Saturday, July 25, 2020

ఆకలి దేవత

Jul 5, 2020
   ఇంకా కావాలి,ఇంకా కావాలి అంటూ మనసునూ ,శరీరాన్ని పీడిస్తూ ,  ఎన్ని మందులు వాడినా ,ఎంత మద్యం తాగినా,ఎంత సంపాదించినా , తగ్గని రోగాల బారి నుండి , తప్పించు కునే దారి కానరాక ,  మనో వ్యధలకు గురియై ,రోజూ చస్తూ బ్రతుకుతూ జీవిస్తూ ఉంటారు
అయితే , ఆధ్యాత్మిక చింతనతో , పూర్వ జన్మల సుకృత పుణ్య వాసనలతో ,,, సద్గతి నీ పొందాలనే ఆకలి ఉండడం నిజంగా  ,అదృష్టం ,
  పరానికి సంబందించిన సమగ్రమైన భక్తి జ్ఞాన వైరాగ్య భావన పెంపొందించే విధంగా సాధన చేయడం ,
ఉత్తమమైన  ,,సత్వగుణ రూపంలో ఉన్న ఆకలి గా జీవితంలో కి ఆహ్వానించ వచ్చును
ఈ ఆకలి కూడా ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తుంది
కానీ, ఇందులో నిష్కామ,నీరాపెక్ష ,ప్రేమ ఉంటుంది ,
అందరినీ తమ కుటుంబ సభ్యుల వలె భావించే సమ తుల్య భావ సంపద వుంటుంది
ఎదుటి వాడి నుండి ఏం  విధంగా డబ్బు లాగడం అనుకోడానికి బదులు ,అతడికి నేను ఏ విధంగా ఉపయోగ పడగలను అన్న నిస్వార్థ ,ఉపకార భావం ఉంటుంది
,  మనసా వాచా కర్మణా ,ఏదైనా దానం చేయడం ప్రవృత్తిగా  మారుతుంది
, మూడు పూటలా కడుపు నిండా తిని పడుకొడం కాకుండా , ఒక పూట ఉపవాసం చేస్తూ,  అమూల్యమైన తన జీవిత కాలంలో పరమాత్మ తత్వ చింతన కోసం , జీవిస్తాడు
ఇక్కడ లక్ష్యం అర్థం కాదు
పరమార్ధం
  చింతన పదార్థం గురించి కాదు
పదార్థం యొక్క యదార్థ స్వరూపం గురించి  , తెలుసు కోడానికి భగవద్గీత లాంటి అత్యుత్తమ సద్గ్రందాలను చదువుతాడు, స్మృతి శృతి ఇతిహాస
పురాణాలు వింటాడు
భజనలు చేస్తాడు ,సత్సంగం
తో సహవాసం చేస్తూ ,పరాత్పరుని గురించి ఆరాట పడతాడు
ఇదంతా ఆకలి రూపమే ,
ఇంకా కావాలి,
భగవంతుని సేవించుకునే మహ భాగ్యం నాకు దక్కాలి నాకు ఇంకా ఇంకా కావాలి ,
అంటూ అర్తిస్తాడు
పూజలు అర్చనలు సేవనం ఆరాధనా, వంటి నవ విధ భక్తి మార్గములను. ఆశ్రయిస్తు ఉంటాడు,
తీసుకోడం లో కంటే ఇవ్వడం లో నిజమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు,
, ఆత్మానుభవం తో అత్మ లో పరమాత్మ సాక్షాత్కారం కోసం సాధన ప్రయత్నం చేస్తూ,క్రమ క్రమంగా పరంధాముని సన్నిధానం వద్ద కు చేరడానికి త్రికరణ శుద్ధితో పరాత్పరుని అన్వేషిస్తూ , ఉంటాడు
నిద్రలో , మెలకువ లో,స్వప్నం లో,, సర్వ కాల సర్వావస్త లలో భగవన్నామ గానం , సంకీర్తన,స్మరణం , చేస్తూ, తనువు మరచి ,దేహం పై ధ్యాస విడచి,నిరంతరం ఆ హరి నామ రూప గుణ స్వరూప వైభవ దర్శనం  ఆత్మ లో భావిస్తూ, జీవించి ఉంటూనే, దేహం నుండి ముక్తుడై ,విదేహుడై తరిస్తా డు
   సచ్చిదానంద స్వరూపుడైన ఆ పరమేశ్వరుని కోసం అలమటించే ఆర్తి ఆర్ద్రత ,,ఆరాటం ,ఆవేదన ,కూడా ఆకలి స్వరూపాలే
  ఇందులో స్వార్థం కామం కోపం ద్వేషం ఈర్ష్య ,కోపం లాంటి వికారాలు ఉండవు
త్యాగం ప్రేమ , ఉదాసీనత , దైవం పై అమితమైన విశ్వాసం ,,  ఆసక్తి, చోటు చేసు కుంటా యి,
ఆ గోవిందుని కళ్ళారా  చూడాలి ,సేవించాలి ,అన్న గొప్ప ఆకలి పుడుతుంది
ఆ వేంకటేశ్వరా స్వామిని తనివార దర్శించే వరకూ మనసు వేరే ఇతర పై నిలువదు
అన్నం రుచించదు
నిద్ర రా దు
