడరాని పాట్లు పడుతున్నా డు కదా !
శరీరం అందంగా కనిపించేందుకు దుస్తులు , నాలుక తో నానా రుచులు ,ముక్కుతో వాసనలు ప్రభావంతో ,ఎన్ని క్వింటాళ్ల ఆహారం ,పానీయాలు , తినరాని తిండి, తాగకూడ ని మధ్యం , ఈ జానెడు పొట్టలో పోస్తున్నామో , లెక్క కట్టలేం కదా !
శరీరానికి కష్టం కలగకుండా , ఏసీ లు కూలర్ లు ,సబ్బులు , కమ్మని వంటకాలు ,, మెత్తటి పాన్పులు , సోఫాలు,,సుగంధ ద్రవ్యాలు సెంట్లు ,పూసుకోడం ,నిత్యం ఈ దేహాన్ని అందంగా అలంకరించి అందులో అనందం పొందడానికి,ఉదయం లేచి నప్పటినుం డి పడుకునే వరకు,, ఈ శరీర సౌందర్యం కొరకు ,,ఎన్ని అగచాట్లు పడుతూ ఉంటా మో ,__ఎంత ఖర్చు పెడుతూ ఉంటామో,, మనకందరకు తెలుసు
చెప్పుకుంటే చేంతా డం త అవుతుంది ,
రెండవది లోక వాసన __
____
తల్లి అడిగింది కొడుకును
,ఇలా పుస్తకాలు చదువుతూ ,ఒంటరిగా ఉంటూ ,,బయటకు వెళ్ళ కుండా , పది మంది తో కలిసి తిరగకుండా ఉంటే లోకులు నిన్ను గూర్చి ఏమనుకుంటారు. చెప్పు నాయనా ?
అతడు మందహాసం చేస్తూ ,నింపాదిగా జవాబు చెప్పాడు తల్లికి
అమ్మా !నేను ఏమిటో ,,ఇన్ని రోజులు నేను చేసింది ఏమిటో,ఇక ముందు నేను చేయాల్సింది ఏమిటో ,, అత్మ విచారణ ద్వారా తెలుసు కున్నాను
ఎవరికోసమో నేను మారలే ను
వారి కి ఇష్టం ఉన్నట్టుగా నేను నడవలేను _ వారి లో గొప్ప కోసం ,గుర్తింపు కోసం ,వారిని మెప్పించడం ,లేదా మెప్పు పొందడం కోసం, నా స్వార్థం కోసం వారిని ఉపయోగిస్తూ ఉండడం కోసం,, నా అవసరాల కోసం వారి చెప్పు చేతల్లో ఉంటూ,, వారు చెప్పింది చేస్తూ ఉండడం నాకు ఇష్టం లేదు
, నా జ్ఞానాన్ని అలా వ్యర్థ కలాపాలలో ,వృథా చేయను. అమ్మా
,అలాంటి క్షుద్ర సంతోషం కంటే
ఆ పరాత్పరుని ధ్యాన వైభవం లో పొందే పరమానందం నా ధ్యేయం ,,
ఎందరో వ్యక్తులు ఎన్నో రకాల మనస్తత్వాలు ఉంటాయి
నాకు యుక్తమని అనిపించింది నేను చేస్తాను ,
ఇన్నాళ్లూ భగవద్గీత , ఉపనిషత్తుల అధ్యయనం చేస్తూ నేను ఎవరో తెలుసు కొనే ప్రయత్నం చేస్తున్నాను
అమ్మా ! నా గురించి నీవు ఏ మాత్రం బాధ పడకు ,
నేను ఈ బాంధవ్యాల కు , అతీతుడు గా ఉండాలని,ఇందుకు నీ ఆశీస్సులు ఉండాలని నిన్ను కోరుకుంటూ ఉన్నాను అమ్మా !__
ధ్యాన యోగం వలన తన ఇంద్రియాలను నియంత్రిస్తూ తన మనసును ఆత్మతో అనుసంధానం చేస్తూ , ,పరమాత్మ సాక్షాత్కారం కోసం సాధనా మార్గంలో పయనిస్తు బ్రహ్మానందం పొందే ప్రయత్నం చేస్తున్నా డు
( ఇంకా ఉంది )
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !_
ఇక మూడవది
శాస్త్ర వాసన ,
అంటే ధర్మం తెలుసుకుంటూ , అన్వయం చేసుకుంటూ,జీవితం లో ఆచరిస్తూ ఉండడం
No comments:
Post a Comment