Monday, October 22, 2018

గోవిందా! గోవిందా!

Oct 21, 2018

మన ఇళ్లల్లో " గోవింద " అంటే అదేదో అనకూడని మాటలా భావిస్తూ ఉంటారు..!. ఇలా భ్రష్ఠు పట్టిన ఆలోచనలు శుద్ధి చేయడం ఎలా....?  "గోవిందా. !..నీకు ఈ నామం ఎంత ప్రీతికరమైన దో ,మాకు తెలుసు..!  "గోవిందా !"అన్న పిలుపుకు నీవు ఎంత పరవశించి పోతావో.? ఎంత ఆనందమో ?,,నీ భక్తులకు కూడా , అంతే ఆనందానుభూతి కలుగుతూ ఉంటోంది.. కదా ! పైగా నీకు మాములుగా వచ్చిందా ఆ పేరు ? స్వామీ ! నీవు  ఏడురాత్రులు ,ఏడు పగుళ్ళు  ,గోపగోపీజనాలను ,అలమందల ను ,దేవేంద్రుడు కోపంతో కురిపించే భీభత్సకరమైన వర్షాలు ఉరుముల దాడినుండి నీ చిటికెనవ్రేలి తో గోవర్ధనగిరి పర్వతాన్ని గొడుగులా ధరించి కాపాడుతూ ,, "శిష్ఠజన రక్షకత్వ  ""బిరుదును సార్ధకం చేసుకోడానికి ఎంతో కష్టపడుతూ , సంపాదించుకున్న "బిరుదు" ఈ గోవింద నామం..! అందుకే  నీ సహస్రాధిక నామాలలోకెల్లా  ,ఈ గోవింద నామం  నీకు బహు ప్రీతికరం కదా  ! కానీ ఎందుకీ అర్థం కాని  ,జ్ఞానం లేని మనిషి ప్రవర్తన తీరు..! శవాల ఊరేగింపు సమయంలోనో ,వైష్ణవ ఆలయాలలోనో ,,లక్ష్మీ రమణుని బ్రహ్మోత్సవాలలో నో , మాత్రమే పరిమితం చేస్తూ "గోవిందా" అంటూ ఉచ్చరించాల్సి రావడం, అలా  భక్తులు వ్యవహరించడం ,హరి హరి నామానికి  హద్దులు పెట్టడం.. చాలా బాధాకరం గా ఉంటోంది..గోవిందా !   "గోవిందా  !"అంటే అంతా అయిపోయింది  ! ఇక ఏమీ మిగిలి లేదు  !"  అనేగా మన భావన ! నిజానికి  అనునిత్యం   ఈకాలచక్ర భ్రమణం లో  నలిగిపోతున్న జగతి లోని సమస్త చరాచర జీవులు ,,జగతిలో ని అందాలు ఆనందాలు, అనిపించే సృష్టిలోని ప్రతీదీ ,, వాని కాల వ్యవధి పూర్తి అవగానే "గోవిందా" అవుతున్న విషయం మనకు తెలియనిదా.?. రేపు మనం కూడా  ఇలాగే  "గోవిందా "అనుకుంటూ గోవిందునివద్దకు చేరవాల్సిందే కదా..! ఇంతటి భక్తిని జ్ఞానాన్ని  వైరాగ్య భావనా సంపదను కలిగించే ఈ గోవింద నామం భుక్తి ముక్తిదాయకము కదా ! మరి ఎందుకు  ఈ చీకటిలో దోబూచులాటలు..? ఎంత పుణ్యం చేసుకుంటే అలా  "గోవిందా " అనుకుంటూ తుది శ్వాస విడిచే యోగం సిద్ధిస్తుంది ? చేసుకున్న కర్మఫలాలు పూర్తి కాగానే అందరూ "గోవిందా" అనవలసిందేకదా ! కానీ అప్పడు గోవిందుని స్మరించే భాగ్యం ఉంటుందో ,,ఉండదో ! అందుకే ,,ఇప్పుడే అందాం ! అనుకుందాం !  కేవలం ఎవరో  ఎక్కడో "చస్తేనే "కానీ జ్ణాపకం రాని గోవిందు ని  ఇప్పుడే స్మరించుకుందాం..!  అలా క్రమంగా "గోవింద "నామం పై పవిత్రభావన ను పెంచుకుందాం..! అంతేగాని , దీనికి విపరీతవ్యాఖ్యలు చేసేవారికి ఘోరమైన పాపం చుట్టుకుంటుంది..సుమా ! అందుకే అన్నమయ్య చెప్పినట్టుగా  ""భావములోనా ,బాహ్యమునందున ,గోవింద! ,గోవింద!  అని కొలువవే మనసా  ! ""అంటూ గోవిందుని నామ వైభవ స్మరణతో పులకించి ,అమృతతుల్య మైన గోవిందుని వేలాది సంకీర్తనలు  రచించి గానం చేసి , తరించడానికి మనకు అందించి  ,తాను",గోవిందుని దివ్య పరందామాన్ని"" చేరుకున్నాడు..!