Sept 16, 2020
"రాధా _! నాపై నీ కున్న ప్రేమ ఎంత ?
" కృష్ణా_!_ అంతులేని అగాధ సముద్రమంత _!
కాదు_ కాదు_!
ఈ అనంతమైన విశ్వ మంత __!
"రాధా _!నేనంటే నీకు ఎందుకింత ప్రేమ ?
_""అది నేను అడగాలి నిన్ను
"కృష్ణా _! అయినా ,నేను అంటూ వేరే లేను , కదా,_!
నీవే నేను _!
నేనే నీవు _!
అందుకే ,నేనే నీవై న , నీవు అంటే ఇష్టం నాకు ,ప్రాణం_!, ప్రేమ _! స్వామవిి, ప్రభువు,భర్త ,కర్త అంతా నీవే , సర్వస్వం నీవే ,_!"_
"రాధా_! క్షణమైనా నేను నిన్ను విడచి ఉండలేక పోతున్నాను,, ,ఎందుకో తెలియడం లేదు నాకు ?_!""
_ "కృష్ణా_! అది రేపల్లె గోపికలను అడుగు ,వారు చెబుతారు _ నీకు ఎందుకో _!"" రాధా,నీకు అసూయ కలగడం లేదా,నాకోసం పరితపించే ఆ , గోప స్త్రీలను చూస్తుంటే ?""
_""కృష్ణా _! మహా రాసలీల వైభవం పొందిన తర్వాత ఏ వ్రజ వనితలకు అలాంటి వికారాలు , అసూయ కలుగుతూ ఉంటాయి చెప్పు _?""
""రాధా _! నిన్ను ఇక్కడకు ఈ రోజున తీసుకుని వచ్చింది ,,_" అదిగో ఆ జయదేవ కవి ఉన్నాడే,,,నీకు అత డిని చూపించ డానికి ,,_!!"" , గీతా గోవిందం"" అనబడే మధుర కావ్యం రాస్తూ ఉన్నాడు చూశావా ?""
"" కృష్ణా _! మన రాధా మాధవ ప్రేమ తత్వం అర్థం కావాలి ,, అంటే __ఈ జయదేవుడు రమణీయంగా కమనీయంగా ,,, శ్రవనానం దము గా ,,మనోహరంగా , మధురాతి మధురం గా , రచిస్తూ ఉన్న_ ఆ అష్టపదులు చదివితే చాలు ,నాకు నీపై ఉన్న ప్రేమానుబంధం నీకు తెలుస్తుంది తెలుసా _! నా ప్రేమ ఇంత, అంత అని ,నేను ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు గోవిందా _!""
""నిజమే రాధా _! మన కే కాదు , మన భక్త జనులను కూడా ఆనందింప జేసే రసవత్తర రమణీయ దృశ్యకావ్యం ఇది _!! ఈ జయదేవ కవి ,బృందావనం లోని అణువణువూ తో మనకున్న అవినాభావ సంబంధాన్ని అద్భుతంగా తన అష్టపది రచనా శైలి లో వర్ణిస్తూ ఉన్నాడు సుమా _!; రాధా మాధవ శృంగారకేళి ,విరహ తాపాన్ని , ఇంత గొప్ప మహత్తర రస రమ్య శృంగార ప్రబంధం గా ఆవిష్కరించడం ఇతడికి ఎలా సాధ్యం అయ్యిందా అని నా సందేహం రాధా _!_??""
""కృష్ణా , ఎంత మాయగా డివయ్య నీవు ,?!_! నిన్ను గాఢంగా విశ్వసించి , నీ కోసమే బ్రతుకుతూ__ నిన్ను ఆరాధించే నీ అపర భక్త శిఖామణి గురించి ,నీకు తెలియ కుండా ఉంటుందా , స్వామీ?? _!
""రాధా _! నమ్ము_!! ,నా మాటలు _! _, ఈ జయదేవుడు రమణీయంగా చిత్రీకరించే ప్రతీ దృశ్యం యదార్థం ,_!
__ మన యమునా తీర విహారం , పూల పొదరిండ్లు , మలయ పవనాలు , ఈ నా చిలుక అలుక లు ,_ నా పరోక్షంలో నీ చెలులు నా గురించి చెప్పిన ఓదార్పు మాటలు , నీ విరహం నిట్టూర్పులు ,కోపం ,దుఖం,ఇలా ఎవరూ చూడని మన ప్రేమా నుభవం ,, ,అన్నీ ఈ మహానుభావుడు మన కోసమే ,మన ఇరువురి ప్రేమానురాగాల గురించే ,, తాను రచిస్తూ ఉన్న ఈ గీత గోవిందం కావ్యం లో,, మన గుట్టు రట్టు చేస్తూ, మన ప్రణయ గాథ, బట్ట బయలు చేస్తువున్నాడు ! చూశావా రాధా _?""
""మాధవా __! నీ అనుగ్రహం లేకుండా , నీ శృంగార లీలలు దర్శించే భాగ్యం కలగడం సాధ్యమా ? చెప్పు _?!""
"రాధా _! నీవు ఇలా చెప్పాలి , ఈ రాధా దేవి అనుగ్రహం పొందకుండా నన్ను చేరుకోలే రు అని_! కదా _! __!""!నా మాట అసత్యమా చెప్పు ??
"" కృష్ణా _! నీ గురించి చెప్పే ప్రతీ కావ్యం , ఇతిహాసం,, పురాణం , ప్రబంధం ఏదైనా అందులో నా ప్రసక్తి లేకుండా ఉంటుందా చెప్పు ,?"""
"" రాధా _! చూడు , ఇంతవరకూ అనందంగా రచన చేస్తూ ఉన్న జయదేవ కవి __ అయ్యో ,అదేమిటి _?! ఒక్కసారిగా విచార వదనంతో ,రచన ఆపి వెళ్లి పోతున్నాడు , ఏమైంది రాధా ?""
"" మాధవా_!! ,అదిగో__ ఆయన భార్య పద్మావతి ఇదంతా చూస్తూ కూడా ఎమీ మాట్లాడ టం లేదు_ సుమా , అంతా నిశ్శబ్ధం_! ,,
"మనం ఏం చేద్దాం రాధా,_?
