Sunday, September 13, 2020

కరోనా దుమారం

Sept 11, 2020
_!"హలో , ,హలో _!
ఎవరూ మాట్లాడేది ?
ఓహో నీవా _?, నరేష్_! బావున్నా వా ? మీరు, మీ భార్యా పిల్లలు  బావున్నారా _?
ఏమిటీ విషయం ,? నాకు ఎందుకు ఫోన్ చేశావు ?
ఏమిటీ ,? ,మన  దగ్గర బంధువు లక్ష్మన్ __ ఆయన !.  మొన్నటివరకు మనమంతా  కలిసి ఉన్నాం.  కదా _?
పాపం ,,ఆయనకు వచ్చిందా కరోనా ? నిజమా  ?  అయ్యో ,పెద్దాయన __!  కాస్తా కనిపెట్టాలి మనం వారిని _!
_! నాకు  ఇపుడు నీవు చెప్పే దాకా  ఆ విషయం తెలియదు సుమా _!
  మేము  అతడితో ఎక్కడికి వెళ్ళాం _?
మేము  వెళ్ళలేదు   _! నాకు ఈ ఉద్యోగం తో నే బిజీ _!
అసలు ,,ఒక ఆదివారం తప్ప తీరిక ఉండదు కదా_ ఎక్కడికైనా పోవడానికి _!""
ఇవి అసలే కరోనా రోజులు _!""
సరే ఇంతకూ అసలు విషయం చెప్ప నే లేదు నీవు _! ఎందుకు ఫోన్ చేస్తున్నావో _?
ఏమిటీ,? నాకు వచ్చిందా కరోనా ? అని ఎవరు చెప్పారు _?
నీ కు 
  _తెలిసిందా  ,ఎవరో అనుకుంటే _??
__మా బంధువు ఎవరికో   __ కరోనా సోకితే , వాడికి సంబంధించిన చుట్టాలు అయినందుకు మాకు  అందరికీ వచ్చినట్టే ,అనుకున్నావా _?
భలే చిత్రంగా ఉంది ,__నీవు ఈ మాట చెబుతూ ఉంటే _!
ఆ ఫంక్షన్ కు వెళ్ళిన వారికందరకు వచ్చింది ,అంటావా _?
__వస్తే రావచ్చు _!కానీ ,మేము వెళ్ళలేదు కదా _! అయినా వస్తుంది అంటావా _? _?
ఎందుకురా బాబూ నీకు, ??
, మా సంగతి మేము చూసు కోమా _?
_అయినా నాకు ఎందుకు ప్రత్యేకంగా ఫోన్ చేసి  చెబుతూ ఉన్నావు ,_? ఎందుకింత ప్రేమ మా మీద పుట్టింది నీకు _??
_ నీవు చేసే ఫంక్షన్ కు రావద్దు అని చెప్పడానికే ఫోన్ చేస్తున్నావా ,_? మంచిదే _!
, నీ జాగ్రత్తలో నీవు ఉండడం  ,బావుంది _!;
కానీ నాకు కరోనా వ్యాధి వచ్చిందని  నీకు  చెప్పింది ఎవడు ?
__ఇపుడు ఇదంతా ఈ విషయం చాటింపు చేసి పది మందికీ  చెబుతున్నా వు  కదూ _!
__ఇందువల్ల   నీకు ఒరిగిం ది ఏమిటీ చెప్పు _?
ఓ సాడిస్టూ _!
ఇలా  ఫోన్ చే యడం వల్ల మేము బాధ పడుతామని  _ తెలియనంత  అమాయకుడ వు కాదు కదా నీవు ?
  ఇది మా ఆఫీస్ టైం _! ఈ  టైమ్ లో నీవు చేసిన ఫోన్ కాల్ విని __ మా స్టాఫ్ అందరూ నాకు కరోనా వ్యాధి సోకిందని __భయంతో నన్ను  బయటకు  తరిమి వేస్తారు అని నీకు  తెలియదా _?
నా భార్య కూడా నన్ను  ఇంటిలోకి   రానీయ దు __ అని నీకు  తెలియదా _?
__హాస్పిటల్ లో కూడా ఉండనీయ ని  దిక్కుమాలిన రోజు వచ్చిందని తెలియదా ?__
__ గతంలో  ఎవరైనా ,తమవారు  బాధపడ టం  తెలిస్తే  తనవారు వచ్చి  ఆదరించి,, కష్ట సుఖాలు తెలుసుకొని  వెళ్ళేవారు _!"
, ఇప్పుడు కాకికూడా, ఒక ఇంటినుండి మరో ఇంటి పైకి వాలని దుస్థితి దాపురించింది అని నీకు  తెలియ కుండా ఉందా  ,చెప్పు ,?""
నిజం తెలియకుండా , ,నీకు సంబంధం లేకున్నా ,ఇలా   తప్పుడు ప్రచారం చేస్తూ ,సమాజం నుండి   నన్ను ఇలా దూరం చేయడం,మనిషి బ్రతికి ఉండగా నే   మానసిక హింసకు గురి చేస్తూ నిలువునా   చంపేయడం  ,_ నీ లాంటి దగ్గరి  బంధువు_, మనిషి అయినవాడు  చేసే పనేనా చెప్పు  _!?
