Saturday, October 12, 2019

ప్రేమానురాగాలు

Dallas, Sept 22 2019
""మాట్లాడటం "మనిషి కి దేవుడు ఇచ్చిన వరమైతే, "స్వభావం" మాత్రం మనిషి తన జన్మ ఎత్తుతూనే ఒంట బట్టించు కొని వస్తాడు,! అది గతజన్మ బంధం కావచ్చు, కుటుంబ వారసత్వం కావచ్చు, పితృదేవతల దీవ న కావచ్చు,, కానీ, మాటతో మనుషులను కలిపే ప్రయత్నం చేస్తా ము ,, కానీ స్వభావం మాత్రం వారిని కలవకుండా దూరం చేస్తుంది, !
మూర్ఖుని మనసు రంజింప రాదు, వాడు మూర్ఖుడు గెలవలే ము అంటాము, దుర్యోధనుడు తెలియని మూర్ఖుడు,రావణాసురుడు తెలిసిన మూర్ఖుడు , ఎవరు చెప్పినా వినలేదు, తాము, తమ వంశాన్ని సర్వ నాశనం చేసుకున్నారు తమ దుష్ట స్వభావం తో!!,,
,,,, తమ అవసారినికో, పరిస్థితులు అనుకూలంగా లేకనో, భయానికో, భక్తికో, ఇలా విపరీత పరిస్తితుల్లో తప్ప అన్ని సమయాలలో,ప్రాణ స్నేహితులు గా ఉండ డం అరుదుగా చూస్తుంటా ము,, కదా!
,,,
ఇద్దరు అన్నదమ్ములు బాల్యంలో ఒకరిని విడిచి మరొకరు ఉండకుండా ప్రేమతో ఉంటారు, కానీ వారు వయసు పెరిగినా కొద్దీ, దూరంగా ఎడ మొహం పెడ మొహం గా ఉంటూ ,ఇంటికి వెళ్లకున్నా, కనీసం ఫోన్ లో కూడా మాట్లాడకుండా ఉంటున్న సోదరుల సంకుచిత స్వభావాలను, తరుచుగా  చూస్తుంటాం,
,,అలాగే ఒ కే  కుటుంబంలో కలిసి మెలిసి ఉంటున్న సభ్యుల స్వభావాలు వేరుగా ఉండటం కూడా చూస్తాం,!
ఒకే తల్లికి పుట్టిన బిడ్డల మధ్య, సయోధ్య లేకుండా పోవడం, ఐకమత్యం ప్రేమానురాగాలు కొరవడటం ,పొట్లాడుకోడం , రాకపోకలు లేకుండా శత్రు భావన తో దూరమై పోవడం, చూస్తూ తల్లిదండ్రులు  గుండెలు బాదుకుంటూ, ఉంటారు.! తమ కళ్ల ముందే, తమ చేతుల్లో అల్లారు ముద్దుగా పెరిగిన సంతానం ఇలా పెరిగి పెద్ద వారై, భార్యా పిల్లలు పుట్టాక కూడా, తమను అనాధా శ్రమాల పాలు చేస్తున్న కొడుకుల వింతస్వభావాల గురించి ఎంత ఏడ్చినా లాభం లేకుండా పోతుంది కదా!!
, ముక్కూ మొహం తెలియని ఎవరెవరి తోనో ఆప్యాయంగా ఉంటారు, రక్త సంబంధం ఉండి, ప్రేగు తెంచుకొని ఒకే కడుపులో పుట్టిన వా రి మద్య ఎందుకు ప్రేమానురాగాలు లోపిస్తూ ఉన్నాయి,??
,, అందరూ మనుషులే, రెండు కాళ్ళు రెండు చేతులూ, ఇలా అందరికీ ఎక్కడ పుట్టినా, ఎవరికి పుట్టిన  అంతా ఒకటే ఆకారం,,!
అయినా ఏదో ఒకటి క్కొట్టోచినట్టు  తేడా కనబడుతూ ఉంటుంది,! కవలలు అయినా ఏదో కొంత భిన్నత్వం ఉంటుంది,!
ఇక స్వభావాలు అయితే, ఇంకా భిన్నంగా ఉంటాయి,!
వృద్దులు, బాలలు యువకులు ఒకే చోట చేరుతారు, స్వభావాలు మరిచి ఆనందంగా ఉండాలని యత్నిస్తు ఉంటారు,!
పిల్లలు ఆట కోసం, యువకులు సరదా కోసం, వృద్దులు బాతాఖానీ కోసం కలిసి ఉంటారు!,,
మనుషు లైతే  కలిసి ఉంటారు లు , ఎన్ని రోజులైనా, దేశ కాల పరిస్థితిని బట్టి,!!!, కానీ మనసులు కలవడం మాత్రం కుదరని పని,!
