Friday, February 1, 2013

Gothram

పుట్టిన ప్రతి మనిషి - ముగ్గురికి రుణ పడి  ఉంటాడు --జన్మ నిచ్చిన  తల్లిదండ్రులకు -- ధార్మిక మైన జీవనం  గడపడానికి -శాస్త్రాలని అందించిన  ఋషులకీ--మరియు  ప్రాణుల్లో కెల్లా అతి  ఉత్కృష్ట మైన  మనిషి జన్మ   ప్రసాదించి --అందమైన ప్రకృతిని   అనుభవించి   ఆరాధించడానికి -కారకుడు అయిన  ఆ పరమాత్మ కు  రుణపడి ఉంటాడు -!
            1  --   తలిదండ్రులు       సజీవులుగా ఉన్నపుడు   వారిని  సేవించుకోడం ద్వారా - వారు గతించాక  శ్రాద్ధ కర్మల ద్వారా వారికి  ఋణం  తీర్చుకుంటాం 
                     2  --       ఇక రామాయణాది శాస్త్ర గ్రంధాలు  పఠించి  - సాంప్రదాయం -సంస్కారం  నేర్చుకుని గీత లో చెప్పినట్లుగా మానవ జన్మను సార్ధకం చేసుకోడం ఎలా ? జగద్గురువులు ఆది శంకరాచార్యులు  లాంటి వారు వ్యాస వాల్మీకి ఋషులు- మన భారత భూమిలోనే  ఆవిర్భవించి  ఆవిష్కరించారు  - మనిషి  ధార్మిక జీవనానికి  ఉపకరించే -విధంగా ఎన్నో స్తోత్రాలు కృతులు - -అందజేశారు--! చదివి -మననం  చేసుకుని - ఆలోచించి  ఆచరించి  తరించడానికి -- అమూల్యమైన   అద్భుతమైన  సంపదను మన  భారత జాతికి  అంద జేశారు - అవి లేకపోతె మనం లేము --
చరిత్ర లేని మనిషికి  మనుగడ లేదు --అట్టి  మహా ఋషుల ఋణం --వారు అందించిన సశాస్త్రీయమైన అనుకరించి  -అన్వయించుకుని --ఇహపరాలను సాధించడం  ద్వారా --ఋషుల  ఋణం తీర్చుకోవాల్సి  ఉంటుంది  -- గోత్రం ప్రసాదించింది  ఋషులే !గోత్రాభి వృద్ది రస్తు ! అంటే-
ఋషుల దీవన వల్ల  మన బ్రతుకు  ధన్యమౌతుంది 
                                 సంద్యావందనంలో --ఆ  ఋషుల  సంస్మరణ  ఉంటుంది --వారు మనకు జ్ఞానం ఇచ్చిన తోలి గురువులు - గురువు కరుణ వల్లే  మన దారి సుగమం  అవుతుంది -- హరితస -ఒక మహర్షి - యవనాశ్వ   మరొకరు -అంబరీషుడు  మూడవ మహర్షి   !
                          ౩--      ఇక దైవ ఋణం -- అనుదినం ఇస్తా దైవాన్ని స్మరించుకోడం -- ఆలయాలకి వెళ్లి -- మరువకుండా  మదిలో నిలుపుకోడం -- పూజలు - నోములు --వ్రతాలు -యజ్ఞాయాగాది క్రతువులు -చేయడం --పవిత్ర నదుల్లో స్నానం చేయడం --ప్రముఖయాత్రా స్తలాలను  దర్శించడం   ద్వారా దైవ ఋణం  తీర్చుకో వచ్చును 

               సర్వే జనాః స్సుఖినో భవంతు --సమస్త సన్  మంగళాని  భవంతు -- ఓం  శాంతి  !శాంతి ! శ్శాంతి !
                                  ---------        శ్రీ శుభమస్తు ---- 

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...