Oct 20, 2018
మన దేశ యువజన వైతాళికుడు ,సంస్కర్త ,,యువత కు స్ఫూర్తిదాయకుడు , మన భారత దేశ,ఆధ్యాత్మిక సౌరభాలతో ఖండతరాళాల్లో విశ్వకీర్తి బావుటా ను ఎగురవేసిన మన వివేకానంద స్వామి .,,పౌరాణిక సద్గ్రంథాల ను ,,స్మృతి స్మృతులను, శాస్త్రాలను , ఉపనిషత్తుల ను ,పురాణ ఇతిహాసాలను క్షున్నంగా చదివి తన అనుభవ సారాన్ని అందరికి ప్రసాదంగా పంచాడు !..తన చివరి శ్వాస విడిచే రోజును, సమయాన్ని తెలుసుకున్న మహాజ్ఞాని ,, ప్రాణవాయువును సహస్రార చక్రం నుండి. యోగప్రక్రియ ద్వారా ఊర్ధ్వ ముఖంగా పంపుతూ ,తనను తానే ,,పరమాత్మ లో లీనం చేసుకున్న ఉత్తమసాధకుడు..! "యోగికి "ఉండాల్సిన యోగ్యత తో ఆత్మదర్శనం ,మహా కాళీ వైభవ అనుభవం కూడా పొందిన ఘనుడు. ! శాశ్వతుడు. ! అమరజీవి ! ఆ ఆత్మవిశ్వాసాన్ని యువతకు ఊపిరిగా ,మనోనిగ్రహం ,బ్రహ్మచర్యం ,ఏకాగ్రత లే ,,,మానసిక శారీరక దృఢత్వంగా ,, మనలో ఏర్పడితే వాటిని , దైవారాదనకు ఉపయోగించడం వలన,, మానవునిలో దైవాన్ని దర్శించవచ్చును అని నిరూపించాడు..!.చక్కని ఆధ్యాత్మిక విషయాలు ,కూడా తన ప్రభోదం ద్వారా మనకు తెలియజేశాడు..మన దేశంలోని గంగానది లోని ఒక్కొక్క నీటి "బిందువు,",బృందావనం భూమిలో ఉన్న ప్రతీ మట్టి ""రేణువు,," నిత్యం పూరీజగన్నాథ స్వామి నివేదనకు ,మట్టిపాత్రల లోని ప్రసాదంగా సమర్పించే అన్నం లోని ఒక్కొక్క" మెతుకు "లో అద్భుతమైన దేవతాశక్తి ఉంటుంది..బిందు బిందు వులో గోవిందుడు ఉంటాడు.. పాపాలు పోగేట్టే ప్రభావం వానిలో ఉంటుంది.. ఎవరైతే వాటిని తృణీకరిస్తారో.. దైవం పట్ల ఘోర అపరాధం చేసిన వాడు అవుతాడు.. అంటూ .అలా తన సకారాత్మ భావనతో అంటే positive thinking తో ,దుర్గతి పొందకుండా ఉత్తమమైన జీవన విధానాలను ఎన్నో రూపొందించాడు. ! అలాంటి సద్భావనలు ప్రేరేపించే విషయాలు,,పురాణ ఇతిహాసాల లో పేర్కొనదగినవి ఎన్నో ఉన్నాయి ,,ఉదాహరణకు , దివ్యము దైవత్వము ,అద్భుతమైన సహజమైన ధనాత్మక కంపనలను మన దేహంలో చిత్తంలో ప్రేరేపించే తులసీదళం ,మారేడు దళాలు,మర్రి వట వృక్షం లాంటి వాటిలో సకారాత్మక శక్తి 100 గజాల మేర వరకు ప్రసరిస్తూ ఉంటుందని శాస్త్రజ్ఞులు ప్రయోగాత్మకంగా వివరించారు.! అందుకే ,తమకు మేలు చేస్తున్న ఆ మొక్కల్లో చెట్టులో దైవాన్ని దర్శిస్తూ ,పూజిస్తూ ప్రదక్షణ లు చేస్తూ అవి కొత్తగా తమకు అందించే అద్భుతమైన సకరాత్మక ధనాత్మక శక్తితో మానసికంగా ఉల్లాసం ,శారీరికంగా ఆరోగ్యాన్ని పొందుతూ ఉన్నారు. అంతటి మహిమాన్వితమైన దైవత్వాన్ని చెట్టులో పుట్టలో ఆకులో ,పువ్వులో రాయిలో కొండల్లో కోనల్లో ఉందని పురాణాల ద్వారా కొన్ని వేల ఏండ్ల క్రితం రాసి తెలియజేసిన మన జీవితాలు ఆనందంగా ఉండడానికి అందజేసిన మన ఋషుల సంస్కృతి ,ముందుచూపు, జాతి సంస్కరభావన కు శతకోటి ప్రణామాలు సమర్పించుదాం. మనలో కొందరు అనుకుంటారు. ,,.