ఒక కుటుంబంలో ఎంత మంది ఉంటున్నా ,అంతా తమ తమ స్వార్థం కోసం కాపురాలు చేస్తూ ఉంటారు,! జీవితమంతా తమ నటనా చాతుర్యం తో ఇతరులను  మెప్పిస్తూ వారి ప్రేమను ఉచితంగా పొందే ప్రయత్నం చేస్తారు,! జీవితంలో మాధుర్యం గ్రహించకుండా యాంత్రిక జీవనం గడుపుతూ ఉంటారు!!
, స్వార్థం లేని మనిషి ఉండడు కదా,!
,, అంత మాత్రాన వారి మద్య ప్రేమ లేదనుకోడం కూడా తప్పే అవుతుంది,!! మాతృ ప్రేమ, లేకుండా ఏ ఇళ్లు శోభిస్తుం ది,??, తండ్రి ప్రేమ లేకుండా ఏ సంతానం పెరుగుతుంది,??, పెద్దవారి ఆప్యాయత అనురాగం లేకుండా పెళ్లిళ్లు ఎలా అవుతున్నాయి,,?? అనుబంధాలు లేకుండా కుటుంబం ఎలా వృద్ది అవుతోంది,,??
, అందుకే ప్రతి మనిషిలో ప్రేమ ఉంది వుంటుంది,! కానీ  కనబడకుండా అంతు చిక్కకుండా , అంతటా నిండి ఉండి కనబడకుండా ఉంటున్న పరమాత్మ వలె ,దాగి వుంటుంది,! దాన్ని కాస్త ఓపిక పట్టి తట్టి, నిద్ర లేపుతు ఉండాలి ,, నిద్రాణంగా ఉన్న ప్రేమైక భావనను జాగృతం చేయాలి,!, చిన్న పిల్లాడిని  బుజ్జగిస్తూ కొప్పడకుండ లాలిస్తూ  తమ పిల్లలను రోజూ,,నిద్ర లేపే ప్రయత్నం చేస్తారు కదా,, తలిదండ్రులు !!!,,
అలాగే పరమ ఆప్తమిత్రుడు, ఆత్మ బంధువు, పరమాత్మ యొక్క అంశము, పరమానంద కరము, జీవన్ముక్తి సాధనము, అంతరంగం లో అంతర్లీన ముగా ఆనంద సాగరం వలె ప్రతి మనిషి లోనూ అంతర్యామి వలె బ్రహ్మానంద స్థితిలో ఉంటున్న ఈ పరమ అద్భుతమైన ప్రేమానుభవాన్ని  , ఎదుటివారిలో, పొందాలంటే ముందుగా తాను ఆ మధుర అనుభవ స్థితిని పొందాలి,,!
అప్పుడే దైవం పైన గానీ, మనిషిపైన ,మూగజీవాల పైన, లతలు చెట్లు కొండలు కోనలు అన్నింటి లోనూ ప్రేమ అనే దైవ భావాన్ని  దర్శించ గలడు!!
అదే, ప్రేమను పంచగలడు కూడా !!
"ప్రేమ" ఉండేది" పిరికిడి"" పరిమాణం గల మన గుండె ల్లో నే అయినా ,, దాని విశ్వరూపం మాత్రం అనంతం,! అఖండం! అద్వితీయం! అమోఘం!, ప్రేమ అనేది, కేవలం అనుభవైక వెద్యమయిన  మధురానుభూతి మాత్రమే!
,, భారత ప్రియ ప్రధాని, అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ ట్రంప్ తో కలవడానికి, అమెరికా లోని టెక్సాస్ కు ఈ రోజు వచ్చాడు.. ఆయనకు స్వాగతం చెప్పడానికి వచ్చిన లక్షలాది మంది భారతీయుల్లో మోడీజీ పై గల వినూత్నమైన  ప్రేమ   సంతోషం తో  పొంగి పోయింది! వారి హృదయాల్లో నిండి ఉన్న పవిత్ర ప్రేమ భావన, ప్రపంచం నలుమూలలా వ్యాపించింది!!
ఇలా ఎక్కడెక్కడి వారి నో కలిపి, అఖరు శ్వాస వరకు విడిపోకుండా పట్టి ఉంచేది ప్రేమ,,!
" ప్రేమ "అనే దివ్యానుబందం ఉంటే స్వభావాలు అనే పరిధులు అడ్డం రావు,!
పెద్దవారు అటూ ఇటూ చూసి కుదిర్చే పెండ్లి, తో, సంస్కారము, విద్యా, కుటుంబము, వంశము, దేశము,సంప్రదాయము వేరైనా గానీ, వివాహ బంధంతో వారు  ఒకటై సంతోషం తో ఆనందమయ జీవనం గడపడానికి ఉపకరించే ఒకే ఒక సాధనం" ప్రేమ,! దానితో
ఏడు సముద్రాలు దాటి, ఏ దేశమైనా పోవచ్చు,! ఎన్ని కష్టాలు ఎదురైన ఇష్టంగా  సవాలు చేస్తూ సాధించ వచ్చు,,! అందుకే
"ప్రేమ "ఉన్న అనుబంధం దైవ బలం తో సమానం, అవుతుంది!!
