Friday, February 1, 2013

Mithunam


మిధునం సినిమా ఒక రమణీయ దృశ్య కావ్యం -తనికెళ్ళ భరణి గారికి పెద్ద వయసైన వారి తరఫున అభినందనలు - తెలుపుకుంటూ -మమ్మల్ని ఆ సినిమా ఎంతగానో ఆకట్టుకుందో చెప్పకుండా ఉండలేక పోతున్నాను -
చక్కని గ్రామీణ వాతావరణాన్ని తలపించే సహజమైన తోటలో- ఒక ఇల్లు చెట్లు పూ లు -కూరగాయలు -తమలపాకుల లతలు పనస -సొర మామిడి లాంటి పండ్లరసాల చెట్లు-సావిత్రిఐన గోవు -అంజి లాంటి లేగదూడ-బావి --వీ ని మద్య -చెప్పులు కుట్టేవానిగా -సన్యాసిలా -ఈతగానిలా -సంగీత ప్రి యునిగా -పూ జారిలా -రసికత ఎరిగిన సరసిలా -చదరంగంలో -తాటా కుపీకల్లో పాటలు పలికించిన భావుకునిలా - నవరసాలు తమ బ్రతుకుల్లో పండించుకున్న- జంటగా-ఇలా ఆ రెండు గంటలు మమ్మల్ని నానా రసమయ సన్ని వేషాల్లో ఓలలాడించి - -మురిపించి -మంత్రింప చేసిన ఘనత భరణి గారికి దక్కుతుంది -
రేడియో లో పాత పాటలు -కాఫీ దండకం తాతగారిపై మనవడి కార్టూన్లు- పెళ్ళాం చీరల్లో భావుకత -కుంకుడు రసంతో తలంటు -నోరూరించే వంటకాలు -ఇడ్లి దోస పచ్చళ్ళు --ప్రేక్షకులకు కడు దగ్గరగా -కమనీయంగా -హృద్యంగా చూపించారు --ప్రేక్షకులకు తమ నిజ జీవితంలో ఎదురయ్యే అనుభవాల సారం కలబోసి నింపారు తమ ఈ చిత్రంలో-
సరసమైన డైలాగులు -నవ్వులు -పరిహాసాలు హాస్యాలు -ప్రతీ క్షణం పంచుకుంటూ -ఆనందం తమ దాంపత్యం లో- నింపుకుంటూ -అంతిమ ఘడియల్లో కూ డా - శరీరాలు వేరైనా తమ ఆత్మలు ఒక్కటే-అని నిరూపించారు -తమ అనురాగ మయ జీవితానికి ఇతరుల అనుబంధాలు ఆప్యాయతలు అడ్డు రాకుండా -తమకంటూ ఒక మరోలోకం-సృష్టించి- భరణి గారు ఇచ్చిన -మధురమైన జీవితం గడిపారు ఆ పుణ్య దంపతులు -
తాము కూడా తమ నిజజీవితంలో అలా ఉండగలమా ? అని తప్పకుండా అత్మవలోకనం చేసుకుంటారు ప్రేక్షకులు . మేము కూడా ఇలాగే ఒకరికొకరై -తోడునీడై ఉంటె బావుండును -అన్న ఊహ మనస్సులో మె దు లుతుంటుంది. కొంతమంది అలా ఆనందంగా ఉండాలని ప్రయత్ని స్తారు కూడా.
అది తమ జేవితమే అన్నంత గొప్పగా అన్వయం చేసుకునే విధంగా పాత్రల చిత్రీకరణ జరిగింది -అలాంటి సన్నివేశాలు సంభాషణలు చొప్పించారు కూడా తనికెళ్ళ గారు.
