కీర్తి శేషులు గూడూరు సాంబశివ రావు మామ గారు ఎంతో పుణ్యాత్ముడు -వీరి తండ్రి నరహర్ రావు గారు -తల్లి సూర్యా బాయి -ఉత్తమ భక్తురాలు -వీరి సంతానం ఆరుగురు -తారాబాయి ( మా అమ్మ ) వెంకటరామారావు -ఆనందా బాయి -చుక్కమ్మ - సాంబశివ రావు - కమలాకర్ రావు - కమలాకర్ రావు తల్లి కడుపులో ఉండగానే తండ్రి నరహర్ రావు గతించాడు -బాల్యం నుండి కష్టాల్లో పెరిగారు - పెద్దాడైన మా పెద్ద మామ -వెంకటరామ రావు చాలా శ్రమించి కష్ట పడి తమ్ములను చదివించాడు - ఆస్తిని - వతన్ లను కాపాడాడు - చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేశాడు -కొడుకులను అమెరికా పంపాడు ( పుత్రవాత్సల్యం చంపుకుని )-కూతురిని కూడా పెళ్లి చేసి స్టేట్స్ కి పంపించాడు -భార్య సావిత్రి మరణించడం- ఆరుగురు పిల్లల ను సంరక్షించడం కోసం -శ్రమించి - వృద్ధాప్యంలో బ్రతుకు పోరాటంలో - ఆరాటపడి -అలసట చెంది పరమాత్మునిలో లీనమయ్యారు -
అలాగే సాంబశివ రావు గారు కూడా బాల్యం నుండి -తమ్ముడు కమలాకరుని కంటికి రెప్పలా ఆదరించి - హైస్కూలు చదువు వరకు మంథని లోను -హన్మకొండ లో తను బి ఏ -తమ్ముని బి ఎస్ సి - డిగ్రీ చదువులు పూర్తీ చేసుకుని జీవితాంతం వరకు కలిసి ఉంటూ బ్రతికారు తమ అన్న గారు వెంకట రామారావు గారి మాట జవ దాటి ఎరుగని విద్యా వినయ సంపన్నులు --
సాంబశివ రావు గారు పేరులోనే కాదు -తన తీరు లోను - బ్రతుకు దెరువు లోను తనదంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో నిరంతరం సాంబశివ ధ్యానం - నామం జపించి ధన్యులైనారు -లక్షెట్టిపేట గ్రామంలో అందరి చేత మంచి వాడని పేరు తెచ్చుకున్న ఉదార స్వభావి - కష్ట జీవి - నిత్య సంతోషి --!
భక్తి అతని సొమ్ము 1 అనుకరణ చేత గాని -- అభ్యాసం చేత గాని అలవడని భక్తీ తత్వం -- ఆ సాంబశివుని అనుగ్రహం వల్ల అలవోకగా -ఈ సాంబశివున్ని వరించి అలరించింది -
వీరు మహా సాహసి - ! ధైర్యం -గుండె నిబ్బరం - ఆత్మ విశ్వాసం -మెండుగా గల వ్యక్తీ - !నిండు గంగను ఒంటరిగా - అడ్డంగా ఈదుకుంటూ వెళ్ళిన మొండి ఘటం !తన గ్రామం -కొత్తూరు లో జరుగుతున్న ఒక హత్య ను ఒంటరిగా ఆపడానికి యత్నించిన పరోపకారి -- బావిలో పడిన ఎద్దును ఒంటరిగా తానె లాగడానికి ప్రయత్నించిన భూత దయాళువు --!
శిథిలా వస్తలో ఉన్న శివాలయాన్ని - తానె అను నిత్యం గంగ నీటితో -- శుద్ది చేస్తూ --శుభ్రంగా ఉంచి-- జీర్ణోద్ధారణ గావించి -- ఇదేండ్లు శ్రమించి - పునః ప్రతిష్ట చేసి - అందరిని కూడా గట్టుకుని -ఆలయ ధ్వజారోహణం గావించి - అంకిత భావం -- అకుంటి త - దీక్షతో జీర్ణాలయాన్ని బాగు చేసి- ఉద్ధరించిన మహోన్నత వ్యక్తీ ప్రయత్న ఫలితమే - ఈ నాడు ప్రజాదరణ పొంది వెలుగొందుచున్న - సాంబశివ ఆలయం !నిరంతర అన్నదానాలతో భక్తుల భజన -భక్తీ గీతాలతో - నిత్య శివ అభిషేక పూజలతో - గ్రామానికి తల మానికంగా - అలరారుచు -ప్రజల నీరాజనాలను అందుకుంటున్నది !