అలా గోవింద నామ విశిష్టత ఎంత గొప్పదో ,చాటి చెప్పాడు..!అందుకే , మనలో కొలువై ఉన్న "గోవిందుని చరణారవింద స్మరణ!" నిరంతరం  చేయుమని "కోతి "లాంటి మన మనస్సును   వేడుకుందాం. ! గోవిందా ,గోవిందా !"",,అంటూ   నోరారా ,తనివారా ,,పిలుద్దాం  !అలాగే   మరొక్క విషయం  ! " సకల జనహితము,సమ్మతము " అయిన  మన "భగవద్గీతను"  శవాల యాత్ర సందర్భంగా మాత్రమే ఉపయోగిస్తూ ఉండడాన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించాల్సి ఉంటుంది.!. చచ్చినవారు  "గీతాబోధనలు " "ఎలాను  వినలేరు..! ఇక  ,"చావబోతూ ఉన్నవారు శ్మశాన వాటిక లోనే  గీతావాక్యాలు వినాలా.?. అది దానికే నిర్దేశింప బడిందా? ,అందుకోసమే అని చెప్పాడా శ్రీకృష్ణుడు ? అక్కడ "గీతను "వినడం వల్ల వచ్చే పుణ్యం ఎవరికి వస్తోంది ? జీవుడు బ్రతికి ఉండగా వినలేని గీతను కనీసం అతడు పోయాక అయినా  వినిపించాలని అనుకోవడం అవివేకం అజ్ఞానం కాదా.?  శవానికి జ్ఞానేంద్రియాలు పని చేయవు  !" అని మనకు తెలుసు కదా ! తెలిసీ, తెలిసీ ,తెలియని వారి వలె నటించడం ,భగవద్ భావాల మర్యాదను కించపరచడం  బాధగా అనిపిస్తోంది  కదామనకు ! ఇక వెంట వెళ్ళేవారి జ్ఞానోదయం కోసమా. అలా వినిపించడం .! "స్మశాన వైరాగ్యం " పురాణ వైరాగ్యం ,ప్రసూతి వైరాగ్యం !"" అంటే ఒక గంటసేపు" అయ్యో! జీవితం అంటే ఇంతేనా ?"" అని అనుకోవడమేనా ?   అంత సులభమా వైరాగ్య భావన రావడం ?  మన ఇండ్లలో లేదా దేవాలయాలలో ,సత్సాంఘాలలో ,అలా ఎక్కడ వీలైతే అక్కడ చదువుకోవడం, లేదా వినడానికి తీరిక ఓపిక భక్తి శ్రద్ధ ఆసక్తులు  మనకు  ఉండడం లేదా. ? ఈ విదంగా మన సంప్రదాయం ను మనమే ఒక చిన్నచూపు చూస్తూ. పవిత్రమైన సద్గ్రంథమునకు మచ్చ తెస్తూ ,ఇతరులు వేలెత్తి చూపే అవకాశాన్ని మనమే వారికి  ఇస్తున్నాం.. !మన బ్రతుకురాత లను మార్చే గీతాగ్రంధమును  చదువుకున్నా ,వినకున్నా ఫర్వాలేదు.!. కానీ ఇలా దుర్వినియోగం చేసే అధికారం మనకు లేదు కదా..! ప్రక్కదారి పడుతున్న ఈ వ్యవస్థను మనమే అప్రమత్తంగా ఉంటూ మనమే దిద్దుకోవాలి..,,! ఎవరో వస్తారని ,,ఎదో చేస్తారని ఆశించడం. అలా అనుకోవడం తప్పు  ! తప్పు అని తెలిసి కూడా మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తుండడం ఘోర అపరాధం అవుతోంది..,, అని నా భావన ! ,దానిని మీ ముందు పెడుతున్నాను.!. ఎలా దిద్దుకోవాలి.? ఎలా సంస్కరించాలి.? ఏం చేస్తే ఆధ్యాత్మిక విలువలు, భక్తి శ్రద్దలు ,ఆచార వ్యవహారాలు ,సంప్రదాయాలు దెబ్బతినకుండా , మన పరమ పవిత్ర సద్గ్రంతం,భగవద్గీతను సద్వినియోగం చేయవచ్చు నో, మేధావులు ,పండితులు ,శాస్త్రం తెలిసిన వారు,శ్రుతి స్మృతి ,పురాణ ఇతిహాసాలు తెలిసినవారు ,విజ్ఞులు ప్రాజ్ఞులు ,నీతి కోవిదులు ఇందులో ఉన్నారు .!.వారు నిర్ణయించాలని ,ఇది " సమస్య  !"అనుకుంటే నివారణ చర్యలు ,మార్గదర్శనం చేయాలని  వారిని సవినయంగా కోరుతున్నాను! .ఈ సంస్కృతి ,రాబోయే తరాలకు , మన సద్ గ్రంధాల పట్ల , వాటి అధ్యయనం , అన్వయం ,ఆచరణ ల పట్ల చక్కని అవగాహనని  ,పెంపొందించే రీతిలో ఉండాలని కోరుకుందాం.!. ఈ సందర్బంగా గీతాచార్యుడు ,శ్రీకృష్ణభగవానుడు  భగవద్గీత లో ప్రబోధించిన ఒక శ్లోకాన్ని తలంచుకుందాం..! 9.27.:::::!! శ్లో  !!"'యత్ కరోషి ,  యదా ష్ణాసి,యత్ జుహోసి,దదాసియత్ ,,,, యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం !""  అనగా  ""నీవు ఏ పని చేసినా ,ఏది తినినా ,ఏది యజ్ఞములో హవిస్సు గా వేసినా , ,ఏది దానము చేసినా ,తపస్సు చేసినా ,,అర్జునా. !అవన్నీ నాకే సమర్పించిన భావంతో చేయుము...!"అని మనకు  సందేశాన్ని   అందించాడు శ్రీకృష్ణుడు !  అనగా మనం చేసే ప్రతీ పనిని " సర్వమ్ శ్రీకృష్ణార్పణ మస్తు !" అన్న అంతర్గత భావనతో  చేయాలని ,,, చూసే ప్రతీ పదార్థంలో  ,యదార్థమైన పరమాత్మ దివ్య వైభవంగా ,దర్శించాలని  ఆ అంతర్యామి ఉపదేశం..!అలా,  భగవన్తుడే స్వయంగా మనకోసం భూమిపై కి దిగివచ్చి ",భగవద్గీత  "ద్వారా అందించిన అమృతతుల్య ఉపదేశ సారాన్ని  గ్రహిస్తూ ఉత్కృష్టమైన ఈ మానవజన్మ ను ఉద్ధరించుకోవాలి.!. అన్ని రోగాలకు దివ్య ఔషధం ,! వేదాల సారం  ,,!జీవన వేదం..! వేదనల నివృత్తికి మూలం ..!ఆధ్యాత్మిక ఆనందానుభూతులను,పరమాత్మ సాక్షాత్కారం ను  అలవోకగా అందించే  సద్గ్రంథం , మన  ఈ భగవద్గీత !! అలాంటి పవిత్రమైన పుస్తక పఠనం ,శ్రవణం ,పూజనం, చేస్తూ ,భావిస్తూ.. మనతో బాటు అందరినీ ,ఇదే స్ఫూర్తితో   ,భగవద్ సేవలో ,కలుపుకుంటూ ,, మానసికంగా, శారీరకంగా  ఆధ్యాత్మిక భావ సంపద తో   ఎదుగుతూ ,తరించుదాం..! గీతామాతకు జై !  గోవిందునికి జై ! గోపాలకృష్ణ భగవానునికి జై !!" హరిః ఓమ్ తత్సత్ !  ఓమ్ నమో భగవతే వాసుదేవాయ !  స్వస్తి !!"

వివేకానంద స్వామి

Oct 20, 2018

మన దేశ యువజన వైతాళికుడు ,సంస్కర్త ,,యువత కు స్ఫూర్తిదాయకుడు , మన భారత దేశ,ఆధ్యాత్మిక సౌరభాలతో  ఖండతరాళాల్లో విశ్వకీర్తి బావుటా ను ఎగురవేసిన మన వివేకానంద స్వామి .,,పౌరాణిక సద్గ్రంథాల ను ,,స్మృతి స్మృతులను, శాస్త్రాలను , ఉపనిషత్తుల ను ,పురాణ ఇతిహాసాలను క్షున్నంగా చదివి తన అనుభవ సారాన్ని అందరికి ప్రసాదంగా పంచాడు !..తన చివరి శ్వాస విడిచే రోజును, సమయాన్ని తెలుసుకున్న మహాజ్ఞాని ,, ప్రాణవాయువును సహస్రార చక్రం నుండి. యోగప్రక్రియ ద్వారా ఊర్ధ్వ ముఖంగా పంపుతూ ,తనను తానే ,,పరమాత్మ లో లీనం చేసుకున్న  ఉత్తమసాధకుడు..!  "యోగికి  "ఉండాల్సిన యోగ్యత తో ఆత్మదర్శనం ,మహా కాళీ వైభవ అనుభవం కూడా పొందిన ఘనుడు. ! శాశ్వతుడు. ! అమరజీవి ! ఆ ఆత్మవిశ్వాసాన్ని  యువతకు ఊపిరిగా ,మనోనిగ్రహం ,బ్రహ్మచర్యం  ,ఏకాగ్రత లే  ,,,మానసిక శారీరక దృఢత్వంగా ,, మనలో ఏర్పడితే  వాటిని , దైవారాదనకు ఉపయోగించడం వలన,, మానవునిలో దైవాన్ని దర్శించవచ్చును అని నిరూపించాడు..!.చక్కని ఆధ్యాత్మిక విషయాలు ,కూడా తన ప్రభోదం ద్వారా మనకు తెలియజేశాడు..మన దేశంలోని గంగానది లోని ఒక్కొక్క నీటి "బిందువు,",బృందావనం భూమిలో ఉన్న ప్రతీ మట్టి  ""రేణువు,," నిత్యం  పూరీజగన్నాథ స్వామి నివేదనకు  ,మట్టిపాత్రల లోని ప్రసాదంగా  సమర్పించే అన్నం లోని ఒక్కొక్క" మెతుకు  "లో  అద్భుతమైన దేవతాశక్తి ఉంటుంది..బిందు బిందు వులో గోవిందుడు ఉంటాడు.. పాపాలు పోగేట్టే ప్రభావం వానిలో ఉంటుంది.. ఎవరైతే వాటిని తృణీకరిస్తారో..  దైవం పట్ల ఘోర అపరాధం చేసిన వాడు అవుతాడు.. అంటూ .అలా తన సకారాత్మ భావనతో  అంటే positive thinking  తో ,దుర్గతి పొందకుండా    ఉత్తమమైన జీవన విధానాలను ఎన్నో   రూపొందించాడు. !  అలాంటి సద్భావనలు ప్రేరేపించే విషయాలు,,పురాణ ఇతిహాసాల లో  పేర్కొనదగినవి  ఎన్నో ఉన్నాయి ,,ఉదాహరణకు ,  దివ్యము దైవత్వము ,అద్భుతమైన సహజమైన ధనాత్మక కంపనలను మన దేహంలో చిత్తంలో ప్రేరేపించే  తులసీదళం ,మారేడు  దళాలు,మర్రి వట వృక్షం లాంటి వాటిలో సకారాత్మక శక్తి 100 గజాల మేర వరకు ప్రసరిస్తూ ఉంటుందని శాస్త్రజ్ఞులు ప్రయోగాత్మకంగా వివరించారు.!  అందుకే  ,తమకు మేలు చేస్తున్న   ఆ మొక్కల్లో చెట్టులో  దైవాన్ని దర్శిస్తూ ,పూజిస్తూ ప్రదక్షణ లు చేస్తూ అవి  కొత్తగా తమకు అందించే   అద్భుతమైన సకరాత్మక ధనాత్మక శక్తితో మానసికంగా ఉల్లాసం ,శారీరికంగా ఆరోగ్యాన్ని పొందుతూ ఉన్నారు.  అంతటి మహిమాన్వితమైన దైవత్వాన్ని చెట్టులో పుట్టలో ఆకులో ,పువ్వులో రాయిలో కొండల్లో కోనల్లో ఉందని పురాణాల ద్వారా కొన్ని వేల ఏండ్ల క్రితం రాసి తెలియజేసిన  మన జీవితాలు ఆనందంగా ఉండడానికి అందజేసిన మన ఋషుల సంస్కృతి ,ముందుచూపు, జాతి సంస్కరభావన కు శతకోటి ప్రణామాలు సమర్పించుదాం. మనలో  కొందరు అనుకుంటారు. ,,.దేవాలయంలో దర్శనానికి వెళ్లే వారు , దేవుణ్ణి  సరిగా చూడటం లేదు  !ధ్యాస , ధ్యానం నిలపడం లేదు ..! ప్రార్థన, అర్చన ,భజనలు చేయడం లేదని  ఇతరులపై  ఆరోపిస్తూ ఉంటారు ! కానీ అది సరి కాదు. ! అది నకారాత్మక భావన.! Negative thoughts.. ! "చెడు అనడం!చెడు  వినడం  ! చెడు చూడడం ! "" పట్ల ఆసక్తిని , శ్రద్ధను కనబరిస్తే ,అది మానవత్వానికి పతనం అవుతుంది..! అందుకే అటువంటి విషయాలపై దృష్టి పోనీకుండా  ,,జాగ్రత్త పడుతూ ,కేవలం" దేవతా విగ్రహం "పైనే దృష్టిని  నిలిపి ,మనసు ,బుద్దిని దైవంపై కేంద్రీకరించుకొని  దేవుడు "ఉన్నాడని" సకరాత్మక భావంతో, విశ్వాసంతో నీవు త్రికరణ శుద్దితో  ,ఆలయంలో దేవతావిగ్రహాన్ని దర్శిస్తే అప్పుడు నీలో  "అది ,"ఆ  ""భావమే "  మనలో "సకరాత్మక "శక్తిని పెంచుతుంది..! అంతే ! ఇక .,, అక్కడ  భగవన్తుడు నిజంగానే కొలువై ఉంటాడు !.మీ ఆర్తిని గమనిస్తూ, మీ కోరికలు తీరుస్తాడు..! ఇక  ప్రస్తుతం , మన నిత్యజీవితంలో, ఎవరికీ  negative  thoughts , అంటే నకరాత్మక భావాల గురించి చెప్పే  "అవసరమే" లేదు! అవన్నీ  ఇప్పుడు అనుభవ పూర్వకంగా తెలుసుకుంటున్నాము కూడా,,! ఆ విదంగా, కొత్త కొత్త రోగాలకు , వ్యాధులకు ,BP, suger  లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు ,heart attack ,లాంటి  ఘోరమైన చావుకు స్వాగతం పలుకుతూనే ఉన్నాం.!