కరుణశ్రీ జంధ్యాల పాపయ శాస్త్రి గారి పుష్ప విలాపం -"నేనొక పూల మొక్క కడ నిలిచి " అనే ఘంటసాల గారిగాత్రమాదుర్యంతో జాలు వారిన పద్యాన్ని ఎంతో హృద్యంగా ఎర్రగుల్లాబీ తో అ ద్భుతంగా చిత్రీకరించారు. బాలు గారు -లక్ష్మిగారు అద్భుతంగా నటించారు -కాదు -ఆ పాత్రల్లో చక్కగా జీవించారు -పాత సిన్మాలు చూస్తున్న భావన కలిగింది సుమా మాకందరికీ --కథ -మాటలు దర్శకత్వం -నటన పాటలు సన్నివేశాలు -చిత్రీకరణ అన్నీ బావున్నాయి- రమ్యంగా -మనోరంజకంగా -ఆహ్లాదంగా ఉన్నాయి.
ఇద్దరితోనే రెండు గంటల కథ నడిపించడం సాహసం. ముసలిపాత్రల్లోకూడా ప్రారంభం -అంతం తో బాటు -- ఒయ్యారాలు సరాగాలు జీవన రాగాలు -షడ్రుచులు ఖేదం -విషాదం మోదం రోషం కోపం ప్రేమ -అభిమానం -పంతం పట్టింపు -ఇలాఎన్నో నోరూరించే ఘుమ ఘుమలు పండించడం ధైర్యం. నేటి ఆధునికతకు దూరంగా ఈ జంటను ఉంచి పాత రోజుల్లో ఉండే సాంప్రదాయాలకి విలువ ఇస్తూ -కొడుకులు కూతుళ్ళు వారి ఆప్యాయతలకు అతీతంగా తమ స్వతంత్ర జీవనానికి అడ్డులేకుండా ఒక హద్దుల్లో ఉంచి - ఇలా చరమ దశలో -వృద్ధాప్యంలో -నిశ్చింతగా ఉండ వచ్చు అని చూపారు
attachment లో detachment తామరాకుపై నీటి బుడగలా -అలా ఉండగలమా /అన్న ప్రశ్న కు జవాబు ఈ సినిమా.
భర్త కు కాలిలో ముళ్ళు కుచ్చుకుంటే భార్య విల విల లాడటం -భార్య జ్వర పడితే భర్త వేదన -మౌన రోదన - ఒకరికొకరు ప్రాణంగా సేవ చేసుకోడం -ప్రేమించుకోడం -ఇలాచేయడం వల్ల వారిపట్ల గల అనురాగం మరింతగా పెరిగి పోవడం చివరి శ్వాస వరకు -ఒకరిని విడచి -మరొకరు ఉండ లేక పోవడం -ఇదే నిజమైన భారతీయ జీవనం -దాం పత్యంలోగల ఆధ్యాత్మిక వేదాంత అనుభవ సారం -మన హిందూ జాతి గర్వించదగ్గ సంస్కారం - ఆలుమగల మధ్య ఒక పసుపు తాడు కల్పించిన ఇంట గొప్ప అనుబంధం -ప్రపంచంలోని ఎ ఇతర దేశాల్లో కూ డా కనిపించదు -మరి మన శాస్త్రాల్లో - ధర్మంలో వేదాల్లో అంతట బలమైన బలం -మర్మం దాగి ఉంది -చిన్న చిన్న అపోహలతో =అపార్దా లతో విడి పోవాలనుకునే పడుచు జంటలకు ఈ సినిమా ఒక కనువిప్పు కలిగిస్తుంది -పొరబాట్లను సరిదిద్దుకోవాలనే తపన - దాంపత్యంలో మధురానుభూతులను ఆస్వాదించు కోవాలనే అవగాహన కలిగిస్తుంది.
ఎంతటి వారైనా రాగ ద్వేషాలకు అతీతులు కారు --అయినా ఒకరి పై ఒకరి కి గల అపారమైన నమ్మకం -ప్రేమ అవగాహన జయిస్తాయి.-ఇచ్చిపుచ్చుకోవడంలో నిజమైన సంతోషం -స్వచ్చమైన ప్రేమ ఉంటాయని చెబుతుంది ఈ కథ. దాంపత్యం కల కాలం వర్ధిల్లడానికి కా వలసిన జీవన సూత్రాలు -ఇందులో మనకి లభిస్తాయి కూడా.