అతడే ఒక సంఘం - ! ఒక వ్యవస్థ ! ఒక ధార్మిక కుటుంబం ! మెండైన -- నిండైన -వ్యక్తిత్వం - దేహ దారుడ్యం -మనో ధైర్యం - కలిగిన సంపూర్ణ వ్యక్తీ !HE DESERVES LEADERSHIP QUALITIES !
నాకు ఎనిమి దేళ్ళ వయసులో - చిన్నతనంలో - బావి వద్ద - మధ్యాహ్నం - నీరు చేద బోతుండగా -నా చేతుల్లోంచి - నిండు బొక్కెన జారడం - నేను కూడా బాలెన్స్ తప్పి బావిలోకి తలక్రిందులుగా జారడం - ఎదో పనిపై - అటుగా వచ్చి - మామగారు చటుక్కున నా ఎడమ కాలి మడమ ను -బట్టి పైకి లాగి నాకు పునర్జన్మ ప్రసాదించిన ప్రాణ దాత - అది ఒక డివ లీల నా ఈ జీవనం వారి స్మ్రుతి చిహ్నం !
ఏమిచ్చి ఋణం తీర్చుకో గలను - ?-అంజలి ఘటించి ప్రణ మిల్లడం తప్ప !
మంచి భక్తుడు -! అందరికి సన్నిహితుడు కావాలంటే భక్తి అవసర మేమో !నిరంతర సాలగ్రామ అభిషేక -పరాయణత -- పురాణ పత్తనము--భజన - గంగ స్నానం - నిత్య కాల క్రుత్యంలో భాగంగా కావడం --ఆయన భాగ్యం !- ఉదయం నాలుగు గంటలకే లేవడం --రావి చెంబు తో గంగ కు వెళ్ళడం - ఇంకా నాకు జ్ఞాపకం - -- తల్లి మీద ఎనలేని ప్రేమ ----ఇలా మనిషిలో ని మంచి గుణాలు -అనుసరించడం -సుకృతం ! -తల్లి దండ్రులు --అందరి పట్ల -వాత్సల్య భావన - ఇవి ఆయన సహజ సంస్కారములు ! అవే అతని సంతానంలో ప్రతి భిమ్భిస్టున్నాయి---నిజమైన వారసత్వ సంపద అదే !
గీతా విద్యాలయం SCHOOL లో అంత వృద్ధాప్యంలో కుడా పిల్లలకు పాఠాలు చెప్పడంలో మనసా- వాచా- కర్మణా - సఫలీకృతుడైన ఉత్తమ ఉపాధ్యాయుడు వీరు VILLAGE REVENUE OFFICER గా కుడా పని చేసి అక్కడ కూడా మారు మూల కుగ్రామం లో కూడా దేవాలయం వెళ్ళడం శుభ్రం చేయడం భజనలు చేయడం - వండుకుని తినడం - ఆ గ్రామస్తుల మన్ననలు పొందడం గమనార్హం !
తన సరస సంభాషణలతో -- చమత్కారాలతో - తోటి వారందరినీ - పిల్లలను - పెద్దలను నవ్వుతు - నవ్వింప జేస్తూ -తన జీవితంలో మోదమే -కాని - ఖేదానికి తావివ్వకుండా గడిపిన నిత్య సంతోషి శ్రీ సాంబశివ రావుగారు !
తనకంటూ ఒక చరిత్ర స్వయంగా రాసుకుని గ్రామంలో మంచి వ్యక్తిగా - ఉదార ఉపకార స్వభావిగా పేరొందిన ఘనుడు -- చెక్కు చెదరని మొక్కవోని -మనస్తత్వంతో -నిశ్చల చిత్తంతో -రెండు పూటలా సంద్యావందన - గాయత్రీ జపం తో - మడీ ఆచారంతో - అనుష్టానము - ఆధ్యాత్మిక చింతనతో పురాణ గ్రంధ పట నంతో -- అత్యంత నియమ నిష్టలతో - శ్రద్ధా భక్తులతో - ఈశ్వరుణ్ణి ధ్యానించి - పూజించి - సేవించి - తరించి -అతనిలో ఐక్యమైన వందనీయుడు - పుణ్య జీవి - పరమ భక్తుడు -- ఈ సాంబశివుడు -- !
