Thursday, November 12, 2020

రామ్మూర్తి

Sept 23, 2020
రామ్మూర్తి  ఇక లేడు అన్న విషయం   చాలా   బాధ గా  ఉంది ,
మనకే ఇంత బాధగా ఉంటే ,పాపం. అతడి సతీమణి , 90 ఏళ్ళ పెద్దమనిషి  తండ్రి గారు , శ్రీమాన్ పాపయ  గారు , పిల్లలు ఎంత బాధగా ఉంటుందో ఊహించలేము కదా
జగన్నాథుని సన్నిధిలో  ఉంటూ ,స్వామి కొలువులో పూజా భిషేక  దూప దీప నైవేద్యాలతో   శ్రీవారి సేవకై ,,భార్యా సమేతంగా  కుటుంబ యుక్తంగా  తమ జీవితం   అంకితం చేసిన వేద మూర్తులు పాపయ గారికి  జగన్నాథుని అనుగ్రహం   ఈ విధంగా ఉంటుందని ఎవరమూ ఊహించలేదు
వృద్ధాప్యం లో భార్య పోవడం ,ఇపుడు ఎదిగిన ,తోడు నీడై ఉంటున్నా కొడుకు పోవడం   కష్టంగా ఉంటుంది
తలిదండ్రులు  తమ కళ్ల ముందు పిల్లలు చల్లగా  వర్ధిల్లాలని కోరుకుంటారు , అలాంటి కొడుకు   ,తనను ఇలా  నిస్సహాయంగా విడిచి, తొందర పడుతూ __ఆ జగన్నాథుని లో తన కన్నా ముందే  వెళ్ళి  ఐక్యం కావడం  , అనేది
ఏ తండ్రికి తల్లికి జరగ కూడదు ,
హే జగన్నాథ ,
రామ్మూర్తి  మంచివాడు నవ్వుతూ నవ్విస్తూ  ఉండేవాడు ఉత్తముడు  అలాంటి వాడిని   , తీసేసుకోవడం , నీ హక్కు
నిజమే
కానీ
అతడి పై ఆధారపడి ఉన్న భార్య పిల్లలు  వృద్ధుడైన తండ్రి  బాగోగులు చూడటం కూడా నీ బాధ్యత గా స్వీకరించు  స్వామీ _!
జగన్నాథ ప్రభూ ,
ఇక ముందు నీకు     కైంకర్యాలు , సేవ యాత్రలు ,  పూజలు ఎవరు చేయాలో కూడా  ఆ అనుగ్రహం  నీవే చూడాలి   తండ్రీ
ఎందుకయ్యా మంచివారిని ఎన్నుకుంటావు ,, నీతో సదా  ఉండడానికి  ?
   జగన్నాటక సూత్ర దారీ
  నీ లీలలు కనలేము
తెలియలేము
తండ్రి
నీ రథచక్రాల గమనం ఎటు వైపు ,ఎప్పుడూ ,ఎలా వెళ్తూ ఉంటుందో  ఎవరి కెరుక
ప్రభూ
  అంతా నీదే
కానీ
  రామ్మూర్తి ఆత్మ కు ప్రశాంతత ను
అతడి కుటుంబానికి యోగ క్షేమాలు ,నీ ఆలయ   నిత్య పూజ విధానాలు  ఇవన్నీ చక్కగా   సవరిస్తూ , సంతోషం సంతృప్తిని ప్రసాదించు 
  హే పరమాత్మ
శరణు

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...