భర్త తన చేతులతో భార్యకు సేవలు చేయడం -ఆమెకి కాలికి స్వయంగా -పట్టాగోలుసులు అమర్చడం - ఒళ్ళు సుస్తీ అయితే కాళ్ళు పట్టడం-సపరిచర్యలు చేయడం -కళ్ళ నీళ్ళు పెట్టు కొడం --ఆమెకి చెప్పులు కుట్టడం -చేతికి గాయమైతే కట్టువేయిన్చుకుని -చిన్న పిల్లాడిలా ఆమె ఒడిలో ఒదిగి పోవడం -తాటాకు పీకలతో చిన్న పిల్లల్లా -పాడుకోడం- భర్త సన్యాసం -భార్యకు పరిహాసం -అతనిపై ఆమెకున్న సత్తా -అధికారం ప్రేమ -అనురాగం అతన్ని కట్టి పడేస్తుంది -అంజి లేగ దూడ చని పొతే కన్న తల్లి దండ్రుల్లా దుఖించడం--గోవును తమ కుటుంబం లో ఒక సభ్యునిగా చూస్తూ - దానికి తమ బాధలు - గాధలు చెప్పుకోడం -అద్భుతంగా ఉంది -
వాలు కుర్చీ ఈ కథకి మూలం -వృద్ధ దంపతుల విశ్రాంతి మందిరం లా -అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొని ఉంటుంది -కలుషితం చేయడానికి వచ్చే కారకాలను ఎప్పుడు తమ ఏకాంతానికి భంగం కలుగకుండా కనిపట్టుకుని ఉండటం- మాకు చాలా నచ్చింది -అవసరాల్లో ఉన్న ఆత్మీయులను ఆదు కోడం ద్వారా - అజ్ఞాతంగా భర్త కున్న ఉదారతకు భార్య కనబరచే కృతజ్ఞత -అతనికి చేతులెత్తి మొక్కడం -అపురూపం -అపూర్వం.
బాలుగారు లక్ష్మిని చేతుల్లో కెత్తి -మామిడి కాయలు అందించడం లాంటి సన్నివేశాలు కోకొల్లలు -భర్తను అటకపై కెక్కించిన భార్యకొంటె తనం భర్త దొంగ తనంగా భార్యకు తెలీకుండా పో[పు డ బ్బాల్లోంచి బెల్లం తీసుకోడానికి వెళ్లి బయట పడటం -అర్ధరాత్రివేళ కూడా ఆత నికిష్టమైన పండుముక్కను దాచి ఇచ్చిన అర్ధాంగిగా లక్ష్మి -నిజమైన గృహ లక్ష్మిగా -మహా లక్ష్మిలా కనబడు తుంది - ఇలా ఎన్నో మధుర ఘట్టాలు మనసునీ వయసునీ కదిలిస్తాయి -కవ్విస్తాయి -కన్నీరు తెప్పిస్తాయి కూడా.
అందులో మచ్చుకు కొన్ని మరపురాని మాటలు.
-----------------------------------------------------------------------
1-ఎంత చల్లని మాట చెప్పావే.
2- మొగుడి చావు కోరుకునే ఆడది ఈ ప్రపంచంలో నేనొక్క దాన్నే.
3- ద్రాక్షార సంబంధం లేదుట.
4--నాకు దొరికినంత గొప్పగా తోడునీడ --సాక్షాత్తు ఆ భగవంతునికి కూ డా దొరికి ఉండదు.
5--జన్మ -జన్మకీ నాకు మీరే కావాలి.
6-మన పెళ్లి మనం చూసుకున్నంత ఆనందంగా ఉంటుంది - నీ పెళ్లి చీర అది కట్టుకుంటే నేనెలా ఒప్పుకుంటాను ? అది మనవరాలైతేంటి ? మహారాణి ఐతేంటి ఈ సినిమాలో మళ్ళీ మళ్ళీ వినాలని పించే మధురమైన పాటలు కూడా .