ఇంకా !!,,. మానసికంగా ఆందోళన ,మెదడు లో రుగ్మతలు, నరాల బలహీనత లాంటి  పేషెంట్ లతో హాస్పిటల్ల సంఖ్య ,రోగాల సంఖ్యా అదే నిష్పత్తిలో,  ఏటా మూడు పూవులు, ఆరు కాయల్లా, పెరుగుతూనే ఉన్నాయి.! ఒకవైపు ",దేవుడున్నాడు " అని ఒప్పుకుంటూ కూడా, ఆయనపై విశ్వాసం ఉంచకుండా " ,ఇది నాది ,!" "ఇదంతా నేనే చేస్తున్నాను.!""" నావల్లే ఇది పూర్తి అయింది..,, నేనంటూ లేకపోతే ఇది అయ్యేది కాదు..!""" నేను చెప్పినట్లు వినలేదు ,, కనుక నీకు ఇలా జరిగింది..!అయినా. ఎలా వినవో ,వినకుండా ఎక్కడికి పోతావో ,,చూస్తాను...!" నీవు ఎవడో , అవతల వాడి మాట వింటావు  ,,కానీ నా మాట వినవు కదా .!"" ఇది.నా ఇల్లు..!నా భర్త! నా భార్య..! ""ఇది ,నేను చెమటోడ్చి సంపాదించిన డబ్బు.!,," ""వాడు నాకు బద్ధ శత్రువు.!. వాడి పేరు వింటేనే ఒళ్ళు మండిపోతుంది..!" వాడి రక్తం చూస్తేనే గాని నాకు నిద్ర పట్టదు  ! వాడా వట్టి పిరికి సన్నాసి ఎందుకూ పనికిరాడు. ! అంటూ , ఇలా ప్రతిరోజూ ,ప్రతీ ఇంటా, ప్రతివారి నోటా, ఎప్పుడూ వినిపించే  ఆ ""నకారాత్మక దృక్పథం "తోనే రోజంతా గడుస్తూ జీవితాలు ముగుస్తూ నే ఉన్నాయి  కదా. ! ఇందులో  మన ego.  "అహం "ఉంటుంది  !ఇది లేకుండా జీవితాన్ని గడపలే ము.!,,.నిజమే  ,,! కానీ ,ఆ "ఆహాన్ని" దెబ్బతీసే సందర్భాలు  మన ముందుకు వచ్చినప్పుడు తట్టుకోలేం.కదా. !అనుకున్నట్టు జరక్కుండా,విపరీత పరిస్థితులు  ఏర్పడటం.. దానితో మనసు గాయపడటం..,,ఇంకా ఇంకా ఎక్కువ "నకారాత్మక " ఉద్వేగంతో. కోపంతో  ,ద్వేషంతో ,పగతో ,ఈర్శ్యతో ,తాపంతో ,దుఃఖం తో రగిలిపోతూ , మనసును కంట్రోల్ చేసుకోలేక ,చిత్తాన్ని ,చితి మంటల జ్వాలల వలె ,లోన బాధను పెంచుకుంటారు..! లోన ఎంత బాధ ఉన్నా కూడా ,, బయటకు పొక్కనీయకుండా ,లోలోన కుమిలిపోతూ , చిక్కి శల్యమై ,క్రమంగా పతనమయ్యే వారు ఎందరో. కనిపిస్తారు..! కొందరు ,కష్టాలు  భరించలేక ఆత్మహత్య చేసుకోడం. చెదిరిన మనసుతో ఆక్సిడెంట్ పాలయ్యేవారు. త్రాగుడు లాంటి వ్యసనాలకు బానిసలయ్యే వారు,,ఇలాంటి మానసిక దుర్బలులను చాలా మందిని చూస్తున్నాం.!.ఇలా బ్రతుకును చిన్నా భిన్నం చేసి, అందమైన జీవితాన్ని ఆనందంగా అనుభవించే మహాభాగ్యాన్ని దూరం చేసే ఈ  దుష్ట మైన ఘోరమైన ,రాక్షస కృత్య నకారాత్మక  చిత్తంతో ,పనులతో ఎన్నో కుటుంబాలు నష్టపోతూ ఉండటం  మనంరోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం..! ఇవన్నీ negative thoughts తో ఏర్పడే  దుష్ప్రభావాలు !,దుష్పరిణామాలే.! అటువంటి విపరీత వాతావరణం ను సుఖవంతంగా  మార్చుకోడానికి ,,స్వామి వివేకానంద అందించిన పుస్తకాలు చదివి ,positive thinking  దృక్పథాన్ని ,సమయ స్పూర్తిని ఏర్పరచుకుందాం...! ఇందులో  ""శాంతం సహనం ,సమానత్వ భావన , ఆనందం ,నమ్మకత్వం ,,సద్భావన ,సత్సంగము,పరస్పర సహకార ము ,అవగాహనా ,అత్మానందం "".