Thursday, November 12, 2020

""మేథో మథనం _!"

Sept 22, 2020
"మనిషి అనేవాడు మనస్సు  అనే ఇంధనంతో  జీవిస్తూ ఉంటాడు _!
కేవలం ప్రాపంచిక దృక్పథం తో చూస్తే  __మనస్సు కు ఉన్న  పటుత్వం సడలి పోతుంది _!
అప్పుడు మనిషి సగటు మనిషిగా నే మిగిలి పోతాడు _!
కానీ ఎపుడైతే 
అదే మనస్సును  ,పరమార్ధం వైపు మళ్ళిస్తు ఉంటాడో ,__ అతడు  ఉన్నతమైన , ఉత్కృష్టమైన  స్థాయి గా ఎదిగి పోతూ  ""మనీషి  ""
గా    దివ్యమైన ఆత్మ ప్రకాశం తో   ,, ఒక యోగి రాజు లా ,వివేకానంద  స్వామి వంటి , సమున్నత ఆధ్యాత్మిక వేత్తగా , వైతాలికునిగా , సమాజ ఉద్దరణకు సిద్దం అయిన సంఘ  సంస్కర్త గా  ప్రభవిస్తూ ఉంటాడు __!
__మనసు కు  కూడా  స్వరూపాలు దేవుని వలె అనంతము ,_!
ఏ  రూపమై నా కూడా  ఇట్టే _క్షణంలో మారుస్తూ,, అవే గుణాలు  మనిషి శరీరంలో  ఉద్దీపన చేస్తుంది ,_!
  ఎక్కడో అమెరికా లో ఉన్న సోదరుని గూర్చి ఆలోచిస్తూ అతడి ఆకారాన్ని స్వభావాన్ని పొందుతూ ,తన అంతరంగంలో సోదర ప్రేమను నింపుకొని ఆనందాన్ని పొందగలిగె అద్భుతమైన , అసాధారణ మైన శక్తి __ మహత్తు , దైవిక శక్తి ,,మనిషి లోని మనసుకు ఉంది _!
అందుకే మహాత్ములు _  ఋషులు , సనాతన కాలంలో తమ   త పః  ప్రభావం తో , పొందిన  అద్భుత శక్తితో ,,దివ్యదృష్టి తో __"ఎక్కడ ఏం  జరుగుతుందో , కళ్ళు మూసుకొని యోగ ప్రక్రియ ద్వారా ,  తాము , ఉన్న చోటు నుండి  కదలకుండా  గ్రహించేవారు  _!
అందుకే మనసు  చెడు భావిస్తే __ దెయ్యమై పీడించ గలదు ,
దైవ స్వరూపంతో   పరమాత్మను ఆరాధిస్తే _  జీవుడిని , నేరుగా దేవుడి  పరమ దామాన్ని  చేర్చ గలదు_!
   అంతట మహిమా న్విితమైన , అద్భుత అమోఘమైన శక్తి చైతన్య ప్రభావం గల  ,మనసుని నియంత్రిస్తూ   ,శిక్షణ అందించే నేర్పు మనిషిలో  ఉండాలి _!""అంటే,,   అతడి  ఆధ్యాత్మిక జ్ఞానం  మాత్రమే   ఆ పరమావధి ని సాధించగల దు  _! దానికోసం__  గురు కృప , సద్ గ్రంథ శ్రవణ పఠన అధ్యయనాలు అత్యావశ్యకం _!!
ఆ విధంగా మనసు ఏది భావిస్తే మనిషి  క్షణంలో , ,ఆ స్వరూపంగా మారి పోతూ ఉంటాడు _! ఉదాహరణకు ,, అదుపు చేయలేని , కోతి చేష్టల స్వభావం కలిగిన మనస్సు చేసే దుష్ఫలితాలు  గురించిన   అందరికీ తెలిసిన  చిన్న కథ _!!