అసలు
నీ మెదడు   సరిగా పని చేస్తోందా ,లేదా _? అన్నది నా అనుమానం _!
వాస్తవం తెలుసుకోకుండా ,అనవసరం గా ఫోన్ చేసి ఇలా  బాధ పెట్టడం
తప్పు అని   తెలియడం  లేదా  నీకు _?
__ఫోన్ ఖర్చు  ఎలాగూ తగ్గిందని ,ఎదో ఒకటి ,ఎవరో ఒకరితో  ,నాన్ స్టాప్ గా మాట్లాడుతూ ఉండడం , ఎదో ఒకటి వాగుతూ ఉండడం ,  కరోనా వ్యాధి లక్షణం లో ఒకటి గా   మారి పోయింది,,_ ఏ పనీ బాధ్యతా లేని  నీ లాంటి   వెదవ లకి _!
__""హలో _! నీవు చెప్పింది నేను  విన్నాను పూర్తిగా_!!"
ఇపుడు నేను చెప్పేది కూడా నీవు విను ఓపికగా  _!
నాకు కరొ నా వచ్చిందని, ఏ గాడిద అన్నాడో ,,నీవు పుట్టించావో నాకు   తెలియదు కానీ ,,
__ ఇపుడు ఉల్టా ప్రచారం గా ,, నీవు నాకు  చెప్పినట్టే ,నేను కూడా నీకు  అదే కరోనా వ్యాధి ఉందని  నీ వాళ్ళకి చెబితే నీ పరిస్తితి ఎలా  అవుతుం దో  కాస్తా  గమనించు _!
ఏదైనా తన దాకా వస్తె గానీ,,ఇలాంటి సీరియస్ విషయాలు  తెలిసి రావు కదా _!
__ హలో ,చేసిందంతా చేసి,   నాకు "సారీ " అని ఒక్కమాట చెబితే సరిపోదు _!  దేవుని ఫోటో ముందర నిలబడి ,గట్టిగా రెండు
చెంపలు వేసుకోవాలి _ ,నీవు ,,ఇకముందు ,ఇలాంటి పిచ్చి మాటలు ఎవరితో కూడా  మాట్లాడ కూడదు అని _!
__ బంధువు  అంటే అర్థం  ఆత్మీయుడు _!
పరిస్థితిని అర్థం చేసుకునే వాడు _!
కానీ నీలాంటి వాడు బంధువు కాదు ,రాబందువులు ,
బ్రతికి ఉండగా పీక్కు తినేవాడు _!
చీ చీ  రోత పుడుతోంది ,,నీతో మాట్లాడుతూ ఉంటే _!_;  బంధువు అన్నవాడు  ,సహాయం చేయాలి ,_! వచ్చిన ఆపద ను  తొలగించే ప్రయత్నం చేయాలి _!,  బాధ్యత తో  తగిన జాగ్రత్తలు చెప్పాలి __!
కానీ   ఏ మాత్రం సామాజిక స్పృహ లేకుండా,, మూర్ఖంగా ఇలా ప్రవర్తిస్తారా చెప్పు _??".
ఎవరితో కూడా  ఇలా  ఫోన్ చేసి ఆటలాడు తూ తమాషా చేయవద్దు, సుమా _!
జాగ్రత్త _!
నిజానికి
నీ మీద పోలీస్ కేస్  పెట్టాలి
కానీ  నీ  భార్యాపిల్లలను. దృష్టిలో ఉంచుకొని  నిన్ను ,క్షమించి వదిలేస్తూ ఉన్నాను _!
__ మళ్లీ నాకు నీ మొహం చూపించకు _!
ఇక ముందు  పొరబాటున కూడా
నాకు ఫోన్ చేయకు
తెలిసిందా _!
ఇక
పెట్టేయ్ ఫోన్   _!
బద్మాష్ _!
    భగవంతుడా ,,ఈ రోజున నన్ను ఈ కరోనా దుమారం లో చిక్కుకొనకుండా  బ్రతికించావు ,
పెద్ద  ప్రమాదం తొలగించి  ,
రక్షించావు కదా _!
స్వామీ,పుకార్లు వింటేనే ఇంత భయం అనిపిస్తూ ఉంది
ఇక నిజంగా జరిగితే?
అమ్మో _!
అది తలచుకుంటే నే వణకు పుడుతోంది _!
  ""హే  పరమాత్మా   _! ఇంకా ఎన్నాళ్ళు  మాకు ఈ అగ్ని పరీక్ష _?
ప్రభూ _!!
ఈ దుష్ట  కరోనా మహమ్మారి బారిన పడకుండా,,నన్నే కాదు, అన్ని దేశాల్లో ని ప్రజలను ,,  అందరినీ కాపాడు _ తండ్రీ _!
ప్రపంచంలో మానవాళిని పట్టి పీడిస్తూ __ చంపుతూ ఉన్న__ ఈ కరోనా వ్యాధిని_ భూమిపై నుండి ,, శాశ్వతంగా తొలగిం చు పరమేశ్వరా _!
పాహిమాం , రక్ష మాం _!
శరణు శరణు శరణు_!
   స్వస్తి _!
హరే కృష్ణ హరే కృష్ణా _!""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...