Dallas, Sept 22 2019
""మాట్లాడటం "మనిషి కి దేవుడు ఇచ్చిన వరమైతే, "స్వభావం" మాత్రం మనిషి తన జన్మ ఎత్తుతూనే ఒంట బట్టించు కొని వస్తాడు,! అది గతజన్మ బంధం కావచ్చు, కుటుంబ వారసత్వం కావచ్చు, పితృదేవతల దీవ న కావచ్చు,, కానీ, మాటతో మనుషులను కలిపే ప్రయత్నం చేస్తా ము ,, కానీ స్వభావం మాత్రం వారిని కలవకుండా దూరం చేస్తుంది, !
మూర్ఖుని మనసు రంజింప రాదు, వాడు మూర్ఖుడు గెలవలే ము అంటాము, దుర్యోధనుడు తెలియని మూర్ఖుడు,రావణాసురుడు తెలిసిన మూర్ఖుడు , ఎవరు చెప్పినా వినలేదు, తాము, తమ వంశాన్ని సర్వ నాశనం చేసుకున్నారు తమ దుష్ట స్వభావం తో!!,,
,,,, తమ అవసారినికో, పరిస్థితులు అనుకూలంగా లేకనో, భయానికో, భక్తికో, ఇలా విపరీత పరిస్తితుల్లో తప్ప అన్ని సమయాలలో,ప్రాణ స్నేహితులు గా ఉండ డం అరుదుగా చూస్తుంటా ము,, కదా!
,,,
ఇద్దరు అన్నదమ్ములు బాల్యంలో ఒకరిని విడిచి మరొకరు ఉండకుండా ప్రేమతో ఉంటారు, కానీ వారు వయసు పెరిగినా కొద్దీ, దూరంగా ఎడ మొహం పెడ మొహం గా ఉంటూ ,ఇంటికి వెళ్లకున్నా, కనీసం ఫోన్ లో కూడా మాట్లాడకుండా ఉంటున్న సోదరుల సంకుచిత స్వభావాలను, తరుచుగా చూస్తుంటాం,
,,అలాగే ఒ కే కుటుంబంలో కలిసి మెలిసి ఉంటున్న సభ్యుల స్వభావాలు వేరుగా ఉండటం కూడా చూస్తాం,!
ఒకే తల్లికి పుట్టిన బిడ్డల మధ్య, సయోధ్య లేకుండా పోవడం, ఐకమత్యం ప్రేమానురాగాలు కొరవడటం ,పొట్లాడుకోడం , రాకపోకలు లేకుండా శత్రు భావన తో దూరమై పోవడం, చూస్తూ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ, ఉంటారు.! తమ కళ్ల ముందే, తమ చేతుల్లో అల్లారు ముద్దుగా పెరిగిన సంతానం ఇలా పెరిగి పెద్ద వారై, భార్యా పిల్లలు పుట్టాక కూడా, తమను అనాధా శ్రమాల పాలు చేస్తున్న కొడుకుల వింతస్వభావాల గురించి ఎంత ఏడ్చినా లాభం లేకుండా పోతుంది కదా!!
, ముక్కూ మొహం తెలియని ఎవరెవరి తోనో ఆప్యాయంగా ఉంటారు, రక్త సంబంధం ఉండి, ప్రేగు తెంచుకొని ఒకే కడుపులో పుట్టిన వా రి మద్య ఎందుకు ప్రేమానురాగాలు లోపిస్తూ ఉన్నాయి,??
,, అందరూ మనుషులే, రెండు కాళ్ళు రెండు చేతులూ, ఇలా అందరికీ ఎక్కడ పుట్టినా, ఎవరికి పుట్టిన అంతా ఒకటే ఆకారం,,!
అయినా ఏదో ఒకటి క్కొట్టోచినట్టు తేడా కనబడుతూ ఉంటుంది,! కవలలు అయినా ఏదో కొంత భిన్నత్వం ఉంటుంది,!
ఇక స్వభావాలు అయితే, ఇంకా భిన్నంగా ఉంటాయి,!
వృద్దులు, బాలలు యువకులు ఒకే చోట చేరుతారు, స్వభావాలు మరిచి ఆనందంగా ఉండాలని యత్నిస్తు ఉంటారు,!
పిల్లలు ఆట కోసం, యువకులు సరదా కోసం, వృద్దులు బాతాఖానీ కోసం కలిసి ఉంటారు!,,
మనుషు లైతే కలిసి ఉంటారు లు , ఎన్ని రోజులైనా, దేశ కాల పరిస్థితిని బట్టి,!!!, కానీ మనసులు కలవడం మాత్రం కుదరని పని,!
ఒక కుటుంబంలో ఎంత మంది ఉంటున్నా ,అంతా తమ తమ స్వార్థం కోసం కాపురాలు చేస్తూ ఉంటారు,! జీవితమంతా తమ నటనా చాతుర్యం తో ఇతరులను మెప్పిస్తూ వారి ప్రేమను ఉచితంగా పొందే ప్రయత్నం చేస్తారు,! జీవితంలో మాధుర్యం గ్రహించకుండా యాంత్రిక జీవనం గడుపుతూ ఉంటారు!!