వీరి తల్లి-- మా అమ్మమ్మ - శ్రీమతి సూర్యా బాయి గారి నిరాడంబర జీవితం - నిరంతర దైవ ధ్యానం - మేలుకొలుపు గీతాలు - తులసి -సాలగ్రామ అర్చనల ప్రభావం వీరిపై మెండుగా పడింది --మా అమ్మ - మా అమ్మమ్మ లతో బాటు సదాచారతా - భజనలు - హరి నామ సంకీర్తనం - శ్రీ--------------శ్రీ మద్భా గవతపద్యాలు చదవడం-- గజేంద్ర మోక్షం-- రుక్మిణి కల్యాణం - అంబ రీశో పాఖ్యానం - లాంటి ఆధ్యాయాలు అనునిత్యం చదివే వారు - ఎవరు విన్నా - వినకున్నా -దైవ ప్రార్థనలో లీనమై పాడుకుని తన జన్మ - నిరంతర దైవ ధ్యానంతో -- భక్తీ తత్పరతతో - ధన్యం చేసుకున్నాడు !
ప్రతి సోమ వారం రోజున - ఉపవాసం - గంగా స్నానం - సాలగ్రామ పూజ - నమక చమకాలతో ఆహిషేకం - నివేదన - భజన - దేవాలయ సందర్శనం - రాత్రి గుడిలో కెళ్ళి - తాళాలతో - తబలాతో - - -నలు గురిని కూడ గట్టుకుని -- గొంతెత్తి - పంచమ స్వరంలో - పద్యాలు - భజన పాటలు - చదవడం - ఇంటికొచ్చి -రామాయణ కావ్యాలు చదివి తల్లికి - వినిపించడం - -అతడి దినచర్యలో ఒక భాగమైంది -
అయితే - ఐదేండ్లు - మంచాన పడి - భాద పడుతుంటే -చూడలేని ప్రజలు - ఇంత మంచి భక్తునికి - ఎంత కష్ట మొచ్చింది ! అని బాధ పడ్డారు -
ఆ విధంగా అతనికి "భక్తుడు " అన్న ముద్ర పడింది - ! తాళాలు పట్టి - గంతులు వేస్తూ - సత్సంగంలోను - ఇంటిలోనూ - ఆలయాల్లో - నిత్య సంకీర్తనం చేశారు --విరామం - అలసట కాన రాకుండా - అందరితో ఆడుతూ --పాడుతూ - ఆనందంగా జీవితాన్ని సంతోషాన్ని అందరితో పంచుకున్నారు -!
అలాగె సంబందాలు - చూసి - ఖర్చుల కోర్చి - ఇతరులకు పెళ్ళిళ్ళు చేశారు కూడా ! పెళ్లి పీటలపై ధర్మపత్నితో - కూర్చుండి ఆమె సహచర్యంలో - సహకారంతో - తన వారికే గాక -పరాయి ఆడపడుచులకు ఉత్సాహంతో నాలుగు జంటలను ఆశీర్వ దించిన సహృదయుడు -
వీరు నిష్టా గరిష్టులు - సద్ బ్రాహ్మణుడు -సచ్చరితుడు - అబద్దము లెన్నడు ఆది ఎరుగడు సంతృప్తి - సంతోషం -సహృదయం కలవాడు - ఎంత కోపం వచ్చినా తన నోటివెంట దుర్భాషలు గానీ - తిట్టు మాటలు గానీ - ఇతరులను నిందించడం గానీ బాధ పెట్టడం గానీ - తెలియని నిష్కపటి -! నిరాడంబరుడు - నిశ్చలమైన ప్రశాంత చిత్తులు --
తన కైనా-- ఇతరుల కైనా అన్యాయం జరిగితే సహించేవాడు కాదు ఎదురు తిరిగి - ప్రతిఘటించి - ఒంటరిగానైనా- పోరాడే పటిమ గల వాడు మొండి - సాహసి - రాత్రిళ్ళు కుడా నిర్భయంగా గ్రామాల్లో - చేలల్లో -- వరి కల్లాల్లో - సంచరించేవారు ముక్కుసూటిగా - నిర్మోహ మాతంగా మాట్లాడే తత్వంతో కొంతమందికి కంటూ వయ్యాడు కూడా -
"ఆత్మ బుద్ది సుఖం చైవ !" అని చెప్పి నట్లుగా అక్షరాలా ఖండితమైన నిర్ణయాలు తీసుకోడం ఆతని నైజం ! వారి అభివృద్ది - ప్రగతి వెనుక వారి భార్యా -పిల్లల సహకారం -- ఆవ గాహన నూటికి నూరుపాళ్ళు ఉంది -అంత్య కాలంలో ఐదేండ్లు వీరు మంచాన పడిన బాధ వర్ణనాతీతం - ! శత్రువుకు కూడా అంతటి బాధ రాకూడదు -- ! కాలు - చేతులు - పలుకు లేకుండా అచేతనావస్తలో ఆయన అనుభవించిన దురవస్త నరకప్రాయం --!
