Friday, February 1, 2013

Sri Ram

 నాగరాణి -శ్రీకాంత్ ల  పుత్ర రత్నానికి  - నామకరణం -శ్రీరాం అని జరిగింది --ఆ  సందర్భంలో  నేను- రామనామానికి  స్పందించి - చలించి రాసినపాట - అందరికి చదివి వినిపించాను -- 9/3/2012
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
 ఏడుకొండలవాడ - వెంకటా రమణా !-    భద్రాచల వాసా-- శ్రీ సీతా రామ చంద్రా - !
శ్రీశైల వాసా -మల్లికార్జునా శివా ---!  !శ్రీకాళ హస్తీశ్వర--  జ్నాన ప్రసూ నాంబికా -హరా !
ముక్కోటి దేవతల ఆశీస్సుల ఫల మండి-- !బుద్ధవరపు శ్రీరాముని  మనసారా  దీవించండి !
పెద్ద మనసు కలిగిన  హితులారా !  బంధువులారా  !  --చిన్నారి  శ్రీరామునికి -- ఆశీస్సులు  అందించండి !  --   
          పితృదేవతలు - కీర్తి --శేషులు  తాతమ్మ --      శ్రీమతి  సరోజనమ్మ _ శ్రీరాముని   దీవించమ్మ !
          పితృ దేవులు - కీర్తి - శేషులు  తాతయ్య లైన -- సీనన్న - బాపన్న     -- తాతమ్మ - తారమ్మ - !
          పొత్తిళ్ళ  పాపడిని - శ్రీ రామ యనుచు  దీవించండి   !
శ్రీరామ   రామ అంటే - పాపాలు  తొలుగు నండి  !      శ్రీరామ నామము  - భవ తారక మంత్ర మండి  !
 స్మరించిన తరించును -- జన్మ ధన్య మగునండి -  !--గౌరికి  శివుడుపదేశించిన  శ్రీరామ నామమండి !
 మధురాతి  మధురము -  శ్రీరామ నామము ! -       సులభము - సరళము - దివ్యాతి  దివ్యము   !
           పుట్టిన పాపాలకు పేరు -- నామకరణ మహోత్సవము  ! -  -అనాదిగా ఆచారము  దేవుళ్ళ పేరు పెట్టుట  !
!           ఆడ పిల్లయితే  -వాణి - లక్ష్మి -గౌరీ యనీ -   --  !               -మగ పిల్లాడైతే  రాముడనీ --శివుడనీ-- --
           నోరార పిలచినా హరియించును   పాతకమని ! -                -కలియుగాన హరినామ స్మరణమే   మిన్న యనీ   --!-
           వింటిమి -- కంటిమి   !--నేడు చూచితిమి -- కనులారా   !
  శ్లో !!  " శ్రీరామ  రామ  రామేతి --రమే రామే  మనోరమే --!  సహస్ర నామ  తత్తుల్యం  -- రామనామ  వరాననే  ! "

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...