, స్వార్థం లేని మనిషి ఉండడు కదా,!
,, అంత మాత్రాన వారి మద్య ప్రేమ లేదనుకోడం కూడా తప్పే అవుతుంది,!! మాతృ ప్రేమ, లేకుండా ఏ ఇళ్లు శోభిస్తుం ది,??, తండ్రి ప్రేమ లేకుండా ఏ సంతానం పెరుగుతుంది,??, పెద్దవారి ఆప్యాయత అనురాగం లేకుండా పెళ్లిళ్లు ఎలా అవుతున్నాయి,,?? అనుబంధాలు లేకుండా కుటుంబం ఎలా వృద్ది అవుతోంది,,??
, అందుకే ప్రతి మనిషిలో ప్రేమ ఉంది వుంటుంది,! కానీ కనబడకుండా అంతు చిక్కకుండా , అంతటా నిండి ఉండి కనబడకుండా ఉంటున్న పరమాత్మ వలె ,దాగి వుంటుంది,! దాన్ని కాస్త ఓపిక పట్టి తట్టి, నిద్ర లేపుతు ఉండాలి ,, నిద్రాణంగా ఉన్న ప్రేమైక భావనను జాగృతం చేయాలి,!, చిన్న పిల్లాడిని బుజ్జగిస్తూ కొప్పడకుండ లాలిస్తూ తమ పిల్లలను రోజూ,,నిద్ర లేపే ప్రయత్నం చేస్తారు కదా,, తలిదండ్రులు !!!,,
అలాగే పరమ ఆప్తమిత్రుడు, ఆత్మ బంధువు, పరమాత్మ యొక్క అంశము, పరమానంద కరము, జీవన్ముక్తి సాధనము, అంతరంగం లో అంతర్లీన ముగా ఆనంద సాగరం వలె ప్రతి మనిషి లోనూ అంతర్యామి వలె బ్రహ్మానంద స్థితిలో ఉంటున్న ఈ పరమ అద్భుతమైన ప్రేమానుభవాన్ని , ఎదుటివారిలో, పొందాలంటే ముందుగా తాను ఆ మధుర అనుభవ స్థితిని పొందాలి,,!
అప్పుడే దైవం పైన గానీ, మనిషిపైన ,మూగజీవాల పైన, లతలు చెట్లు కొండలు కోనలు అన్నింటి లోనూ ప్రేమ అనే దైవ భావాన్ని దర్శించ గలడు!!
అదే, ప్రేమను పంచగలడు కూడా !!
"ప్రేమ" ఉండేది" పిరికిడి"" పరిమాణం గల మన గుండె ల్లో నే అయినా ,, దాని విశ్వరూపం మాత్రం అనంతం,! అఖండం! అద్వితీయం! అమోఘం!, ప్రేమ అనేది, కేవలం అనుభవైక వెద్యమయిన మధురానుభూతి మాత్రమే!
,, భారత ప్రియ ప్రధాని, అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ ట్రంప్ తో కలవడానికి, అమెరికా లోని టెక్సాస్ కు ఈ రోజు వచ్చాడు.. ఆయనకు స్వాగతం చెప్పడానికి వచ్చిన లక్షలాది మంది భారతీయుల్లో మోడీజీ పై గల వినూత్నమైన ప్రేమ సంతోషం తో పొంగి పోయింది! వారి హృదయాల్లో నిండి ఉన్న పవిత్ర ప్రేమ భావన, ప్రపంచం నలుమూలలా వ్యాపించింది!!
ఇలా ఎక్కడెక్కడి వారి నో కలిపి, అఖరు శ్వాస వరకు విడిపోకుండా పట్టి ఉంచేది ప్రేమ,,!
" ప్రేమ "అనే దివ్యానుబందం ఉంటే స్వభావాలు అనే పరిధులు అడ్డం రావు,!
పెద్దవారు అటూ ఇటూ చూసి కుదిర్చే పెండ్లి, తో, సంస్కారము, విద్యా, కుటుంబము, వంశము, దేశము,సంప్రదాయము వేరైనా గానీ, వివాహ బంధంతో వారు ఒకటై సంతోషం తో ఆనందమయ జీవనం గడపడానికి ఉపకరించే ఒకే ఒక సాధనం" ప్రేమ,! దానితో
ఏడు సముద్రాలు దాటి, ఏ దేశమైనా పోవచ్చు,! ఎన్ని కష్టాలు ఎదురైన ఇష్టంగా సవాలు చేస్తూ సాధించ వచ్చు,,! అందుకే
"ప్రేమ "ఉన్న అనుబంధం దైవ బలం తో సమానం, అవుతుంది!!