""కృష్ణా మన ప్రియభక్తుని కి కలిగిన ఖేదం తొలగించ కుండా ఉంటామా _ చెప్పు _!? మనం వచ్చింది అతడిని అనుగ్రహించ డానికే కదా ప్రభూ _!_ నీవు వెళ్ళి , ఆ కావ్య రచన అతడు ఎక్కడ ఆపాడో __ ఎందుకు ఆపాడో చూడు , _!;నీకు అర్థం అవుతుంది అతడి విచారానికి కారణం _!_!"
,"" రాధా _! ఎలా వెళ్లను,__? ఈ కృష్ణ రూపం తోనా _?
"" కృష్ణా ,_! అన్నీ తెలిసిన నీకు ఏమని చెప్పను _? నాతో చెప్పింతు వేమయ్యా , నటనా గ్రేసర చక్రవర్తి _!?? నిన్ను మించిన మహా నటులు లేరని నాకు తెలుసు లే , నంద నందనా _!! నంద కిషో రా ,,_!వెళ్లు స్వామీ __!తొందరగా ,_! జాగ్రత్త _! పద్మావతి భర్త రూపంలో , వెళ్ళి చూడు _!_ఆమెకు అనుమానం రాకుండా నటించు _ అని చెప్పాలా __జగన్నాటక సూత్రధారి ??_!" నేను కూడా ఉంటా ను లే__ నీ ప్రక్కన __!ఆమెకు అగుపించ కుండా _!
""రాధా _! చూడు ఈ అష్ట పది __! ఇక్కడే రాసి కొట్టి వేశాడు , ఎందుకో ,, తనకి నచ్చలేదు కాబోలు _!_!""
"" కృష్ణా _! ఏ సందర్భము అది ? తాను రాసింది తనకే నచ్చలేదు అంటే ,ఎదో సంకట స్థితి లో ఉన్నాడు అన్నట్టే గా _ మన జయదేవుడు ,_!""
"" హే రాధికా _! ప్రియతమా__! ,ప్రియే _!, చారు శీలే ,_!రాధే ,! ఇందాకా మనం అనుకున్న మన ప్రేమ విషయమే అతడి బాధకు కారణం అయ్యింది సుమా _!, చూడు _ఇక్కడ_!!"'
""అవును కృష్ణా_! నా ప్రేమ విషమై నిన్ను కాటేస్తు ఉంది అట _! అమ్మో _!!"" స్వామీ ఇది నిజమా ? నిన్ను అంతగా బాధ పెడుతూ ఉన్నానా నేను ?"_
"" స్మర గరళ ఖండనం _
మమ శిరసి మండనం _
దేహి పద పల్లవ ముదా రం__!""
_!"" కృష్ణా ఇతడు మన ప్రేమ గుట్టు రట్టు చేస్తున్నాడు సుమా _!"
"" రాధా _! నీ చిగురు టాకులవంటి నీ కోమలమైన మృదువైన పాద పద్మం తో నా శిరస్సును ,, నీ కాలితో తాకితెనే గానీ , నా తలకెక్కిన నీ ప్రేమ అనే ఈ విషము తగ్గదు సుమా _! అని నేను ఆ పొదరింటి లో,,బాధపడుతూ నేను నీతో అన్న విషయం కూడా రాశాడు ,,_! ఎలా తెలిసిందో కదా ఈయనకు _?!"'
కానీ రాధా నేను పొందిన ఆ బాధ కంటే , నా గురించి నా భక్తుడు పొందిన ఈ బాధే ఎక్కువగా ఉంది _!;, ""చూశావా__! ఇవే చరణాలు__! రాసినవి కొట్టి వేశాడు ,_! అలాంటి చెడు ఆలోచన కలిగినందుకు,,తాను బాధ పడుతూ ఉన్నాడు రాధా_!!" మనం ఇపుడు ఏం చేద్దాం ?""
"" కృష్ణా _!! భక్తుడు పొందిన అనుభూతి మనం ఆనందంతో అనుభవించిం దే కదా ,,_! కల్పన కాదు కదా _; స్వామీ _!! తాను దైవంగా భావిస్తూ ఉన్న కృష్ణ పరమాత్మ తలపై ,, రాధాదేవి కాలితో తాకడం ,అన్న సున్నిత భావనను పాపం , అతడు తట్టుకోలేక పోయాడు __!అందుకే ఆ చరణాలను కొట్టి వేసి , ఇటువంటి ఆలోచన తనకు వచ్చినందుకు సిగ్గు పడుతూ వెళ్ళి పోయాడు
కృష్ణా _! ""
""" రాధా _! జయదేవుని కి కలిగిన అనుభూతి నిజం అని నిరూపించాలి మనం_! ఏమంటావు నీవు _??"" _! ""అవును కృష్ణా _! అవే చరణాలు మళ్లీ నీవే __నీ స్వహస్తాలతో రాస్తే _ సరి పోతుంది కదా _! """ జయదేవుని రూపంలో ఉన్న నీవు అలా రాస్తూ ఉంటే , చిరునవ్వుతో , చూస్తూ ఉన్న పద్మావతి ,, నిజంగానే నిన్ను తన భర్త గా అనుకుంటూ ఉంది , రాధా మనోహ రా _ అదిగో అతడి సతీమణి పద్మావతి , నిన్ను ఓరకంట చూస్తూ మందహాసం చేస్తూ ఉంది ,చూడండి ,,_!
"" ఆమెను నీవు కనిపెట్టు _ కానీ ,రాధా _!,నీవు చెప్పినట్టు అవే పదాలు తిరిగి రాశాను _!, నీకు తెలుసా ,_ రాధా ! అసలు ఈ అష్టపదులు రచనకు మూల కారణం ఎవరో _?""
"" కృష్ణా _! ప్రతీ భర్త విజయానికి వెనుక భార్య హస్తం ఉంటుంది __!
రాధా ఇలా నీవు నా వెనక ఉంటూ , నా పనులు చక్కచేస్తు ఉన్నట్టుగా అవునా _?
అలా నవ్వకు కృష్ణా _! ఇది వాస్తవం _! స్త్రీ అనే శక్తి తోడు లేని ఏ పురుషుడూ స్పందన లేని శిల వలె జడ పదార్థం అవుతాడు సుమా_! చూడు ఈ పద్మావతిని ,, తన నాట్యం తో హావ భావాల అభినయం తో , భర్తపై తనకు గల అమితమైన ప్రేమతో ,, అతడి కావ్య రచన కు అడుగడుగునా ఉత్సాహాన్ని మనసులో నింపుతూ ప్రోత్సహించిన ఈమె నిజంగా ధన్యు రాలు , మాధవా _!""
""రాధా , తన భర్తకు గల అపారమైన , శ్రీకృష్ణ భక్తి తత్వం అర్థం చేసుకొని ,, అతడిని తన నటనా చాతుర్యం తో బుద్ది కుశలత తో ఉచిత రీతిలో ప్రేరేపించిన ,ఇలాంటి పతివ్రతా శిరోమణి ,, కృష్ణ ప్రేమకు అంకితమైన అలాంటి కవి శ్రేష్ఠుడు , భక్త శిఖామణి ___
ఇరువురూ ధన్యులే , రాధా _! మన ప్రేమ కు , బృందావన దివ్య సీమకు , గీత గోవిందం అనే కావ్యం ద్వారా రూప కల్పన కావించిన ఈ పుణ్య దంపతులు జీవన్ముక్తి పొందుటకు యోగ్యులు కదా _!,
""కృష్ణా__! అసలు జయదేవుడు వచ్చే వేళ అయ్యింది , కలం పెట్టేసి లే __ అక్కడినుండి. ,,_! స్వామీ _! పద _పద , తొందరగా _!,
""అయిపోయింది రాధా రాయడం ,, పద _!!!
అమ్మయ్య అనుకున్నట్టే వచ్చాడు , అదిగో చూశాడు మనం రాసింది ఆహా , _! అతడి మొహం లో ఎంత ఆనందం వెలిగి పోతూ ఉందో చూశావా రాధా __!""?
__"" కృష్ణా _!తన భార్యను పిలిచ అమిత ి సంతోషం తో చూపిస్తూ ఉన్నాడు _!!,వారి భక్తి విశ్వాసాలు , కావ్య రచనా పరిశ్రమ కు "రాధా కృష్ణ పరమాత్మ ""అనుగ్రహం లభించినందుకు ఎంతగా పరవశిస్తూ ఆనందిస్తూ ఉన్నారో చూడు ,_!"
""కృష్ణా నీ సన్నిధానం లో ఆమెకు కలిగిన మహదానందం తో దంపతులు ప్రణామాలు చేస్తూ ఉన్నారు , చూడూ ,_! స్వామీ , జయదేవ దంపతులు ముక్తిని ఎప్పుడు పొందగలరు _?""
""రాధా _! నీ అనుగ్రహం పొందాక ముక్తి మార్గం సులభతరం అవుతుంది కదా _! , మన ఇద్దరమూ అతడి అంతరంగంలో అనునిత్యము నర్తిస్తూ ఉంటాము , __; _ ! అయినా
రాధా ,_! నాకు తెలియని విషయమా ,, నీ కు నాపై గల ప్రేమాతి శేయం ??,_!
మన ప్రణయ గాథ ను , ప్రేమానురాగాల ను మానవాళికి ఆదర్శంగా ఉండేట్టు గా , దంపతుల ప్రేమ అద్వైత ప్రేమ గా , ఒకరికొకరు ప్రాణం గా భావించే విధంగా ఉండేందుకు ఒక ఉదాహరణగా ఉండాలని ,__ కదూ ,, రాధా,,నీవే స్వయంగా పద్మావతి అంతరంగంలో నర్తి స్తు,, నీ నాట్య గతుల ద్వారా , పద ఘట్టన ము తో ,,, కాలి అందెల సవ్వడి తో ,, సుస్వర సంగీత భరిత ధ్వనులతో , అలరింపజేస్తు ,,ఈ గీతా గోవిందం కావ్య రచనకు అష్టపదుల గాన మధురిమ కు ప్రాణం పోస్తూ __మన ప్రేమకు సచ్చిదానంద స్వరూ పాన్ని , ఆపాదించి పాత్ర పోషణ చేస్తూ_ పరోక్షంగా ,_ ఈ కావ్యానికి శాశ్వత త్వాన్ని కల్పించా వు కదూ రాధా__;""
""కృష్ణా _! నేను పద్మావతి అంతరంగం లో ఉన్నాను అంటే నీవు జయదేవుని లో అంతర్యామి గా ఉంటూ అతడి బుద్దిని ప్రేరేపిస్తూ , అతడి కలం పట్టుకొని " సంస్కృత సాహిత్యం లో అష్ట పదులు అన్న నూతన కవిత్వ కావ్య రచన కు శ్రీకారం చుట్టా వని అర్థం కదూ కృష్ణా __!
జయదేవ కవి రచిస్తూ ఉన్న తమ ప్రణయ కావ్య రచనా ఆనంద పారవశ్యంలో ఇలా రాధా కృష్ణులు ఆనందానుభూతి పొందుతూ , పరస్పరం సంభాషిస్తూ , వారి ఆనందనిలయమైన, గోలోక ధామ మైన , పరమానంద కరమైన , వారు నడయాడిన బృందావనం చేరుకున్నారు
__ అద్వితీయమైన ,అపురూపమైన, సాక్షాత్తూ శ్రీకృష్ణ భగవానుని అపార కృపా కటాక్షములు తనకు లభించడానికి __కారణం జయదేవుని అంకిత భక్తి యే కదా _!
__"కొందరు పుట్టుకతోనే జన్మతః భక్తులై , జ్ఞానులై ఉంటారు ,_!
భక్తి భావంతో సాధన చేస్తే భగవంతుడే ఏదో ఒక రూపంలో వచ్చి అనుగ్రహిస్తాడు అని నమ్ముతూ ఉన్న జగన్నాథ స్వామి భక్తుడు , ఈ జయదేవుడు _! అతడు ఏక సంతాగ్రాహి ,_! జగన్నాథుని పై కలిగిన ,అపార భక్తి విశ్వాసాలతో ,,అతడు ,ఆడుతూ పాడుతూ ఆశువుగా గానం చేస్తూ ఉంటే , స్వామి లీలలు అతడికి కళ్ళకు కట్టినట్లు కనబడుతూ ఉండేవి _!
జనాదరణ pindua అతడి గీతాలు పాడుకుంటూ భక్తజన కృష్ణ భక్తి తన్మయత్వం లో స్తుతిస్తూ ,జయదేవుని అష్టపదుల వైభవాన్ని ఆనందిస్తూ ఉండేవారు _! ఆ విధంగా ,,
జయదేవుడు శ్రీకృష్ణుని పరబ్రహ్మ స్వరూపం గా పూజించాడు _;
గీత గోవిందమును శృంగార రసముతో , మధుర భక్తి తో , శ్రీకృష్ణుడు, పరమాత్మ గా , నాయ కుడుగా , రాధాదేవి జీవాత్మ గా ,నాయకీగా చిత్రీకరిస్తూ భక్తి భావంతో స్తుతించాడు __!
జీవాత్మ పరమాత్మల అనిర్వచనీయ మైన__ అవినాభావ ప్రేమానురాగాల అనుబంధమే __ ఈ ""గీత గోవిందం ""అనబడే కావ్య సారాంశం _!
హరిః ఓం తత్సత్ _!
స్వస్తి _!
హరే కృష్ణ హరే కృష్ణా _!
Thursday, November 12, 2020
జయ జయ దేవ_ జయ రాధా మాధవ!
Sunday, September 13, 2020
కరోనా కుంభ కోణం
Sept 12, 2020
"నమస్కారం సబ్ ఇన్స్పెక్టర్ గారూ !"
_""నమస్కారం , _! రండి ,ఇలా కూర్చోండి _!""
""థాంక్స్ అండి _! ""
""చెప్పండి ,_! ఏం కావా లి మీకు_?"
""నా పేరు రాజ శేఖర్ ,_!: ఇక్కడే ,ఇదే బెంగళూర్ సిటీ లో , నేనొక సాప్ట్ వేర్ ఉద్యోగిని , ,_!
" అవునా,,సంతోషం ,,_! మీకు నాతో ఏం పని పడింది _!?
"" పెద్ద సమస్య వచ్చి పడిందం డీ ,_! నిన్న మా తల్లి గారికి కిడ్నీ సమస్య కోసం ఇక్కడే ఒక పెద్ద హాస్పిటల్ కి తీసుకెళ్ళాను ,,_! కానీ వాళ్ళు ముందు కరోనా పరీక్ష చేయాలి అన్నారు _!'"
,",మంచిదే కదా _! ఇప్పుడు , ఇది మామూలు వ్యవహారం అయ్యింది ప్రతీ హాస్పిటల్ లో _!చేశారా ? _ ఏమన్నారు ??"
""చేశారు _!"
""ఏమైంది , తర్వాత ?""
తమ పరీక్షలో ""కరోనా పాజిటివ్"" అని తేల్చారు వాళ్ళు _!
""అవునా ,అయితే ముందు మీరు లేచి దూరంగా ఉండండి రాజూ _గారూ _!"
_""అంత భయపడకండి మీరు , ఇన్స్పెక్టర్ గారూ _! పూర్తిగా నన్ను చెప్పనీ యం డీ _!
__"" కరోనా అంటేనే వణకు వస్తోంది_! చెప్పండి _ తొందరగా _!""
""మా అమ్మ సంపూర్ణ ఆరోగ్యం గా ఉంది,, బీపీ షుగర్ లు లేవు _! ,జెనరల్, చెకప్ కోసం పోతే ఇలా కావడం ఆశ్చర్యంగా అనిపించింది,, ఆ రిపోర్ట్, మేము నమ్మకుండా ,మళ్లీ వేరే పెద్ద హాస్పిటల్ లో పరీక్ష చేయించాను ,_!"" నిన్ననే వెంటనే _!"
"" ఏమైంది మరి అక్కడ _?
""_ అక్కడ" నెగటివ్ ""అని చెప్పారు _!""
_""ఏమిటీ ,ఒకే మనిషికి , ఒకే రోజున , రెండు రకాల రిపోర్ట్స్ వచ్చాయా _? __"చెప్పండి_! చెప్పండి _!,తర్వాత మీరు ఏం చేశారు _?,ఎక్కడికి వెళ్ళారు _?
__ఎక్కడికి వెళ్ళలేదు సార్ _! ,, ఏం చేయాలో తోచక ఇంట్లోనే ఉండి పోయాం _!"
_"" తర్వాత _?
"" ఈ రోజు ఉదయం మున్సిపాలిటి వారు వచ్చారు మమ్మల్ని వెతుక్కుంటూ __!""
""దేనికీ _ రాజు గారు ? ఇంత త్వరగా వాళ్లకు ఎలా తెలిసింది ,,?
,__హాస్పిటల్ వాళ్ళు వారికి ఫోన్ చేసి చెప్పారా , ఈ విషయం _?
""అదే అడిగాను , నేను _! వాళ్ళు , అవునన్నా రు _!""
మేము ఇల్లు చేరామో లేదో వాళ్ళు దిగారు ""కరోనా రంగం"" సిద్దం చేయడానికి_! _!, మా అమ్మ కరోనా పేషంట్ కనుక మా లోకాలిటీ మొత్తం కంటోన్మెంట్ బోర్డు తగిలిస్తూ బ్లీచింగ్ పౌడర్, చల్లుతూ రోడ్లు ఇల్లూ కరోనా విస్తరించకుండా నివారణ చర్యలు చేస్తూ ఉన్నాము అన్నారు _!""
_ "మరి , రాజూ గారూ ,_!అమ్మ గారికి పాజిటివ్ కాదు __!మళ్లీ పరీక్ష చేయించాను __! నెగెటివ్ వచ్చింది __!అని చెప్పారా లేదా __?!""