ఇలాంటి దశలో వారి శ్రీమతి -దుర్గాబాయి -మా అత్తగారు -తన భర్తకు చేసిన సపరిచర్యలు శ్లాఘనీయం - ! అనితరసాధ్యం -- కూడా ! ఆమె ఓపిక -నేర్పు - భర్త పట్ల ఆమెకు గల భక్తీ శ్రద్ధ - ప్రేమానురాగాలు - స్త్రీ జాతికే ఆదర్శ ప్రాయం ! సతీ దుర్గ గా- ఒక పతివ్రత లాంటి ఆ తల్లి కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకోనినా పుణ్యమే -- ! భర్త సేవకు మాత్రమె అంకితమై - పండుగలు - -పెండ్లిళ్ళు - సంతోషాలు - సంబరాలు - నిద్రాహారాలు వదలుకుంది !-రెప్పపాటు కాలాన్ని కుడా వృధా చేయకుండా -ఆయన ఆరోగ్యం - కోసం బాగు కోసం మాత్రమె జీవించిన ఆ పరమ సాధ్వికి హృదయ పూర్వక ప్రణామాలు = సమర్పిస్తున్నాను --!
! భార్య అంటే అలా ఆమెలా - ఉండాలి !"
ఆయన ఇంత కష్ట పడుతూ కూడా - ఇన్నేండ్లు సంతృప్తిగా ఉండటం అటు భార్య -ఇటు కొడుకులు చేసిన సేవల వల్లనే అని చెప్పక తప్పదు ! "కొడుకులు అంటే ఇలా వారిలా - ఉండాలి" !
తండ్రికి వెన్నంటి ఉండి ఆయన అంతిమ శ్వాస వరకు షాయా శక్తులా స్వయంగా - తమ భార్యలతో సహా - సేవించుకుని - తమ ప్రేమను - శ్రమను ధార పోసి కన్నా తండ్రిని బ్రతికిన్చుకోడం కోసం వారు ముగ్గురు ఎంతో శ్రమించారు కన్నీళ్ళు కార్చారు - బాధపడ్డారు !ఒక సారి తండ్రిగారి కి ఆస్పత్రిలో - అవసరం ఉండగా -- పెద్దకొడుకు తన నెత్తురు కుడా ఇచ్చాడు తామే స్వయంగా డాక్టరు పనీ - నర్సు పనీ చేస్తూ -సగం వైద్యం తామే చేశారు ప్రాణానికి ప్రాణంగా వారు పడిన శ్రమ అభినందనీయం !
భగవద్గీత లోని శ్లోకం ప్రకారం అంతిమ ఘడియల్లో ఎవరైతే హరినామ స్మరణ చేస్తూ పోతారో వారు సాయుజ్యం పొందుతారు అని !
దానికోసం మా మామగారు కీర్తి శేషులు గూడూరు సాంబశివరావు గారు జీవితాంతం సాధన చేశారు - ! శరీరం కదలలేకున్నా - నోటితో పలుక లేకున్నా కంటి చూపు - వినికిడి జ్ఞానం వెంట అంటి ఉన్నాయి చివరి క్షణం వరకు --! ఆ అనుగ్రహం వలన భగవన్నామ స్మరణ -శ్రవణం చేస్తూ - పరమాత్మలో కలిసి పోయారు ! వారి నిరంతర ఆధ్యాత్మిక చింతన - భక్తీ జ్ఞాన వ్య్రాగ్యాల వల్లనే ముక్తిని పొందడానికి కారణం !