లాంటి మానవతా విలువల ను పెంచే" బీజాలు" మన "హృదయం "అనబడే సుక్షేత్రంలో మొలకెత్తుతాయి .! సారవంతమైన భూమిలో ,నాణ్యమైన విత్తనాలు వేయడంతో. చక్కని ఫల పుష్ప భరితమైన పంటలు లభిస్తున్నట్టు గా. మనం ప్రశాంతంగా ఉండటానికి అనువైన రంగాన్ని ,భావాలను ,వ్యక్తులను ,పరిసరాలను మనం విజ్ఞతతో వివేకంతో , ఎంచుకోవాలి.., ! ఇదే మన నిజమైన విద్య !  మానవత్వంతో దైవత్వాన్ని దర్షింప జేసీ అమృతనంద గంగా లహరి  నకారాత్మక భావంతో అంటే కోపంతో , 10 ఏళ్ళ నుండి మాట్లాడకుండా ఉంటున్న స్వంత తోడబుట్టిన  అన్నయ్యను , సకరాత్మక భావంతో.ఇంటికి వెళ్లి  ప్రేమతో పలకరిస్తే,  ,అతడు ఆనందంతో పొంగిపోతాడు కదా !.ఇందులో. మనకు పోయేది  ఏముంది  ? డబ్బు ఖర్చు లేదు ఆయాస ప్రయాసలు అసలే లేవు  మాటలో చూపులో భావనలో దృక్పథం లో చేసే పనుల్లో  అందరితో కలిసి వేసే అడుగుల్లో కొంత వినూత్నమైన ,మార్పు !అంతే కదా !  చిరునవ్వు తో ఆప్యాయంగా మాట్లాడే ఒక్క మాటే కదా  ! రెండు హృదయాలను కుటుంబాలను , శాశ్వతంగా కలుపుతూ  "రక్తసంబందం "అనే అనుబంధం తో ఎందరి జీవితాలలోనో ఆనందాన్ని పంచుతూ పెంచేది. ! తల్లిదండ్రులు తోబుట్టువులు ,స్నేహితులు ,వీరే కాక మన ఇరుగుపొరుగు వారూ ఊరివారు మన దేశంలో మొత్తం ప్రపంచంలోని వారందరితో మన అనురాగ బంధాన్ని.!  వారితో  ప్రేమానుబందాలన ఇలాంటి ప్రేమానురాగాల బంధంతో గట్టిగా పెనవేసుకుందాం ! సత్యమైన నిత్యమైన శాశ్వతమైన ఆనందకరమైన ,అనుభవైక వేద్యమైన అనుబంధాలను  సకరాత్మక భావనతో. POsitive thinking , అలవర్చుకుంటూ,, వ్యక్తిత్వ వికాసాన్ని మన పెంచుకుందాం.! వివేకానందుని జీవిత విధానంలో ,అతని రచనల్లో ,ఉపన్యాసాల్లో అద్భుతంగా  ప్రబోధించిన జీవన సత్యాలు మానవత్వపు విలువలు  చదవడం ద్వారా ,, మనం తెలుసుకోవచ్చును.,!దేశభక్తిని పెంపొందించే శక్తిని, ఆత్మస్తైర్యాన్ని ,అభ్యుదయ భావాలని  ,దృఢమైన సంకల్ప బలాన్ని ,స్ఫూర్తిని ,ఆధ్యాత్మిక సాంప్రదాయ అంతర్యాన్ని ,, నేటి యువతకు   కావల్సిన ఉత్తేజంతో ,ఉద్దేశ్యంతో ఉపదేశిస్తుంది.! ఇలాంటి సద్భావన , సత్పలితం , శాంతి కాముకత ను ప్రేమానురాగాలను ,పెంపొందించే మార్గంలో పయనిస్తూ.. మనవారిని కూడా postive  thinking తో మనవెంట తీసుకెళదాం!. కానీ మనలో మన హృదయాల్లో ఇంత గొప్ప చైతన్యం కలగాలంటే ,ఆధ్యాత్మిక సంపద   అత్యవసరం.! దైవారాదన , దైవంపై అమితమైన విశ్వాసం , నమ్మిన సిద్ధాంతం కోసం ,పెద్దలు అందించిన అమూల్యమైన మన దేశ సాంప్రదాయ సంస్కృతి  ఆచరణ కోసం,స్వంత సుఖాన్ని ,స్వార్ధాన్ని ఫణం పెట్టక తప్పదు.! మానవత్వం నుండి దానవత్వానికి దిగజార్చే negative thinking కి స్వస్తి చెపుతూ .దైవత్వానికి దగ్గరి దారి చేర్చే ధనాత్మక దృక్పథాన్ని, సకరాత్మక భావాన్ని..,మన జీవితంలో కేవలం ఇలాంటి అందమైన భావాలతో ఇలను స్వర్గధామంలా మార్చుకునే ఆనందకరమైన భావ సంపదను ,ఆచరణ ద్వారా ,అమలుచేస్తూ , మన స్వంతం చేసుకుందాం.  !