దేవాలయంలో దర్శనానికి వెళ్లే వారు , దేవుణ్ణి సరిగా చూడటం లేదు !ధ్యాస , ధ్యానం నిలపడం లేదు ..! ప్రార్థన, అర్చన ,భజనలు చేయడం లేదని ఇతరులపై ఆరోపిస్తూ ఉంటారు ! కానీ అది సరి కాదు. ! అది నకారాత్మక భావన.! Negative thoughts.. ! "చెడు అనడం!చెడు వినడం ! చెడు చూడడం ! "" పట్ల ఆసక్తిని , శ్రద్ధను కనబరిస్తే ,అది మానవత్వానికి పతనం అవుతుంది..! అందుకే అటువంటి విషయాలపై దృష్టి పోనీకుండా ,,జాగ్రత్త పడుతూ ,కేవలం" దేవతా విగ్రహం "పైనే దృష్టిని నిలిపి ,మనసు ,బుద్దిని దైవంపై కేంద్రీకరించుకొని దేవుడు "ఉన్నాడని" సకరాత్మక భావంతో, విశ్వాసంతో నీవు త్రికరణ శుద్దితో ,ఆలయంలో దేవతావిగ్రహాన్ని దర్శిస్తే అప్పుడు నీలో "అది ,"ఆ ""భావమే " మనలో "సకరాత్మక "శక్తిని పెంచుతుంది..! అంతే ! ఇక .,, అక్కడ భగవన్తుడు నిజంగానే కొలువై ఉంటాడు !.మీ ఆర్తిని గమనిస్తూ, మీ కోరికలు తీరుస్తాడు..! ఇక ప్రస్తుతం , మన నిత్యజీవితంలో, ఎవరికీ negative thoughts , అంటే నకరాత్మక భావాల గురించి చెప్పే "అవసరమే" లేదు! అవన్నీ ఇప్పుడు అనుభవ పూర్వకంగా తెలుసుకుంటున్నాము కూడా,,! ఆ విదంగా, కొత్త కొత్త రోగాలకు , వ్యాధులకు ,BP, suger లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు ,heart attack ,లాంటి ఘోరమైన చావుకు స్వాగతం పలుకుతూనే ఉన్నాం.!ఇంకా !!,,. మానసికంగా ఆందోళన ,మెదడు లో రుగ్మతలు, నరాల బలహీనత లాంటి పేషెంట్ లతో హాస్పిటల్ల సంఖ్య ,రోగాల సంఖ్యా అదే నిష్పత్తిలో, ఏటా మూడు పూవులు, ఆరు కాయల్లా, పెరుగుతూనే ఉన్నాయి.! ఒకవైపు ",దేవుడున్నాడు " అని ఒప్పుకుంటూ కూడా, ఆయనపై విశ్వాసం ఉంచకుండా " ,ఇది నాది ,!" "ఇదంతా నేనే చేస్తున్నాను.!""" నావల్లే ఇది పూర్తి అయింది..,, నేనంటూ లేకపోతే ఇది అయ్యేది కాదు..!""" నేను చెప్పినట్లు వినలేదు ,, కనుక నీకు ఇలా జరిగింది..!అయినా. ఎలా వినవో ,వినకుండా ఎక్కడికి పోతావో ,,చూస్తాను...!" నీవు ఎవడో , అవతల వాడి మాట వింటావు ,,కానీ నా మాట వినవు కదా .!"" ఇది.నా ఇల్లు..!నా భర్త! నా భార్య..! ""ఇది ,నేను చెమటోడ్చి సంపాదించిన డబ్బు.!,," ""వాడు నాకు బద్ధ శత్రువు.!. వాడి పేరు వింటేనే ఒళ్ళు మండిపోతుంది..!" వాడి రక్తం చూస్తేనే గాని నాకు నిద్ర పట్టదు ! వాడా వట్టి పిరికి సన్నాసి ఎందుకూ పనికిరాడు. ! అంటూ , ఇలా ప్రతిరోజూ ,ప్రతీ ఇంటా, ప్రతివారి నోటా, ఎప్పుడూ వినిపించే ఆ ""నకారాత్మక దృక్పథం "తోనే రోజంతా గడుస్తూ జీవితాలు ముగుస్తూ నే ఉన్నాయి కదా. ! ఇందులో మన ego. "అహం "ఉంటుంది !ఇది లేకుండా జీవితాన్ని గడపలే ము.!,,.నిజమే ,,! కానీ ,ఆ "ఆహాన్ని" దెబ్బతీసే సందర్భాలు మన ముందుకు వచ్చినప్పుడు తట్టుకోలేం.కదా. !