,, అది ఇద్దరు సోదరులు,భార్యాభర్తలు స్నేహితులు , ఎవరైనా కావచ్చు,,! చివరకు అమెరికా లో ఇంటింటా ఎంతో గారాబంగా పెంచబడే కుక్కా పిల్లి కూడా కావచ్చు ను,!
వృద్దశ్రమాల్లో అనాథ ల వలె విడవబడిన ఏ బంధము లేని, ఎవ రో తెలియని పెద్దవారి పై చూపే ఆదరణ సానుభూతి ఆప్యాయత అయినా కావచ్చును, !
దానినే "ప్రేమ"" అంటారు ,!
ఇంత మందిని ఇలా ఒకే వేదికపై, ఒకే భావనతో ,ఒకే సమయంలో ,వేలాది మందిని కలిపి ఉంచే పవిత్ర పావన భావన" ప్రేమ,"!!
, ఇక ఈ దివ్య ఆయుధం చేతిలో ఉంటే, ఎంత దుర్మార్గ మైన స్వభావము నైనా జయించ వచ్చును,!
ఉదాహరణ కు విభీషణుడు,!! తాను పుట్టిం ది రాక్షస జాతి, లో,, కానీ, ఒక వివాహిత స్త్రీ, కోసం, మద ము, అహం కారం తో, రాక్షస జాతి నీ , వంశ నాశనం , కీర్తీ ప్రతిష్టలను నాశనం చేస్తున్న అన్న రావణుడు , చేసే ఆగడాలను, తమ్ముడైన కూడా, సహించలేకపోయాడు ,! కారణం తన భూమిపై తన వారిపై అతడికి ఉన్న అపారమైన ప్రేమ,!!,అతడు రాముని పక్షం చేరకుండా ఉంటే లంకా రాజ్యం నామ రూపాలు లేకుండా పోయేది ,, కదా!!
,, మన భారత దేశ సరిహద్దు పై ,నిద్రాహారాలు మాని, కాపలా కాస్తున్న వారి దేశప్రేమ "అనుపమానము,, అనిర్వచనీయము,, అద్భుతము, కూడా!! తమ ప్రాణాలను ఫణంగా తాకట్టు పెట్టి,మన మాన ప్రాణాలను కాపాడుతూ, దేశ గౌరవాన్ని నిలబెడుతూ ఉన్న వీర జవాను ల దేశ భక్తి అనే "ప్రేమ"" అమరము !అమూల్యం!
,,,
, సహజంగా పుట్టుకతో మనిషిది మంచిస్వభావం , గా ఉంటుంది !!, కానీ మనిషి పెరిగే కొద్దీ ,,క్రమంగా అతడి స్వభావం పై ప్రభావం చూపే అస్తి, బలగం డబ్బు, కీర్తీ, ఉద్యోగం,దేహ బలం తో , అతడి, కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలు పెరుగుతూ ,,మనిషి స్వభావాన్ని మార్చేస్తు, దుర్గతి పాలు చేస్తు ఉంటాయి,! ఏ దేశ చరిత్ర చూసినా ఇదే కారణంగా తెలుస్తూ వుంటుంది!!
,, అందుకే తస్మాత్ జాగ్రత్త, మనిషిగా ఎదగాలంటే అలాంటి పశు తత్వా లు, ఈ దివ్య మైనప్రేమ తత్వానికి అడ్డురాకుండ చూడాలి,! సోదర ప్రేమ, మిత్ర ప్రేమ, బంధు ప్రేమ, సకల ప్రాణుల పై ఆదరణ ప్రేమ, ప్రకృతి పై కారుణ్య ము అనే ప్రేమ, ఇలా సర్వ మానవ సభ్రాతృత్వా భావం అనబడే మహత్వ పూరితమైన ప్రేమ తో ""స్వభావాలు" అనే సరిహద్దులను చెరిపి, అంతా ఒకటే,! అందరూ మనవారే, !అందరికీ ఒక్కడే దేవుడు,!అన్న దైవారాధన "స్వభావం "తో ఆనందంగా జీవించాలి!, ఎదుటివారిని కూడా అదే ఆనంద నిలయంలో కలుపుకుంటూ , వారిలో కూడా ప్రేమతో అనందాన్ని దర్శిస్తూ ,భగవద్ సాక్షాత్ కార భాగ్యాన్ని పొందే ప్రయత్నం చేద్దాం,!!
సర్వే జనాః స్సుఖినో భవం తు ! సమస్త సన్మంగలాని భవంతు ,!
హరే క్రిష్ణ హరే కృష్ణా!!
స్వస్తి !!"
