జందెము వేసుకునే విధానం రాస్తున్నాను --!
ఆచమనం చేయాలి -- ప్రాణాయామం - సంకల్పం యదా విధిగా చెప్పాలి --
మమ శ్రౌత స్మార్త విహిత నిత్య కర్మానుష్టాన యోగ్యతా సిధ్యర్థం బ్రహ్మ తెజోభి వ్రుధ్యర్థం --యజ్ఞోప వీత ధారణం కరిష్యే !
అని నీళ్ళు విడవాలి -- జంధ్యాన్ని రెండు మోకాళ్ళకు చుట్టి - మూడు చోట్ల కుంకుమ తో అలంకరణ చేయాలి -- !
మళ్ళీ ఆచమనం చేసి -- ఒక జంధ్యాన్ని రెండు చేతులా పట్టుకుని ఈ మంత్రం అంటూ ధరించాలి < కుడి భుజం పై నుండి >
యజ్ఞోపవీతం పరమం పవిత్రం - ప్రజాపతే -సహజం పురస్తాత్ -
ఆయుష్య మగ్ర్యం -ప్రతిముంచ శుభ్రం --యజ్ఞోపవీతం బలమస్తు తేజః !!
తిరిగి ఆచమనం -- మళ్ళీ మరొక జందెం --అదే మంత్రాన్ని అంటూ ధరించాలి
మూడవ పోగు జందెం - కూడా అలాగే ధరించాలి !
ఆ తర్వాత పాత కొత్త జంద్యాలను కలిపి దశ గాయత్రి జపం -చేయాలి ---
పాత జంధ్యాన్ని కుడి భుజం పైగా తీసి వేస్తూ --ఈ మంత్రాన్ని అనాలి --
ఉపవీత చిన్న తంతుం ---జీర్ణం కశ్మల దూషి తం----!
విసృజామి యశో బ్రహ్మ -వర్చో దీర్ఘాయు రస్తుమే---!
తీసిన జంధ్యాన్ని --ఎవరూ తొక్కని చోట వదిలేయాలి
నూతన యజ్ఞోపవీతం తో -- యదా శక్తి -- గాయత్రి జపం చేయాలి --
జయం - శుభం
No comments:
Post a Comment