అనుకున్నట్టు జరక్కుండా,విపరీత పరిస్థితులు ఏర్పడటం.. దానితో మనసు గాయపడటం..,,ఇంకా ఇంకా ఎక్కువ "నకారాత్మక " ఉద్వేగంతో. కోపంతో ,ద్వేషంతో ,పగతో ,ఈర్శ్యతో ,తాపంతో ,దుఃఖం తో రగిలిపోతూ , మనసును కంట్రోల్ చేసుకోలేక ,చిత్తాన్ని ,చితి మంటల జ్వాలల వలె ,లోన బాధను పెంచుకుంటారు..! లోన ఎంత బాధ ఉన్నా కూడా ,, బయటకు పొక్కనీయకుండా ,లోలోన కుమిలిపోతూ , చిక్కి శల్యమై ,క్రమంగా పతనమయ్యే వారు ఎందరో. కనిపిస్తారు..! కొందరు ,కష్టాలు భరించలేక ఆత్మహత్య చేసుకోడం. చెదిరిన మనసుతో ఆక్సిడెంట్ పాలయ్యేవారు. త్రాగుడు లాంటి వ్యసనాలకు బానిసలయ్యే వారు,,ఇలాంటి మానసిక దుర్బలులను చాలా మందిని చూస్తున్నాం.!.ఇలా బ్రతుకును చిన్నా భిన్నం చేసి, అందమైన జీవితాన్ని ఆనందంగా అనుభవించే మహాభాగ్యాన్ని దూరం చేసే ఈ దుష్ట మైన ఘోరమైన ,రాక్షస కృత్య నకారాత్మక చిత్తంతో ,పనులతో ఎన్నో కుటుంబాలు నష్టపోతూ ఉండటం మనంరోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం..! ఇవన్నీ negative thoughts తో ఏర్పడే దుష్ప్రభావాలు !,దుష్పరిణామాలే.! అటువంటి విపరీత వాతావరణం ను సుఖవంతంగా మార్చుకోడానికి ,,స్వామి వివేకానంద అందించిన పుస్తకాలు చదివి ,positive thinking దృక్పథాన్ని ,సమయ స్పూర్తిని ఏర్పరచుకుందాం...! ఇందులో ""శాంతం సహనం ,సమానత్వ భావన , ఆనందం ,నమ్మకత్వం ,,సద్భావన ,సత్సంగము,పరస్పర సహకార ము ,అవగాహనా ,అత్మానందం "".లాంటి మానవతా విలువల ను పెంచే" బీజాలు" మన "హృదయం "అనబడే సుక్షేత్రంలో మొలకెత్తుతాయి .! సారవంతమైన భూమిలో ,నాణ్యమైన విత్తనాలు వేయడంతో. చక్కని ఫల పుష్ప భరితమైన పంటలు లభిస్తున్నట్టు గా. మనం ప్రశాంతంగా ఉండటానికి అనువైన రంగాన్ని ,భావాలను ,వ్యక్తులను ,పరిసరాలను మనం విజ్ఞతతో వివేకంతో , ఎంచుకోవాలి.., ! ఇదే మన నిజమైన విద్య ! మానవత్వంతో దైవత్వాన్ని దర్షింప జేసీ అమృతనంద గంగా లహరి నకారాత్మక భావంతో అంటే కోపంతో , 10 ఏళ్ళ నుండి మాట్లాడకుండా ఉంటున్న స్వంత తోడబుట్టిన అన్నయ్యను , సకరాత్మక భావంతో.ఇంటికి వెళ్లి ప్రేమతో పలకరిస్తే, ,అతడు ఆనందంతో పొంగిపోతాడు కదా !.ఇందులో. మనకు పోయేది ఏముంది ? డబ్బు ఖర్చు లేదు ఆయాస ప్రయాసలు అసలే లేవు మాటలో చూపులో భావనలో దృక్పథం లో చేసే పనుల్లో అందరితో కలిసి వేసే అడుగుల్లో కొంత వినూత్నమైన ,మార్పు !అంతే కదా ! చిరునవ్వు తో ఆప్యాయంగా మాట్లాడే ఒక్క మాటే కదా ! రెండు హృదయాలను కుటుంబాలను , శాశ్వతంగా కలుపుతూ "రక్తసంబందం "అనే అనుబంధం తో ఎందరి జీవితాలలోనో ఆనందాన్ని పంచుతూ పెంచేది. ! తల్లిదండ్రులు తోబుట్టువులు ,స్నేహితులు ,వీరే కాక మన ఇరుగుపొరుగు వారూ ఊరివారు మన దేశంలో మొత్తం ప్రపంచంలోని వారందరితో మన అనురాగ బంధాన్ని.! వారితో ప్రేమానుబందాలన ఇలాంటి ప్రేమానురాగాల బంధంతో గట్టిగా పెనవేసుకుందాం ! సత్యమైన నిత్యమైన శాశ్వతమైన ఆనందకరమైన ,అనుభవైక వేద్యమైన అనుబంధాలను సకరాత్మక భావనతో. POsitive thinking , అలవర్చుకుంటూ,, వ్యక్తిత్వ వికాసాన్ని మన పెంచుకుందాం.! వివేకానందుని జీవిత విధానంలో ,అతని రచనల్లో ,ఉపన్యాసాల్లో అద్భుతంగా ప్రబోధించిన జీవన సత్యాలు మానవత్వపు విలువలు చదవడం ద్వారా ,, మనం తెలుసుకోవచ్చును.,!దేశభక్తిని పెంపొందించే శక్తిని, ఆత్మస్తైర్యాన్ని ,అభ్యుదయ భావాలని ,దృఢమైన సంకల్ప బలాన్ని ,స్ఫూర్తిని ,ఆధ్యాత్మిక సాంప్రదాయ అంతర్యాన్ని ,, నేటి యువతకు కావల్సిన ఉత్తేజంతో ,ఉద్దేశ్యంతో ఉపదేశిస్తుంది.! ఇలాంటి సద్భావన , సత్పలితం , శాంతి కాముకత ను ప్రేమానురాగాలను ,పెంపొందించే మార్గంలో పయనిస్తూ.. మనవారిని కూడా postive thinking తో మనవెంట తీసుకెళదాం!. కానీ మనలో మన హృదయాల్లో ఇంత గొప్ప చైతన్యం కలగాలంటే ,ఆధ్యాత్మిక సంపద అత్యవసరం.! దైవారాదన , దైవంపై అమితమైన విశ్వాసం , నమ్మిన సిద్ధాంతం కోసం ,పెద్దలు అందించిన అమూల్యమైన మన దేశ సాంప్రదాయ సంస్కృతి ఆచరణ కోసం,స్వంత సుఖాన్ని ,స్వార్ధాన్ని ఫణం పెట్టక తప్పదు.! మానవత్వం నుండి దానవత్వానికి దిగజార్చే negative thinking కి స్వస్తి చెపుతూ .దైవత్వానికి దగ్గరి దారి చేర్చే ధనాత్మక దృక్పథాన్ని, సకరాత్మక భావాన్ని..,మన జీవితంలో కేవలం ఇలాంటి అందమైన భావాలతో ఇలను స్వర్గధామంలా మార్చుకునే ఆనందకరమైన భావ సంపదను ,ఆచరణ ద్వారా ,అమలుచేస్తూ , మన స్వంతం చేసుకుందాం. !తనవారినే కాకుండా అందరినీ మనవారుగా భావించే positive thikning ను ,కొంచెం కష్టమైనా కూడా , దీనితో పదిమందికి ,ఎదో ఒకరకంగాి ,అంతో ఇంతో , సహాయపడే అవకాశం ఉంటుంది ! కనుక., సాటి మనిషిగా తోటివారితో సఖ్యంగా ,సంతోషంగా ఉండే వీలు కలుగుతుంది ,, కనుక ఆచరణలో పెడుతూ.." సదా మీ సేవలో..! , అంతా మన మంచికే !"" జరిగింది, జరుగుతున్నది, జరుగబోయేది ,,అన్నీ మన మంచికే..!!" అనుకుంటూ మన స్వార్థ ప్రయోజనము కంటే ఇతరులకు మనం చేసే మేలు లో మన సంతోషాన్ని వెతుక్కోవడమే నిజమైన మానవత్వం..! అద్భుతమైన, సకల మానవకోటి కి ఆదర్శము ఆచరణీయము,ఆనందకరమూ అయిన "" సకరాత్మక చింతన ""తో మన బ్రతుకుల్లో దీపావళి దివ్వెల వెలుగులు నింపుకుందాం !. జగదాంబ విశ్వపాలిని మాత కృపతో సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని సాధిద్దాం..! ఎందరో మహానుభావుల మహాత్ముల ఆశయాలను "సకరాత్మక ""భావంతో వారు కన్న "కలల సాకార" రూపాన్ని మన సంఘటిత సంస్కార సద్భావన తో సాధిద్దాం..! ఇందుకోసం మన అందరికీ కావాల్సిన శక్తినీ, స్పూర్తిని ,, విశ్వాసాన్ని ,సమయాన్ని ,సమయస్ఫూర్తి ని అనుగ్రహించమని ఆ పరమేశ్వరుని చరణ కమలాలను తాకుతూ వేడుకుందాం.!. " సర్వే జనాః సుఖినోభవంతు!. సమస్త సన్మంగళాని భవంతు..! ఓమ్ శాంతి !శాంతి !శాంతిః స్వస్తి !"
No comments:
Post a Comment