Saturday, October 12, 2019
ప్రేమానురాగాలు
భయం
Sept 29, 2019 Dallas
దేహావస్తలకు మానసిక ఆందోళనకు కారణం భయం,, ఇది భూమిపై పుట్టిన ప్రతీ ప్రాణికి ఉంటుంది,, చావు కంటే మించిన భయం, గోచీ కంటే మించిన దారిద్య్రం లేదు అంటారు,
నిజమే కానీ, పిల్లలకు కొత్త మనుషులు అంటే భయం, యువకులకు ఉద్యోగ ము దొరక దని భయం. ఉద్యోగులకు క్రమశిక్షణ భయం, వృద్దులకు ఆదరణ భయం,
బయట కాలు పెడితే చాలు, ప్రమాదాల భయం,ప్రతివాడికీ గుర్తింపు కోసం భయం,
చనిపోయిన వారి శవాలను చూస్తే ఉండాల్సిన భయం, బ్రతు కుతెరువు కోసం చేసే అగచాట్ల లో ఆరాటం తో, అనుక్షణం భయం చూస్తుంటాం,
భయానికి మరో పేరు టెన్షన్, నీవు భయపడుతున్న వూ అంటే ఒప్పుకోరు, కానీ టెన్షన్ అనేది ఉదయం లేస్తూనే, ప్రారంభం అయిన ఆరాటం, పోరాటం ఆవేదన, తొందర, మనః శాంతి లేకుండా కాలు కాలిన పిల్లిలా ఉరుకులు పరుగులు. వజ్రాయుధం లా చేతిలో ఫోన్, బయట ఆటో, విమానం, ట్రైన్, బస్సు కార్లు, ఇలా ఏది వీలైతే దానితో దేశాలు తిరుగుతూ, గమ్యం టైమ్ కు చేరుతా మో లేదో, పని అవుతుం దో కాదో, అన్న భయం పీకుతూ ఉంటుంది
, కానీ కనబడకుండా మేకపోతు గాంభీర్యం మాత్రం ప్రదర్శిస్తూ ఉంటారు, అంటే నటిస్తూ ఉంటారు,,
ఇలా జీవించాలంటే అలా నటించడం తప్పదు అన్నట్టుగా ఎంత ఆత్మీయుల కైన భయానికి కారణం గా ఉంటున్న ఆస లు విషయం చెప్పకుండా దాస్తూ, దాస్తూ, తన వారి కి కూడా పరాయి వారు అవుతుంటారు,
నిజమే, చెప్పకూడని విషయాలు ఉంటాయి, కానీ వాటి గురించి టెన్షన్ తో, బాధ పడుతూ, అనుకున్నట్టు కాకపోతే ఆవేదనతో కుమిలి కుమిలి పోతూ, కలిగే దుఖాన్ని కక్కలేక, ఆత్మీయులతో పంచుకొలేక,, సమస్య పరిష్కారం కోసం ఎవరిని అడగలేక, గుండె జబ్బు లు లాంటి భయంకరమైన వ్యాధులు కోరి తెచ్చుకునే వారు చాలా మందిని చూస్తుంటాము
భయానికి కారణం భయం కలిగించే విషయం పై అవగాహన లేకపోవడమే కదా,
పరీక్షిత్తు మహారాజు గారు తన చావుకు వారం రోజుల గడువు తెలుసుకొని, పరిష్కారం కోసం విజ్ఞుల ను ఆశ్రయించాడు
సమస్య చావు దైన మరేదైనా, అర్థం అయితేనే గానీ, భయం పోదు, పరిష్కారం కాదు కదా,, ఇందులో మరొక పాజిటివ్ thinking ఉంది, దానిని అనుభూతి అంటారు,
ఈ రకమైన అనుబంధం లో భయం ఉండదు, ఎన్ని రకాల పనులను చేసినా, ఈ అనుబంధం అనే అద్భుతమైన బంధం తో బ్రతుకు ను ఆనందమయం చేసుకోవచ్చును, ఎన్ని కష్టా లైన, ఇష్టంగా భరించ వచ్చును,
కష్టాలు భయాలు, సమస్యలు లేనివాడు పృత్వి లో లేడు కదా, వాటిని అధిగమించడం, లేదా మరచిపోవడం కేవలం వాటితో అనుబంధాన్ని పెంచుకోవడం వల్లనే వీలవుతుంది,,! ఉదాహరణకు,
ఒక సామాన్య గృహిణి, ఉదయం నుండి సాయంత్రం వరకూ, తన ఇంట్లో ఎన్నో విభిన్నమైన పాత్రల లో జీవిస్తూ , పని ఒత్తిడికి గురి అవుతూ, అలసట, అయినా విశ్రాంతి నోచుకోకుండా నిర్విరామంగా తన ఇంటి పని చేస్తూ, ఉండటం ! ఆమె సేవకు గుర్తింపు, ఆదరణ, వేతనం, గౌరవం, సెలవులు, లాంటివి ఇవేమీ కోరకుండా, నిస్వార్థంగా తన కర్తవ్యాన్ని సక్రమంగా, క్రమ శిక్షణ తో చేసుకొని పోతుంది,
తన భర్త, పిల్లల పైన ఉన్న ప్రేమానుబంధం తో ఇబ్బందులు ఎన్ని ఉన్నా సహిస్తుంది, అడ్డంకులు ఎన్ని ఎదురైన అధిగమిస్తూ ఉంటుంది, ఇంటిలో పనే గాకుండా, బయట ఉద్యోగాలు చేస్తూ కూడా, మెండైన అత్మ విశ్వాసం తో, నిండైన గుండె బలం తో, ఎంతో మందితో అనుబంధాన్ని పెంచుతూ, దృఢమైన వ్యక్తిత్వాన్ని, అలవరచు కుంటుంది,
అలాంటి సామర్థ్యం గల ఇల్లాలి జోలికి ఏ భయము వెళ్ళదు, ఎందుకంటే అభిమానం ప్రేమా, ఆప్యాయత అనురాగం అనబడే అనుబంధాలు , ఆమెకు సమస్యను అర్థం చేసుకొని, సులువుగా సాధించుకునే ప్రజ్ఞ ను, వారి విజ్ఞతను, పరిణత ను తన జీవితఅనుభవాల ద్వారా సంపాదిస్తుంది ,
, అందుకే , విజయ సోపానం సులభంగా అధిరోహించాలని ఉంటే,నిర్భయంగా, ఏ సమస్యను అయినా సాధించాలని అనుకుంటే, అనుబంధం తోనే అవుతుంది సుగమం.
