Saturday, July 25, 2020

ఆకలి దేవత

Jul 5, 2020
   ఇంకా కావాలి,ఇంకా కావాలి అంటూ మనసునూ ,శరీరాన్ని పీడిస్తూ ,  ఎన్ని మందులు వాడినా ,ఎంత మద్యం తాగినా,ఎంత సంపాదించినా , తగ్గని రోగాల బారి నుండి , తప్పించు కునే దారి కానరాక ,  మనో వ్యధలకు గురియై ,రోజూ చస్తూ బ్రతుకుతూ జీవిస్తూ ఉంటారు
అయితే , ఆధ్యాత్మిక చింతనతో , పూర్వ జన్మల సుకృత పుణ్య వాసనలతో ,,, సద్గతి నీ పొందాలనే ఆకలి ఉండడం నిజంగా  ,అదృష్టం ,
  పరానికి సంబందించిన సమగ్రమైన భక్తి జ్ఞాన వైరాగ్య భావన పెంపొందించే విధంగా సాధన చేయడం ,
ఉత్తమమైన  ,,సత్వగుణ రూపంలో ఉన్న ఆకలి గా జీవితంలో కి ఆహ్వానించ వచ్చును
ఈ ఆకలి కూడా ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తుంది
కానీ, ఇందులో నిష్కామ,నీరాపెక్ష ,ప్రేమ ఉంటుంది ,
అందరినీ తమ కుటుంబ సభ్యుల వలె భావించే సమ తుల్య భావ సంపద వుంటుంది
ఎదుటి వాడి నుండి ఏం  విధంగా డబ్బు లాగడం అనుకోడానికి బదులు ,అతడికి నేను ఏ విధంగా ఉపయోగ పడగలను అన్న నిస్వార్థ ,ఉపకార భావం ఉంటుంది
,  మనసా వాచా కర్మణా ,ఏదైనా దానం చేయడం ప్రవృత్తిగా  మారుతుంది
, మూడు పూటలా కడుపు నిండా తిని పడుకొడం కాకుండా , ఒక పూట ఉపవాసం చేస్తూ,  అమూల్యమైన తన జీవిత కాలంలో పరమాత్మ తత్వ చింతన కోసం , జీవిస్తాడు
ఇక్కడ లక్ష్యం అర్థం కాదు
పరమార్ధం
  చింతన పదార్థం గురించి కాదు
పదార్థం యొక్క యదార్థ స్వరూపం గురించి  , తెలుసు కోడానికి భగవద్గీత లాంటి అత్యుత్తమ సద్గ్రందాలను చదువుతాడు, స్మృతి శృతి ఇతిహాస
పురాణాలు వింటాడు
భజనలు చేస్తాడు ,సత్సంగం
తో సహవాసం చేస్తూ ,పరాత్పరుని గురించి ఆరాట పడతాడు
ఇదంతా ఆకలి రూపమే ,
ఇంకా కావాలి,
భగవంతుని సేవించుకునే మహ భాగ్యం నాకు దక్కాలి నాకు ఇంకా ఇంకా కావాలి ,
అంటూ అర్తిస్తాడు
పూజలు అర్చనలు సేవనం ఆరాధనా, వంటి నవ విధ భక్తి మార్గములను. ఆశ్రయిస్తు ఉంటాడు,
తీసుకోడం లో కంటే ఇవ్వడం లో నిజమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు,
, ఆత్మానుభవం తో అత్మ లో పరమాత్మ సాక్షాత్కారం కోసం సాధన ప్రయత్నం చేస్తూ,క్రమ క్రమంగా పరంధాముని సన్నిధానం వద్ద కు చేరడానికి త్రికరణ శుద్ధితో పరాత్పరుని అన్వేషిస్తూ , ఉంటాడు
నిద్రలో , మెలకువ లో,స్వప్నం లో,, సర్వ కాల సర్వావస్త లలో భగవన్నామ గానం , సంకీర్తన,స్మరణం , చేస్తూ, తనువు మరచి ,దేహం పై ధ్యాస విడచి,నిరంతరం ఆ హరి నామ రూప గుణ స్వరూప వైభవ దర్శనం  ఆత్మ లో భావిస్తూ, జీవించి ఉంటూనే, దేహం నుండి ముక్తుడై ,విదేహుడై తరిస్తా డు
   సచ్చిదానంద స్వరూపుడైన ఆ పరమేశ్వరుని కోసం అలమటించే ఆర్తి ఆర్ద్రత ,,ఆరాటం ,ఆవేదన ,కూడా ఆకలి స్వరూపాలే
  ఇందులో స్వార్థం కామం కోపం ద్వేషం ఈర్ష్య ,కోపం లాంటి వికారాలు ఉండవు
త్యాగం ప్రేమ , ఉదాసీనత , దైవం పై అమితమైన విశ్వాసం ,,  ఆసక్తి, చోటు చేసు కుంటా యి,
ఆ గోవిందుని కళ్ళారా  చూడాలి ,సేవించాలి ,అన్న గొప్ప ఆకలి పుడుతుంది
ఆ వేంకటేశ్వరా స్వామిని తనివార దర్శించే వరకూ మనసు వేరే ఇతర పై నిలువదు
అన్నం రుచించదు
నిద్ర రా దు
ఇది తినాలి,ఇది కావాలి ఇటు వెళ్ళాలి ,చూడాలి అనిపించ దు
ఎందుకంటే ఆదిదేవుడు మనసులో కొలువై ఉంటే , అన్నీ ఉన్నట్టే కదా
    దైవాన్ని దర్శించాలని ఉండే ఆకలి కి కూడా తీరేది కాదు ,ఎంత చేసినా  తృప్తి కలగదు,
ఈ దేహమే ,దేవాలయం గా , తన ఆత్మలో కొలువై ఉన్న దైవమే దేవుడుగా భావించే స్థాయికి ఎదిగే వరకూ ,ప్రయత్న లోపం జరుగకుండా అప్రమత్తత తో  అత్మ సమర్పణ ,చేసుకుంటూ ,ఆత్మ విచారణ , కొనసాగిస్తూ నే ఉంటాడు భక్తుడు
  ఆలయం చుట్టూ ఎన్ని సార్లు,ఎన్ని మార్లు ప్రదక్షిణ ముల చేసినా
తృప్తి ఉండదు
  ,,ఆ" ఆకలి" తీరదు , ఎందుకని?