___ఒక బాటసారి    ప్రయాణంలో అలసిపోయి ఒక చెట్టు నీడన విశ్రమిస్తాడు ,
", అయ్యో  _! నాకు దాహంగా ఉంది కొన్ని మంచినీళ్లు ఉంటే బాగుండును ,""! అనుకున్నాడు
__వెంటనే  పెద్ద పాత్రలో  చల్లని  స్వచ్చమైన నీరు అతడి ముందు  అగుపడింది , _!
అతడికి ప్రాణం లేచి వచ్చినట్టు గా అనిపించి
""ఆహా_!  అనుకుంటూ ఆ నీరు   తాగి   దాహం తీర్చుకున్నాడు _! అలసటతో చెట్టు నీడన
పడుకున్నాడు ,,,కాస్సేపటికి లేచి చూసేసరికి , పొద్దు పోయింది ,_!
అతడికి ఆకలి  వేసింది _!
""ఏవైనా తినడానికి దొరికితే  బావుండును __!"",అని  తలంపు రాగానే ,,చటుక్కున  ఎదుట   పళ్ళెంలో చక్కని ఆహారం తయారుగా కనిపించింది ,
__ బాటసారి ఆనందంతో ఆరగించి ఆకలి తీర్చే సుకున్నాడు
,  __ఇప్పుడు అతడికి తెలిసిపోయింది ,తాను కూర్చున్నది కల్ప వృక్షం చెట్టు క్రింద అని ,_ ఎది కోరితే అది ఇస్తుందని _!!"
ఇంకేం ,మనసు సంతోషంతో    పొంగి పోతూ ఉండగా , ""పడుకోడానికి మంచం , చక్కని ఇల్లు దాసీ జనం__"" ఇలా ఏది అనుకుంటే అవి ప్రత్యక్ష మౌ తూ ఉన్నాయి _!
  ఎదురుగా ఒక నౌకరు అతడికి వింజామర తో వీస్తు ఉంటే ,  బాటసారికి  అకస్మాత్తుగా  భయం వేసి ,,,వీడు   దెయ్యం గా మారి నన్ను 
చంపేస్తాడే మో _!?"",అన్న  భావన రావడం ఆలస్యం ,__వెంటనే , అలా జరిగి పోవడం  ,అంతా క్షణాల్లో జరిగి పోయింది _!
__ అంత వేగవంతంగా ఉంటుంది మనసు యొక్క సంచలన తీవ్రత ,_!;
వాయు వేగం కంటే  ఎన్నో రెట్లు అమిత వేగం తో  ప్రయాణించే అసాధారణ శక్తి గలది మనిషి లో ఉన్న మనసు _!
మనసుకున్న శక్తిని బట్టి మూడు గుణాలు గా  అది వర్తిస్తూ ఉంటుంది _!
_1_ మంచి  మనసు కలవాడే మనిషి __ అది సత్వ గుణం
_2__ అమితంగా  కోరికలు తీర్చుకునే  విధంగా  మనసు చరిస్తూ ఉంటే , ఆ మనిషి రజో గుణ సంపన్నుడు అవుతాడు
  _3 _ ఇక కోపము ద్వేషము పగ ప్రతీకారము ,శాడిస్టు లాంటి  రాక్షస ప్రవృత్తి తో హింసా మార్గంలో _ మనసు చలించే  ప్రకృతిగలవాడు __తామస గుణ ప్రధానంగా సంచరిస్తూ ఉంటాడు  అని
ఈ విధంగా మనిషి  ఈ  మూడు గుణాలతో తయారు చేయబడుతా డు  అని గీతాచార్యుడు భగవద్గీత లో   చక్కగా  వివరించాడు _
__ ఆ విధంగా ,_  మనసు ఆకలి ని భావిస్తే ,దేహానికి ఆకలి స్పురిస్తూ ఉంటుంది ,_!  మనసు  వేరే ధ్యాసలో లేదా పనిలో ,గానీ  పడితే మనిషికి  ఆకలి వేయదు _!
అలాగే దాహం గా ఉండడం , కూడా వేయదు కదా  _!
ఈ విధంగా  మనిషికి  ""ఏదైనా చెయ్యాలి ,,,తినాలి ,, ఎటైనా   వెళ్ళాలి  _!"",అనుకునే   ఏ పని అయినా మనసు తోనే జరగాలి ,,_!"
నిద్రావస్థ లో _ ఈ చంచల మైన  మనసు ఆత్మలో లయం అయిపోతుంది ,_!! ఈ దశలో ,,దానికి ఉనికి ఉండదు _!
