Monday, October 22, 2018

అమ్మ దయ

Oct 19, 2018
అంతా" అమ్మదయ !"అమ్మ మాయా రూపంలో ఉంటోంది.. "ఉండి ఈ జగన్నాటకం రచిస్తూ నడిపిస్తోంది..కదా !"అంతర్ముఖ సమారాడ్యా ,బహిర్ముహ సు దుర్లభా.. ! "అన్నట్లుగా  ఈ " జగమే మాయ ,బ్రతుకే మాయ.." ! చూస్తున్నది ఉండకుండా పోవడం ,మాయ.! లేనిది కనబడటం.మాయ.! ఇలా అన్ని చూస్తూ ,తెలిసీ తెలిసీ అదే మాయాజాలం లో చిక్కి  ,అదే ప్రపంచంలో ,గొప్ప "" జ్ఞానులం" అన్న అజ్ఞానం తో బ్రతుకు ఈడుస్తూ, సారం లేని నిస్సార విషయాల్లో సారం వెదకుతూ ఉండడం..కూడా మాయ..!   అంతర్యామి  ! ఏమిటయా నీ లీల ? ఎందులకీ గోల ! ? మాయాలోలా.. !  స్వామీ !  నీ జగన్నాటకం లో నీవు కదిపే పావులం.. మేము అంతా !  అంతే కదా ఆనంతా   ! ఇదంతా పరమాత్మ లీల.!  ఆనంతుని ఆనంద  హేల...! వెరసి జీవునికి లోలపాట...! ఏది నిజం..? చూసేదా ,చూడలేనిదా ,చూసేవాడా ,చూపించే వాడా ,..తెలిసేదెలా.. ? ఎలా   ? ఎలా  ? ఈ జీవుడు తరించేది..ఎలా. ?ఓ అంతర్యామి  ! చెప్పు ! ఎలా నిన్ను చేరేది. ? అసలు నేను ఎవరిని..? ఎవరివాడను..? ఎక్కడివాడను ?నా  అడ్రస్ ఎక్కడ..? వచ్చింది ఎక్కడినుండి  ? పోవాల్సింది ఎక్కడికి.? ఇంకెంత దూరంలో ఉంటుంది నా మజిలీ..?  అంటున్నారు అందరూ.. నాలోనే కొలువై ఉన్నావని ! "ఏదీ.. ఉంటే కనబడడేం ?  ఎక్కడ వెదకాలి.. ?ఏమని పిలవాలి...?. ఎలా ఉంటాడు ఆ దేవుడు..? అతని అడ్రస్ ఎక్కడ..?   ఎక్కడ  ? సమాధానం చెప్పేది ఎవరు.?.. కనపడని వాడిని చూసేదెలా..? తనను నేను  చేరేదెలా..? అంతా మాయ..! జగన్మాయ ,! పంచభూతాల ప్రభావం మాయ..! ఇంద్రియాల చైతన్యం మాయ  !  అసలు మన చుట్టూ ఎదో ఉంది..!  ఎక్కడో ఉంది.. !  అది మనకు తెలియకుండా  ఉంది !మనకు కనిపించకుండా  మనల్ని నడిపిస్తూ.. ముందుకు ఉంది ..! ఈ భూమికి దయతో తెచ్చింది ,ఇవన్నీ ఆనందంతో అనుభవంచమని ఇచ్చింది , చివరికి ఈ ఇచ్చినవన్ని లాగేసుకుని, ఈ భూమిపై నుండి నిర్దాక్షిన్యంగా ఈడ్చి ఎక్కడికో తెలియని లోకాల్లో పంపించెది..!  ఏమిటిది...? అది లేకుండా ఏదీ లేదు.! అన్నింటిలోనూ అది ఉంటుంది. చూస్తే భ్రమ !  భ్రాంతి ! తెలిస్తే కాంతి ! నిజమే కానీ .. కానీ అది ఏమిటో..  ఎలా ఉంటుందో.. మనతో ఇంకా ఏమేమి చేయిస్తూ , సాక్షిగా ఉంటూ  తాను మాత్రం నిమిత్తమాతృనిగా నటిస్తూ   ,,ఎంతదూరం నన్ను  ఈ అజ్ఞానాంధకార మాయా లోకంలో , ఇంకా ఎంత దూరం బర బరా ,ఈడ్చుకుంటూ వెళ్తుందో.. ? తెలిసేది ఎలా.???.