,, అది ఇద్దరు సోదరులు,భార్యాభర్తలు స్నేహితులు , ఎవరైనా కావచ్చు,,! చివరకు అమెరికా లో ఇంటింటా ఎంతో గారాబంగా పెంచబడే కుక్కా పిల్లి కూడా కావచ్చు ను,!
వృద్దశ్రమాల్లో అనాథ ల వలె విడవబడిన  ఏ బంధము లేని, ఎవ రో తెలియని పెద్దవారి పై చూపే ఆదరణ సానుభూతి ఆప్యాయత  అయినా కావచ్చును, !
దానినే  "ప్రేమ"" అంటారు ,!
ఇంత మందిని ఇలా ఒకే వేదికపై, ఒకే భావనతో ,ఒకే సమయంలో ,వేలాది మందిని కలిపి ఉంచే పవిత్ర పావన భావన" ప్రేమ,"!!
, ఇక ఈ దివ్య ఆయుధం చేతిలో  ఉంటే, ఎంత దుర్మార్గ మైన స్వభావము నైనా జయించ వచ్చును,!
ఉదాహరణ కు విభీషణుడు,!! తాను పుట్టిం ది రాక్షస జాతి, లో,, కానీ, ఒక వివాహిత స్త్రీ, కోసం, మద ము, అహం కారం తో, రాక్షస జాతి నీ , వంశ నాశనం , కీర్తీ ప్రతిష్టలను నాశనం చేస్తున్న అన్న రావణుడు , చేసే ఆగడాలను, తమ్ముడైన కూడా, సహించలేకపోయాడు ,! కారణం తన భూమిపై తన వారిపై అతడికి ఉన్న అపారమైన ప్రేమ,!!,అతడు రాముని పక్షం చేరకుండా ఉంటే లంకా రాజ్యం నామ రూపాలు లేకుండా పోయేది ,, కదా!!
,, మన భారత దేశ సరిహద్దు పై ,నిద్రాహారాలు మాని, కాపలా కాస్తున్న వారి దేశప్రేమ "అనుపమానము,, అనిర్వచనీయము,, అద్భుతము, కూడా!! తమ ప్రాణాలను ఫణంగా తాకట్టు పెట్టి,మన మాన ప్రాణాలను కాపాడుతూ, దేశ గౌరవాన్ని నిలబెడుతూ ఉన్న వీర జవాను ల  దేశ భక్తి అనే "ప్రేమ"" అమరము !అమూల్యం!
,,,
, సహజంగా పుట్టుకతో మనిషిది  మంచిస్వభావం , గా ఉంటుంది !!, కానీ మనిషి పెరిగే కొద్దీ ,,క్రమంగా అతడి స్వభావం పై ప్రభావం చూపే అస్తి, బలగం డబ్బు, కీర్తీ, ఉద్యోగం,దేహ బలం తో , అతడి, కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలు పెరుగుతూ ,,మనిషి స్వభావాన్ని మార్చేస్తు, దుర్గతి పాలు చేస్తు ఉంటాయి,! ఏ దేశ చరిత్ర చూసినా ఇదే కారణంగా తెలుస్తూ వుంటుంది!!
,, అందుకే తస్మాత్ జాగ్రత్త, మనిషిగా ఎదగాలంటే అలాంటి పశు తత్వా లు, ఈ దివ్య మైనప్రేమ తత్వానికి అడ్డురాకుండ చూడాలి,! సోదర ప్రేమ, మిత్ర ప్రేమ, బంధు ప్రేమ, సకల ప్రాణుల పై ఆదరణ ప్రేమ, ప్రకృతి పై కారుణ్య ము అనే ప్రేమ, ఇలా సర్వ మానవ సభ్రాతృత్వా భావం అనబడే మహత్వ పూరితమైన ప్రేమ తో ""స్వభావాలు" అనే సరిహద్దులను చెరిపి, అంతా ఒకటే,! అందరూ మనవారే, !అందరికీ ఒక్కడే దేవుడు,!అన్న దైవారాధన "స్వభావం "తో ఆనందంగా జీవించాలి!, ఎదుటివారిని కూడా అదే ఆనంద నిలయంలో  కలుపుకుంటూ , వారిలో కూడా  ప్రేమతో అనందాన్ని దర్శిస్తూ ,భగవద్ సాక్షాత్ కార భాగ్యాన్ని పొందే ప్రయత్నం చేద్దాం,!!
సర్వే జనాః స్సుఖినో భవం తు ! సమస్త సన్మంగలాని భవంతు ,!
హరే క్రిష్ణ హరే కృష్ణా!!
స్వస్తి !!"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...