తనవారినే కాకుండా  అందరినీ మనవారుగా భావించే positive thikning ను ,కొంచెం కష్టమైనా కూడా , దీనితో పదిమందికి ,ఎదో ఒకరకంగాి  ,అంతో ఇంతో ,  సహాయపడే అవకాశం ఉంటుంది ! కనుక., సాటి మనిషిగా తోటివారితో సఖ్యంగా ,సంతోషంగా ఉండే వీలు కలుగుతుంది ,, కనుక  ఆచరణలో  పెడుతూ.." సదా మీ సేవలో..! , అంతా మన మంచికే  !""   జరిగింది, జరుగుతున్నది, జరుగబోయేది  ,,అన్నీ మన మంచికే..!!" అనుకుంటూ మన  స్వార్థ ప్రయోజనము కంటే ఇతరులకు మనం చేసే మేలు లో మన సంతోషాన్ని వెతుక్కోవడమే నిజమైన మానవత్వం..! అద్భుతమైన, సకల మానవకోటి కి ఆదర్శము ఆచరణీయము,ఆనందకరమూ అయిన "" సకరాత్మక చింతన ""తో మన బ్రతుకుల్లో దీపావళి దివ్వెల వెలుగులు నింపుకుందాం !. జగదాంబ విశ్వపాలిని మాత కృపతో సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని సాధిద్దాం..! ఎందరో  మహానుభావుల  మహాత్ముల ఆశయాలను  "సకరాత్మక  ""భావంతో  వారు కన్న "కలల సాకార" రూపాన్ని మన సంఘటిత సంస్కార సద్భావన తో సాధిద్దాం..! ఇందుకోసం మన అందరికీ కావాల్సిన శక్తినీ, స్పూర్తిని  ,, విశ్వాసాన్ని ,సమయాన్ని ,సమయస్ఫూర్తి ని అనుగ్రహించమని ఆ పరమేశ్వరుని చరణ కమలాలను తాకుతూ వేడుకుందాం.!. " సర్వే జనాః సుఖినోభవంతు!. సమస్త సన్మంగళాని భవంతు..! ఓమ్ శాంతి  !శాంతి  !శాంతిః   స్వస్తి !"

అమ్మ దయ

Oct 19, 2018
అంతా" అమ్మదయ !"అమ్మ మాయా రూపంలో ఉంటోంది.. "ఉండి ఈ జగన్నాటకం రచిస్తూ నడిపిస్తోంది..కదా !"అంతర్ముఖ సమారాడ్యా ,బహిర్ముహ సు దుర్లభా.. ! "అన్నట్లుగా  ఈ " జగమే మాయ ,బ్రతుకే మాయ.." ! చూస్తున్నది ఉండకుండా పోవడం ,మాయ.! లేనిది కనబడటం.మాయ.! ఇలా అన్ని చూస్తూ ,తెలిసీ తెలిసీ అదే మాయాజాలం లో చిక్కి  ,అదే ప్రపంచంలో ,గొప్ప "" జ్ఞానులం" అన్న అజ్ఞానం తో బ్రతుకు ఈడుస్తూ, సారం లేని నిస్సార విషయాల్లో సారం వెదకుతూ ఉండడం..కూడా మాయ..!   అంతర్యామి  ! ఏమిటయా నీ లీల ? ఎందులకీ గోల ! ? మాయాలోలా.. !  స్వామీ !  నీ జగన్నాటకం లో నీవు కదిపే పావులం.. మేము అంతా !  అంతే కదా ఆనంతా   ! ఇదంతా పరమాత్మ లీల.!  ఆనంతుని ఆనంద  హేల...! వెరసి జీవునికి లోలపాట...! ఏది నిజం..? చూసేదా ,చూడలేనిదా ,చూసేవాడా ,చూపించే వాడా ,..తెలిసేదెలా.. ? ఎలా   ? ఎలా  ? ఈ జీవుడు తరించేది..ఎలా. ?ఓ అంతర్యామి  ! చెప్పు ! ఎలా నిన్ను చేరేది. ? అసలు నేను ఎవరిని..? ఎవరివాడను..? ఎక్కడివాడను ?నా  అడ్రస్ ఎక్కడ..? వచ్చింది ఎక్కడినుండి  ? పోవాల్సింది ఎక్కడికి.? ఇంకెంత దూరంలో ఉంటుంది నా మజిలీ..?  అంటున్నారు అందరూ.. నాలోనే కొలువై ఉన్నావని ! "ఏదీ.. ఉంటే కనబడడేం ?  ఎక్కడ వెదకాలి.. ?ఏమని పిలవాలి...?. ఎలా ఉంటాడు ఆ దేవుడు..? అతని అడ్రస్ ఎక్కడ..?   ఎక్కడ  ? సమాధానం చెప్పేది ఎవరు.?.. కనపడని వాడిని చూసేదెలా..? తనను నేను  చేరేదెలా..? అంతా మాయ..! జగన్మాయ ,! పంచభూతాల ప్రభావం మాయ..! ఇంద్రియాల చైతన్యం మాయ  !  అసలు మన చుట్టూ ఎదో ఉంది..!  ఎక్కడో ఉంది.. !  అది మనకు తెలియకుండా  ఉంది !