ఈ మాంస  నేత్రాలను కప్పిన  ",మాయ" అనే పరదాలు తొలగించి  , స్వామి దివ్య సుదర్శనాన్ని  చూడగలిగే భాగ్యాన్ని పొందేదెలా  ,?,ఎలా  ఎలా   ? ఏం చేస్తే  ఆ "ఆత్మదర్శనం" కలుగుతుంది..? ఏం చేస్తే అందులో పరమాత్మ దర్శనం నిక్షిప్త మౌతోంది..? ఎవరిని ఆశ్రయించాల ?ి ఏ సద్గురువును పట్టుకోవాలి..? స్వామిని దర్శించేందుకు యోగ్యత ఉండాలి అంటారు కదా..! అందుకు సత్సంగము తప్పకుండా కావాలని అంటారు..కదా !అలాంటి. సత్ పురుషులు ఎక్కడ..?ఆ సత్ సంగం ఎక్కడ..? ఎలా పొందాలి ఆ అర్హత..? ఆ  "మార్గదర్శనం  " లభిస్తేనే కదా.. స్వామిని చేరేది... ! ఈ జన్మకు ఆ యోగం ఉంటుందా.?. ఈ వివేకం ,ఈ స్ఫూర్తి ,ఈ చైతన్యం ,ఈ దృక్పథం.. ఎన్నటికైనా ,ఏ జన్మలో నైనా  ఈ జీవికి లభించేనా..? ప్రభువును చేరాలన్న ఆశ  ఆర్తి ,ఆకాంక్ష ,ఆవేదన ,ఆరాటం  ఎన్నటికైనా ఫలించేనా.? విధాత నా నుదుట అలాంటి భాగ్యరేఖలు లిఖించేనా..? ఎన్ని జన్మలకైనా ఈ కల నిజమయ్యేనా...? దేవాదిిదేవా  ! దివ్య ప్రభావా. ! దయతో ,నా కళ్ళను కప్పిన "అహంకార మమకార మాయా మోహ"" పొరలు తొలగించు.!. నీపై బుద్దిని, ,నీ కథలను శ్రవణం చేసే చెవులను, నిన్ను మాత్రమే స్తుతించే నోరును ,నీ కోసం పని చేసే చేతులను , నీ మంగళకర ము ,నయనమనోహరము  ,పరమా నందకరము.. ,అఖండముఅద్భుతము ,అపురూపము ,పరమ పావనము.. అయిన దివ్యరూపాన్ని సంతోషంగా తిలకించేందుకు యోగ్యమైన కన్నులు ,,, నీ అందమైన అరుణ చరణ కమలాల  కమనీయ అత్యంత రమణీయ సందర్శన  అద్భుతదృశ్యంలో బందీగా మారే చిత్తశుద్ధిని.. ,,. నాకు అనుగ్రహించు ! .. చాలు ! ఈ జన్మకు అదే పదివేలు !..నీవు దయతో ఇచ్చిన  నీ ఈ జన్మకు  ,సర్వాంతర్యామి వి ! స్వామీ ! నీవే విలువ కట్టుకో !.కరుణాసిందో.! దీనబందో..! నన్ను బ్రోచే భారం నీదే  ! బరువూ నీదే !ప్రభూ !  త్రికరణ శుద్దితో నేను నీకు సమర్పించే అంతః కరణాన్ని అనుగ్రహించు..! కృతజ్ఞతతో అర్పించే నా నిర్మల హృదయాన్ని నీ కొలువుగా  మార్చి నన్ను నీ భావనలో  నీ సేవలో భావించి ,,నన్ను  కృతార్థున్ని చెయ్యి, తండ్రీ.. ! నిన్ను నమ్మిన నా నమ్మకాన్ని వమ్ము చేయకు...! జగత్ప్రభూ   ! జగన్నాథస్వామీ !. జగన్మోహనాకారా...! నీకే శరణు !నీవే శరణు  ! స్వస్తి !"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...