అలా ఈ సాంబశివుని ఆత్మ -- ఆ పరమాత్మలో ఐక్యమైంది --!
వారి ఆత్మ శాంతిని పొందుగాక ! ఆ దేవాది దేవుని అనుగ్రహ - ఆశీర్వచనాల వలన వారి కుటుంబం శాంతి సౌఖ్యాలను పొందుగాక !
సర్వే జనాః సుఖినో భవంతు ! సమస్త సన్ మంగళాని భవంతు !
ఓమ్ -శాంతి - శ్శాంతి - శ్శాంతి::!
మంచి భక్తుడు -! అందరికి సన్నిహితుడు కావాలంటే భక్తి అవసర మేమో !నిరంతర సాలగ్రామ అభిషేక -పరాయణత -- పురాణ పత్తనము--భజన - గంగ స్నానం - నిత్య కాల క్రుత్యంలో భాగంగా కావడం --ఆయన భాగ్యం !- ఉదయం నాలుగు గంటలకే లేవడం --రావి చెంబు తో గంగ కు వెళ్ళడం - ఇంకా నాకు జ్ఞాపకం - -- తల్లి మీద ఎనలేని ప్రేమ ----ఇలా మనిషిలో ని మంచి గుణాలు -అనుసరించడం -సుకృతం ! -తల్లి దండ్రులు --అందరి పట్ల -వాత్సల్య భావన - ఇవి ఆయన సహజ సంస్కారములు ! అవే అతని సంతానంలో ప్రతి భిమ్భిస్టున్నాయి---నిజమైన వారసత్వ సంపద అదే !
తండ్రి -తల్లి గర్వ పడేది - తమ పిల్లలు ప్రయోజకులై - ప్రేమానురాగాలు కలవారై -- హితోభి లాశులై - ఉంటేనే !
ఏమైనా ఆయన సత్వ గుణ సంపాదకు -- కు వారసులము మనమై నందుకు సంతోషమే ! పూర్వ కాలంలో పతివ్రతలను తలపించే సతీమణి ఆయనకు భార్యగా లభించడం -- ఆయన చేసిన పుణ్యాల ఫలం ! ఆయనలా ఉండొచ్చేమో గాని ఆమెలా సేవలు చేయడం నిజంగా అనితర సాధ్యం - - ఒక రోజు కాదు-- నెల కాదు -సంవత్సరం కాదు - నాలుగేళ్ల పైగా భర్తను - -- కంటి పాపలు చంపుకొని --నిద్రాహారాలు మాని -- పెళ్ళిళ్ళు పండుగలు తల్లిగారిల్లు --అన్నీ ఆయన సేవలోనే భావించి - సేవ చేస్తూ తరించడం - చాలా గొప్ప విషయం --! దీనిలో పిల్లల సహాయ సహా కారాలు ఉన్నయి -ప్రేమానురాగాలు ఉన్నాయి - వారిలో తండ్రికి సేవ చేయడం లో అలసట పొందని--దీక్ష ఉంది ! అయినా - స్త్రీలలో ఇంత ఓపిక -ప్రేమ - ఉండటం - చాలా అరుదు !
వారు ఒకరికి మరొకరు -తీసిపోరు --చక్కని జత !
మనం నేర్చుకునేది - ఒకరికోసం మరొకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ జీవించడం --!పొరబాట్లను వేలెత్తి చూపడం కాకుండా - వాటిని సరి దిద్దుకుని ఆదర్శంగా బ్రతకడం -- ! ఈవిడా ప్రేమ మూర్తులు -త్యాగ దనులు -ఆదర్శ ప్రాయులు !
కాలచక్ర ప్రభావంలో నిలిచేది -- గెలిచేది -భక్తి మార్గమే !స్త్రీకి భర్తనే దేవుడు ! అతని సేవ దేవుని సేవకంటే గోప్ప్ ! ఏ యాత్రా - నోము - వ్రతము - దానికి సాటి కాదు --ఇది వేద ప్రమాణము కనుక ఇలాంటి సేవలు చేసి పుణ్యాన్ని చేద్దాం ! ఇలాంటి పుణ్య దంపతులను సేవించడం -- అలా ఉండడం - మనం చేయాల్సిన -పని !