"" అదీ చెప్పాను_! రిపోర్ట్ కూడా చూపాను _ వారికి !!మాకు అదంతా తెలియదు ,_! వార్డ్ మెంబర్ ,,కౌన్సిలర్ చెప్పినట్టు చేస్తున్నాం అన్నారు _!""
""_ రాజు గారు , _!వాళ్ళు అలా కరోనా హడావుడి చేస్తుంటే మీ colony వాళ్ళు చూస్తూ ఉన్నారా _?""
పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు _ చెప్పండి _; కరోనా అంటే అందరికీ భయమే కదా _! ఇపుడు _;అంతా ఇళ్ళల్లో కెళ్ళి డోర్ లాక్ చేసుకొని కిటికీ లనుండి తమాషా చూస్తూ ఉన్నారు _!__ నాకు ఏమీ తోచక __మీ సలహా కోసం ,మాకు సహాయం చేస్తారని వచ్చాను _!""
__""రాజు గారు _ చాలా మంచి పని చేశారు మీరు _! మీకు తెలియదు ,ఈ కరోనా వ్యవహారం కూడా ఇపుడు రాజకీయం చేస్తున్నారు ,హాస్పిటల్ వాళ్ళు _!""
"" ఇందులో రాజకీయం చేయాల్సిన అవసరం ఏముంది,? సార్ ,_!"
"" రాజు గారు _!మీ రు తెలుసు కోవాల్సిన విషయం ఇక్కడ ఒకటి ఉంది _!, అది మీకు చెబుతాను _!కానీ మీరు మాత్రం ఆ విషయం ఎక్కడ __ఎవరితోనూ చెప్పవద్దు సరేనా _!""
"" అయ్యా నా కెందుకు ఆ కరోనా గోల , _?ఎక్కడా చెప్పను కానీ__
ఈ కరోనా మిస్టరీ ఎదో కాస్త క్లియర్ చేయండి , సార్ _!మీకు పుణ్యం ఉంటుంది ,__!""
__ అదే చెబుతున్నాను రాజు గారు __ ఆ హాస్పిటల్ సిబ్బందికి __ఈ మున్సి పాలిటి వాళ్లకు _ వార్డ్ మెంబర్ లకూ మధ్యే ఒక ఒప్పందం ఉంటుంది _!
". ఒప్పందమా ?_ దేనికీ,, _?""
__ అవును సిటీలో ఎక్కడైనా , కరోనా పేషంట్ ఉంటే ,అతడు ఉన్న ప్రాంతంలో కట్టుబాటు చేసేందుకు_ కరోనా నియంత్రణ కోసం ,_ అధికారులు ఆ ప్రాంతం వార్డ్ మెంబర్ కు నాలుగు లక్షలు మంజూరు చేస్తారు ,__!;"
"" మంచిదే కదా _!"
""అందులో ఒక లక్ష ఖర్చు అయ్యింది _""అనిపించి మిగతా సొమ్ము స్వాహా చేస్తారు _!""
""అమ్మ బాబోయ్ _!ఇంత గూడు పుటా నీ ఉందా దీని వెనుక _?
"" అలా జరిగినా కొంత డబ్బు జేబుల్లో వేసు కున్నా , ఫర్వా లేదు కరోనా పేషంట్స్ ని రక్షించేందుకు _! కానీ ఘోరమైన ,నమ్మలేని విషయం ఏమంటే కరోనా వ్యాధి లేనివారికి కూడా __ ""పాజిటివ్ ""అని పరీక్షలో వచ్చిందని రిపోర్ట్ ఇస్తారు , వారు ఉంటున్న వార్డ్ మెంబర్ కు ఫోన్ చేసి చెబుతారు , కూడా
""అంటే తప్పుడు రిపోర్ట్ ఇస్తారా ,_?
""అవును మీకు ఇచ్చినట్టే "" _!
"" ఇంత అన్యాయమా _? పెద్ద హాస్పిటల్ అని నమ్మి వెళ్తే _? దేనికోసం రోగులను ఇంత మోసం చేయడం _?
హాస్పిటల్ వారూ, రాజకీయ నాయకు లు కలిసి కేస్ పోకుండా బయటకు పొక్కకుండా , చాటు మాటున , ""టై అప్ "" అంటే ఒడంబడిక చేసుకుంటారు _!
_""తమ చేతికి_దొరికినంత దోచుకో వడానికి __ఈ కరోనా వ్యాధి బాధితులను కూడా ,అడ్డం పెట్టుకొని లక్షలు సంపాదిస్తూ ఉన్నారు __ ఇలా కరోనా ను రాజకీయం చేస్తూ _!
__"" సార్ ,! నేను మళ్ళీ కరోనా పరీక్ష చేయించు కోవడం చాలా మంచిది అయ్యింది , బతికి పోయాను_! అమ్మో _! లేకపోతే , తనకు ,కరోనా నిజంగానే సోకిందని _ 80 ఏళ్లు నిండిన మా అమ్మగారు దిగులుతో _మంచం పట్టేది కదా _!""
_""_రాజు గారు,_! డాక్టర్స్ లను హాస్పిటల్ ను పూర్తిగా నమ్ముకొని ప్రాణాలు కాపాడుతారు అని విశ్వాసం తో వచ్చే ప్రజలను __ఇలా మోసం చేస్తూ దొడ్డి దారిన డబ్బుకు కక్కుర్తి పడే వారు , __దేనికైన తెగిస్తారు_! వారికి సిగ్గూ శరం,మానం,అవమానం అభిమానం వుండవు కదా _!""
,"" అయ్యా _!సబ్ ఇన్స్పెక్టర్ గారూ _!నన్ను _ మా అమ్మ గారిని _ఈ కరోనా మహమ్మారి నుండి రక్షించారు _!!మీకు ధన్యవాదాలు , _! మీకు రెండు చేతులూ జోడించి,,మా కృతజ్ఞత తెలియ జేస్తూ ఉన్నాను __!; ఇపుడు మా ఇంటి చుట్టూ జరుగుతున్న అబద్ధపు కంటోన్మెంట్ నాటకం నుండి మేము బయట పడేది ఎలా_? __ సార్ ,_!ఇంత ఉపకారం చేశారు _!,ఇక
దయచేసి ఆ కంటోన్మెంట్ చిక్కునుం డీ కూడా మమ్మల్ని రక్షించండి _!,,మీ ఖర్చు లు ఏదైనా ఉంటే ఇచ్చుకుంటాం _!""