మనకు కనిపించకుండా  మనల్ని నడిపిస్తూ.. ముందుకు ఉంది ..! ఈ భూమికి దయతో తెచ్చింది ,ఇవన్నీ ఆనందంతో అనుభవంచమని ఇచ్చింది , చివరికి ఈ ఇచ్చినవన్ని లాగేసుకుని, ఈ భూమిపై నుండి నిర్దాక్షిన్యంగా ఈడ్చి ఎక్కడికో తెలియని లోకాల్లో పంపించెది..!  ఏమిటిది...? అది లేకుండా ఏదీ లేదు.! అన్నింటిలోనూ అది ఉంటుంది. చూస్తే భ్రమ !  భ్రాంతి ! తెలిస్తే కాంతి ! నిజమే కానీ .. కానీ అది ఏమిటో..  ఎలా ఉంటుందో.. మనతో ఇంకా ఏమేమి చేయిస్తూ , సాక్షిగా ఉంటూ  తాను మాత్రం నిమిత్తమాతృనిగా నటిస్తూ   ,,ఎంతదూరం నన్ను  ఈ అజ్ఞానాంధకార మాయా లోకంలో , ఇంకా ఎంత దూరం బర బరా ,ఈడ్చుకుంటూ వెళ్తుందో.. ? తెలిసేది ఎలా.???.ఈ మాంస  నేత్రాలను కప్పిన  ",మాయ" అనే పరదాలు తొలగించి  , స్వామి దివ్య సుదర్శనాన్ని  చూడగలిగే భాగ్యాన్ని పొందేదెలా  ,?,ఎలా  ఎలా   ? ఏం చేస్తే  ఆ "ఆత్మదర్శనం" కలుగుతుంది..? ఏం చేస్తే అందులో పరమాత్మ దర్శనం నిక్షిప్త మౌతోంది..? ఎవరిని ఆశ్రయించాల ?ి ఏ సద్గురువును పట్టుకోవాలి..? స్వామిని దర్శించేందుకు యోగ్యత ఉండాలి అంటారు కదా..! అందుకు సత్సంగము తప్పకుండా కావాలని అంటారు..కదా !అలాంటి. సత్ పురుషులు ఎక్కడ..?ఆ సత్ సంగం ఎక్కడ..? ఎలా పొందాలి ఆ అర్హత..? ఆ  "మార్గదర్శనం  " లభిస్తేనే కదా.. స్వామిని చేరేది... ! ఈ జన్మకు ఆ యోగం ఉంటుందా.?. ఈ వివేకం ,ఈ స్ఫూర్తి ,ఈ చైతన్యం ,ఈ దృక్పథం.. ఎన్నటికైనా ,ఏ జన్మలో నైనా  ఈ జీవికి లభించేనా..? ప్రభువును చేరాలన్న ఆశ  ఆర్తి ,ఆకాంక్ష ,ఆవేదన ,ఆరాటం  ఎన్నటికైనా ఫలించేనా.? విధాత నా నుదుట అలాంటి భాగ్యరేఖలు లిఖించేనా..? ఎన్ని జన్మలకైనా ఈ కల నిజమయ్యేనా...? దేవాదిిదేవా  ! దివ్య ప్రభావా. ! దయతో ,నా కళ్ళను కప్పిన "అహంకార మమకార మాయా మోహ"" పొరలు తొలగించు.!. నీపై బుద్దిని, ,నీ కథలను శ్రవణం చేసే చెవులను, నిన్ను మాత్రమే స్తుతించే నోరును ,నీ కోసం పని చేసే చేతులను , నీ మంగళకర ము ,నయనమనోహరము  ,పరమా నందకరము.. ,అఖండముఅద్భుతము ,అపురూపము ,పరమ పావనము.. అయిన దివ్యరూపాన్ని సంతోషంగా తిలకించేందుకు యోగ్యమైన కన్నులు ,,, నీ అందమైన అరుణ చరణ కమలాల  కమనీయ అత్యంత రమణీయ సందర్శన  అద్భుతదృశ్యంలో బందీగా మారే చిత్తశుద్ధిని.. ,,. నాకు అనుగ్రహించు ! .. చాలు ! ఈ జన్మకు అదే పదివేలు !..నీవు దయతో ఇచ్చిన  నీ ఈ జన్మకు  ,సర్వాంతర్యామి వి ! స్వామీ ! నీవే విలువ కట్టుకో !.కరుణాసిందో.! దీనబందో..! నన్ను బ్రోచే భారం నీదే  ! బరువూ నీదే !ప్రభూ !  త్రికరణ శుద్దితో నేను నీకు సమర్పించే అంతః కరణాన్ని అనుగ్రహించు..! కృతజ్ఞతతో అర్పించే నా నిర్మల హృదయాన్ని నీ కొలువుగా  మార్చి నన్ను నీ భావనలో  నీ సేవలో భావించి ,,నన్ను  కృతార్థున్ని చెయ్యి, తండ్రీ.. ! నిన్ను నమ్మిన నా నమ్మకాన్ని వమ్ము చేయకు...! జగత్ప్రభూ   ! జగన్నాథస్వామీ !. జగన్మోహనాకారా...! నీకే శరణు !నీవే శరణు  ! స్వస్తి !"

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...