ఇది తినాలి,ఇది కావాలి ఇటు వెళ్ళాలి ,చూడాలి అనిపించ దు
ఎందుకంటే ఆదిదేవుడు మనసులో కొలువై ఉంటే , అన్నీ ఉన్నట్టే కదా
    దైవాన్ని దర్శించాలని ఉండే ఆకలి కి కూడా తీరేది కాదు ,ఎంత చేసినా  తృప్తి కలగదు,
ఈ దేహమే ,దేవాలయం గా , తన ఆత్మలో కొలువై ఉన్న దైవమే దేవుడుగా భావించే స్థాయికి ఎదిగే వరకూ ,ప్రయత్న లోపం జరుగకుండా అప్రమత్తత తో  అత్మ సమర్పణ ,చేసుకుంటూ ,ఆత్మ విచారణ , కొనసాగిస్తూ నే ఉంటాడు భక్తుడు
  ఆలయం చుట్టూ ఎన్ని సార్లు,ఎన్ని మార్లు ప్రదక్షిణ ముల చేసినా
తృప్తి ఉండదు
  ,,ఆ" ఆకలి" తీరదు , ఎందుకని?
నోరు నొవ్వంగా ఎన్ని రోజులు ఎన్ని భజనలు ఎన్ని కీర్తనలు పాడిన తృప్తి కలుగదు
ఆ ఆకలి తీరదు ఎందుకని?
సాలగ్రామ శిలా మూర్తి గే వెలసిన స్వామిని ఎంత చూసినా,ఎన్ని సార్లు చూసినా  ఎన్ని సాష్టాంగ ప్రణామం చేసినా ,,,తనివి తీరదు
ఎన్ని ప్ ప్రదక్షిణ లు చేసినా కాళ్ళకు నొప్పి పుట్టదు కదా
ఈ ఆకలి తీరదు ఎందుకని ?
ఎన్ని సార్లు, ఎన్ని రోజులు స్వామి అఖండ నామ సంకీర్తనలు, నాద నీరాజనం భక్తి గీతాలు వింటున్నా ,చెవులు తనియవు,  తిండి నిద్ర మరచి , లెక్కచేయకుండా ,,ఈ చేతులతో   శ్రీహరి భజనలు చేస్తూ ఉన్నా కూడా ,
మనసు నిండదు ఈ ఆకలి తీరదు ఎందుకని
,దాహం వేస్తే నీళ్ళు త్రాగుతూ,ఆకలి వేస్తే ఆహారం తిని  తృప్తి పడవచ్చు
కానీ  సర్వేశ్వరుని ,సర్వాంతర్యామి తత్వాన్ని గ్రహించడానికి ఉండే ఆర్తి ,ఆరాధనలు అనబడే ఆకలి తీరేది కాదు
  ఈ ఆకలి రుచి తెలిసిన వాడికి ఇక వేరే పదార్థాల వాసన గురించి ఆలోచించడు
ఇదే తన జీవిత లక్ష్యం
ఇదే జీవిత పరమార్థం
ధ్యేయం ,గమ్యం కూడా  ఇదే
  జీవుడికి ఉండాల్సిన ముఖ్య లక్షణం , దేవుడి గురించి భావించే ఆకలి వేయడం ,
అన్నమయ్య సినిమాలో, చూస్తాం భక్తి అనబడే ఆకలి  స్వరూపం
తిరుమల యాత్రికుల బృందం తో ,  వెళ్తూ ఒక చోట మజిలీ చేసిన భక్త బృందం ,భోజనాలు చేస్తూ ఉంటే అన్నమయ్య  చూస్తూ ఉంటాడు
నారదుడు ఒక సాధువు వేషం లో వచ్చి
నాయనా వారంతా  భోజనం చేస్తూ ,,ఆకలి తీ ర్చు కుంటు ఉన్నారు కదా వారం రోజులు గా పస్తులు ఉంటూ ఏమీ తినకుండా ఉంటున్నావు,
అలసట వేయడం లేదా
ఆకలిగా లేదా
స్వామీ , ఆకలి గా ఉంది ,
కానీ ఈ ఆకలి కాదు ఆ శ్రీనివాసుని , ఆ ఏడుకొండల స్వామిని దర్శించాలి అని ఆకలిగా ఉంది
అని పరమాత్మను చూడాలన్న  తన ఆవేదన తెలియ జేస్తాడు,
    ఎంత అమాయకం నీది,? నాయనా,
ఇలా ఉపవాసాలు చేస్తూ,స్వామిని దర్శిం చే లోగా  ఈ అసలు శరీరమే పోతే ఎలా చెప్పు.
   స్వామీ అసలే పోయినా అంతా పొయినా ,నా స్వామి  దర్శనం  అయ్యేవరకు పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టను
అని బదులు ఇచ్చిన జవాబు, నారదుని కి మహదానందం కలిగిస్తుంది
  అన్నమయ్య భక్తి తత్పరత కు సంతోషించి , స్వయంగా తాంబూర వాయిద్యాన్ని బహుకరిస్తాడు
అలా అన్నమయ్య కు గల వేంకటేశ్వర స్వామి భక్తికి అంకురార్పణ  చేస్తాడు ,బ్రహ్మ మానస పుత్రుడు నారదుడు
పరమాత్ముని సన్నిధానం చేరుకోవాలని ఆరాటపడే జీవుడి బలీయమైన ఆకలి ని కూడా
దైవానుగ్రహం కటాక్షించే  దేవతగా కీర్టింపవచ్చును కదా
స్వస్తి _!
హరే కృష్ణ హరే కృష్ణా _!"

ఆకలి రాక్షసి

Jul 4, 2020
  భూమి మీద పుట్టాక ,ప్రాణికి ఆకలి మొదలవుతుంది,_!
తల్లి కడుపు నుండి బయటకు రావడమే ఆలస్యం ,_ఇక "కేరు కేరూ"" మంటూ   ఆకలి కోసం ఏడుస్తూ ఉంటారు,_!
ఇది మొదలు,_ఆకలి భూతం జీవుడి లో  ఆవిర్భా వించడాని కి_!!,
ఇక మనిషి విషయం చూస్తే ,,జననం నుండి మరణం వరకు _జీవితంలో ,ఎన్ని వేల క్వింటాళ్ల ఆహారం లాగిస్తూ మజా చేస్తాడో _ఆ బ్రహ్మ కూడా లెక్క పెట్టలేడు _!,
మనిషికి మాత్రమే కాదు ,_ ప్రతి జంతువుకు,పక్షులు జలచరాలు  నిత్యం ఆకలి వేటలో. అలమటిస్తూ ,పడరాని పాట్లు ,చెయ్యరాని పనులు చేస్తూ ఉంటాయి_!
ఆకలి  రాక్షసిని , శాంత పరచ డానికి ,కోసం , పొట్ట నింపుకొడానికి ఎన్నో అబద్ధాలు, అన్యాయాలు,ఘోరాలు,, పాప కర్మలు చేస్తూ ఉంటాడు,మనిషి,_!
  ఇలా నిద్రా, శాంతి ,సుఖం లేకుండా చేస్తున్న ఈ  ""ఆకలిని రాక్షసి ని ""దెయ్యం _భూతం _, పిశాచి _కరో నా మహమ్మారి ,,,,,_!అని ఎన్ని తిట్లు తిట్టినా సరిపోవు కదా _!
  ప్రస్తుతం మనల్ని పీడిస్తున్న  ఈ కరోనా కు కూడా ఇదే ఆకలి రోగం , పుట్టింది _!
దాని చే తికి దొరికితే చాలు, "జలగ "లా_ రక్తం  పీలుస్తూ,ప్రాణం పిండేస్తూ ఉంటోంది _!
ఇలాంటి దుష్ట జీవుల పీడ_ మనకు కొత్త కాదు,_!
కాన్సర్, డెంగ్యూ,లాంటి విష వ్యాధులు,, ప్లేగు, కలరా, మలేరియా, ,లాంటి వైరల్ వ్యాధు ల వ్యాప్తి ని దైర్యంగ ఎదుర్కొంటూనే  ఉన్నాం_!
  ఇపుడు పుట్టిన ఈ కరోనా రాక్షసి_ కొత్త గా పుట్టిన పరాన్నజీవి,_!
  బ్రతకడానికి  "మనిషి శరీరం" అనే ఉపాధి దొరికితే చాలు ,,అది,,క్షణాల్లో_ లక్షల్ల సంఖ్యల్లో ,దాని ఉత్పత్తి పెరుగుతూనే పోతూ ఉంటుంది_!
అందుకే ,  బ్రతకాలంటే ,_ఆ కరోనా రాక్షసి కి   దొరక్కుండా తప్పించుకు తిరగాలి _!
తప్పదు _!
దాని ఆకలి తీర్చడం అంటే , స్వయంగా _బలి పశువు కావడమే ,_!
  కంటికి కనబడే దొంగను పట్టవచ్చు_!
కానీ  మనతో దాగుడు మూతలు ఆడుతూ, మనిషి ప్రాణాలతో చెలగాటం  ఆడుతున్న ఈ కరోనా రాక్షసి అనబడే  పిల్లికి దొరక్కుండా తిరిగే ఎలుకలా   భయపడుతూ,కూడా, జాగ్రత్త గా  ఉంటూ బ్రతకడం నేర్చుకోవాలి ,_!
"కరోనా రాక్షసి"  ఆకలి తీర్చడం అంటే __ప్రాణాలు  తీయడం  అనే  ఘోరహింసా కాండ , ను చూస్తున్నాం _!
ఆకలి ఎంత  చెడ్డ పనైనా చేస్తుంది, ,పాపపు పనులు కూడా చేయిస్తూ ఉంటుంది,_!
ఆకలి లో అనేక స్వరూపాలు  కూడా ఉంటాయి,_!
డబ్బు సంపాదించడం కూడా ఒక  ఆకలి రూపమే _!
ఎంత సంపాదించినా ఇంకా ఇంకా కావాలి, _! అనే దురాశ కూడా  ఆకలి రకమే_!
అలాగే  కోట్లల్లో వ్యాపారం ,, ఉద్యోగాలు చేస్తూ లంచాలు పట్టడం , అవినీతి బాగోతం , ఆస్తి పోగేయడం ,భూములు కొంటూ, బిల్డింగు లు కడుతూ, అన్యాయం అధర్మం అని చూడకుండా   , డబ్బు సంపాదన చేస్తూ ఉండడం
కూడా  దురాశ ,దురాపెక్ష , దుర్మార్గం తో కూడిన ఒక ఆకలి స్వరూపమే కదా_;
    బాగా డబ్బు  కలవారికి మదం ,అహంకారం మోతాదు మించి పోతూ వుంటుంది_!
  తను చెప్పినట్టు  ఎదుటివాడు విని తీరాలి_;
వినకపోతే  వీడు ఎంతకైనా తెగిస్తాడు, _!
"కోపం_ పగ _ద్వేషం _కక్ష లతో,, బంధుత్వం ,మానవత్వం అని చూడకుండా చంపేందుకు కూడా సిద్ధ పడతాడు_!
  మితంగా తినే ఆహారం ఆరోగ్యాన్ని ఇస్తుంది_! ,
ఏది రుచిగా అనిపిస్తే , అది తింటూ పోతూ ఉంటే అది రోగాన్ని తెచ్చి పెడుతుంది_!
  ఆహారమే కాదు, అలా మోతాదు కు మించి ,హద్దులు దాటి, నైతిక విలువలు మరచి , ఏ పనీ  చేసినా__  అది
మందు లేని రోగం అవుతుంది  ,_!
అందుకే   మనిషికి ""భోగాన్ని " అధికంగా అందిస్తూ ఉండే
ఆకలి అనేది కూడా  ఒక రోగ మే _!
      కామం , కూడా పరిమితి దాటితే , కామపిశాచి  ,, కామాంధుడు ,అన్నారు
కళ్ళు మూసుకుపోయి , యుక్తా యుక్త విచక్షణా జ్ఞానం కోల్పోయి__
ఆడపిల్ల ల పై  అత్యాచారాలు    చేస్తున్నారు _!
ఇలా తన మనసు పై నిగ్రహం లేక ,_ నియంత్రణ కోల్పోయి,, వ్యామోహం తో చేసే ఈ  రాక్షస కృత్యం ,ఆకలి రాక్షసి యొక్క  స్వరూపమే _!
,,  ఇలాంటి దుండగుల ఆకలి  సాధారణంగా తీరేది కాదు ,_!
"వేట కోసం చిరుత పులి" పొంచి ఉన్నట్టుగా_ అమాయక ఆడపిల్లల ను  కాటు వేయడానికి __ఈ కామ పిశాచాలు , ఎదురు చూస్తు ఉంటాయి_!
వినక పోతే , క్రూర జంతువు వలె ,ఎంతటి దారునానికైన  తెగిస్తారు_!చివరకు
ప్రాణాలు కూడా  తీస్తారు_!
అప్పుడు కానీ,,వారి ని
ఆవహించిన  కామ రాక్షసి ఆకలి చల్లారదు _!
  అదొక వింత రోగం లక్షణాలు  ఉన్న ఘోర ఆకలి రాక్షసి,_!
  రోజూ  వేళ తప్పకుండా,ఈ ఆకలి భూతానికి పూట కింత  ఎప్పుడూ పడేస్తూ _శాంతి పరుస్తూ ఉండాలి ,_!
" ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు_!" అన్నట్లుగా,దరిద్రుడు,ధనికుడు అనకుండా__ఆకలి రాక్షసి వచ్చే వేళ అయ్యింది అంటే _తినాల్సిందే _!
లేదా  ఆ ఆకలి  రాక్షసి నిన్ను తినేస్తుంది_!
  ఇలా  ఎన్నో దేశాల్లో ,అనేకం ,,ఆకలి చావు లతో   _ ఎంతో మంది  జీవితాలు ముగియడం మనం  చూస్తున్నాం _!
"అన్నం ప్రాణం ఇస్తుంది ,_!". అందుకే, అన్నదాత సుఖీ భవ అంటూ  ,,అన్నం పెట్టిన వారిని కృతజ్ఞతా తో కీర్తిస్తూ ఉంటాం _!
ప్రాణాలు నిలబెడుతుంది అన్నం కనుక,,
అన్నీ దానాలలో అన్న దానం శ్రేష్టం అంటాము,_!
అన్నం పెట్టిన చేతికి దండం పెడతాం కూడా _!
భిక్షాం దేహి అంటూ అన్నపూర్ణ మాతను భోజనం సమయంలో స్మరిస్తూ ఉంటాం _!
అన్నం తినకుండా అతిగా ఉపవాసాలు  ఉన్నా,,అదే పనిగా 'విపరీతంగా తిన్నా ఇంతే సంగతులు _!
అజీర్ణం ,అనారోగ్యం , రోగాల పాలవుతూ ఉంటారు _!
  ఈ జానెడు పొట్ట కోసం ,జీవులు పడరాని పాట్లు , పడతారు_!
చెయ్యరాని పనులు చేస్తూ ఉంటారు_!
""వ్యభిచారం , రౌడీ తనం , గుండాయిజం  ""అంతా డబ్బు పై దురాశ అనే ఆకలి ప్రభావమే కదా _ !
చైనా ,పాకిస్తాన్ " రాజ్య కాంక్ష"" వివాదం  కూడా ఒక రకమైన ఆకలి రోగం కోవకు చెందినదే ,,_!
తమకు ఉన్నది  ,,దేవుడు ఇచ్చింది _చాలదు ,,_!
_ఇంకా కావాలి  _!,,నీకు లేకున్నా ఫర్వా లేదు,_!
నాది నాకే, _!నీదే నాకే,_!"
ఇంకా కావాలి_!
అంటూ  అంతులేని ఆశలతో ,, స్వార్థ పిశాచం ఆవహింప జేసుకుంటూ,,దృతరాష్ట్రుని వలె  వంశనాశనాన్ని కొని తెచ్చి కుంటారు _!
రావణుడి వలె సర్వ నాశనం అవుతారు _;ఇహపర లోకాల్లో భ్రష్టు లౌతారు _!,,
పరువూ ప్రతిష్ట, నీతి నిజాయితీ,గౌరవ మర్యాదలు__ లాంటి  సద్గుణాలు , బోధనా_ _  వీరికి రుచించవు _!,
దైవభక్తి ,దైవారాధన , భగవద్గీత లాంటి సన్మార్గ చింతన లు వీరికి మింగుడు పడ వు ,_!
, జీవితంలో తృప్తి ,,  లేకుండా ,   ఆనందం అంటే అసలైన  అర్థం తెలియకుండా,, జీవిత పరమార్ధం తెలుసు కోకుండ ",,గుడ్డెద్దు చేనులో పడి అడ్డ దిడ్డ ముగ, మేస్తు పోతూ ""ఉన్నట్లుగా , ఆకలి రాక్షసి కి దాసులై, జీవిత పరమార్ధం కోల్పోయి, వెఱ్ఱి భ్రమతో , జీవిస్తుంటారు_!
,అత్యాశ తో, నిరంతరం చస్తూ  బ్రతికే ,,ఇలాంటి వారి ఆకలి లెక్కలు  చూడటం ___ ,ఆ  దేవుడికి కూడా తలకు మించిన భారం _!
__ మనం నిత్యం పేపర్లో,,  టీవీ లో _నిత్య జీవితంలో స్వానుభవం తో చూస్తున్న ,ప్రాపంచిక సౌఖ్యాలు గురించిన ఆకలి  స్వరూప స్వభావాలు అవి _!;
  జీవితంలో  ఇలా " ఇంకా కావాలి _""అనిపించే పదార్థాలకు వ్యక్తులకు ,,  దురాపెక్షాలకు  అంతు ఉండదు
తృప్తి లేదు _!
విపరీతమైన వ్యామోహాలకు ,కామ క్రోధ మోహ మద మత్సరా లకు  సంబంధించిన   తీరని ఆకలిని  _, ఎన్ని జన్మలెత్తినా   తృప్తి లేని ఈ  ఆకలిని ,_ తమ
  ప్రవృత్తిగా చేసుకుంటూ  జీవించే వారిని ,_"మనుషులు అనడం కంటే జంతువులు_"" అనడం అతిశయోక్తి కాదు కదా_!
ఇక ఇదే ఆకలికి ఉన్న మరో కోణాన్ని చూద్దాం_!
           !! సశేషం !;
స్వస్తి _!"
హరే కృష్ణ హరే కృష్ణా _!""

