జీవుడంటే ఏవరు ?"
ఈ ప్రశ్నచాలాజటిలమైనది రామకృష్ణ పరమహంస లాంటి మహాత్ములు కూడా తమ జీవితాలను ఫణంగా పెట్టి పరమాత్ముని చేరడానికి ఎంతో ప్రయాస పడ్డారు -భగవద్గీత సారాంశమే దీనికి జవాబు -జీవుడు సనాతనుడు దీనికి చావులేదు -జీవుడు -నిత్యం బ్రహ్మ సత్యం -జగత్తు మిథ్య -ఇవి జగద్గురువు శంకరా చార్యులు ప్రతిపాదించిన నిత్య సత్యాలు మన జీవన సూత్రాలు -పరమార్థాన్ని సూచించే ఆధ్యాత్మిక సోపానాలు జీవుడంటే దేవుడు- దైవాంశ సంభూతుడు -దేవునుకి ఎన్ని సులక్షణాలు ఉంటాయో అన్నీ ఈ జీవునిలో ఉన్నాయి -అవి మన బ్రతుకు ఉజ్జ్వలంగా మహాఉన్నతంగా దేదీప్య మానంగా మన బ్రతుకును దిద్దడ గలవు -మనం ఈ ఉనికి గుర్తించాలంటే ఆత్మ విచారం అవసరం -
ప్రతీ ప్రాణిలో జీవుడు ఉన్నాడు - దాని వల్ల ప్రాణంఏర్పడి జీవన చర్యలు ఉంటాయి -జననం నుండి మరణం వరకు ఉన్న జీవుడు గత జన్మ సంస్కారంతో చలామణి అవుతాడు ఒక్కొక్క ప్రాణిలో ఒక్కొక్క రూపంతో భిన్న స్వభావాలతో భిన్న సంస్కారాలతో ప్రవర్తిస్తుంటాడు -దేవుడు పది అవతారాలు మాత్రమే ఎత్తాడేమో కాని ఈ ప్రాణులు ఎన్ని కోట్ల జన్మలు ఎత్తాయో -ఎత్తుతాయో ఎవరికీ తెలియదు ఆ జీవుడు గత జన్మలలో ఆచరించిన సుకర్మ -దుష్కర్మ ఫలితంగా పాపపుణ్యాల అనుభవిస్తూ ఉంటాడు --
ప్రతి మనిషి ఒక నడుస్తున్న దేవాలయం అంటారు -నిజమే జీవి చేసుకున్న పుణ్యం వల్ల సద్బుధ్ధితో చక్కని కర్మలు చేస్తూ భగవత్ చింతనతో తన హృదయం దేవాలయంగా చేసుకుంటాడు ఆ జీవుడు అనగా ఉద్ధరింప బడతాడు మాత్రం ఉంటుంది -పురాణాలు ఎన్ని విన్నా -క్షేత్రాలు తీర్థాలు ఎన్ని దర్శించినా -ఆత్మ శుధ్ధిలేని పుణ్య కర్మలు ఎన్ని ఆచరించినా - జన్మ తో బ్రాహ్మణుడైనా కూడా తన నడవడిద్వారానే తనలోని జీవుడిని ఉద్ధరించు కుంటాడు
దేవాలయంలో లోన బయట పరిశుభ్రతను పాటించి మానసికంగా శారీరకంగా దైవ చింతన చేస్తూపొరపాటు చేయకుండా దేవుని పై చిత్తం ఉంచి జాగ్రత్తగా ఉంటాము -మనలోని జీవికి దైవ లక్షణాలు ఉన్నయి అనడానికి ఇదే కారణం - ఎందఱో మహానుభావులు ఎంతోక్రుషి చేసి తమ లోని జీవున్ని ఉద్ధరించు కున్నారు -
అన్ని ప్రాణుల కంటే మనిషిలో ఉన్న ప్రాణికి అనగా జీవుని కి భగవంతుడు తనకు తాను ఉద్ధరించుకునే శక్తినీ బుద్దినీ -వివేకాన్నీ -ఆలోచనా జ్ఞానాన్నీ ప్రసాదించాడు -అందుకే అన్ని జన్మల్లో కెల్లా -మానవజన్మ దుర్లభమనీ అన్ని ప్రాణులలో కెల్లా మానవుడే ఉత్తమమనీ -వేదాలు శాస్త్రాలు అతన్ని మంచి మార్గంలో నడిపించెందుకే మహాత్ములు చెప్పారు -
" నేను ఎవరు ?" అన్న నిరంతర ఆత్మవిచారంతోనే మనిషి ఉద్ధరింప బడతాడు- ఈ దేహం తాను తెచ్చుకున్నది కాదు - జీవుడు ధర్మమార్గంలో నడవడానికి ఉపయోగించుకునే పరికరం మాత్రమే -జీవునికి ఈ శరీరం ఒక వస్త్రం లాంటిది దీనిపై వ్యామోహం తగదు- లొపలఉన్న జీవుని ఉద్ధరించే ప్రయత్నం చేయాలి -- "నిత్యం సన్నిహితో మృత్యు 1కర్తవ్యం ధర్మ చింతనం !"- ఎప్పుడు ఈ జీవుడు ఎగిరిపోతాడో తెలీదు దీపం -ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలి ఈ జీవుడు ఉద్ధరింప బడటానికి దేవుడిచ్చిన చెక్కని అవకాశం ఈ మానవ జన్మ! దీనిని --ఉపయోగించుకోవడం మానవ లక్షణం - మరో జన్మఅంటూ ఉండకుండా భగవంతుని చరణారవిందములను గూర్చి పూజించడం- స్మరించడం -భజించడం- సేవించడం చేయాలి -జన్మ ధన్యం చేసుకోవాలి!
NOV 22, 2014
Thursday, May 19, 2016
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment