Saturday, July 25, 2020

శివ యోగి తత్వం

Jul 6, 2020
"శివ యోగి తత్వం _
  నిర్వాణ షట్కం _!"
 
_____&&&______
1__ మనో ,బుద్ది ,అహంకార_ చిత్తమును కాను _!
చెవులు నాలుక ,నాసికను_ కాను  నేను_!
నింగి,  ప్రకాశ, వాయువు ను_ నే కాను _!
చిదానంద రూప  శివ
పరబ్రహ్మను నేను_!

2___
ప్రాణమును కాను_  !              పంచ ప్రాణాలు కాను _!
సప్త ధాతువులు_ పంచ కోశాలు కాను_!
వాక్కునూ ,అవయవ, పాయూవస్ట కాను _!
చిదానంద  రూప శివ
పరబ్రహ్మ నూ _ నేను _!

3__
రాగ ద్వేష లోభ _
మోహము ను కాను _!
మదమును కాను__!
మాత్స ర్యము కాను _!
ధర్మార్థ కామ మో_
_క్షము ల నూ  కాను _!
చిదానంద రూప  శివ  పరబ్రహ్మను నేను _!"

4__
     పాప పుణ్యము కాను_! దుఃఖ సౌఖ్యము కాను_!
మంత్ర తీర్థము  _వేద_ యజ్ఞాలు  కానూ _!
భోజనము ,భోక్తను _
_భోజ్యమును కాను_! చిదానందరూప  శివ
పర బ్రహ్మము నేను _!""

5__
  మృత్యువు , శంక ను,
జాతి బేధము కాను _!
తలి దండ్రి కాను_
_ జన్మము ను కాను _!
బంధు మిత్రుల కాను_!
గురు శిష్యులు కాను _!
చిదానంద  రూప శివ
పరబ్రహ్మ ను నేను _!

6__
  నిరాకార _నిర్గుణ_ స్వరూపాన్ని నేను_!
సర్వత్ర_ సర్వేంద్రియ_
వ్యాపకుడ నేను _!
బంధ ముక్తులు లేని_
సమత్వ భావకుడ_!
చిదానంద శివ _
పరబ్రహ్మను నేను_!
   శివుడను నేను _!
  శివ యోగిని నేను_!

శివాయ గురవే నమః_!
స్వస్తి _!"
హరే కృష్ణ హరే కృష్ణా _!""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...