వాసనా బలం 2

Jul 1, 2020
శాస్త్ర వాసన ,మూడవది
,  ధర్మం ,న్యాయం ,సత్యం , భగవద్ భక్తి తెలిసినవాడు ,అనగా శాస్త్రం పట్ల అవగాహన  ఆసక్తి , ఉండి , దాని రుచి తెలిసిన వాడు ,  పొరబాటున _ప్రక్క దారిన పడితే   ఏమౌతుంది ?
  ఒక పండితుడు తన కూతుర్ని.  విద్యా బుద్దులు నేర్చిన ఒక యువకుడికి ఇచ్చి పెళ్లి జరిపించాడు
,ఏడాదికి కూతురు తండ్రి వద్దకు వచ్చి , నీ అల్లుడు  జూదం ,ఆడుతూ ,మద్యం తాగుతూ , పరాయి స్త్రీల సాంగత్యం తో పెడదారిన పడుతూ ,భ్రశ్టుడై పోతున్నాడు
అంటూ ఏడుస్తూ వాపోయింది
తండ్రి ఆమెను సముదాయించి నేను వచ్చి అతడితో మాట్లాడతానని చెప్పి తిరిగి పంపించాడు
,ఈయన వెళ్లి ,,తన అల్లుడిని ఏకాంతంగా కలిసి ఇలా చెప్పాడు
చూడూ !,నీవు చదువుకున్న వాడివి ,శాస్త్ర జ్ఞానం తెలుసు , !
నీవు చేస్తున్న మద్య పానం ,జూదం ఆట ,వ్యభిచారం లాంటి పర్యవసానం గురించి  నీకు బాగా తెలుసు
కానీ నీ భార్యకు ఇదంతా  అర్థం చేసుకునే పరిజ్ఞానం లేదు ,అమాయకంగా నీవు ఏదో తప్పు దారిన పోతున్నవని అనుకుంటూ ఉంది
,నిన్ను   అవన్నీ మానుకోమని అనడం లేదు
అయితే  అలాంటి చోటికి వెళ్ళేటపుడు  నీవు ఆమెకు కొంత జ్ఞాన బోధ చేసి వెళ్లు ,,ఒక శ్లోకం ,మంచి నీతి కథ చెప్పి  _నీ పని మీద వెళ్తూ ఉండు !
అంతే ! నీ మంచితనం మీద నమ్మకం తో ఆమె నీ తిరుగుళ్ళు గురించి ఇక  అంతగా పట్టించుకోదు ,
ఇలా నీవు చేయడం వల్ల __
ఇద్దరి మధ్య ఎలాంటి  సమస్య ఉండదు
అని చెప్పి వెళ్లి పోయాడు
  ఇతడి కి  కూడా    సంతోషంగా ఉంది,తనకు అడ్డు రాకుండా ,భార్యకు నాలుగు మంచి మాటలు చెప్పి వదిలించు కోవచ్చు గదా అనుకున్నాడు
ఆ రోజు నుండి బయటకు వెళ్ళే ముందు ఆమెను కూర్చో బెట్టి భగవద్గీత శ్లోకాలు ,జ్ఞాన యోగం గురించి చెప్తూ  ,  ఆ తర్వాత  తన  విలాస జీవితం గడపడానికి పోయే వాడు ,
అలా చేస్తూ చేస్తూ కొన్ని రోజులకు  ఆ వ్యసనాలకు దూరంగా ఉంటూ ,, వివేకంతో ఆత్మ విచారణ చేసుకుంటూ  వచ్చాడు
నేను  ఇంట్లో ఆమెకు చెబుతున్నది  ఏమిటి ? బయట నేను చేస్తున్నది ఏమిటి ?
శాస్త్ర విజ్ఞానం ఏ మాత్రం లేని ,,నేను చెప్పిందే వేదంగా   ఆమె వింటూ   నమ్ముతూ వస్తోంది
  నేను  చెప్పేదానికి , చేసేదా నికి   ఏమైనా పొంతన ఉందా ?'"
అంటూ  అత్మ విమర్శ చేస్తూ ఉంటే ,చివరకు తాను చేస్తున్న  తప్పు తెలిసి వచ్చింది ,
, శాస్త్ర వాసన ప్రభావం అలా ఉంటుంది
  ఈ మూడు వాసనలు ,దేహ వాసన , లోక వాసన,,శాస్త్ర వాసన ల గురించి అప్రమత్తత తో మెలగాలి ,
వాసన అనగా రుచి ,
ఒకసారి నాలిక తో రుచి తెలిశాక , ముక్కు తో వాసన పసిగట్టాక ఇక  మనిషి  దాన్ని అనుభవం లోకి తెచ్చుకునే వరకూ    పిచ్చి వాడి లా దాని వెనక తిరుగుతూ ఉంటాడు ,
ఒకవేళ దొరక్కుండా పోతే కోపం , ఆవేశం బాధ దుఖం ,, కసి,, పగ ప్రతీకారం ,, ఇలా ఆ పదార్థం ,లేదా వ్యక్తి గురించి మధనపడుతూ  ఉంటాడు
,దుర్యోధనుడు ద్రౌపది విషయం లో పెంచుకున్న  ఈర్ష్య కోపం ,  కట్టలు తెంచుకుని పోయాయి
చివరకు ద్రౌపదీ వస్త్రాపహరణం తో గానీ  , యుద్ధంలో అందర్నీ కోల్పోతే గానీ అతడి పగ చల్లారలేదు
, తన కున్న ఇంద్రియాల బలం దుర్వినియోగం చేస్తే , పశువు ఔతాడు
అవే పంచేంద్రియాల ను మనస్సుతో   కలిపి ఆత్మ లో లయం చేస్తే   సచ్చిదానంద స్వరూపుడు ఔతాడు
