దేవి భాగవత మహా ప్రవచనము - వినుటకు వచ్చిన
స్త్రీ శిరోమణులు! -- అమ్మవారి రూపాలు మీరు ! అఖిలాండేశ్వరి ప్రతి రూపాలు !
భరత దేశ సౌభాగ్య సంస్కృతుల - వైభవాల నిలయాలు మీరు ! -
-పరాశక్తి వలె ప్రకాశించి - చైతన్యం జగతికి తెచ్చారు --1
అంగనలందరు అమ్మవారిని - సేవించుకొను పండుగ రోజి ది !
-- దేవి భగవతిని పూజించాలని తహ లాడే తరుణమిది -!
మహా లక్ష్మి -సరస్వతి ఉమ వలె -అపర దేవతా వనితల వోలె
--అలంకరించుకొ ని వనితలందరూ -పరుగు పరుగున అరుదెంచారు -!
ఆహా 1 ఎంతటి భాగ్యము మనదీ ! శ్రీ మాతను గని -- ధన్యులౌదు మని --
- లక్ష్మీవారము మంగళప్ర దము -మంగళ గౌరీ రాజ రా జేశ్వరి!
లలిత1 శ్రీ మాత! -భగవతి! భవాని! -ఎన్ని పేరులో ఎన్నిరూ పములో -
-సాయంకాలపు శుభ గడియ ఇది! --దేవ దేవి1 వేంచేయు నో ఏమో -1
మెల్ల మెల్లగా పిల్ల తెమ్మెరలు -హాయిని గొలుపుచు వీచు చున్నవి -
-శుభ సూచకముగా -కళ్యాణ రాగాన సంగత ధ్వని విన బడు చున్నది -
అదిగో ! మణి ద్వీప కాంతి పుంజములు -పురాణస్ థలి ప్రసరించుచున్నవి
-- కాలి అంది య లు ఘల్లు ఘల్లు మను -మువ్వల -సవ్వడి అదిగో -అదిగో !
దేవి సమా రోహణ ము -జయము చేయు టకు - తానే స్వయముగ వచ్చునో -ఏమో
- ఏమో 1 ఏమో ! అందుర?ఆర్తిగ పిలిచినా రాకుండు టయా ?
అదిగో ! అదిగో అదిగో - చూ డుడు ! కళ్ళను పెద్దవి చేసి చూడుడు 1 --
సాక్షాత్తుగా ఆ పరాశక్తియే - అఖిలాండ కోటి బ్రహ్మాండ జననియే -
మనల కరుణించ కదలి వచ్చినది -స్వాగత మివ్వగ కదలాలండి -
-కలలు ఫలియించె ! జన్మ తరియించే-కనులు చెమరించె - ప్రక్రుతి పులకించే -!
-కన్నె పడుచులు -వృద్ధ వనితలు - పెద్ద ముత్తైదు పడతుల్లారా !
అమ్మలగన్నా అమ్మను- పూజించ స్వాగత మివ్వగ రారండి !--
- రత్న ఖచిత సింహాసనమ్మునే ఆసనమ్ ముగా వేయండి !
నాట్యము చేయుచు -పాటలు పాడుచు - ఆనందముతో మ్రొక్కండి -!
అందమైన అందాల అమ్మను -ఆహ్వానిం చగ రారండి !
ఓ శారదా ! బంగారు కలశము తెచ్చి పాదములు అభిషేకించమ్మా !
ఓ భవానీ ! అర్ఘ్య పాద్యముల అమ్మకు అందించి -సేవించ మ్మా !
కాత్యాయని 1 పారాణి తెచ్చి బంగారు పాదము ల నలరించమ్మా 1-
-పద్మావతీ 1 పసుపు కుంకుమలతో మాతను సేవించి తరించ వమ్మా 1
--లక్ష్మె సరస్వతులారా ! మీరు- వింజామరతో వీచండమ్మా !
పెద్ద ముత్తైదువులంతా కలిసి -జయ గీతాలు పాడండ మ్మా 1
దేవి భాగవత కథా మహిమయో 1 మహేశ్వర శర్మ ప్రతిభ యో ఏమో !
ఆహా ఎంతటి భాగ్యము మనదీ --శ్రీ మాతను గని ధన్యుల మైతిమి 1
రాజీవ లోచని 1 రాజ రాజేశ్వరి - చల్లని చూపుల కరుణించు చున్నది 1
కరమున బంగరు గా జులు -నడుమున వడ్డాణము నలరించు శ్యామలా
!కొప్పున మల్లెల -గళమున మందార పుష్ప హారము ల నలరించు వాణీ !
గంధము పూసీ -చందన మందించి -తల్లిని సేవించ మ మ్మ -భారతీ !
మల్లెలు మొల్లలు సన్న జాజులు --
మందారాలు కనకాంబర మ్ముల -విరి దండలతో మణి హారమ్ముతో -పరమేశ్వరి నలరించగ రారే 1
కమ్మని వంటలు భక్చ్య భోజ్యముల పాయస పరమాన్నములను తెండి !
-పాలు పెరుగు -క్షీరాన్ నము -పులిహోర - పలు శాకమ్ముల మరువక తెండి 1
కమ్మని నేతితో -చేసిన చక్కర పొం గలి --- శ్రద్ధగ నైవేద్య మందించండి
-మామిడి దాని మ్మ అరటి ద్రాక్షలు -- జామనారింజ-- ఆపిల్-పండ్లు
విరివిగా దేవికి నివేదించుమా !
పలు రుచుల పలు రకాల వంటల - పరమేశ్వరికి అర్పించండి! తనువున మనసున భజియించండి 1
పూర్వ జన్మలో చేసిన పుణ్యమో - కన్నవారి ఆశీస్సు బలమ్మొ !
గురువు గారు బోధించిన విధమో - ఫలియించెను నేడు -- మన నోము ఫలమ్ము !
మహాలక్ష్మి -ఉమా- సరస్వతి -భవా ని - శాంకరి -
ఏ రుపంమున కొలిచేవారికి ఆ రూపమ్ము న అగుపించును తల్లి 1
పక్కవారినీ పిలవం డీ --తెలిసిన వారికి చెప్పండీ !
కన్నులు విచ్చీ --మనసును పెట్టీ --హృ దయము పొంగగ-స్తుతి యించండి
--ము క్త కంఠమున - మనోహరమ్ముగ --మధుర గీతముల పా డండి
కర్పూర మంగళ హారతులేత్తి -వరు సగ నిలబడి ఏక కన్థమున -
జయ జయ శాంకరి -కౌమారి యనుచు ఆనందమ్ముగ వేడుకోనండి 1
కోరిన తడవుగ కొంగు బంగారమై -కరుణించు తల్లి --వందన మమ్మా !
పసుపు కుంకుమతో -పాడి పంటలతో పిల్లా పాపలతో చల్లగ ఉంచి -
మరువక నిన్ను సేవించు భాగ్యము అందించావమ్మా - -కని కరించమ్మా !
దీవించవమ్మా ! మరల కనిపించ వమ్మా 1
'' శ్లో ''---కా త్యాయని మహామాయే --భవాని భువనేశ్వరీ !-
సంసార సాగరే మాగ్నామ్ -మాముద్ధర కృపామ యే !!
గౌరీ శంకర భగవాన్ కీ జై !నమః పార్వతీ పతయే హర హర మహా దేవ హర !!
No comments:
Post a Comment