Friday, September 14, 2018

కష్టాలు సుఖాలు పరమేశ్వరా!

దేవుడు కష్టాల్లో గుర్తు కొస్తాడని అంటారు, సుఖాల్లో మరచిపోతామని అంటారు..!అసలు.కష్టం అంటే ఏమిటి.? అలాగే ఏది సుఖం,,?కష్టాలు లేనిది ఎవరికి. ? , ఎంత ధనవంతుడు, బలవంతుడు, విద్యావంతుడు అయినా లేదా బీదవాడు, రోగులు, అనాధాలు, అభాగ్యులు,అయినా కష్టాలు లేవని అనే వారెవరు..? జన్మించిన మానవుడు అంతిమ శ్వాస వరకు కష్టాలు పడక తప్పదు, సుఖం కూడా..! అయితే ఎవరి కష్టాలు వారికే ఎక్కువ,,! 

గుడికెళ్లని వారు ఉంటారేమో కానీ హాస్పిటల్ ను దర్శించని వారు ఉండరు,ఎందుకంటే జనన మరణాలు అక్కడే సంభవిస్తున్నాయి . ఎక్కువ కాలం బ్రతకడానికి ఎక్కువగా డాక్టర్ లను చూడాలి, వారు చేసే treatment కష్టాలను మన ఇష్టపూర్వకంగా స్వీకరించాలి .!

కానీ.దేవాలయానికి వెళ్ళాలంటే మాత్రం కష్టాలు గుర్తుకొస్తున్నాయి..దైవదర్శనానికి తీరిక ఉండదు . అన్ని విషయాలు జ్ణాపకం ఉంటాయి. కానీ దేవుని భజనలు స్తోత్రాలు మాత్రం, జ్ణాపకం ఉండవు, అలాగే అందర్నీ నమ్ముతాం కానీ దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు ,అంతటా ఉండి నిండి అన్నింటిని నడిపిస్తున్న సచ్చిదానంద స్వరూపుడు అంటే. మాత్రం నమ్మము.. 

ఇక ఈ మందులు కలిసిన ఆహార పదార్థాలు తినడం రోగాలకు మూలం కాగా,బ్రతుకు బాటలో, జీవన పోరాటంలో ఆరాటంలో మనం పడే కష్టాలు పుష్కలం,.!. అంతులేని సమస్యలు .అయితే కష్టం అంటే అసలు అర్థము ఏమిటి? తిండికి లేకపోవడమా ,తింటే అరగక పోవడమా,! డబ్బులు లేకపోవడమా, ఉన్న డబ్బులు ఎలా దాచుకోవాలో తెలీక పోవడమా.!ఇలా కష్టాలకు ఎన్నో నిర్వచనాలు, చెబుతారు... అందుచేత దైవారాదనకు కష్టాలే రావాల్సిన అవసరం లేదు, 

ఎందుకంటే దేవుణ్ణి తలవని రోజు దుర్దినం,! తలిచిన రోజు సుదినం,,! పోతన అందించిన భాగవత భక్తిమార్గము లో " దేవదేవుని నుతియించు దినము దినము ""!" అంటాడు. కావున దైవాన్ని తలచుకోవాలంటే నమ్మకం మొదటి మెట్టు,!అనగా భావం ముఖ్యం !, ఎంత విశ్వాసమో అంత ఫలితం కదా,,!,అందుచేత మన కష్టసుఖాలకి ,భగవన్తుని పూజించడానికి లంకె పెట్టగూడదు.. లోన ఉన్న అంతర్యామికి , బయట మనం అనుభవించే భౌతిక కర్మలఫలితాలకు ఏ మాత్రం సంబంధం లేదు..

మన సంచిత కర్మల ఫలితం మన ఈ కష్టాలు సుఖాలు..! అంతే గాని దైవం మూలకారణం కాదు కదా...! చూసే చూపులో, భావించే మనసులో దైవాన్ని ఆరాధించే తత్వం దాగి ఉంటుంది. తపన, సాధన,,సత్సంగం, దైవానుగ్రహం తోడైతే తప్ప హృదయంలో దైవాన్ని స్థిరంగా ఉంచుకోడం సాధ్యం కాదు కదా,,! పరమేశ్వరా!, పరంధామా,! 



ఎన్ని కష్టాలు రానీ, సుఖాలు పోనీ,, నిన్ను తలిచే, కొలిచే పూజించే, భజించే భావించే అచంచలమైన భక్తివిశ్వాసాలను అనుగ్రహించు,! భావ దారిద్ర్యం రానీకు పరమాత్మా,!, నీ స్మరణయే సుఖం,! నీ తలంపు లేని ఘడియలు కష్టం, కావున స్వామీ ! మంగళకరము, మహిమాన్వితమైన నీ దివ్యవిగ్రహ దర్శన మహాభాగ్యాన్ని ప్రసాదించు..! శరణు జగదీశా,! శరణు, ఆదిదేవా శరణు..!మా కున్న కష్టాలలో కూడా నీ ఉనికిని గుర్తించే స్పూర్తిని శక్తిని జ్ఞానాన్ని ప్రసాదించు మహాదేవ దేవా !,శరణు !

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...