__ అదే అఖరు నిద్ర అయితే ఇక "మనసు " అనేదే ఉండదు _!
  అదృష్టం ఉండి, నిద్ర నుండి మేల్కొని లేస్తే__ చాలు  ,వెంటనే మనసు కూడా లేచి ,,   ఎదుట కనిపించే ప్రతీ పదార్థం,పరిసరాలలో తానే ఆవేశించి ,తన ప్రతిభను చాటుతూ"" ,నేను ఉన్నాను ,నాకు ఇది కావాలి ,__!""అంటూ తన అస్తిత్వం చాటుతూ , ,కోరికల చిట్టా విప్పుతూ పోతుంది _!!   ఈ  మనసుకు  ఒక పేరు ""నేను,", మరో పేరు ""అహంకారము "", ఇతరాలు _""జీవుడు"" అనీ,""ప్రాణము"" అనీ ,, కూడా  భావిస్తారు _!
మనసు  అనేది దేహంలో ని జీవుడి నీ , సదా  ఆశ్రయించి ఉంటుంది  _!,,
కానీ   జీవుడు  ,దేహి  కాదు కదా _!
   శరీరం మరణిస్తే__ జీవుడు దీనిని విడచి మరో శరీరం వెదుక్కుంటూ వెళ్తాడు _!
  అందుకే   ఈ శరీరం ను  ఒక అద్దె కొంప _ అంటారు_!
  దాని ఆయువు తీరితే , , రిపేర్ చేసే అవకాశం కోల్పోతే     జీవుడు ,అంటే మనసు  , మరో బండి ,అంటే వాహనాన్ని ,చూసుకుంటాడు _!!
ఈ మనసు యొక్క  ప్రకృతి ఎంత వికృతి గా,, విచిత్రంగా ఉంటుందో చూడండి _!!,
తన ఆత్మీయుడు ఎవరైనా మరణిస్తే , మనసుకు   ఆకలి నిద్ర , ల పై మనసు పోదు కదా,,_!
  ఎందుకంటే ఆ చనిపోయిన వాడు__ ఈ మనసుకు  చాలా చాలా ఇష్టమైన వాడు ,_! అందుకే  , అంత తొందరగా  తిరిగి రాదు ,_! వేరే స్థితి పై మనసు పోదు _!
పరధ్యానం లో పడి పోతాడు _!
   తాను  ఇష్టపడితే , అంటే  దానిపై మనసు పడితే ,,  గట్టిగా  పట్టుకుని   విడిచి పెట్టదు _!
ఇక  దానికి ఇష్టం గానీ  లేకపోతే ,  మనసు లగ్నం కాకపోతే , దాని జోలికి పోదు కదా _!   పరమ అసహ్యం గా చూస్తుం ది
__"" నాకు ఇది కావాలి ,ఇది తినాలి __!",అనిపించ  క పోవడానికి 
కారణం __మనసు వాటి గురించి ఆలోచన చెయ్యడం లేదు  _!
  అన్న మాట__ _!!"మన  ,గీతాచార్యుడు__ శ్రీకృష్ణ భగవానుని అద్భుతమైన  ఉపదేశ సారం  కూడా ఇదే _!"
""  నీ మనసే నీకు శత్రువు_!, మితృవు కూడా_! _!
యద్భావం తద్భవతి ,__! అన్నట్టుగా
!_"" భాగ్యం కానీ __దరిద్రం కానీ కేవలం భావన తోనే ముడిపడి ఉంటుంది _!!
  ఒక్క"" తలంపు"" తోనే  సకల  జగత్తు  స్పురిస్తు ఉంటుంది,_!
సృష్టి మొత్తం , మనసుతో పుడుతుంది __! మనసుతో స్థితి పొందుతుంది ,_!అదే _మనసులో లయం అవుతుంది , __! కావాలంటే పునః  ఆవిర్భవిస్తుంది _!!
__ మనసు లేని మనిషి పిచ్చి వాడు గా పరిగణింప బడతాడు  కూడా _!!"
"" ఆ  అబ్బాయి  నల్లగా ,వికారంగా  ఉన్నాడు  _! అతడిని నీవు ,ఎలా మెచ్చావ్ _?! ఎలా  ప్రేమించావే , పిచ్చి దానా _?!"" అని  పొరబాటున ఎవరైనా ఒక యువతిని   అడిగితే ,, వెంటనే , ఆమె అంటుంది  కదా _!
ఓ తాతా _!
""నా కళ్ళు పెట్టుకొని  చూడు_!; అతడు   నీకు ఎంత అందంగా కనిపిస్తూ  ఉంటాడో  ,,అప్పుడు   తెలుస్తుంది _ నీకు !; అని అనందంగా జవాబు వస్తుంది __!
అందుకే _""తాను మెచ్చింది రంభ _!
తాను మునిగింది గంగ _!"
అంటారు ,
అది నా  మనసుకు ఇష్టం  అయ్యింది _! అంతే _!!"" అడగడానికి నీవెవరు _?!"
ఇలా ఉంటాయి మనసు చేసే పిచ్చి చేష్టలు  కొంటె పనులు _!"_;""
ఎందరు మనుషులను_' మన చుట్టూ  చూస్తూ ఉన్నామో ,__అన్నిరకాల భిన్నమైన  మనసు లను  తత్వాలను  కూడా చూస్తూ ఉంటాము
""లోకో భిన్న రుచిః _!  అంటారు ప్రాజ్ఞులు  _!,
  మనసు ప్రవర్తించే తీరు గురించిన మరో  చిన్న కథ _!! చూద్దాం
___
ఒక గ్రామంలో , ఒక  గృహస్థు,, సంసారం  లో బాధలు పడలేక_ విరక్తి తో ,   యోగిగా   బ్రతకాలని నిశ్చయించు కుని _ ఇంట్లో చెప్పకుండా   బయట పడి ,వెళ్ళి ,,ఒక సాధువు ను ,,కాళ్ళా వేళ్ళ పడి__ బతిమాలి _ ఎలాగో  ఒప్పించి ,, అతడి ఆశ్రమంలో చేరాడు
  కొన్ని రోజులు ఆశ్రమంలో ఉన్న కట్టుబాట్లు  ,పాటిస్తూ , సన్యాస జీవితం   సాగించాడు __!
  రాను రానూ, ఇప్పుడు ,,, అతడికి సంసారం కంటే సన్యాసం కష్టంగా  అనిపించింది, _!
అంతా మౌనం_! ధ్యానం , జపం _!
, వేరే మాటలు లేవు _!!,ధ్యానం లో ఉంటే భార్యా పిల్లలు తరుచూ  గుర్తుకొస్తు  మనసు  వికలం అవుతూ ఉంటే ,పాపం , అతడు  కుదురుగా ,ప్రశాంతంగా ఒక చోట  ఉండలేక పోతున్నాడు ,,_!
ఇది గమనించి _ ఆశ్రమంలోని  ,ఒక  సన్యాసి అడిగాడు _ అతడిని __!
""ఎందుకు నీవు  ఈ ఆశ్రమంలో చేరావు ?""
    ""ఏం చేయను నేను  _?! భార్యా పిల్లలతో , ఇంట్లో ఉంటే, రాత్రి పగలు  మనసుకు ,దేహానికి  విశ్రాంతి లేకుండా  నేను పని చేయాల్సి వస్తోంది అక్కడ__!"" _ విసుగు వచ్చింది ,_! అందుకే తప్పించుకొని  పారి పోయివచ్చాను నేను _!  అన్నాడు ,
""పని తప్పించు కోడానికి ఇక్కడ చేరావా ,_?!""
  _""అవును ,ఇక్కడ  హాయిగా ఉంది నాకు ,_!!""
  ""ఏ పని చేయకుండా  ఇలా ఉండడం  నీకు బావుందా _?!
   " అవును మరి__! ఏ రంధి లేకుండా  , వేళకు కమ్మగాతింటూ  హాయిగా  నిద్ర పోవచ్చు కదా ఇక్కడ  _!  పైగా ఎవ్వరూ ఏమీ అనరు కూడా _!""
అన్నాడు
  ""ఈ ఆశ్రమం ముఖ్య ఉద్దేశ్యం నీకు తెలుసా ?_!""?
_  గురువు గారు  నాకు ఏమీ  _చెప్పలేదు  మరి _!""
  __""ఈ రోజు వారు మరొక ఆశ్రమానికి వెళ్తున్నారు__ వారు తిరిగి  వచ్చాక _ అప్పుడు నీకు తెలుస్తుంది_!""
అని వెళ్ళాడు
  ఆత ని మాటలు ,మన ఈ సంసారి కి ఏమీ అర్థం కాలేదు ,
__  సాధారణంగా , గురువు గారు ఆశ్రమం లో ఉంటేనే__ వంట చేస్తారు _!
  ఆయన లేనప్పుడు ఉపవాసంతో సమాధిలో ధ్యాన ముద్రలో_  గడుపుతారు శిష్యులు _!
  ఆ రోజు  ఉపవాసంతో గడిచింది _!
మరుసటి రోజున సాయంత్రం వచ్చాడు గురువు గారు__!
  ఆయన జపము తపము ముగిసే సరికి రాత్రి అయ్యింది
__మనవాడికి   కడుపులో ఎలుకలు పరుగెడుతూ ,ఆకలికి నక నకలాడి పోతున్నాడు  __
శోష వచ్చి పడి పోతున్నాడు కూడా _!!
చివరకు గురువు గారు__ రాత్రి  భోజనానికి  వచ్చి  కూర్చున్నాడు _!
పదార్థాలు వడ్డించారు అందరికీ _!
ఈ శిష్యుడి కి _ విస్తరిలో వడ్డించిన  అన్నం చూస్తూ__ తినకుండా  ఉంటే __  ప్రాణం లేచి పోతోంది ఆకలికి ,_!
__గురువు గారు భోజనం ప్రారంభం చేస్తెగాని __ ,శిష్య  బృందం తినడం కుదరదు __!
అది నియమం _!
అటూ ఇటూ  తేరిపార చూస్తూ,  చేతిని విస్తరిలో  పెట్టకుండా దిక్కులు చూస్తూ ఉన్న గురువు గారిని  అడిగాడు ఉండబట్టలేక _!!
_""అయ్యా__; మీరు నిన్నటి నుండి ఏమి తిన లేదు కదా __!!,మీకు ఆకలి వేయడం లేదా _??" ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నారు _??""
ఆయన అన్నారు _
నాకు ఆకలి ,లేదు _!""
   కానీ ,నాకు మాత్రం  విపరీతంగా ఆకలి వేస్తోంది స్వామీ,_!!""
  ""  ఏమిటి, భోజనం చేయకుండా ఉండలేవా రెండు రోజులు?""
""  అమ్మో ,ఇక ఒక్క నిముషం ఆలస్యం అయితే చచ్చి పోతాను _ స్వామీ _!""
అయితే  ఆలస్యం ఎందుకు _??  చావు _!""
అన్నాడు ,
_""అదేమిటి స్వామీ __ అలా అంటున్నారు __??""
__" బ్రతుకు మీద మనసు రోసి__   నీ భార్యా పిల్లలు  ఎవరు లేరు అనుకుని_ వైరాగ్యం తెచ్చుకుని , అన్నీ విడిచి ,,ఇక్కడికి  వచ్చాక కూడా  ,ఇంకా నీకు  తిండి పై  యావ పోలేదు ,_!!
భగవద్ ధ్యానం లో   ఉంచే బదులు.  నీవు నీ మనస్సును , ఎక్కువగా ఆకలి పైనే  లగ్నం చేస్తున్నావు ,,_!
ఇంద్రియాలను చిత్తాన్ని మనసును ,దేహాన్ని  అంతః కరణం అదుపులో ఉంచుకోలేని. నీవు ఈ ఆశ్రమంలో ఉండటానికి అనర్హుడ వు   ,_!!  వెళ్ళి పో,,నాయనా __!""
అంటూ బయటకు  పంపించాడు _!
    అందువల్ల , ఈ చిత్ర విచిత్రమైన స్వభావం గల  మనస్సును నిబ్బరం చేసుకోవడం,    కట్టుబాటు లో ఉంచడం ,, సామాన్య విషయం కాదు _!
ఎంతో  సాధన  చేయాలి _!
భగవద్గీత గ్రంధాన్ని  నిరంతరం  అధ్యయనం చేసేవారికి ,వారి  మనసుని ,కొంత వరకు తమ ఆధీనంలో ఉంచగలిగే సౌలభ్యం ఉంది
__కళ్ళ ముందు జరిగే పరిణామాల ను సాక్షిగా చూస్తూ ఉండడం ఒక పరమ , యోగి _ ఉత్తమ సాధకుని లక్షణం_!!
      నిజానికి సంసార జీవితంలో   ఉండే భోగాలు అనుభవిస్తూ    హాయిగా గడపడం చాలా సులభం_గా భావిస్తాము !""