_ ""రాజు గారు _!ఆ దిగులు కూడా మీకు అవసరం లేదు,_! వెళ్ళి మీ ఇంటిలో ప్రశాంతంగా ఉండండి ,_! జరిగినది అంతా మరచి పొం డీ _!""
""మా కాలనీ వాళ్లకు ఏం చెప్పాలి నేను సార్_?""
_"" వాళ్లకు ఏదో తప్పుడు సమాచారం అందింది అట _!,అందుకే వచ్చారు వాస్తవం చెప్పాను వెళ్ళి పోతున్నారు , అనండి _! అంతే _!""
"" నేను అంటాను వారితో_! కానీ వెళ్ళి పొమ్మని వారితో ఎవరు చెబుతారు సార్ _?""
__ఆ విషయం నాకు వదిలేయండి రాజు గారు _! నేను మీ కాలనీ వార్డ్ మెంబర్ తో ఇప్పుడే ఫోన్ లో మాట్లాడుతాను ,_!, మీరు ఇంటికి వెళ్లేసరికి అంతా క్లియర్ చేస్తా రు వాళ్ళు సరేనా _!"",
_"" సార్ చాలా థాంక్స్ అండి మీకు _!
__ రాజు గారు _! నా దగ్గరకు వచ్చారు కదా , అడగకున్నా ,మీకు ఒక సహాయం చేస్తాను ,_!""
__"" చాలా సంతోషం సార్ _! దానికి నన్ను ఏం చేయమంటారు చెప్పండి _?!""
ఏం లేదు ,_ ఈ కరోనా డబ్బులు _కుంభ కోణం,రాజకీయం ,తప్పుడు సమాచారం , మన మధ్య జరిగిన ఈ మాటలు , ఇవన్నీ ఇక్కడే మరచి పొండి , ,అంతే _!""
""సరే సార్ _! గాలికి కొట్టుకు పోయె కంప ,నాకెందుకు _? ఎక్కడ అనను _!""
_""రాజు గారు __! మీ వార్డ్ మెంబర్ తో చెప్పి _ రేపే,మీ అమ్మగారికి,మీరు కోరుకున్న హాస్పిటల్ లో __ ఉచితంగా కిడ్నీ పరీక్ష చేయిస్తాను , _; మళ్లీ ఏ కరోనా పరీక్ష చేయాల్సిన అవసరం లేకుండా _!_"" మీకు ఓ కే నా ,చెప్పండి _??""
_""వద్దు సార్ , _! ఇక మేము ఇక్కడ ఉన్న ఏ హాస్పిటల్ లో కూడా__ ఏ పరీక్ష చేయించు కోము ,_! ఇంత ఘోరం కళ్ళారా చూశాక కూడా , ఇంకా ఇక్కడి హాస్పిటల్ కు వెళ్ళడమా _? _ అమ్మో _!!"" హాస్పిటల""్ అన్న పేరు వింటేనే _ ఆ" కరోనా"" పేరు కంటే ఎక్కువ గా వణుకు , భయం ,దడ పుడుతోంది , _! థాంక్స్ సార్ _! నన్ను కరోనా కుంభ కోణం నుండి బయట పడేసి నందుకు _!!"
ఇక వెళ్తాను ,,సార్ _!;
""_ ఓ అమాయక పు భారతీయుడా _! చూస్తున్నావు గా నా ఈ బాధ _??
_""ఎలా తట్టుకుంటూ ఉన్నావయ్యా , నీవు స్వామీ _! ఈ రెండు చెంప దెబ్బల కొర్చుకుంటు కూడా , _?"" నిజంగా నీకు పెట్టాలి కోటి దండాలు _!!""
_ సబ్ ఇన్స్పెక్టర్ గారూ _! జరిగింది చాలు _! ఏ పరీక్షలు వద్దు _!,చూద్దాం కొన్ని రోజుల తర్వాత ,__! _ముందు మమ్మల్ని ఈ కరోనా కుంభ కోణం షాక్ నుండీ పూర్తిగా కొలుకో నివ్వండి సార్ _!"
""ఏమైనా మీ మేలు మరచి పోలేం. _! ఎంత జ్ఞాన బోధ చేశారు_ సార్ మీరు_! ఆహా _!""
""ఇంటి ముందు కాలు పెట్టాలి_!""
,,ప్రశాంతంగా బ్రతకాలి అంటే ,,_
ఇలా _"_ లోక జ్ఞానాన్ని బోధించే వారిని_ ఎంతమందిని ఆశ్రయించా లో కదా _?
హే భగవంతుడా ,, _!
నా దేశాన్ని ఈ దళారుల నుండి మాఫియా గ్యాంగ్ , ల నుండి రక్షించు , స్వామీ _!; లక్షలాది మంది ప్రజల ప్రాణాలు తీస్తున్న _ఈ దుష్ట మహమ్మారి కరోనా వ్యాధిని కూడా __తమ స్వార్థానికి వాడుకుంటూ_ _,, కరోనా బారిన పడి, మరణించిన వారి శవాల గుట్టల పై , జిత్తులమారి నక్క ల వలె కాపు కాస్తూ,, ఆబగా డబ్బులు ఏరుకుంటూ ఉన్న __ మనుషుల రూపంలో కనిపించే ,,ఈ నికృష్ట దౌర్భాగ్య పాపపు రాక్షసులను ,నీవు ఎలా చూస్తూ __ భరిస్తూ ,ఉన్నావయ్యా, నారాయణా,, స్వామీ _!
కరోనా కంటే నీచాతి నీచులు వాళ్ళు _!
హే దేవా దిదేవా,_! దీన బాం ధవా_!