, వాసనా బలానికి లొంగ కుండా ఉండాలి అంటే , ఆ వాసన స్థలాలకు వ్యక్తులకు దూరంగా ఉంటూ, తప్పించుకు తిరగాలి
, ఎలాంటి సాంగత్యం అలవాటు చేసుకుంటే , అలాంటి వాటి వాసనల ప్రభావానికి లో నౌ తుంటాడు మనిషి
,ఎదురుగా బాహ్యంగా కనిపించే తీపి మత్తు జూదం లాంటి గురించిన వాసనలు మాత్రమే కాకుండా
గత జన్మ వాసనలు కూడా  మనిషిని వెంట బడి పీడిస్తూ ఉంటాయి
అపుడపుడు స్వప్నంలో కనిపించే భయంకర ,దృశ్యాలు  ఎన్నో జన్మల కర్మల వాసనా ప్రభావాలే
, టీవీ ,ఫోన్ సినిమాలు , మత్తు పానీయాలు, క్లబ్ లు ,విందులు ,వినోదాలు , ఇవన్నీ  వాసనలను  క్రమంగా బలపరిచేవే ,
  వాటి నుండి బయట పడాలంటే
తరుచుగా
ఆత్మ పరిశోధన చేస్తూ ఉండాలి ,
గత జన్మ లో చేసిన కర్మ ఫలాల వాసన ఈ జన్మలో అనుభవానికి వస్తూ ఉంటుంది ,,
జడ భరతుడు జింక గురించిన చింతలో చనిపోయి, జింక గా జన్మించి , అయ్యో ఎంత మూర్ఖంగా నా తపస్సు ను మాని,,ఇంద్రియాలకు వశుడ నై, జింక పై వ్యామోహం తో  జంతువు వలె ప్రవర్తించాను
భగవంతుడా ,నాకు మరొక్క   అవకాశం ఇవ్వు తండ్రీ అంటూ వల వలా ఏడ్చాడు
అలా ఉంటుంది వాసనా బలం
గీతాచార్యుడు చెప్పినట్టుగా దేన్నీ గురించి చింతిస్తూ మరణిస్తూ ఉంటాడో, మరుజన్మ లో జీవుడు అదే సంపర్కం తో జన్మిస్తాడు అని,,
హరి నామం, హరి రూపం హరి ధ్యానం చేస్తూ ,శ్వాస విడుస్తూ ఉంటే,జీవుడికి ముక్తి లభిస్తుంది ,
భీష్మ పితామహుడు ,,అన్యాయం అధర్మం వైపు ఉంటూ , ఏమీ చేయలేని విపరీత నిస్సహాయ స్థితిలో ఉంటూ కూడా , చివరి దశలో, తన ఎదురుగా శ్రీకృష్ణుని చూస్తూ   అంతిమ శ్వాస విడిచి మోక్షాన్ని పొందాడు ,,
అందుకే ఆత్మ ఉద్దరింపబడాలి అంటే  దుర్వ్యసనపరులకు దూరంగా ఉండాలి
సజ్జన సాంగత్యం అభిలషించా లి,,
దుర్వ్యస న స్థలాలకు ,వ్యక్తులకు,, దూరంగా ఉండాలి,
వివేకం తో   మంచి చెడూ  తెలుసుకుంటూ ఉండాలి
ఇదంతా స్వయంగా ప్రయాణిస్తూ ఉద్యమంగా సాగాలి
తాగుడు అలవాటు కు బానిసలైన వారు  ఇక ఆ వ్యసనం నుండి విముక్తిని పొందే అవకాశం చాలా చాలా తక్కువ ,
అలాంటి వారు , ఆ పరిస్థితుల ను  తప్పించు కుని ,, తిరుగుతూ ఉంటే  ,క్రమంగా  ఆ వాసనను  మరచిపోయే  అవకాశం ఉంటుంది ,,
అందుకే  సత్సంగం గొప్పది ,ఉన్నతమైనది ,ఉత్తమమైనది  మనిషిని , దైవం దగ్గరకు  చేర్చే అత్యుత్తమ మహోన్నత ఉత్కృష్టమైన  అద్భుత సాధనా సంపత్తి
  అలాంటి సంస్కారం ఉన్నవాడు నిజంగా అదృష్ట వంతుడు
పూర్వ జన్మ పుణ్య ఫలం ఉంటేనే గానీ ఆ "" సత్సంగ వాసన   "" లభించదు కదా
__ సత్సంగం తో , దుర్వ్య సన ల పట్ల  ఉన్న వాసనా బలం  క్రమంగా సన్నగిల్లుతుంది
, ఇది కావాలన్న  బలీయమైన వాసన కోరిక , ఆకాంక్ష, ఉండదు
ఈ దశలో మనస్సు నిలకడ గా ఉంటుంది ,ఇప్పుడు పరమాత్మ వైపు మరల్చు కొనే అవకాశం.  మనకు  ఏర్పడుతుంది
ఇదే జీవన్ముక్తి కి  మార్గాన్ని సుగమం చేస్తుంది
,అందువల్ల సత్వ గుణాన్ని స్వంతం చేసుకుందాం
  మనల్ని ప్రలోభ పెట్టే  వాసనలను  అణచి వేస్తూ ,,మనస్సును నిరంతర  దైవ చింతన తో ,,ఆత్మ విచారణ తో   ఆ  పరందామున్   భక్తి శద్దలతో ,ఆరాధిస్తూ  మానవ జన్మను సార్ధకం చేసుకుందాం
_"" సత్సంగ త్వే నిస్సంగత్వం !
నిస్సంగత్వే  నిర్మోహత్వం !
నిర్మోహత్వే  నిశ్చలతత్వం !
నిశ్చల తత్వే  జీవన్ముక్తిః _!
భజగోవిందం భజగోవిందం,!
గోవిందం భజ మూఢమతే! _!""
సర్వే జనాః సుఖినోభవంతు !
స్వస్తి!
హరే కృష్ణ హరే కృష్ణా !_""