ఎంత పెద్ద సమావేశం అయిన, కుటుంబం గ్రామం, నగరం చివరకు దేశ దేశాల ప్రముఖ నేతల ద్వారా అయినా చర్చలు సఫలం కావాలంటే ముందుగా చిరునవ్వే సమాధానం గా సమస్యకు స్వాగతం పలకాలి, ఎదుటి వ్యక్తిని గౌరవాభిమానాల తో సత్కరించా లి,
ఈ విధంగా మనిషి మనిషికీ అనుబంధం పెరగాలి, అందరూ ఐకమత్యంగా ఉండాలంటే, ఒకే త్రాటి పై నడిపించాలని అనుకుంటే స్నేహం, లేదా బంధుత్వం, లేదా మంచితనం, మంచి మాట, లాంటి సంస్కార ఔన్నత్యాన్ని చాటుతూ, మానవత్వం అనే సున్నితమైన, అద్భుతమైన, ఉత్కృష్టమైన , పరమానంద కరమైన, సభ్య సమాజానికి శ్రేయస్కరము అయిన ఆత్మీయత అనే దైవ సంబంధం తో శాశ్వత, సహజీవన శాంతియుత సత్సంబంధాలను మన మధ్య పెంచుకోవాలి ,
, అనుబంధాలు తెలియని జీవితం అంధకార బందురం,అగమ్యగోచరం , అయోమయం, జంతు ప్రాయం,,
, మానవ జీవనాన్ని అనుబంధము అనబడే ఒకే ఒక మహత్తరమైన శక్తితో సార్థకం చేసుకోవచ్చును,,
పిల్లి కుక్కా పులి సింహం, ఆవు లాంటి జంతువులలో అనుబంధాలు అసలే ఉండవని అర్థం కాదు,, ప్రాణం ఉన్న ప్రతీ జీవి కి మరొక జీవి తో ఎంతో కొంత అనుబంధం ఉండి తీరుతుంది, కానీ, వివేకం తక్కువ కనుక, జంతువుల్లో ఎక్కువగా స్వార్థం వుంటుంది ,
, అదే మనిషిలో అయితే, ప్రాణానికి ప్రాణం ఇచ్చేంత అనుబంధం, త్యాగభావం, నిస్వార్థ ప్రేమ ఇచ్చి పుచ్చు కు నే తత్వం, విచక్షణా జ్ఞానం ఉంటుంది కనుక, భయ రాహిత్యం గా జీవించే వీలు ఉంటుంది
, జీవితంలో అందాన్ని అనందాన్ని, సంతృప్తిని, ప్రశాం తంగా అనుభవించడానికి కావల్సిన అనుబంధాలు ఆత్మీయతల తో మధురానుభూతి నీ పొంద డానికి ధృడ సంకల్పం చేస్తూ, ఆనందమయ జీవనాన్ని గడుపుదా ము, స్వస్తి
హరే క్రిష్ణ హరే కృష్ణా
పుత్ర వ్యామోహం
Austin, Oct 6, 2019
మహాభారతం లో అత్యంత దయనీయమైన పాత్ర దృతరాష్ట్రుడు, ! పేరుకు తాను మహారాజు అయినా, ఉత్సవ విగ్రహం ను తలపించే తోలు బొమ్మ వలె,దుష్టచతుష్టయం ఎలా చెబితే అలా ఇష్టం లేకున్నా పాపపు పనులు చేస్తూ పోవడం. తండ్రి గా అతడు నరకం అనుభవించాడు,.! కారణం అతడి పుత్ర వ్యామోహం,! ఫలితం కన్న కొడుకు మాటకు చేతకు ఎదురు చెప్ప లేడు, !నామ మాత్రానికే రాజు ,కానీ రాజ్యం పై సంపూర్ణఅధికారం, పెత్తనం అంతా సుయోధనుడు చెలాయించాడు ,!
, ద్రౌపది వస్త్రాపహరణం సందర్భం లో, ఆమెను కాపాడింది, ఆమె సౌశీల్యం, పతివ్రతా ధర్మమని, శ్రీకృష్ణుడు వెనక ఉండి పాండవులను కాపాడుతూ ఉన్నాడని గుడ్డిరాజుకు తెలుసు, !శ్రీకృష్ణుడు సాక్షాత్తూ పరమాత్ముడు అని కూడా తెలుసు!, తనకు దివ్యదృష్టిని అనుగ్రహిం చి, అందుడు, మూర్ఖుడు, అవివేకి అని తెలిసి కూడా, అతిదుర్లభమైన మోక్షదాయకం అయిన విశ్వరూప దర్శనం శ్రీకృష్ణ భగవానుడు తనకు ఇవ్వడం కూడా ,ఇప్పటికైనా కొడుక్కి బుద్ది చెప్పమని సూచించ డానికే !!
అయినా పుత్ర మమకారం తో, ఘోర మైన యుద్దానికి , మారణకాండకు సమ్మతించాడు !.కానీ పుత్రునికి మాత్రంఎదురు చెప్పలేక పోయాడు,,!
అంధత్వం తో బలహీనుడు, నిస్సహాయ స్థితిలో, ఉండి కూడా, తనకంటూ ఒక వ్యక్తిత్వం లేక, దేవుడే దిగివచ్చి నచ్చ జెప్పినా చూపులోనే కాదు, మాటలో, చేతలో కూడా "గుడ్డి తనం "చూపించాడు
,,,, అప్పుడే కాదు ,,ఈ కాలం లో కూడా అలాంటి దృతరాష్ట్రు లు ఎంతో మంది ఉన్నారు.! వ్యామోహం, దురాశ, అసూయ , పగ ప్రతీకారాలు ఎన్ని ఘోరాలు చేయిస్తాయో భారత యుద్దం ద్వారా మనకు తెలుస్తోంది ,,
కళ్ళు ఉండి కూడా పుత్ర వ్యామోహం తో, సంతానం పై మమకారం తో , కొందరు తండ్రులు , కొడుకుల కుటుంబాల సమస్యల లో అనవసరంగా జోక్యం చేసుకుంటూ , వారిచే మాటలు పడుతూ, బాధ పడుతూ, ఎవరికి చెప్పలేక, మింగలేక కుమిలి పోతూ , రోగాల పాలవుతూ, ఉంటున్నారు,,!! పెండ్లి ఉద్యోగం అయ్యాక సంతానాన కిి దూరంగా ఉంటూ వారి వ్యక్తిత్వ వికాసానికి తోడ్ప డా లి,, అంటే స్వేచ్ఛను ఇవ్వాలి, బరువు బాధ్యతలు వారే స్వయంగా తెలుసుకునేలా అవకాశం ఇవ్వాలి,
అడిగితేనే సలహాలు, సూచనలు, సహాయాలు అందజేస్తూ ఉండాలి,,, ఇవన్నీ పెద్దవారు పాటిస్తూ గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలి, !ఇది మా జీవన విధానం గా మారాలి!
, ఇక, ఈ నాటి యువతరానికి నా లాంటి సీనియర్ సిటిజెన్ ల విన్నపం ఏమిటంటే,," మీ తరం వేరు,! మా తరం వేరు,! మేము పెరిగిన వాతావరణం, అలవాట్లు, సమాజం, నాగరికత ఆచార వ్యవహారాలు , ఉద్యోగ వనరులు, తిండి విధానం, స్నేహాలు, ప్రేమలు, పండగ వ్యవహారాలు ఇలా, ఇప్పుడు మీరు చూస్తున్న పద్ధతులకు పూర్తిగా భిన్నంగా ఉంటున్నాయి,!
,, టెక్నాలజీ తెలియని వ్యవస్థ లో అమాయకంగా పెరిగిన వార లం మేము,,! ఇది మీకు నచ్చక పోవచ్చు,! అలాగే మీ జీవన విధానం లో ఇమడలేక మాకు కూడా కష్టం కలిగించ వచ్చును,!
,, ఇంత వయసు వచ్చాక మేము మారడం, అలవాట్లు మార్చుకోడం చాలా కష్టం!!, మీ పై దృతరాష్ట్రు నీ వలె పెంచుకున్న మమకారం, ప్రేమ లు, మీకు ఇబ్బంది కలిగించ వచ్చును కూడా!!
రేపు మీ పిల్లలు కూడా మీతో ఇలాగే ఇబ్బంది పడతారు, అన్నది నిజం! అది ప్రకృతిసహజం,! తరానికి తరానికి మధ్య ఏర్పడే భిన్న అభిప్రాయాలు, ఎవరూ పూడ్చ లేని అగాధాలు,!! మనమే చొరవ చేసుకొని, మానవత దృక్పథం తో పెద్ద మనసు చూపుతూ సర్దుకు పోవాలి,,,!