నోరు నొవ్వంగా ఎన్ని రోజులు ఎన్ని భజనలు ఎన్ని కీర్తనలు పాడిన తృప్తి కలుగదు
ఆ ఆకలి తీరదు ఎందుకని?
సాలగ్రామ శిలా మూర్తి గే వెలసిన స్వామిని ఎంత చూసినా,ఎన్ని సార్లు చూసినా  ఎన్ని సాష్టాంగ ప్రణామం చేసినా ,,,తనివి తీరదు
ఎన్ని ప్ ప్రదక్షిణ లు చేసినా కాళ్ళకు నొప్పి పుట్టదు కదా
ఈ ఆకలి తీరదు ఎందుకని ?
ఎన్ని సార్లు, ఎన్ని రోజులు స్వామి అఖండ నామ సంకీర్తనలు, నాద నీరాజనం భక్తి గీతాలు వింటున్నా ,చెవులు తనియవు,  తిండి నిద్ర మరచి , లెక్కచేయకుండా ,,ఈ చేతులతో   శ్రీహరి భజనలు చేస్తూ ఉన్నా కూడా ,
మనసు నిండదు ఈ ఆకలి తీరదు ఎందుకని
,దాహం వేస్తే నీళ్ళు త్రాగుతూ,ఆకలి వేస్తే ఆహారం తిని  తృప్తి పడవచ్చు
కానీ  సర్వేశ్వరుని ,సర్వాంతర్యామి తత్వాన్ని గ్రహించడానికి ఉండే ఆర్తి ,ఆరాధనలు అనబడే ఆకలి తీరేది కాదు
  ఈ ఆకలి రుచి తెలిసిన వాడికి ఇక వేరే పదార్థాల వాసన గురించి ఆలోచించడు
ఇదే తన జీవిత లక్ష్యం
ఇదే జీవిత పరమార్థం
ధ్యేయం ,గమ్యం కూడా  ఇదే
  జీవుడికి ఉండాల్సిన ముఖ్య లక్షణం , దేవుడి గురించి భావించే ఆకలి వేయడం ,
అన్నమయ్య సినిమాలో, చూస్తాం భక్తి అనబడే ఆకలి  స్వరూపం
తిరుమల యాత్రికుల బృందం తో ,  వెళ్తూ ఒక చోట మజిలీ చేసిన భక్త బృందం ,భోజనాలు చేస్తూ ఉంటే అన్నమయ్య  చూస్తూ ఉంటాడు
నారదుడు ఒక సాధువు వేషం లో వచ్చి
నాయనా వారంతా  భోజనం చేస్తూ ,,ఆకలి తీ ర్చు కుంటు ఉన్నారు కదా వారం రోజులు గా పస్తులు ఉంటూ ఏమీ తినకుండా ఉంటున్నావు,
అలసట వేయడం లేదా
ఆకలిగా లేదా
స్వామీ , ఆకలి గా ఉంది ,
కానీ ఈ ఆకలి కాదు ఆ శ్రీనివాసుని , ఆ ఏడుకొండల స్వామిని దర్శించాలి అని ఆకలిగా ఉంది
అని పరమాత్మను చూడాలన్న  తన ఆవేదన తెలియ జేస్తాడు,
    ఎంత అమాయకం నీది,? నాయనా,
ఇలా ఉపవాసాలు చేస్తూ,స్వామిని దర్శిం చే లోగా  ఈ అసలు శరీరమే పోతే ఎలా చెప్పు.
   స్వామీ అసలే పోయినా అంతా పొయినా ,నా స్వామి  దర్శనం  అయ్యేవరకు పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టను
అని బదులు ఇచ్చిన జవాబు, నారదుని కి మహదానందం కలిగిస్తుంది
  అన్నమయ్య భక్తి తత్పరత కు సంతోషించి , స్వయంగా తాంబూర వాయిద్యాన్ని బహుకరిస్తాడు
అలా అన్నమయ్య కు గల వేంకటేశ్వర స్వామి భక్తికి అంకురార్పణ  చేస్తాడు ,బ్రహ్మ మానస పుత్రుడు నారదుడు
పరమాత్ముని సన్నిధానం చేరుకోవాలని ఆరాటపడే జీవుడి బలీయమైన ఆకలి ని కూడా
దైవానుగ్రహం కటాక్షించే  దేవతగా కీర్టింపవచ్చును కదా
స్వస్తి _!
హరే కృష్ణ హరే కృష్ణా _!"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...