Monday, June 29, 2020

మట్టి

June 29, 2020
"ఈ మహిలో నీ మహిమ ఎంతో__చూపావయ్యా _!
  ఈ మట్టిలో  నీ ప్రతిభ ఎంతో __ దాచేవయ్యా_!"
మట్టిలింగము లోని శివయ్యా_!
భలే చతురుడవు ,, నీకూ_ దండాలయ్యా _!!
మట్టి లోనే పుట్టేది, _
మట్టి తోనే పెరిగేది_
మట్టిలోనే కలిసేది, _
మట్టితో నే తిరిగేది,_
ఈ జీవుడే కదా_!_
      !!మట్టి లింగము !!
మట్టిలో న మాణిక్యాలు ,_! వజ్రాలూ  ,రత్నాలూ _
వెండీ ,బంగారాలను_
మట్టితో నే సృష్టి చేసి , _
మట్టియే  మాతో నిలిచే_ సత్యమని నిత్యమని ,_
భ్రమతో  మము బ్రతికించే వూ_
  మా బ్రతుకును  పండించే వు_!
      !!మట్టి లింగము!!  
మట్టి తోనే చెట్టూ ,చేమా_
మట్టి తోనే కొండా ,కోనా_
మట్టి తోనే నీరూ పారు _
మట్టి తోనే గాలి వీచు_
మట్టి తోనే ఇల్లూ వాకిలి _
మట్టి తోనే ఈగా ,దోమా_
మట్టి తోనే భార్యాభర్త_
మట్టి తోనే బంధాలు_
మట్టి తోనే ఆత్మీయులు_
మట్టి తోనే అనుబంధాలు _
మట్టి తోనే , ప్రేమా, రామా_
మట్టి తోనే నాది, నీదీ_
మట్టి తోనే నేనూ, నీవూ_
మట్టి తోనే మంట  పుట్టు_!!
      !! మట్టి లింగము !!

"మట్టి లేని బ్రతుకు లేదు_!
మట్టి లేని ప్రాణి లేదు_!
మట్టి తోనే ఆనందం _!
మట్టి తోనే ఆరోగ్యం  _!
మట్టి తోనే వాసన లు_!
మట్టి తోనే పెండ్లిల్లు_!
మట్టితోనే చావూబ్రతుకు,_!
మట్టి తోనే అనుభూతులు,
మట్టియే అని తెలిసి, మళ్లీ
మట్టి పూసుకు తిరిగేము _!
     !!మట్టి లింగము !!

"మట్టి తోనే భక్తి, ముక్తి_!
మట్టి తోనే పుట్టు శక్తి_!
మట్టి తోనే కలుగు రక్తి _!
మట్టి తోనే జీవన్ముక్తి _!
మట్టి తోనే వైరాగ్యం _!
మట్టి తోనే వేదాంతం _!
మట్టి తోనే జ్ఞా నం_!
మట్టి తోనే సాధనం _!
మట్టి తోనే జన్మ వచ్చు_!
మట్టి తోనే జన్మ పోవు_!
మట్టి యే తింపీ చంపు_!
మట్టి యే రంగుల రాట్నం _
మట్టియే నాటకరంగం_!
మట్టి తోనే పుణ్యం ,పాపం_
మట్టి తోనే దానం, ధర్మం_!
    !!మట్టి లింగ ము!!

"మట్టి తోనే దేవుళ్ళు _!
మట్టి తోనే శిలా మూర్తులు_!
మట్టితో మందిరాలు _!
మట్టి తో మసీదులు
మట్టి తోనే చర్చి_!
మట్టి తోనే పంటలు,_!
మట్టితో గాలీ నీరూ_!
మట్టి లో సముద్రాలు
మట్టిలో భూకంపాలు_!
మట్టిలో అగ్నిజ్వాలలు_!
    ఎంత గొప్పవాడవూ_ నీవు శివయ్యా _!
     చిన్న మట్టి లింగము లో కుదురుగ_ ఇమిడే వయ్యా _!!    మట్టి లింగము!!

"మట్టి తోనే  సిరులు_
మట్టి లో వైభవ లక్ష్మి ,_!
ధాన్య లక్ష్మీ,థనలక్ష్మీ,,_
మట్టి లో నారాయణుడు
మట్టి లో నే బ్రహ్మ _!
మట్టి లో సకల దేవతలు _!
మట్టి తోనే అన్నం ,నీళ్ళు
మట్టి తోనే  మనుషులు, పశువులు _!
మట్టి తోనే బొమ్మలు_ బొరుసులు_!
మట్టి తోనే చెలగాటం _!
మట్టి తోనే  జీవుని ఆటా, పాటా_!
   ;;  మట్టి లింగము !!

"మట్టి తోనే  జలచరాలు,_!
_చేపలు,మొసళ్ళు, తిమింగలాలు _!
మట్టి తోనే పాములు  కప్పలు
మట్టితోనే  నావలు నౌకలు_
మట్టి తోనే ఇసుక తిన్నెలు మట్టి తోనే మానము ,ప్రాణము _!
మట్టి తోనే మంచీ, చెడ్డా,_!
మట్టి తోనే జమా ఖర్చు_!
మట్టి తోనే మానమభిమానాలు ,_!
మట్టితోనే దీపాలు _!
మట్టితో నే పాపాలు ,శాపాలు_!

   !!మట్టి లింగము !!
మట్టితో  నే పుట్టిల్లు _!
మట్టి తోనే  మెట్టినిల్లు _!
మట్టితో నే   కొత్తిల్లు _!
మట్టితో నే  పాతి ల్లు_!
మట్టితో నే  ఆశ_!
మట్టి తోనే  శ్వాస_!
మట్టి మీదే  ధ్యాస_!
మట్టి తోనే ,_భాష _!
మట్టితో వేషాలు _!
మట్టి తో ద్వేషాలు _!
మట్టి తోనే   నాటకాలు_!
మట్టి మీదే   ఆన_!
మట్టి యే  అందరికీ తల్లి_!
మట్టి యే తండ్రీ, గురువూ_!
మట్టియే బ్రోచే దైవం _!
     ! మట్టి లింగము !!

"మట్టి తో స్నానము _!
మట్టితో పానము _!
మట్టితో దేవుళ్ళు _!
మట్టి తో నోములు _!
మట్టితో పూజలు _!
మట్టితో  నమాజు_!
మట్టి తో ప్రార్థనలు _!
మట్టి తో యాత్రలు _!
మట్టి తో దానాలు _!
మట్టి తో యజ్ఞాలు_!
మట్టి తో యాగాలు _!
మట్టితో దేశాలు _!
మట్టితో  ఆలోచనలు_!
మట్టితో అందాలు _!
మట్టి తో బంధాలు_!
      !!మట్టి లింగము!!

"ఈ మట్టియే కదా,
_ శివ లింగమైనదీ_!
ఈ మట్టియే కదా
    _విష్ణుమూర్టై నది_!
ఈ మట్టియే కదా,
   __సూర్యచంద్రాదులూ_!
ఈ మట్టియే కదా
_!బ్రహ్మాండ భువనాలు _!
_నింగిలో మెరయు ఆ
నక్షత్రాల పుంతలు _!
ఈ మట్టియే కదా_
_అండాండ పిండాలు_!
మట్టితోనే కదా
_గ్రహముల ,గమనాలు_!

    !!  మట్టి లింగము!!
మట్టితోనే సృష్టి ,_!
_మట్టి తోనే వృష్టి _!
మట్టితోనే దృష్టి, _!
__మట్టి తోనే పుష్టి_!
మట్టితో జీవనము _!
మట్టితో భావన ము_!
ఈ మట్టితో భోగ_
_ భాగ్యాల అనుభవము_!
ఈ మట్టితో ఆత్మ _
_,పరమాత్మనే   చేరు _!
ఈ మట్టి సాధనము _!
_, ఈ మట్టి బోధనము_!
ఈ మట్టియే తల్లి,_!
_తండ్రి _ఈ మట్టియే_!
మట్టియే గురువూ,,_!
మట్టియే దైవము_!
మట్టి యే సర్వమూ,_! సర్వమూ బ్రహ్మము _!
    అని తెలుపుటకే కదా _!
_ పార్థివ శివ లింగ_
రూపంలో కొలువుండీ_
మా పూజ లందుచూ_
, __మమ్ము కరుణీంచేవూ_!
      !;మట్టి లింగము!;

మట్టి కానిది ఒకటి_! _అదియే పరబ్రహ్మము_!
మట్టి కానిది_ మాసి _
పోనిది _అదె ఒకటి_!
సత్య ము, అనంతము , బ్రహ్మము అది ఒకటే,_!
మట్టి బ్రహ్మము , మట్టి_ _బొమ్మ లూ  బ్రహ్మ మే_!
మట్టి కుండలు_ బ్రహ్మమే_! కొండలూ బ్రహ్మమే,_!
మట్టి తో చేయబడు_ ప్రతి పదార్థమూ  బ్రహ్మమే,_!
మట్టి అణువణువున  _
ఉన్న చైతన్య  రూపమే_
పరంజ్యోతియై వెలుగు ,_   ఆ పరమాత్మ తత్వమే_,
నదులలో,వాగులో
,చెరువులో ,బావిలో,
నీటి యందగుపించు _సూర్య దేవుని వలె
ఒక్కటై   తావెలుగు,_! అనేకముగ భాసించు,,_!_
అన్నింటిలో తాను_!
,తాను అన్నింటిలో_! సర్వాత్ముడై  యుండు
తానే అంతై ఉండు_!

   !; మట్టి లింగము !!
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని  కొలువ
ఈ మట్టి దేహమే
,_, దీపమై తోడుండు_!
ఈ జీవునికి  మోక్ష__ _మార్గమును చూపించు,_!
ఇది మట్టి దేహము కాదు_!
వట్టి దేహము  కాదు_!
భగవంతు డిచ్చి నా 
అపురూప అవకాశం_!
అమూల్యమైన వరము _!
ఈ మానవ జన్మము _!
సకల ప్రాణుల కన్న బహు_
_ ఉత్కృష్ట మైనది _!
దీనికోసమే కదా_ _రాముడూ ,కృష్ణుడూ
వివిధ అవతారాలతో ,
_భువికి దిగి వచ్చినది_;
నాలుగూ వేదాలు,
స్మృతి ,శృతి, పురాణాలు_
యోగము ,శాస్త్రము
,ధర్మము చెప్పినది_!
  _ దేహ వాసన తొలగి ,, పరము కావాలంటే ,_
జీవాత్మ పరమాత్మ_
,_ యందు కలవాలంటే_,
ఈ మట్టి దేహమే
_,శోధించి _సాధించు,_!
ఆత్మానుభవముతో
భాసించు _శోభించు_!
పుణ్య భారత_భూమి మట్టి లో పుట్టి, నా,
ఈ మట్టి లో గిట్టినా,
జన్మ రాహిత్యమౌ_
  భక్తి శ్రద్ధలు కలుగు _!
అందుకే __!
ఈమట్టియే శరణము_!
మట్టి యే దైవము_!
మట్టి యే మార్గము_!
మట్టి యే బ్రహ్మము_!
మట్టి యే జీవుడు,_!
మట్టి యే దేవుడు _!

మాతృ భూమి కీ జై
భూమా త కి జై
గోమాత కి జై
శ్రీ మాత కి జై

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...