,, మమ్మల్ని, మా తప్పులు, ఒప్పులను,ఇష్టాయిష్టాలను మా వంశానికి వారసులు అయినందుకు మీరు భరించక తప్పదు,!
ఎందుకంటే మీరు తప్ప మాకు ఆదరించే దిక్కు ఎవరూ లేరు.! మిమ్మల్ని కాదని ఎవరూ ముందుకు రావడానికి సాహసించరు !! కష్టమైనా సుఖమైనా మేము మీతో,, మీరు మాతో కలిసి అనుభవించాలి తప్ప, ఇతరుల ప్రమేయం అంత మంచిది కాదు !! ఎవరికి మనగురించి ఒక్క కానిమాట అనే అవకాశం ఇవ్వొద్దు,! అనుబంధం, ప్రేమ, స్నేహం, ఐక్యత ఇవన్నీ ఇతరులు మనల్ని చూసి నేర్చుకోవాలి. !
బలహీనతలు ప్రతివ్యక్తి లో ఉండటం సహజం ;వృద్దాప్యం లో అవి మరింత గా బాధిస్తూ ఉంటాయి..
పెద్ద తనం లో ఒక జంట కలిసి ఉన్నంత కాలం, ఫర్వాలేదు,! కానీ,, అందులో ఒక పక్షి ఎగిరిపోతే, మరొక పక్షి పడే బాధ, నరకయాతన జీవచ్చవం లా బ్రతుకు ఈడ్చే వృద్దుల ను బంధువుల్లో సమాజంలో మీరు చూస్తూనే ఉన్నారు,! ఇలా బ్రతికే కన్నా చస్తే నయం అనుకుంటూ దినదిన గండం లా గడుపుతూ ఉంటారు..,
ఇప్పుడొ స్తోంది, వృద్ధాశ్రమం ప్రసక్తి,,!! వీళ్లని ఏదైనా ఆశ్రమం లో వేద్దామా అని!!
,, ఆ విధంగా కన్నవారిని అనాథ ఆశ్రమాల పాలు చేసి, నెలకు ఇంత అని ఖర్చులు పడేసి, చేతులు దులుపుకోవడం ,,అది బుద్ధిమంతులు అయిన కొడుకు లు చేసే పని అనిపించుకోదు,,!
,, ప్రతీ మనిషికి ఒక చరిత్ర ఉంటుం ది,, అది ఎవరికీ వారే స్వయంగా ఉన్నతంగా ఎదుగుతు చక్కని నడకతో సంస్కారం తో రాసుకోవాలి!!,, అందుకు, సభ్య సమాజంలో ఆదర్శంగా మెదులుతూ, ఇతరులకు మార్గదర్శకం గా ఉండాలంటే, మీరు మనిషి మనుగడకు మూలమైన నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలి,,!,,,
అందులో మొదటిది
, తలిదండ్రుల ను గౌరవిం చడం !! వారికి మలివయసు లో సేవ చేయాలి అన్న విషయం తెలియని వారు ఒక వంద అనుకుంటే,, ప్రస్తుత కాలంలో, వాటిని, ఆచరణలో పెట్టేవారు సగం ఉండరేమో అన్న అనుమానం వస్తుంది,!!
, ,, వారిని తమ దగ్గర ఉంచుకొని నానా మాటలు అంటూ, వారిని ఎన్నో అగచాట్ల పాలు చేస్తూ ఉండే కన్నా, వేరే ఇల్లు చూసి అందులో నివాసం ఉంచి, కనీస సదుపాయాలు ఏర్పాటు చేయడం చాలా మంచిది,,!! ఓపిక ఉన్నంతవరకు దూరంగా ఉంటారు,, ఆ తర్వాత మీరే గతి,, కదా!!""
,, కానీ వారిని, వృద్ధాశ్రమం పాలు మాత్రం చేయకండి,,!!
,, జంతువులు ముసలివై పోతే, కోతకు బలి ఇచ్చినట్టుగా, జంతు వుల వలె అనాగరికంగా అసభ్యంగా,అమానుషంగా , ప్రవర్తిస్తూ,, సభ్య సమాజానికి చెరగని మచ్చ తెచ్చుకోకండి,,,!!
, ఇలా చేస్తే, మీ పిల్లలు కూడా మిమ్మల్ని మీ చేతగాని తనం లో తప్పకుండా ప్రేమతో ఆదరిస్తారు,,,!