ఎండమావుల వంటి ,  ఆ సుఖాల కోసం ,అదే శాశ్వతంగా భ్రమిస్తూ ,భావిస్తూ ,వాని వెనుక దాగిన కష్టాలను, ఎంత ఘోరంగా అనిపించినా కూడా ,మనసు పెట్టీ ,ఎంతో  ఇష్ట పడుతూ   ఉన్నట్టుగా నటిస్తూ  ఉంటాం _!, ,అదంతా పరమేశ్వరుని   కృప గా  కృతజ్ఞత చూపకుండా ,  అజ్ఞానంతో  జీవితాన్ని వ్యర్ధం , చేసుకుంటూ  ఉంటాం _!
__మనసును కట్టుబాటు లో ఉంచకుండా  విచ్చలవిడిగా విడిచి పెడితే  ,,జీవుడికి దుర్గతి పడుతుంది ,
, తన  ఆనంద సాగరం గా , భావిస్తూ ఉంటున్న ఈ  సంసారం లో   నిత్య కర్మలు చేస్తూ కూడా  __కర్మ ఫలం ఆశించ కుండా , నిరాపెక్ష భావంతో యోగిలా , సన్యాసి వలె గడపడం _ అనేది ,  నేటి సాంకేతిక యుగంలో  అత్యంత   కటినతర మైన విషయం _!
__ సన్యాసి సుఖి,సంసారి దుఃఖి అంటారు ,,_!
కానీ ,,
  సంసారం లో ఉంటూ కూడా యోగి లా బ్రతుకుతూ ___ తామరాకు పై నీటి చుక్క లా,విషయ సుఖాలకు  , దేనికీ అంటకుండా ,,,మనసూ శరీరము  దైవ చింతన లో గడిపే వారు  లేక పోలేదు ,
___ అలా ,జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడుతూ  పారిపోయే సన్యాసి కన్నా ,అదే సమస్యల వలయంలో ఉంటూ, భయపడకుండా పోరాటం సాగిస్తూ  ఉంటున్న సంసారి యే ,సన్యాసి కన్నా గొప్పవాడు ,
__ కాకపోతే  , అందమైన సంసార జీవితాన్ని , అందించి ,  మన  జీవితాన్ని  ఆనందమయం చేస్తున్న  ఆ పరమాత్ముని కృపను ఏ  మాత్రం  మరచిపోకుండా__ఉండాలి _!     అనుక్షణం  పరమార్థము యొక్క   పర తత్వాన్ని  గుర్తుచేసుకుంటూ  ఉండాలి _!!, 
ఇంతటి  మహా వైభవాన్ని  దయతో ఉదారంగా ప్రేమతో మనకు   ,అనుగ్రహించిన  ఆ   దైవానికి   సదా  కృతజ్ఞత సమర్పిస్తూ ఉండాలి _!
__ఎంతటి విద్యావంతు డైనా,ఎన్ని క్షేత్రాలు దర్శించినా , పుణ్య కార్యాలు చేసినా ,, గొప్ప పదవిలో ఉంటున్నా ,  మనిషిలో మానసికంగా పరివర్తన  చెందాలి _!
, తన  ఋజు ప్రవర్తన తో  __ఆ  మార్పును , నిత్య జీవనంలో   ఆచరణ  ద్వారా  నిర్వహించే ప్రయత్నం చేయాలి _!
లేక పోతే , అలాంటి వారి వ్యయ ప్రయాసలు డాంబి క జీవన విధానం  __వృథా ,అవుతాయి _!  ఉత్తమమైన
మానవ జన్మ _కూడా వ్యర్ధం అవుతాయి _కదా _! అన్న జీవిత  సత్యం ,, పరమార్థం  ,తెలిస్తే ,,చాలు _!
ఇదే  జ్ఞానం _!
ఇదే ధర్మం _!
ఇదే వివేకం _!
_ఇదే , మానవత్వం _!
ఇదే జీవిత ధ్యేయం _!
ఇదే గమ్యం _
ఇదే పరమాత్మ  అనుగ్రహం కూడా _!
స్వస్తి _!"
   హరే కృష్ణ హరే కృష్ణా _!""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...