ఎందరో అభాగ్యులు అమాయకులు ,పేదవారు , నా కన్నా దీనులు , కన్నీళ్ళతో , నిన్ను వేడుకుంటూ ఉన్నారు తండ్రి _! కరుణించు వారిని _!!"'
ఈ కరోనా కాటుకు బలికాకుండ,, సకల జనావళిి నీ రక్షించు పరమాత్మా ,_!
__""ఈ నర రూప రాక్షసుల అకృత్యాల బారి నుండి ,, మాత్రమే కాకుండా ఆగకుండా అన్ని దేశాల్లోనూ , కరోనా సాగిస్తూ ఉంటున్న ఈ దారుణ మారణ కాండను నీవు మాత్రమే ఆపగలవు ,, ప్రభూ
మమ్మల్ని మేము రక్షించు కొలేకుండ ఉన్నాము _!!
అందుచేత ,, పరమేశ్వరా _! కరుణతో ఈ పాడు కరోనా వ్యాధి నుండి ,ఈ లోకాన్ని కాపాడు , పరమాత్మా _!",
నీవే గతి _ మాకు _! వేరే దిక్కు లేదు ఇక _!!
నీకే శరణు ,_! నీవే శరణు _!"
పాహిమాం పరంధామా _!, రక్షమాం , పరమాత్మా _!! _!
స్వస్తి _!
హరే కృష్ణ హరే కృష్ణా _!"
కరోనా దుమారం
Sept 11, 2020
_!"హలో , ,హలో _!
ఎవరూ మాట్లాడేది ?
ఓహో నీవా _?, నరేష్_! బావున్నా వా ? మీరు, మీ భార్యా పిల్లలు బావున్నారా _?
ఏమిటీ విషయం ,? నాకు ఎందుకు ఫోన్ చేశావు ?
ఏమిటీ ,? ,మన దగ్గర బంధువు లక్ష్మన్ __ ఆయన !. మొన్నటివరకు మనమంతా కలిసి ఉన్నాం. కదా _?
పాపం ,,ఆయనకు వచ్చిందా కరోనా ? నిజమా ? అయ్యో ,పెద్దాయన __! కాస్తా కనిపెట్టాలి మనం వారిని _!
_! నాకు ఇపుడు నీవు చెప్పే దాకా ఆ విషయం తెలియదు సుమా _!
మేము అతడితో ఎక్కడికి వెళ్ళాం _?
మేము వెళ్ళలేదు _! నాకు ఈ ఉద్యోగం తో నే బిజీ _!
అసలు ,,ఒక ఆదివారం తప్ప తీరిక ఉండదు కదా_ ఎక్కడికైనా పోవడానికి _!""
ఇవి అసలే కరోనా రోజులు _!""
సరే ఇంతకూ అసలు విషయం చెప్ప నే లేదు నీవు _! ఎందుకు ఫోన్ చేస్తున్నావో _?
ఏమిటీ,? నాకు వచ్చిందా కరోనా ? అని ఎవరు చెప్పారు _?
నీ కు
_తెలిసిందా ,ఎవరో అనుకుంటే _??
__మా బంధువు ఎవరికో __ కరోనా సోకితే , వాడికి సంబంధించిన చుట్టాలు అయినందుకు మాకు అందరికీ వచ్చినట్టే ,అనుకున్నావా _?
భలే చిత్రంగా ఉంది ,__నీవు ఈ మాట చెబుతూ ఉంటే _!
ఆ ఫంక్షన్ కు వెళ్ళిన వారికందరకు వచ్చింది ,అంటావా _?
__వస్తే రావచ్చు _!కానీ ,మేము వెళ్ళలేదు కదా _! అయినా వస్తుంది అంటావా _? _?
ఎందుకురా బాబూ నీకు, ??
, మా సంగతి మేము చూసు కోమా _?
_అయినా నాకు ఎందుకు ప్రత్యేకంగా ఫోన్ చేసి చెబుతూ ఉన్నావు ,_? ఎందుకింత ప్రేమ మా మీద పుట్టింది నీకు _??
_ నీవు చేసే ఫంక్షన్ కు రావద్దు అని చెప్పడానికే ఫోన్ చేస్తున్నావా ,_? మంచిదే _!
, నీ జాగ్రత్తలో నీవు ఉండడం ,బావుంది _!;
కానీ నాకు కరోనా వ్యాధి వచ్చిందని నీకు చెప్పింది ఎవడు ?
__ఇపుడు ఇదంతా ఈ విషయం చాటింపు చేసి పది మందికీ చెబుతున్నా వు కదూ _!
__ఇందువల్ల నీకు ఒరిగిం ది ఏమిటీ చెప్పు _?
ఓ సాడిస్టూ _!
ఇలా ఫోన్ చే యడం వల్ల మేము బాధ పడుతామని _ తెలియనంత అమాయకుడ వు కాదు కదా నీవు ?
ఇది మా ఆఫీస్ టైం _! ఈ టైమ్ లో నీవు చేసిన ఫోన్ కాల్ విని __ మా స్టాఫ్ అందరూ నాకు కరోనా వ్యాధి సోకిందని __భయంతో నన్ను బయటకు తరిమి వేస్తారు అని నీకు తెలియదా _?
నా భార్య కూడా నన్ను ఇంటిలోకి రానీయ దు __ అని నీకు తెలియదా _?
__హాస్పిటల్ లో కూడా ఉండనీయ ని దిక్కుమాలిన రోజు వచ్చిందని తెలియదా ?__
__ గతంలో ఎవరైనా ,తమవారు బాధపడ టం తెలిస్తే తనవారు వచ్చి ఆదరించి,, కష్ట సుఖాలు తెలుసుకొని వెళ్ళేవారు _!"
, ఇప్పుడు కాకికూడా, ఒక ఇంటినుండి మరో ఇంటి పైకి వాలని దుస్థితి దాపురించింది అని నీకు తెలియ కుండా ఉందా ,చెప్పు ,?""
నిజం తెలియకుండా , ,నీకు సంబంధం లేకున్నా ,ఇలా తప్పుడు ప్రచారం చేస్తూ ,సమాజం నుండి నన్ను ఇలా దూరం చేయడం,మనిషి బ్రతికి ఉండగా నే మానసిక హింసకు గురి చేస్తూ నిలువునా చంపేయడం ,_ నీ లాంటి దగ్గరి బంధువు_, మనిషి అయినవాడు చేసే పనేనా చెప్పు _!?