""మీరు మీ అమ్మా నాన్నలను వారి ముసలితనం లో అనాథ ఆశ్రమంలో వది లేశారు గదా,! మరి ఇప్పుడు మిమ్మల్ని మేము ఎందుకు అదే అనాథ ఆశ్రమంలో వదిలి వేయకూ డ దు! !""అని మీ పిల్లలు మిమ్మల్ని నిలదీసే దురవస్తను చేతులారా కొని తెచ్చు కోకండి,,! మేము మా కన్న వారిని వారి వృద్దాప్యం లో దగ్గరుంచుకొని వారి అఖరు శ్వాస వరకూ కంటికి రెప్పలా కాపా డు కున్నాం,! పెద్దలు చూపిన చక్కని బాటలో మేము నడిచాం!,, అలాగే మీరు కూడా మరవకుం డా, జడవకుండ నడవండి!!"" అని మేము చేసింది మీకు చెబుతున్నాం, !
,,,ఎంత వద్దనుకున్నా తలిదండ్రుల ఋణం తీర్చుకునే అవకాశం వారి సంతానం స్వీకరించ క తప్పదు.,,!
,,, ఇదిగో! ఇక్కడే మీ యువతరం పాటించ వలసిన ఓర్పు నేర్పు, ఉంటున్నాయి,!,, మనిషిగా పుట్టాక, ఎవరికైనా ఈ బాధ్యత మోయక తప్పదు,, !భరించక తప్పదు,,!
ఏ దేవాలయానికి వెళ్లకున్నా ఫర్వాలేదు, !!"మాతృదేవభవ, పితృదే వోభవ, "!!"అన్న వేదో క్తి అనుసరించి, కన్న తలిదండ్రులను ప్రేమతో వారు బ్రతికినన్నాళ్ళు ఆదరిస్తే చాలు,!!,, ఏ దీక్షలు పురాణాలు, చదువులు అవసరం లేదు !!"
, బ్రతికి ఉండగా తలిదండ్రుల ను ప్రేమతో ఆదరిస్తే చాలు,, వారు పోయాక ఎన్ని చేసినా, ఏమీ లాభం ఉండదు !! మీ ఆదరణతో ,వారి కళ్లలో ఆనందం, వారి హృదయంలో సంతృప్తి, వారి గుండెల్లో ప్రేమ పొంగివస్తాయి,! ఇవన్నీ కలిసి మీకు మీ కుటుంబానికి శ్రీరామరక్ష అవుతూ నిలుస్తాయి,,!!మీరు ప్రశాంతంగా ఆనందంగా చక్కని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చిరకాలం వర్ధిల్లే మహా భాగ్యాన్ని వారు తమ హృదయపూర్వక మైన ఆశీస్సులతో మీకు అందజేస్తారు,,!
ఇది నిజం,!
, ఇప్పుడు మనం అనుభవించేది సంపద, డబ్బు కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ మన పితృదేవతల దీవ నా బలంతోనే కదా మనకు సంక్రమించాయి,, !అంటే ATM వలె మన వెంట జన్మ జన్మల తరబడి అంటిఉంటూ, కాపాడుతూ మీకు ఉజ్వల భవిత ను అందిస్తూ ఉంటుంది..!
""తల్లీ! నీ మాతృత్వ ప్రేమకు , ఎన్ని జన్మలు ఎత్తినా, ఎంత సేవ చేసినా నీ ఋణం తీరేనా?! తండ్రీ,! గురువు, దైవం, మార్గ దర్శకత్వం తో మాకు చక్కని జ్ఞానాన్ని, అందించి, మంచి మనిషిగా తీర్చి దిద్దుతు నీవు మాపై చూపించిన అనురాగానికి , మిమ్మల్ని ఎంతగా సేవించినా, పూజించినా ,ప్రేమించినా మీ ప్రేమకు సరి తూగే నా??
""మాతా పిత పాదసేవ యే మాధవ సేవ !""
""పరమాత్మా, !!ఈ అద్భుతమైన మానవత్వపు విలువల గుర్తిస్తూ , బ్రతికే అత్మ స్థైర్యాన్ని,, మనో బలాన్ని మాకు అనుగ్రహించు! స్వామీ, ఉత్కృష్టమైన మానవజన్మ కు సార్థకత అందించు ! దేవాది దేవా,,! అనంత !అచ్యుతా! పరమేశ్వరా! పరాత్పరా !, శరణు శరణు శరణు !
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా!!""
A Drama that became Real!
The Turning Point Forty years ago, while teaching at Ragampet village high school, I experienced a moment that changed a student’s life fore...
-
The Turning Point Forty years ago, while teaching at Ragampet village high school, I experienced a moment that changed a student’s life fore...
-
May 8, 2020 పగలే వెన్నెలా.... పల్లవి !" ____&___ "కరోనా వచ్చేరా ,కష్టాలు తెచ్చేరా !! కరుణ లేక మన వారిని చంపు చుండే రా!!...
-
May 27, 2020 ఈ గోపికా స్త్రీలకు శ్రీకృష్ణుని పట్ల గల ఆ ఆరాధనా భావం ఎలా కలుగు తోంది? భర్తా పిల్లలు అత్తా మామలు బంధువులు,సంసార బాధ్యతలు , ఇ...