------------- - -----------------------------------------------------------------------------------------------------
1-- ఎవరు గెలిచారిప్పుడు --? ఎవరు ఓ డారిప్పుడు ? -రెండు గుండెల చప్పుడు --నాదం ఒక్కటే ఎప్పుడు 1
2-ఆవకాయ పచ్చడి అందరిదీ --గోంగూర పచ్చడీ మనదేలే 1
సినిమా చూస్తున్నంత సేపు కమ్మని భోజనం చేస్తున్నంత ఆనందంగా -తృప్తిగా -ఉంటుంది - ఎన్నాళ్ళకు ఇలాంటి పాత సినిమాల్లోని -అనుభూతులు ఆత్మీయతలు ఆప్యాయతలు ఈ మిధునం సినిమాలో చూస్తున్నాంఅనిపిస్తుంది .
కుటుంబంలో ప్రతి ఒక్కరుకలిసి వచ్చి చూడ దగ్గ సినిమాఇది. భార్యా భర్తలను ఇంకా దగ్గరికి చేసి వారికి మా ర్గ దర్శకం--మధుర స్వప్నం -మానవతా దర్పణం -మమతానురాగాల దర్శనం - బాల గాంధర్వ రాగాలు పలికించే గాయకుడుగానే కాదు నటుడిగా కూడా -జీవన మధురిమలు పలికించి పండించడంలో సిద్ధ హస్తుడు -అనిపించాడు -వారిలో అంతర్లీనంగా అంతర్వాహినిగా సంచరించే ఆ కళామ తల్లికి జోహారులు హృ దయ పూర్వక నమస్కారాలు తెలియ జేస్తున్నాము.
జీవితంలో చరమాంకం -క్లైమాక్స్ ముగింపు -వాస్తవానికి దగ్గరగా ఉంది -భర్తను కోల్పోయిన భార్య దీనంగా -ఉంటుంది నిజమే , కాని భా ర్యను కోల్పోయిన భర్త జీవితం అంతకంటే దీనాతి దీనంగాఉంటోంది. ప్రస్తుతకాలంలో, స్త్రీ శక్తి స్వరూపి ఆమెతో పోలిస్తే ఒక్క దేహ దారుడ్య త లో తప్ప మగవాడు ఆమె సహాయ సహా కారాలు లేకుండా ఏ పని చేయడాని కైనా మనో నిబ్బరంసహజంగా అమెకున్నంతగా అతనికి ఉండదు దీపం లేని ఇంటిలా అతని జీవితం చీకటి మయం అవుతుంది.
అందుచేత ఆమె చేత కోరబడిన కోరిక వింతగా క నిపించినా వారి అన్యోన్య దాంపత్యానికి - అదే best solution. ఈ కథకే కాదు ఇలాంటి ఎ కథానిక కైనా ఆ పరిష్కారం అందాన్నిస్తుంది పొతే - నిజ జీవితంలో ఇది సాధ్య పడదు -విధి చేతుల్లో మనం కీళ్ళు బొమ్మలం -మన చేతిలో ఏది లేదు -మన జీవితాలను సాఫీగా సాగడానికి పరమాత్ముని కరుణించమని త్రికరణ శుద్ధితో కోరడం తప్ప.
ఈ సినిమా లో ఆ ఇద్దరిలో ఆ అనురాగ అన్యోన్య దాంపత్యంలో -దైవత్వం కరుణ -అనురాగం నిండుగా - మెండుగా ఉన్నాయి -- భరణి లా దైవాన్ని నమ్ముకున్న వారు పదిమందికి అవసరమౌతారు -ఆత్మ బంధువులౌతారు.
ఆ జంట వలె - ప్రతి జంట -ఆదిదంపతుల జంటలా అర్ధ నారీశ్వరులై -అర్ధాంగిని తన అర్ధశరీరంలో అంతర్లీనంగా అరాదిస్తూ -గౌరవిస్తూ తనలో తాను ఆమెతో రమిస్తూ నిత్యం ప్రశాంత చిత్తంతో -పరమానందంతో -జీవిస్తూ -పరమేశ్వర ప్రసాదితమైన జీవితాన్ని ఆనంద మయం చేసుకోవాలని నేటి దంపతులను కోరు కుంటున్నాము - ఆ స్పూర్తిని నేటి మానవాళిలో కలిగించమని ఆ భగవంతుడిని వేడుకొంటున్నాము.
సర్వే జనాః స్సుఖినో భవంతు

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...