అసలు
నీ మెదడు సరిగా పని చేస్తోందా ,లేదా _? అన్నది నా అనుమానం _!
వాస్తవం తెలుసుకోకుండా ,అనవసరం గా ఫోన్ చేసి ఇలా బాధ పెట్టడం
తప్పు అని తెలియడం లేదా నీకు _?
__ఫోన్ ఖర్చు ఎలాగూ తగ్గిందని ,ఎదో ఒకటి ,ఎవరో ఒకరితో ,నాన్ స్టాప్ గా మాట్లాడుతూ ఉండడం , ఎదో ఒకటి వాగుతూ ఉండడం , కరోనా వ్యాధి లక్షణం లో ఒకటి గా మారి పోయింది,,_ ఏ పనీ బాధ్యతా లేని నీ లాంటి వెదవ లకి _!
__""హలో _! నీవు చెప్పింది నేను విన్నాను పూర్తిగా_!!"
ఇపుడు నేను చెప్పేది కూడా నీవు విను ఓపికగా _!
నాకు కరొ నా వచ్చిందని, ఏ గాడిద అన్నాడో ,,నీవు పుట్టించావో నాకు తెలియదు కానీ ,,
__ ఇపుడు ఉల్టా ప్రచారం గా ,, నీవు నాకు చెప్పినట్టే ,నేను కూడా నీకు అదే కరోనా వ్యాధి ఉందని నీ వాళ్ళకి చెబితే నీ పరిస్తితి ఎలా అవుతుం దో కాస్తా గమనించు _!
ఏదైనా తన దాకా వస్తె గానీ,,ఇలాంటి సీరియస్ విషయాలు తెలిసి రావు కదా _!
__ హలో ,చేసిందంతా చేసి, నాకు "సారీ " అని ఒక్కమాట చెబితే సరిపోదు _! దేవుని ఫోటో ముందర నిలబడి ,గట్టిగా రెండు
చెంపలు వేసుకోవాలి _ ,నీవు ,,ఇకముందు ,ఇలాంటి పిచ్చి మాటలు ఎవరితో కూడా మాట్లాడ కూడదు అని _!
__ బంధువు అంటే అర్థం ఆత్మీయుడు _!
పరిస్థితిని అర్థం చేసుకునే వాడు _!
కానీ నీలాంటి వాడు బంధువు కాదు ,రాబందువులు ,
బ్రతికి ఉండగా పీక్కు తినేవాడు _!
చీ చీ రోత పుడుతోంది ,,నీతో మాట్లాడుతూ ఉంటే _!_; బంధువు అన్నవాడు ,సహాయం చేయాలి ,_! వచ్చిన ఆపద ను తొలగించే ప్రయత్నం చేయాలి _!, బాధ్యత తో తగిన జాగ్రత్తలు చెప్పాలి __!
కానీ ఏ మాత్రం సామాజిక స్పృహ లేకుండా,, మూర్ఖంగా ఇలా ప్రవర్తిస్తారా చెప్పు _??".
ఎవరితో కూడా ఇలా ఫోన్ చేసి ఆటలాడు తూ తమాషా చేయవద్దు, సుమా _!
జాగ్రత్త _!
నిజానికి
నీ మీద పోలీస్ కేస్ పెట్టాలి
కానీ నీ భార్యాపిల్లలను. దృష్టిలో ఉంచుకొని నిన్ను ,క్షమించి వదిలేస్తూ ఉన్నాను _!
__ మళ్లీ నాకు నీ మొహం చూపించకు _!
ఇక ముందు పొరబాటున కూడా
నాకు ఫోన్ చేయకు
తెలిసిందా _!
ఇక
పెట్టేయ్ ఫోన్ _!
బద్మాష్ _!
భగవంతుడా ,,ఈ రోజున నన్ను ఈ కరోనా దుమారం లో చిక్కుకొనకుండా బ్రతికించావు ,
పెద్ద ప్రమాదం తొలగించి ,
రక్షించావు కదా _!
స్వామీ,పుకార్లు వింటేనే ఇంత భయం అనిపిస్తూ ఉంది
ఇక నిజంగా జరిగితే?
అమ్మో _!
అది తలచుకుంటే నే వణకు పుడుతోంది _!
""హే పరమాత్మా _! ఇంకా ఎన్నాళ్ళు మాకు ఈ అగ్ని పరీక్ష _?
ప్రభూ _!!
ఈ దుష్ట కరోనా మహమ్మారి బారిన పడకుండా,,నన్నే కాదు, అన్ని దేశాల్లో ని ప్రజలను ,, అందరినీ కాపాడు _ తండ్రీ _!
ప్రపంచంలో మానవాళిని పట్టి పీడిస్తూ __ చంపుతూ ఉన్న__ ఈ కరోనా వ్యాధిని_ భూమిపై నుండి ,, శాశ్వతంగా తొలగిం చు పరమేశ్వరా _!
పాహిమాం , రక్ష మాం _!
శరణు శరణు శరణు_!
స్వస్తి _!
హరే కృష్ణ హరే కృష్ణా _!""
A Drama that became Real!
The Turning Point Forty years ago, while teaching at Ragampet village high school, I experienced a moment that changed a student’s life fore...
-
The Turning Point Forty years ago, while teaching at Ragampet village high school, I experienced a moment that changed a student’s life fore...
-
May 8, 2020 పగలే వెన్నెలా.... పల్లవి !" ____&___ "కరోనా వచ్చేరా ,కష్టాలు తెచ్చేరా !! కరుణ లేక మన వారిని చంపు చుండే రా!!...
-
May 27, 2020 ఈ గోపికా స్త్రీలకు శ్రీకృష్ణుని పట్ల గల ఆ ఆరాధనా భావం ఎలా కలుగు తోంది? భర్తా పిల్లలు అత్తా మామలు బంధువులు,సంసార బాధ్యతలు , ఇ...